Category Archives: Telugu Janapada Cinemalu

Telugu Janapada Cinemalu తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్ బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితే, మరల మరలా చూడాలనిపించే మూవీ సూపర్ డూపర్ హిట్.

సినిమా చూడంగానే ఆలోచనను రేకిత్తేంచే మూవీ సందేశంతో కూడిన మూవీ. సమాజంలో ఉండే సమస్యలను అంతర్లీనంగా తెలియజేస్తూ ఉంటాయి.

తెలుగు మూవీ అయితే ఆనందం అందిస్తాయి లేకపోతే ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మూవీ మనసును రంజింప చేయడానికే ఉంటుంది. అలా మనసును రంజింపజేస్తూ సామాజిక సందేశం కానీ వ్యక్తిగత సందేశం కానీ అంతర్లీనంగా అందిస్తాయి. లేదా ముగింపు సందేశంతో ముగుస్తుంది.

కేవలం సందేశాత్మకంగా సాగే సినిమాలు తక్కువగా ఉంటే, ఎక్కువ వినోదం అందిస్తూ ఉండేవి ఎక్కువగా ఉంటాయి. యాక్షన్, డ్రామా, సెంటిమెంట్, లవ్, ఫిక్షన్, డాన్స్ వంటి విషయాలు కలిసి, మనిషి మనసు ఆకట్టుకోవడానికి మూవీ ట్రై చేస్తుంది. మూవీ మనసును రంజింప చేయడం ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది.

విజయవంతమైన తెలుగు మూవీ నీ మనసు నాకు తెలుసు అన్నట్టు మన మనసులో కదలికలకు తగ్గట్టుగా స్క్రీనుపై పాత్రలు కదిలిస్తుంది.
చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితేతెలుగులో ఆనాటి మేటి మూవీస్

అన్ని రకాల ఎమోషన్స్ కలిగిన తెలుగు మూవీ చూసి చూడంగానే నచ్చేస్తుంది. తిరిగి మరలా చూడాలనిపించే విధంగా మన మనసుపై ముద్ర వేస్తుంది. అటువంటి మూవీ మరల మరలా చూడడం అంటే, అది సూపర్ హిట్టే అవుతుంది.

మామగారు, అబ్బాయిగారు, అల్లుడుగారు, ఖైదీ, పెదరాయుడు, సమరసింహారెడ్డి, పోకిరి, బాహుబలి ఇలా కుటుంబ కధతో బాటు వ్యవస్థలోని ఊహాశక్తికి దగ్గరగా ఉండే అంశంతో తెలుగు మూవీ మనల్ని ఆకట్టుకుంటుంది.

సమాజంలో ఒకరికి అన్యాయం జరిగిందనే విషయం ఒక న్యూస్ మారి ఉంటుంది. ఏదో కుటుంబంలోని పెద్దాయన యొక్క కర్తవ్యతా నిష్ట కొందరి మనసులలో చేరి ఉండవచ్చును. సామాజిక పరిస్థితులలో నేరప్రవృత్తులపై వచ్చే కధనాలు, సమాజంలో మంచివారి హృదయాలలో భావనలు పెంచవచ్చును. కల్పనలో ఒక హీరోని సృష్టించే స్థితిలో కొందరు ఆలోచన చేయవచ్చును.

ఎక్కువమంది మనసును రంజింపచేసే సాధనములలో సినిమా ఒక సాధనంగా ఉంది.

అటువంటి తెలుగు మూవీలలో చూసి చూడంగానే నచ్చేసే తెలుగు సినిమాలు కొన్నింటిని ఈ పోస్టులో చూద్దాం.

అయితే అలాంటి సినిమాలలో చూసే పాత, కొత్త తెలుగు మూవీలను ఇందులో చూద్దాం.

భక్తిప్రహ్లాద తెలుగులో ఆనాటి మేటి మూవీస్

మనస్థితికి ఇప్పుడు కాకపోతే మరెప్పుడో చేసుకున్న మన కర్మే కారణం కాగలదని నమ్మేవారికి ఈ భక్తప్రహ్లాదలో సమాధానం లభిస్తుంది. శ్రీమహావిష్ణువు నిలయం వైకుంఠం. అక్కడ ఉండే ద్వారపాలకులు, ఋషులను అడ్డుకుంటారు. ఆ తప్పుకు శిక్షగా శాపం పొందుతారు. ఉదారుడైన శ్రీమహావిష్ణువు వారికి వెసులుబాటు తెలియజేస్తాడు. అదేమిటంటే….

