Category Archives: Telugu Bhakti Cinemalu

తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్ Telugu Bhakti Cinemalu తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్ తెలుగుభక్తిమూవీ తెలుగు భక్తి చలనచిత్రం సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

తెలుగు భక్తి చిత్రాలు పురాణ సినిమాలు

తెలుగు భక్తి చిత్రాలు పురాణ సినిమాలు మహా శివరాత్రి సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రికి భక్తి సినిమాలు చూడడంలో భక్తి మనసులో పెంపొందుతుంది.

మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుని భక్తి చిత్రాలు చూడడంలో శివుని గురించిన ఆలోచనలే మనసులో ఉంటాయి. మహా శివరాత్రి రోజున పరమశివునిపై భక్తి శ్రద్దలతో మనసు పెట్టడమే, గొప్పని చెబుతారు. అలా పరమశివునిపై మనసు మళ్లడానికి తెలుగు భక్తి చిత్రాలను వీక్షించడం కూడా ఒక పద్దతి.

శ్రీమహావిష్ణువు కధలో శివుడు లేకుండా ఉండడు. శివుని కధలో విష్ణువు లేకుండా ఉండడు.

తెలుగు భక్తి చిత్రాలు యూట్యూబ్ వీడియోలు.

https://www.youtube.com/watch?v=3dq2A_s3Sno
https://www.youtube.com/watch?v=Cywn2VO0NjQ
https://www.youtube.com/watch?v=PbUR9J0RGcQ
https://www.youtube.com/watch?v=WGs57vRqZsI&t=8s
https://www.youtube.com/watch?v=3dq2A_s3Sno

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలుగు భక్తి చిత్రాలు పురాణ సినిమాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ ప్రేక్షకులు ఆదరించిన తెలుగు మూవీస్

తెలుగులో ఆనాటి మేటి మూవీస్ చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితే, మరల మరలా చూడాలనిపించే మూవీ సూపర్ డూపర్ హిట్.

సినిమా చూడంగానే ఆలోచనను రేకిత్తేంచే మూవీ సందేశంతో కూడిన మూవీ. సమాజంలో ఉండే సమస్యలను అంతర్లీనంగా తెలియజేస్తూ ఉంటాయి.

తెలుగు మూవీ అయితే ఆనందం అందిస్తాయి లేకపోతే ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మూవీ మనసును రంజింప చేయడానికే ఉంటుంది. అలా మనసును రంజింపజేస్తూ సామాజిక సందేశం కానీ వ్యక్తిగత సందేశం కానీ అంతర్లీనంగా అందిస్తాయి. లేదా ముగింపు సందేశంతో ముగుస్తుంది.

కేవలం సందేశాత్మకంగా సాగే సినిమాలు తక్కువగా ఉంటే, ఎక్కువ వినోదం అందిస్తూ ఉండేవి ఎక్కువగా ఉంటాయి. యాక్షన్, డ్రామా, సెంటిమెంట్, లవ్, ఫిక్షన్, డాన్స్ వంటి విషయాలు కలిసి, మనిషి మనసు ఆకట్టుకోవడానికి మూవీ ట్రై చేస్తుంది. మూవీ మనసును రంజింప చేయడం ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది.

విజయవంతమైన తెలుగు మూవీ నీ మనసు నాకు తెలుసు అన్నట్టు మన మనసులో కదలికలకు తగ్గట్టుగా స్క్రీనుపై పాత్రలు కదిలిస్తుంది.
చూసి చూడంగానే నచ్చేమూవీ హిట్ అయితేతెలుగులో ఆనాటి మేటి మూవీస్

అన్ని రకాల ఎమోషన్స్ కలిగిన తెలుగు మూవీ చూసి చూడంగానే నచ్చేస్తుంది. తిరిగి మరలా చూడాలనిపించే విధంగా మన మనసుపై ముద్ర వేస్తుంది. అటువంటి మూవీ మరల మరలా చూడడం అంటే, అది సూపర్ హిట్టే అవుతుంది.

మామగారు, అబ్బాయిగారు, అల్లుడుగారు, ఖైదీ, పెదరాయుడు, సమరసింహారెడ్డి, పోకిరి, బాహుబలి ఇలా కుటుంబ కధతో బాటు వ్యవస్థలోని ఊహాశక్తికి దగ్గరగా ఉండే అంశంతో తెలుగు మూవీ మనల్ని ఆకట్టుకుంటుంది.

