మనసుకు నచ్చే మంచి మాటలు

మనసుకు నచ్చే మంచి మాటలు

మనసుకు నచ్చే మంచి మాటలు. జీవితం చాలా విలువైనది. సాధన చేసేవారికి సమయం సరిపోదు. ఒక్కసారి గడిచిన కాలం తిరిగి రాదు. గడుస్తున్న కాలంలో ఎలా జీవిస్తున్నామో అదే ఓ జ్ఙాపకంగా మారిపోతుంది. అది సంతోషం కావచ్చు… లేదా బాధ కావచ్చును.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

జీవితంలో వ్యక్తికి వ్యక్తులు ఎదురౌతూ ఉంటారు. మాటతీరు చక్కగా ఉండేవారు మనసుకు నచ్చే మంచి మాటలు మాట్లాడగలిగితే, కొందరు మనసుకు నచ్చని మాటలు మాట్లాడతారు. కానీ ఎదుటివారు ఎలా మాట్లాడినా మన మాటతీరు ఎదుటివారికి ఓదార్పుగా ఉండాలని అంటారు.

ఒక చోట వ్రాసిపెట్టినట్టుగా ఉండే మంచి మాటలు చెప్పడం తేలిక, కష్టకాలంలో మనసుకు నచ్చే విధంగా మంచి మాటలు మాట్లాడడం కష్టం. కాబట్టి ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతూ ఉండడం చేత కష్టకాలంలో చక్కని మాటలు మాట్లాడవచ్చని అంటారు.

ప్రతి బంధం వ్యక్తి నమ్మకం బట్టి బలంగా ఉంటే, వ్యక్తి స్వభావాన్ని బట్టి మంచి సంబంధాలు కొనసాగుతాయి. మంచి వ్యక్తులు మంచి మాటలు మాట్లాడుతూ తమ చుట్టూ ఉండేవారిపై ప్రభావం చూపగలరు. అటువంటి మంచి వ్యక్తుల మాటలను దూరం చేసుకోకుండని పెద్దలు చెబుతూ ఉంటారు.

సాదారణ పరిస్థితులలో మనసు ధృఢంగా ఉంటుంది. అసాధారణ పరిస్థితులలో మనసు చలిస్తుంది. కాబట్టి కష్ట కాలంలో మనసుకు శాంతి కలిగే విధంగా మనసుకు నచ్చే నాలుగు మంచి మాటలు చెప్పే బంధం మనిషి అవసరం.

ఒక వ్యక్తికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులే, ఒక వ్యక్తికి మనసుకు నచ్చే నాలుగు మంచి మాటలు చెప్పగలరు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే వ్యక్తితో మొదటగా మనమే మంచి మాటలు మాట్లాడడం మేలని అంటారు. శ్రీరామాయణంలో తనకు ఎదురపడే వ్యక్తులతో, రాముడే మొదటగా పలకరించేవాడు అంటే, మాట ప్రభావం ఎలా ఉంటుందో? అర్ధం చేసుకోవాలి.

అలా మన జీవితంలో మన మనసుకు నచ్చేటట్టుగా మంచి మాటలు మాట్లాడేవారిని దూరం చేసుకోకూడదు. అలాంటి బంధాలలో మొదటిగా ఉండే బంధం…. జీవితభాగస్వామి. వీరు జీవితంలో సగమై ఉంటారు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసే బంధం ఇదే. తల్లిదండ్రులు కూడా మేము తోడు ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రమాణం చేయరు… కానీ జీవితపు భాగస్వామి మాత్రం జీవితాంతము తోడుంటానని బంధానికి పూనుకుంటారు. కాబటి అటువంటి జీవిత భాగస్వామితో ఎప్పటికీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి.

తర్వాత ఇతర బంధాలు, స్నేహితులు… మన మనసుకు నచ్చేవిధంగా నాలుగు మంచి మాటలు మాట్లాడుతారు.

మనసుకు నచ్చే మంచి మాటలు మాట్లాడగలిగితే

మనం మంచి మాటలు మాట్లాడగలిగితే, మన మాటల ప్రభావం, మన చుట్టూ ఉండేవారి మనసులో దాగి ఉంటుంది. కడుపుకు తిన్నది కడుపులో ఉండదు కానీ మనసులోకి చేరిన మాటల ప్రభావం అలానే ఉండిపోతుంది. కాబట్టి మంచి మాటలు మాట్లాడగలిగితే మాత్రం ఆ మనిషి చుట్టూ మంచి బంధాలు బలపడుతూ ఉంటాయి.

అవసరాన్ని బట్టి ఆసక్తికరంగానో, ఆకట్టుకునే విధంగానో లోకంలో మాటలు వినబడుతూనే ఉంటాయి.

సినిమా మాటలలో మాటలు

ఇప్పుడొస్తున్న సినిమాలలో మనసుకు నచ్చే మంచి మాటలు కన్నా ఆకట్టుకునే తీరులో మాటలు పోకడ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువమందికి నచ్చే నాలుగు మాటలు, ఎక్కువమందిని రంజింపచేసే మాటల వలన సినిమా కలెక్షన్లు ఉంటాయి. కాబట్టి సినిమా మాటలలో మంచి మాటలతో పాటు ఆసక్తిని పెంచే మాటలు, ఆకర్షణను తీసుకువచ్చే మాటలు… వివిధ విషయాలను పరిచయం చేసే మాటలు ఉంటాయి.

మన ఏది గ్రహిస్తున్నామో అదే తిరిగి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు, మంచి మాటలు వినడం ప్రధానం అంటారు. మంచి పుస్తకాలు చదవడం మేలు అంటారు. మంచి పుస్తకాలు చదవడం వలన మాట యొక్క విలువ తెలియబడుతుంది. మాటతీరు మారుతుందని అంటారు.

సోషల్ మీడియాలో మంచి మాటలు చాలానే ఉంటాయి. బంధాల గురించి వారి వారి జీవితంలో అనుభవం ఆధారంగా ఈ సోషల్ మీడియా పోస్టులు ఉండవచ్చును. లేక ఒకచోట చదివినవి వారికి నచ్చితే, వాటిని పోస్ట్ చేయవచ్చును. సోషల్ మీడియాలో కూడా మనసుకు నచ్చే మాటలు హల్ చల్ చేస్తూ ఉంటాయి.

కత్తికంటే కలం గొప్పది ఎందుకంటే అది తూటా కన్నా శక్తివంతమైన మాటను వ్రాయగలదు. అలా వ్రాసిన మాట మందిలో మార్పుకు నాంది కాగలదు. కాబట్టి మాట చాలా శక్తివంతమైనది అయితే మంచి మాట అమృతము వంటిది అంటారు.

కావునా తొలుత మనం మంచి మాటలు మాట్లాడడం వలన చెడుగా మాట్లాడేవారు కూడా మంచి మాటలు వినడానికి ప్రయత్నిస్తారని, ఆపై వారు కూడా మంచి మాటలనే మాట్లాడే అవకాశం ఉంటుందని అంటారు. మంచిని పెంచడానికి మాటే ఆయుధం అయితే, అటువంటి మంచి మాటలు మాట్లాడడానికి మంచి బంధం ఉండాలి. అది మంచి పుస్తకం చదివితే ఎలాంటి భావన కలుగుతుందో, మంచి మిత్రుడితో మాట్లాడిన తరువాత అదే భావన కలుగుతుందని అంటారు.

రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్