నాభక్తులుగా ఏడు జన్మలు పొందుతారా? లేక నాకు శత్రువులుగా మూడు జన్మలు పొందుతారా? అనే విషయం తేల్చుకుని చెప్పమంటాడు. అందుకు ఆ ద్వారపాలకులు భక్తులుగా ఏడు జన్మలకాలం వైకుంఠం వదిలి ఉండలేం. శత్రువులుగా మూడు జన్మలకాలం దూరమై, మరలా వైకుంఠం వచ్చేవిధంగా అనుగ్రహించమని శ్రీమహావిష్ణువుని కోరతారు.

స్థితికారుడు వారి కోరికను మన్నిస్తాడు. అలా పూర్వజన్మలో చేసిన పాపఫలం అనుభవించడానికి పుట్టిన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు పుడతారు. అయితే ఒకరు శ్రీమహావిష్ణువు చేతిలో మరణించి కొంతపాప పరిహారం పొందుతాడు. రెండవవాడు తన అన్న మరణానికి శ్రీమహావిష్ణువు కారణం అని తలుస్తాడు. తన స్థితికి కారణం స్థితికారుడు అనిభావించిన హిరణ్యకశిపుడు, స్థితికర్తపై కక్షను పెంచుకుంటాడు.

ఆ కక్షతోనే తపస్సుచేసి వరాలు పొందుతాడు. శ్రీహరి భక్తులను వేదిస్తాడు. అంత శ్రీహరి ద్వేషి అయిన అతనికి పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు నిత్య శ్రీహరినామస్మరణ చేస్తూ ఉంటాడు. లోకంలో అందరినీ కట్టడి చేయగలిగాను అనుకునే అసురుడికి కొడుకే కొరకరాని కొయ్యగా మారతాడు. విరోధిగా భావించే శ్రీహరినామస్మరణ, శ్రీహరిధ్యానం అసురుడు అయిన హిరణ్యకశిపుడుకి తలనొప్పిగా మారుతుంది. ఆ తలనొప్పే, తన చావుకు కారణం అవుతుంది.

అసురునింట పుట్టినా అద్భుతమైన గుణములతో ప్రకాశించిన ప్రహ్లాదుడి చరిత్రను చదివితీరాలని పెద్దలంటారు. అటువంటి తెలుగు భాగవతగాధ తెలుగు మూవీగా భక్తప్రహ్లాద పేరుతో ఉంది. ఇది యూట్యూబ్ లో పుల్ లెంగ్త్ మూవీగా అందుబాటులో ఉంది.

భక్తిప్రహ్లాద చూసి చూడంగానే నచ్చేసే తెలుగు మూవీ

మాయాబజార్ పెద్దమాయగాడు మామ అయితే, చిన్నమాయగాడు అల్లుడు.

తెలుగులో అనేక మూవీలు వస్తూ ఉన్న నాటి మాయాబజార్ మూవీ మరలా విడుదల అయితే అదే ముందుంటుందని నిరూపించిన తెలుగు ఓల్డ్ మూవీ మాయాబజార్. అలనాటి మాయాబజార్ పెద్దమాయగాడు మామ అయితే, చిన్నమాయగాడు అల్లుడు.

పెద్దమాయగాడు కృష్ణుడుగా ఎన్టీరామారావు నటిస్తే, చిన్నమాయగాడుగా ఎస్వీరంగారావు మరిపించారు. సావిత్రి కృష్ణుడి అన్నగారి కూతురు శశిరేఖగా నటిస్తే, అమె మనసును మాయచేసినవాడిగా అక్కినేని అభిమన్యుడుగా నటించారు. ఇలా మాయాబజార్ తెరపై మన మనసును కట్టిపడేస్తుంది.

శశిరేఖా పరిణయం తెలుగువారికి తెలిసిన భారత కధే. అయితే ఈ మాయాబజారు తెలుగు మూవీలో పాండవుల ప్రస్తావనే కానీ పాండవుల పాత్రలు సినిమాలో కనబడవు. వారి బిడ్డ అభిమన్యుడు, కృష్ణుడింట సాగించే ప్రేమకధే ఈ మాయాబజార్ సినిమా కధ.