సమాజంలో ఒకరికి అన్యాయం జరిగిందనే విషయం ఒక న్యూస్ మారి ఉంటుంది. ఏదో కుటుంబంలోని పెద్దాయన యొక్క కర్తవ్యతా నిష్ట కొందరి మనసులలో చేరి ఉండవచ్చును. సామాజిక పరిస్థితులలో నేరప్రవృత్తులపై వచ్చే కధనాలు, సమాజంలో మంచివారి హృదయాలలో భావనలు పెంచవచ్చును. కల్పనలో ఒక హీరోని సృష్టించే స్థితిలో కొందరు ఆలోచన చేయవచ్చును.

ఎక్కువమంది మనసును రంజింపచేసే సాధనములలో సినిమా ఒక సాధనంగా ఉంది.

అటువంటి తెలుగు మూవీలలో చూసి చూడంగానే నచ్చేసే తెలుగు సినిమాలు కొన్నింటిని ఈ పోస్టులో చూద్దాం.

అయితే అలాంటి సినిమాలలో చూసే పాత, కొత్త తెలుగు మూవీలను ఇందులో చూద్దాం.

భక్తిప్రహ్లాద తెలుగులో ఆనాటి మేటి మూవీస్

మనస్థితికి ఇప్పుడు కాకపోతే మరెప్పుడో చేసుకున్న మన కర్మే కారణం కాగలదని నమ్మేవారికి ఈ భక్తప్రహ్లాదలో సమాధానం లభిస్తుంది. శ్రీమహావిష్ణువు నిలయం వైకుంఠం. అక్కడ ఉండే ద్వారపాలకులు, ఋషులను అడ్డుకుంటారు. ఆ తప్పుకు శిక్షగా శాపం పొందుతారు. ఉదారుడైన శ్రీమహావిష్ణువు వారికి వెసులుబాటు తెలియజేస్తాడు. అదేమిటంటే….

నాభక్తులుగా ఏడు జన్మలు పొందుతారా? లేక నాకు శత్రువులుగా మూడు జన్మలు పొందుతారా? అనే విషయం తేల్చుకుని చెప్పమంటాడు. అందుకు ఆ ద్వారపాలకులు భక్తులుగా ఏడు జన్మలకాలం వైకుంఠం వదిలి ఉండలేం. శత్రువులుగా మూడు జన్మలకాలం దూరమై, మరలా వైకుంఠం వచ్చేవిధంగా అనుగ్రహించమని శ్రీమహావిష్ణువుని కోరతారు.

స్థితికారుడు వారి కోరికను మన్నిస్తాడు. అలా పూర్వజన్మలో చేసిన పాపఫలం అనుభవించడానికి పుట్టిన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు పుడతారు. అయితే ఒకరు శ్రీమహావిష్ణువు చేతిలో మరణించి కొంతపాప పరిహారం పొందుతాడు. రెండవవాడు తన అన్న మరణానికి శ్రీమహావిష్ణువు కారణం అని తలుస్తాడు. తన స్థితికి కారణం స్థితికారుడు అనిభావించిన హిరణ్యకశిపుడు, స్థితికర్తపై కక్షను పెంచుకుంటాడు.

ఆ కక్షతోనే తపస్సుచేసి వరాలు పొందుతాడు. శ్రీహరి భక్తులను వేదిస్తాడు. అంత శ్రీహరి ద్వేషి అయిన అతనికి పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు నిత్య శ్రీహరినామస్మరణ చేస్తూ ఉంటాడు. లోకంలో అందరినీ కట్టడి చేయగలిగాను అనుకునే అసురుడికి కొడుకే కొరకరాని కొయ్యగా మారతాడు. విరోధిగా భావించే శ్రీహరినామస్మరణ, శ్రీహరిధ్యానం అసురుడు అయిన హిరణ్యకశిపుడుకి తలనొప్పిగా మారుతుంది. ఆ తలనొప్పే, తన చావుకు కారణం అవుతుంది.

అసురునింట పుట్టినా అద్భుతమైన గుణములతో ప్రకాశించిన ప్రహ్లాదుడి చరిత్రను చదివితీరాలని పెద్దలంటారు. అటువంటి తెలుగు భాగవతగాధ తెలుగు మూవీగా భక్తప్రహ్లాద పేరుతో ఉంది. ఇది యూట్యూబ్ లో పుల్ లెంగ్త్ మూవీగా అందుబాటులో ఉంది.