శశిరేఖ – అభిమన్యుల పరిణయానికి సహకరించే పనిలో ఘటోత్కచుడి మాయావిలాసం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రాయలేం కాబట్టి సినిమా చూసి ఆనందించడమే మేలు.

అలనాటి మేటి తెలుగు మూవీలలో సత్యహరిశ్చంద్ర మూవీ ఒక్కటి.

ఈ రోజులలో సత్యానికి పర్యాయపదంగా వాడేంతలగా ప్రసిద్ది పొందిన పేరు సత్యహరిశ్చంద్ర. అబద్దాలాడేవారి గురించి వ్యంగ్య భావనతో మాట్లాడేవారు ”అబ్బో దిగొచ్చాడండీ పెద్ద సత్యహరిశ్చంద్ర” అని సంభోదిస్తూ ఉంటారు. నిత్యం సత్యం చెప్పినవారెవరూ అంటే, సత్యహరిశ్చంద్ర… సత్యహరిశ్చంద్ర….సత్యహరిశ్చంద్ర…

అటువంటి సత్యహరిశ్చంద్రుని జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని పెద్దలంటారు. పురాణాలలో పురాణ పురుషుల చరితములు సినిమాలుగా మార్చి ఇచ్చిన తెలుగు దర్శకులకు కృతజ్ఙతలు చెప్పుకోవాలి. పురాణాలలో వశిష్ఠుడి చేత కీర్తింపబడిన సత్యహరిశ్చంద్ర, పరమేశ్వరుడ విశ్వామిత్రుని రూపంలో పెట్టి అన్ని పరీక్షలలోనూ నెగ్గుతాడు.

సత్యహరిశ్చంద్ర తెలుగు మూవీ గురించి పూర్తిగా రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

భట్టీ విక్రమార్క అలనాటి తెలుగు మూవీ…

రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులు, దైవానుగ్రహం పొంది, ప్రజలను పరిపాలించేవారు. అంతటి రాజులు, దైవం దగ్గరకు పడే పాట్లు వ్యక్తిగత జీవితంలో మార్పులు తెస్తాయి. దైవానుగ్రహం సాధించడానికి శక్తిని, యుక్తిని కలిగిస్తుంది. కానీ ప్రయత్నం సాధకుడే చేయాలి.

అలాంటి సాధకుడికి కాలంలో కలిగే కష్టాలకు ఓర్చగలిగే శక్తి ఉంటుంది. దైవానుగ్రహం వలననే సాధించగలిగే శక్తి ఉన్నా, కాలం పెట్టే పరీక్షలో ఆ శక్తి వలన ప్రయోజనం కన్నా నిరీక్షణ వలన ప్రయోజనం ఉంటుంది. తదుపరి శక్తి వలన ప్రయోజనం పొందగలుగుతారు.

అలా సాక్షాత్తు పరదేవతా అనుగ్రహం పొందిన భట్టీవిక్రమార్కులు అజేయులుగా ఉంటారు. విక్రమార్కుడు బేతాళుడినే వశపరచుకుంటాడు. పరాక్రమముతోనూ, యుక్తితోనే ఉండే విక్రమార్కుడికి తెలివైన మంత్రిగా భట్టీ అండగా ఉంటాడు.

ఎన్ని ఉన్నా కాలం వలన కలిగే కష్టం మాత్రం మనిషి అనుభవించాల్సిందే. అలా విక్రమార్కుడు వ్యక్తిగతంగా పొందిన కష్టం ఏమిటి? దైవానుగ్రహం చేత విశిష్ట శక్తులు కలిగిన మాంత్రికుడిని ఎలా జయించాడు? సినిమా చూసి తెలుసుకోవాలి.

సాహసం కలిగిన కధలు అందరినీ అలరిస్తే, అప్పట్లో సాహసం రాజుల కధలలో…. భట్టీ విక్రమార్క చూసి చూడంగానే నచ్చేమూవీ…

భట్టీ విక్రమార్క అలనాటి తెలుగు మూవీ… ఇందులో రామారావు, అంజలీదేవి, ఎస్వీరంగారు, కాంతారావు తదితరులు నటించారు.
ఇందులో రామకృష్ణ, ఎస్వీరంగారావు, విజయనిర్మల తదితరులు నటించారు.

రావణాబ్రహ్మ భక్తి, అనురక్తిని చూపే భూకైలాస్ తెలుగు మూవీ

ఎన్టీరామారావుగారు శ్రీరాముడు, కృష్ణుడు అంటూ పురాణ హీరోల పాత్రలతో ప్రేక్షకులను మరిపించారు. అయితే ఆయన పురాణప్రతినాయకుడి పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. సాదారణంగా ప్రజాధరణ పొందని కధానాయకుడు ఏదో ఒకసారి ప్రతినాయకుడి పాత్రలో కనబడతారు. కానీ ఎన్టీరామారావుగారు మాత్రం పలుమార్లు ప్రతినాయకుడి పాత్రలను పోషించారు. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలలో మెప్పించారు.

అలా ఎన్టీరామారావు గారు రావణాబ్రహ్మగా చేసిన తెలుగు మూవీ భూకైలాస్. రావణుడి తల్లి సముద్రతీరంలో సైకత లింగమును పూజిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు శివార్చన చేస్తూ ఉండగా, సముద్రపు అలలు వచ్చి, సైకత లింగమును కలిపేసుకుంటాయి. వెంటనే గృహమునకు పోయి మదనపడుతున్న తల్లిని చూసి రావణాసుడు, సైకత లింగం కాదు. శివుడి ఆత్మలింగం తీసుకువస్తానని కైలాసం బయలుదేరతాడు.

రావణాసురుడు ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. రావణుడి శివునిని ఆత్మలింగం కోరకుండా, అమ్మవారిని కోరతాడు. శివుడు అనుగ్రహిస్తాడు. అమ్మవారిని వెంటపెట్టుకుని స్వగృహమునకు పోతున్న రావణుడిని నారదుడు కలుస్తాడు. ఆ తర్వాత అమ్మవారిని వెంటపెట్టుకుని రావణుడు మరలా శివుని దగ్గరకు వెళతాడు.

కైలాసంలో శివుని దగ్గర నుండి వెనుతిరిగిన రావణుడు, పాతాళలోకంలో ఉన్న మండోదరిని వివాహమాడతాడు. మండోదరిని వెంటపెట్టుకుని తల్లిని చేరిన రావణుడికి అసలు విషయం బోధపడుతుంది. తను ఆత్మలింగం కోసం కోరకుండా వేరు విషయాలకోసం ప్రాకులాడానని…. వెంటనే మరలా తపస్సు చేసిన రావణుడికి శివుని ఆత్మలింగం చేతిలోకి వస్తుంది.

ఈసారి శివుని ఆత్మలింగమును చేతబట్టి పోతున్న రావణుడికి దారి మద్యలో సంధ్యావందనం చేయవలసిన సమయం ఆసన్నమవుతుంది. ముక్కటి ఆత్మలింగమును నేలపైకి చేర్చరాదు. అందుకని ఓ ఆవులమందని కాసే కుర్రవాని చేతికి శివుని ఆత్మలింగం ఇచ్చి రావణుడు సంధ్యావందనానికి సముద్రపు తీరానికి పోతాడు.

అయితే ఆ బాలకుడు మూడుమార్లు రావణా… అంటూ అరిచి శివుని ఆత్మలింగము నేలపై పెడతాడు. పరుగు పరుగున అక్కడికి వచ్చిన రావణుడు శివలింగమును కదిలిస్తాడు. ప్రకృతి శక్తి ముందు అతని శక్తి పనికిరాదు. శివుని ఆత్మలింగం అక్కడే ప్రతిష్టంపబడుతుంది. రావణబ్రహ్మ భక్తి వలన గోకర్ణ క్షేత్రం అలా ఏర్పడిందని అంటారు.

రావణాబ్రహ్మ భక్తి, అనురక్తిని చూపే భూకైలాస్ తెలుగు మూవీ

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా నటించిన తెలుగు మూవీ

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు త్రిపాత్రాభినయం చేసిన సినిమా. ఇది మహాభారతంలోని కర్ణుడి పాత్రను ప్రధానంగా చూపుతుంది. దానంలో కర్ణుడు గొప్పవాడుగా చెప్పబడతాడు. అటువంటి కర్ణుడి పాత్రతో పాటు, కృష్ణుడు, ధుర్యోధనుడి పాత్రలలో ఎన్టీరామారావు నటించారు.