భక్తిప్రహ్లాద చూసి చూడంగానే నచ్చేసే తెలుగు మూవీ

మాయాబజార్ పెద్దమాయగాడు మామ అయితే, చిన్నమాయగాడు అల్లుడు.

తెలుగులో అనేక మూవీలు వస్తూ ఉన్న నాటి మాయాబజార్ మూవీ మరలా విడుదల అయితే అదే ముందుంటుందని నిరూపించిన తెలుగు ఓల్డ్ మూవీ మాయాబజార్. అలనాటి మాయాబజార్ పెద్దమాయగాడు మామ అయితే, చిన్నమాయగాడు అల్లుడు.

పెద్దమాయగాడు కృష్ణుడుగా ఎన్టీరామారావు నటిస్తే, చిన్నమాయగాడుగా ఎస్వీరంగారావు మరిపించారు. సావిత్రి కృష్ణుడి అన్నగారి కూతురు శశిరేఖగా నటిస్తే, అమె మనసును మాయచేసినవాడిగా అక్కినేని అభిమన్యుడుగా నటించారు. ఇలా మాయాబజార్ తెరపై మన మనసును కట్టిపడేస్తుంది.

శశిరేఖా పరిణయం తెలుగువారికి తెలిసిన భారత కధే. అయితే ఈ మాయాబజారు తెలుగు మూవీలో పాండవుల ప్రస్తావనే కానీ పాండవుల పాత్రలు సినిమాలో కనబడవు. వారి బిడ్డ అభిమన్యుడు, కృష్ణుడింట సాగించే ప్రేమకధే ఈ మాయాబజార్ సినిమా కధ.

శశిరేఖ – అభిమన్యుల పరిణయానికి సహకరించే పనిలో ఘటోత్కచుడి మాయావిలాసం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రాయలేం కాబట్టి సినిమా చూసి ఆనందించడమే మేలు.

అలనాటి మేటి తెలుగు మూవీలలో సత్యహరిశ్చంద్ర మూవీ ఒక్కటి.

ఈ రోజులలో సత్యానికి పర్యాయపదంగా వాడేంతలగా ప్రసిద్ది పొందిన పేరు సత్యహరిశ్చంద్ర. అబద్దాలాడేవారి గురించి వ్యంగ్య భావనతో మాట్లాడేవారు ”అబ్బో దిగొచ్చాడండీ పెద్ద సత్యహరిశ్చంద్ర” అని సంభోదిస్తూ ఉంటారు. నిత్యం సత్యం చెప్పినవారెవరూ అంటే, సత్యహరిశ్చంద్ర… సత్యహరిశ్చంద్ర….సత్యహరిశ్చంద్ర…

అటువంటి సత్యహరిశ్చంద్రుని జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని పెద్దలంటారు. పురాణాలలో పురాణ పురుషుల చరితములు సినిమాలుగా మార్చి ఇచ్చిన తెలుగు దర్శకులకు కృతజ్ఙతలు చెప్పుకోవాలి. పురాణాలలో వశిష్ఠుడి చేత కీర్తింపబడిన సత్యహరిశ్చంద్ర, పరమేశ్వరుడ విశ్వామిత్రుని రూపంలో పెట్టి అన్ని పరీక్షలలోనూ నెగ్గుతాడు.

సత్యహరిశ్చంద్ర తెలుగు మూవీ గురించి పూర్తిగా రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

భట్టీ విక్రమార్క అలనాటి తెలుగు మూవీ…

రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులు, దైవానుగ్రహం పొంది, ప్రజలను పరిపాలించేవారు. అంతటి రాజులు, దైవం దగ్గరకు పడే పాట్లు వ్యక్తిగత జీవితంలో మార్పులు తెస్తాయి. దైవానుగ్రహం సాధించడానికి శక్తిని, యుక్తిని కలిగిస్తుంది. కానీ ప్రయత్నం సాధకుడే చేయాలి.

అలాంటి సాధకుడికి కాలంలో కలిగే కష్టాలకు ఓర్చగలిగే శక్తి ఉంటుంది. దైవానుగ్రహం వలననే సాధించగలిగే శక్తి ఉన్నా, కాలం పెట్టే పరీక్షలో ఆ శక్తి వలన ప్రయోజనం కన్నా నిరీక్షణ వలన ప్రయోజనం ఉంటుంది. తదుపరి శక్తి వలన ప్రయోజనం పొందగలుగుతారు.