కర్ణుడి వంటి పుట్టుకను సమాజం ప్రశ్నిస్తూనే ఉంటుంది. సమాజం చిన్నచూపు చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ విధానం పద్దతికి విరుద్దంగా ఉంటుంది, కాబట్టి. కుంతికి వివాహం కాకముందే, ఋషి మంత్రం వలన సూర్యానుగ్రహం వలన కర్ణుడు పుడతాడు. అలా పుట్టిన కర్ణుడిని కుంతి ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది.

మయసభలో దుర్యోధనుడు పరాభవం పొందడం. పరాభవం పొందిన దర్యోధనుడు శకుని సాయంతో పాండవులను ఓడించడం. పాండవులు వనవాసం చేయడం. పాండవవనవాసం తర్వాత శ్రీకృష్ణరాయభారం. తర్వాత కురుక్షేత్ర యుద్ధమునకు కురుపాండవులు సిద్దపడడం… కధ క్లైమాక్స్ కు చేరుతుంది.

ఆ తరువాత కర్ణుడు సూతుల ఇంట పెరిగి విలుకాడు అవుతాడు. అర్జునుడంతటివాడు కర్ణుడు అంటారు. కానీ అనుగ్రహం అర్జునుడికే ఉంటుంది. కురుసభలో విలువిద్య ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రయత్నించిన కర్ణుడికి, దుర్యోధనుడు సాయపడతాడు. అలా వారిద్దరి మద్య స్నేహం ఏర్పడుతుంది.

కుంతి కర్ణుడిని కలుస్తుంది. కర్ణుడు కుంతితో అయిదుగురితో కూడిన పాండవులు నీకు ఉంటారని, అందులో అయితే అర్జునుడు లేకపోతే కర్ణుడు ఇద్దరిలో ఒక్కరే ఉంటారని అంటాడు. చివరికి అర్జునుడితో కూడిన పాండవులే కుంతికి ఉంటారు. ఈ కధ అందరికే తెలిసిందే, కానీ ఎన్టీరామారావుగారి నటన ఆసక్తిగా ఉంటుంది. దానవీరశూరకర్ణ చూసి చూడంగానే నచ్చేమూవీ….

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా నటించిన తెలుగు మూవీ

శ్రీరామ కధా గానం లవకుశ తెలుగు మూవీ

లవకుశ శ్రీరామనామము రామ నామము రామ నామము అంటూ రామనామసంకీర్తన చేస్తూ రామకధను చెప్పడం రాముని తనయుల నుండే మరలా ప్రారంభం అయ్యింది… కుశలవులు శ్రీరాముని తనయులు కానీ రాముడిని కలవడం మాత్రం శ్రీరాముని దివ్వగానం ప్రారంభించాకే…

ధర్మము మానవరూపంలో తిరిగితే అది శ్రీరాముడు అంటే, అటువంటి రాముని కుమారులు అయిన కుశలవులకు, ఆ ధర్మమూర్తి గురించి తెలుసుకుని గానం చేశాకే శ్రీరామదర్శనం అయింది. శ్రీరామనామము అంతటి శక్తివంతమని చెబుతారు. శ్రీరాముడు ధర్మము కోసం రాజ్యం విడిచాడు. అదే రాజధర్మం కోసం భార్యను దూరం చేసుకున్నాడు.

ప్రజలకు మార్గదర్శకంగా ఉండే రాజు, ప్రజల దగ్గర చులకన కాకుడదు. అలా చులకన అయ్యే పరిస్థితులు ఉంటే, ఆ పరిస్థితులలో రాజ్యం విడవడం లేక అందుకు కారణం అయ్యినవారిని విడిచిపెట్టడం చేయాలంటారు.

రావణాసురుడు అపహరించిన సీతమ్మను చేపట్టడం ఏమిటి? అని ఒక చాకలివాడు అన్నమాటను శ్రీరాముడు వింటాడు. వెంటనే శ్రీరాముడు తన ప్రాణానికి ప్రాణమైన సీతను వదులుకోలేకా, రాజ్యాన్ని ఎవరోఒకరు తీసుకోవాల్సిందిగా తన తమ్ములను కోరతాడు. అందుకు సోదరులు ఎవరూ అంగీకరించరు. చేసేదిలేక సీతను అడవులలో విడిచిరమ్మని లక్ష్మణుడిని రాముడు ఆజ్ఙాపిస్తాడు.