అలా సాక్షాత్తు పరదేవతా అనుగ్రహం పొందిన భట్టీవిక్రమార్కులు అజేయులుగా ఉంటారు. విక్రమార్కుడు బేతాళుడినే వశపరచుకుంటాడు. పరాక్రమముతోనూ, యుక్తితోనే ఉండే విక్రమార్కుడికి తెలివైన మంత్రిగా భట్టీ అండగా ఉంటాడు.

ఎన్ని ఉన్నా కాలం వలన కలిగే కష్టం మాత్రం మనిషి అనుభవించాల్సిందే. అలా విక్రమార్కుడు వ్యక్తిగతంగా పొందిన కష్టం ఏమిటి? దైవానుగ్రహం చేత విశిష్ట శక్తులు కలిగిన మాంత్రికుడిని ఎలా జయించాడు? సినిమా చూసి తెలుసుకోవాలి.

సాహసం కలిగిన కధలు అందరినీ అలరిస్తే, అప్పట్లో సాహసం రాజుల కధలలో…. భట్టీ విక్రమార్క చూసి చూడంగానే నచ్చేమూవీ…

భట్టీ విక్రమార్క అలనాటి తెలుగు మూవీ… ఇందులో రామారావు, అంజలీదేవి, ఎస్వీరంగారు, కాంతారావు తదితరులు నటించారు.
ఇందులో రామకృష్ణ, ఎస్వీరంగారావు, విజయనిర్మల తదితరులు నటించారు.

రావణాబ్రహ్మ భక్తి, అనురక్తిని చూపే భూకైలాస్ తెలుగు మూవీ

ఎన్టీరామారావుగారు శ్రీరాముడు, కృష్ణుడు అంటూ పురాణ హీరోల పాత్రలతో ప్రేక్షకులను మరిపించారు. అయితే ఆయన పురాణప్రతినాయకుడి పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. సాదారణంగా ప్రజాధరణ పొందని కధానాయకుడు ఏదో ఒకసారి ప్రతినాయకుడి పాత్రలో కనబడతారు. కానీ ఎన్టీరామారావుగారు మాత్రం పలుమార్లు ప్రతినాయకుడి పాత్రలను పోషించారు. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలలో మెప్పించారు.

అలా ఎన్టీరామారావు గారు రావణాబ్రహ్మగా చేసిన తెలుగు మూవీ భూకైలాస్. రావణుడి తల్లి సముద్రతీరంలో సైకత లింగమును పూజిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు శివార్చన చేస్తూ ఉండగా, సముద్రపు అలలు వచ్చి, సైకత లింగమును కలిపేసుకుంటాయి. వెంటనే గృహమునకు పోయి మదనపడుతున్న తల్లిని చూసి రావణాసుడు, సైకత లింగం కాదు. శివుడి ఆత్మలింగం తీసుకువస్తానని కైలాసం బయలుదేరతాడు.

రావణాసురుడు ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. రావణుడి శివునిని ఆత్మలింగం కోరకుండా, అమ్మవారిని కోరతాడు. శివుడు అనుగ్రహిస్తాడు. అమ్మవారిని వెంటపెట్టుకుని స్వగృహమునకు పోతున్న రావణుడిని నారదుడు కలుస్తాడు. ఆ తర్వాత అమ్మవారిని వెంటపెట్టుకుని రావణుడు మరలా శివుని దగ్గరకు వెళతాడు.

కైలాసంలో శివుని దగ్గర నుండి వెనుతిరిగిన రావణుడు, పాతాళలోకంలో ఉన్న మండోదరిని వివాహమాడతాడు. మండోదరిని వెంటపెట్టుకుని తల్లిని చేరిన రావణుడికి అసలు విషయం బోధపడుతుంది. తను ఆత్మలింగం కోసం కోరకుండా వేరు విషయాలకోసం ప్రాకులాడానని…. వెంటనే మరలా తపస్సు చేసిన రావణుడికి శివుని ఆత్మలింగం చేతిలోకి వస్తుంది.

ఈసారి శివుని ఆత్మలింగమును చేతబట్టి పోతున్న రావణుడికి దారి మద్యలో సంధ్యావందనం చేయవలసిన సమయం ఆసన్నమవుతుంది. ముక్కటి ఆత్మలింగమును నేలపైకి చేర్చరాదు. అందుకని ఓ ఆవులమందని కాసే కుర్రవాని చేతికి శివుని ఆత్మలింగం ఇచ్చి రావణుడు సంధ్యావందనానికి సముద్రపు తీరానికి పోతాడు.