లక్ష్మణుడు సీతమ్మను అడవిలో వదిలేసి వెళతాడు. సీతమ్మను వాల్మీకి మహర్షి, తన ఆశ్రమమునకు తీసుకువెళతాడు. లోకపావనీ దేవిగా సీతమ్మ అక్కడ పిలవబడుతుంది. సీతమ్మకు కుశ,లవులు జన్మిస్తారు. వారు వాల్మీకి మహర్షి వద్ద శ్రీరామాయణం తెలుసుకుంటారు. గానంచేస్తారు. అలా వారు అయోధ్యలో కూడా రామకధను గానం చేస్తారు.

శ్రీరాముడు తలపెట్టిన అశ్వమేధ యాగంలో అశ్వమును కుశలవులు బంధిస్తారు. తత్ఫలితంగా శ్రీరాముడు వారితో తలపడడం, వారెవరో తెలుసుకోవడం జరుగుతుంది. రామనామ సంకీర్తన ఎక్కువగా వినబడుతుందీ సినిమాలో…. చూసి చూడంగానే నచ్చేమూవీ లవకుశ తెలుగు మూవీ.

శ్రీరామ కధా గానం లవకుశ తెలుగు మూవీ
సుగుణములు కలిగిన సుందరి గుణసుందరి తెలుగు మూవీ.

లోకంలో గుణములే అందములు అయితే, అటువంటి సుగుణముల గలవారిని కాలము పెట్టే పరీక్ష కఠినంగానే ఉంటుంది. పరమేశ్వరుని అనుగ్రహం వలననే సుగుణములు కలుగుతాయి. కానీ అటువంటి సుగుణములు కాలప్రభావం చేత పరీక్షకు గురై, ఎక్కువకాలం కీర్తింపబడతాయి. ఆకోవలోనే అలనాటి పాత తెలుగు సినిమాలు చాలావరకు ఉంటాయి. సుగుణములు కలిగిన సుందరి గుణసుందరి తెలుగు మూవీ.

పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఒకరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు పెద్దకుమార్తెలకు రాచరికపు మర్యాదలపై ఆసక్తి ఉంటే, చిన్నమ్మాయికి ప్రాతివ్రత్యపు కధలంటే మక్కువ. పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే సతుల కధలంటే ఇష్టం. ఆమె పేరు గుణసుందరి.

ఒకరోజు కొలువుదీరిన మహారాజును, నిండుసభలో అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే గుణసుందరి కూడా తండ్రిని గౌరవిస్తుంది, కానీ నాకు కాబోయే భర్తే దైవమంటుంది. రాజుకు కోపం వస్తుంది. ఇంకా పెళ్లైనా కాలేదు…. అప్పుడే ఇలా మాట్లాడుతుందేమిటి? అనుకుంటాడు. అన్ని అంగవైకల్యం ఉన్నవాడిని ఏరికోరి గుణసుందరికిచ్చి వివాహం చేస్తాడు.

రూపం ఎలా ఉన్నా, గుణసుందరిభర్తకు ఏ అంగవైకల్యం లేదనే విషయం బయటపడుతుంది. రాజు ఆశ్చర్యపడతాడు, భవంతిలో మెట్లపైనుండి క్రిందకు జారిపడతాడు. గాయంపాలైన రాజు మంచమెక్కుతాడు. గుణసుందరి తన భర్తతో పాటు బయటకు వెళ్ళిపోతుంది.

పూరిగుడిశెలో ఉంటున్నా, గుణసుందరి భర్తతో హాయిగా కాపురం చేస్తుంది. కానీ రాజుగారి గాయం మానదు. రాజుగారిగాయం నయం కావాలంటే, మహేంద్రమణి కావాలని రాజవైద్యులు చెబుతారు. మహేంద్రమణిని సాధించి, తెచ్చినవారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజు చాటింపువేయిస్తాడు.

రాజుగారి పెద్దల్లుళ్ళు ఇద్దరూ మహేంద్రమణి సాధించడానికి బయలుదేరతాడు. గుణసుందరి తన భర్తయొక్క గాధను, తన భర్తనోటివెంట తెలుసుకుంటుంది. వెంటనే తన తండ్రిని రక్షించవలసినదిగా అతనిని వేడుకుంటుంది. రాజుగారి చిన్నల్లుడు కూడా మహేంద్రమణి కోసం బయలుదేరతాడు.

రాజుగారి ముగ్గురల్లుళ్ళు మార్గమద్యంలో కలుసుకుంటారు. మహేంద్రమణిని సాధించడంలో యక్షకన్యలు పెట్టే పరీక్షలలో ఇద్దరూ ఫెయిల్ అవుతూ ఉంటారు. మూడోవాడు యక్షకన్యలను మెప్పిస్తాడు. అలా మూడోవాడు సాధించిన మహేంద్రమణిని, అతనిని మోసం చేసి, పెద్దవారిద్దరూ తస్కరిస్తారు.

మహేంద్రమణితో రాజుగారి దగ్గరకు వెళతారు. అయితే మంత్రంతో పనిచేసే మహేంద్రమణి పనిచేయదు. ఎందుకంటే వారు ఆ మంత్రం మరిచిపోతారు. పూర్వగాధలోని ఋషి శాపంచేత, బల్లూకముగా మారి గుణసుందరి భర్త స్వగృహమును చేరతాడు.

తీసుకురాబడిన మహేంద్రమణి పనిచేయాలంటే మంత్రం కావాలి. మంత్రం తెలిసినవ్యక్తి ఎలుగుబంటిగా మారాడు. ఎలుగుబంటిగా మారిని భర్తతో గుణసుందరి తన గుడిశెలోనే పరమేశ్వరుడిని ప్రార్ధిస్తుంది. చివరికి పార్వతీ, పరమేశ్వరులు ఎలుగుబంటితో సహా రాజమందిరం చేరి, అక్కడ నిజనిర్ధారణ చేయిస్తారు.

చివరికి రాజుగారిగాయం నయం అవుతుంది. గుణసుందరిభర్తకు శాపవిమోచనం కలుగుతుంది. తెలుగులో ఆనాటి మేటి మూవీస్ లో గుణసుందరి తెలుగు మూవీ.

తెలుగు మూవీస్ తెలుగురీడ్స్

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ. ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించారు.

వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ తెలుగు మూవీకి దర్శకత్వం వహించారు.

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది.

సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య దిక్కున ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు ఆరగించు, ఇతోదకమైన సంతానం కలుగుతుంది” అని ఆకాశవాణిగా పలుకుతాడు. మహరాణి వెంటనే చెట్టు దగ్గరకు వెళుతుంది.

చెట్టున ఉన్న ఫలాలు మహారాణి భూలక్ష్మికి అందకపోవడంతో ఆమె అక్కడే చెట్టు క్రింద ఉన్న పుట్టపై కాళ్లు పెట్టి, చెట్టు కొమ్మల నుండి అందినంతలో ఉన్న ఫలాలను కోసుకుని, క్రిందికి దిగుతుంది.

అలా మహారాణి పుట్టమీద నుండి క్రిందికి దిగగానే, ఆమె చెంగులో ఉన్న ఫలాలు ఒక్కటి మినహా మిగిలినవి అన్ని మరలా చెట్టుకి చేరతాయి. ఇక అక్కడి పుట్టలోని నాగరాజు మానవరూపంలో ప్రత్యక్షమై, మహారాణిని పేరాశకు, ఆమె చేసిన తప్పుకు శిక్షించదలుస్తాడు.

అయితే నేను తల్లిని అయ్యేవరకు నాకు గడువు ఇవ్వవలసినదిగా మహారాణి, నాగరాజుని ప్రార్ధన చేయడంతో, నాగరాజు బిడ్డ పుట్టిన ఆరుమాసాలకు తిరిగి వస్తానని, అప్పుడే నిన్ను కాటువేసి చంపుతానని చెప్పి అంతర్ధానం అవుతాడు.

ఈ విషయం మహారాజుకు చెప్పకుండా మహారాణి భూలక్ష్మి దాచి ఉంచుతుంది. కొన్నాళ్లకు వారికి ఏడుగురు ఆడ శిశువులు జన్మిస్తారు. అయితే దు:ఖిస్తున్న రాణిని, విషయం అడిగి తెలుసుకున్న మహారాజు మొత్తం నాగులన్నింటిని చంపించే ప్రయత్నం చేస్తాడు.

కానీ వారి ప్రయత్నం అలా సాగుతున్నా నాగరాజు అంత:పురంలోకి వచ్చి మహారాణిని కాటువేసి వెళ్లిపోతాడు. పసిపిల్లలను పెంచకుండానే మహారాణి ప్రాణాలు విడుస్తుంది. మహారాజు తనకు పుట్టిన ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటాడు.

ఏడుగురు పిల్లల్లో ఆఖిరి పిల్లపేరు బాలనాగమ్మ.

ఏడుగురు పిల్లల్లో ఆఖిరి పిల్లపేరు బాలనాగమ్మ. పిల్లలు పట్టు మేరకు మహారాజు మరోరాణి మాణిక్యాన్ని వారికి తల్లిగా తీసుకువస్తాడు. మొదట్లో ఆమె పిల్లలను బాగానే చూసుకుంటుంది. కానీ చెలికత్తె చెప్పుడు మాటలకు మాణిక్యం మనసులో స్వార్ధం పెరిగి, పిల్లలను నానా కష్టాలకు గురి చేస్తూ ఉంటుంది.

రాజుకు ఈ విషయం తెలిసి రాజు ఆగ్రహించి, మాణిక్యాన్ని దాసిని చేస్తాడు. తర్వాత మాణిక్యం తన చెలికత్తె సహకారంతో రాజుకు మందు పెట్టి, మహారాజును వశపర్చుకుంటుంది. తనకు వశపడిన రాజుని, నీ పిల్లలని చంపేయమని రాజుకు చెబుతుంది. మాణిక్యానికి వశపడి ఉన్న రాజు, మాణిక్యం మాటానుసారం చిన్న పిల్లలను చంపడానికి అడవికి తీసుకువెళతాడు.

అక్కడ చంపలేక వారిని అక్కడే వదిలేసి, తన రాజ్యానికి వెళ్లిపోతాడు. తిరిగి వెళ్లిన రాజు, మాణిక్యం రాణిగా ఉంటే, రాజు పూర్తిగా అమెకు వశపడి ఉంటాడు. తర్వాత ఆ పిల్లలు అడవిలోనే పెరుగుతారు.

పానుగంటి పురం రామవర్తికి తన చెల్లెలు అయిన భూలక్ష్మి కోల్పోవడంతో, ఆమె పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. అతనికి ఏడుగురు కొడుకులు, ఆఖిరివాని పేరు కార్యవర్తి. అడవిలో భూలక్ష్మి పిల్లలు పెరిగి పెద్దవుతారు.

భూలక్ష్మి అన్న రామవర్తి పిల్లలు కూడా తమ మేనత్త పిల్లల జాడ కోసం ప్రయత్నిస్తూ పెరుగుతారు. వరుస అయిన ఏడు జంటలు విడివిడిగా పెరిగి యుక్త వయస్సుకు వచ్చాక వారు ఒకరినొకరు తారసపడే అవకాశం వస్తుంది.

రామవర్తి అనుజ్ఙతో అతని ఏడుగురు పిల్లలు తమ మేనత్త సంతానం ఎక్కడ ఉందో వెతుకుతూ అడవికి వస్తారు. ఆ అడవిలో వారు కలుసుకోవడం, వారికి పెళ్లిళ్లు కూడా జరుతాయి.

పెళ్లైన తర్వాత బాలనాగమ్మకు ఒక పిల్లవాడు జన్మిస్తాడు, తర్వాత ఆమె మాంత్రికుడి చేత అపహరింపబడుతుంది. ఆమెను దక్కించుకోవాలని మాంత్రికుడు, బాలనాగమ్మను బంధించి ఉంచుతాడు.

బాలనాగమ్మని విడిపించడానికి వెళ్లిన కార్యవర్తి మాంత్రికుడి మంత్రప్రభావంతో శిలగా మారిపోతాడు. చివరకు బాలనాగమ్మ కొడుకు వచ్చి తన తల్లిదండ్రులను విడిపిస్తాడు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?