అయితే ఆ బాలకుడు మూడుమార్లు రావణా… అంటూ అరిచి శివుని ఆత్మలింగము నేలపై పెడతాడు. పరుగు పరుగున అక్కడికి వచ్చిన రావణుడు శివలింగమును కదిలిస్తాడు. ప్రకృతి శక్తి ముందు అతని శక్తి పనికిరాదు. శివుని ఆత్మలింగం అక్కడే ప్రతిష్టంపబడుతుంది. రావణబ్రహ్మ భక్తి వలన గోకర్ణ క్షేత్రం అలా ఏర్పడిందని అంటారు.

రావణాబ్రహ్మ భక్తి, అనురక్తిని చూపే భూకైలాస్ తెలుగు మూవీ

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా నటించిన తెలుగు మూవీ

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు త్రిపాత్రాభినయం చేసిన సినిమా. ఇది మహాభారతంలోని కర్ణుడి పాత్రను ప్రధానంగా చూపుతుంది. దానంలో కర్ణుడు గొప్పవాడుగా చెప్పబడతాడు. అటువంటి కర్ణుడి పాత్రతో పాటు, కృష్ణుడు, ధుర్యోధనుడి పాత్రలలో ఎన్టీరామారావు నటించారు.

కర్ణుడి వంటి పుట్టుకను సమాజం ప్రశ్నిస్తూనే ఉంటుంది. సమాజం చిన్నచూపు చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ విధానం పద్దతికి విరుద్దంగా ఉంటుంది, కాబట్టి. కుంతికి వివాహం కాకముందే, ఋషి మంత్రం వలన సూర్యానుగ్రహం వలన కర్ణుడు పుడతాడు. అలా పుట్టిన కర్ణుడిని కుంతి ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది.

మయసభలో దుర్యోధనుడు పరాభవం పొందడం. పరాభవం పొందిన దర్యోధనుడు శకుని సాయంతో పాండవులను ఓడించడం. పాండవులు వనవాసం చేయడం. పాండవవనవాసం తర్వాత శ్రీకృష్ణరాయభారం. తర్వాత కురుక్షేత్ర యుద్ధమునకు కురుపాండవులు సిద్దపడడం… కధ క్లైమాక్స్ కు చేరుతుంది.

ఆ తరువాత కర్ణుడు సూతుల ఇంట పెరిగి విలుకాడు అవుతాడు. అర్జునుడంతటివాడు కర్ణుడు అంటారు. కానీ అనుగ్రహం అర్జునుడికే ఉంటుంది. కురుసభలో విలువిద్య ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రయత్నించిన కర్ణుడికి, దుర్యోధనుడు సాయపడతాడు. అలా వారిద్దరి మద్య స్నేహం ఏర్పడుతుంది.

కుంతి కర్ణుడిని కలుస్తుంది. కర్ణుడు కుంతితో అయిదుగురితో కూడిన పాండవులు నీకు ఉంటారని, అందులో అయితే అర్జునుడు లేకపోతే కర్ణుడు ఇద్దరిలో ఒక్కరే ఉంటారని అంటాడు. చివరికి అర్జునుడితో కూడిన పాండవులే కుంతికి ఉంటారు. ఈ కధ అందరికే తెలిసిందే, కానీ ఎన్టీరామారావుగారి నటన ఆసక్తిగా ఉంటుంది. దానవీరశూరకర్ణ చూసి చూడంగానే నచ్చేమూవీ….

దానవీరశూరకర్ణ ఎన్టీరామారావు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా నటించిన తెలుగు మూవీ

శ్రీరామ కధా గానం లవకుశ తెలుగు మూవీ

లవకుశ శ్రీరామనామము రామ నామము రామ నామము అంటూ రామనామసంకీర్తన చేస్తూ రామకధను చెప్పడం రాముని తనయుల నుండే మరలా ప్రారంభం అయ్యింది… కుశలవులు శ్రీరాముని తనయులు కానీ రాముడిని కలవడం మాత్రం శ్రీరాముని దివ్వగానం ప్రారంభించాకే…

ధర్మము మానవరూపంలో తిరిగితే అది శ్రీరాముడు అంటే, అటువంటి రాముని కుమారులు అయిన కుశలవులకు, ఆ ధర్మమూర్తి గురించి తెలుసుకుని గానం చేశాకే శ్రీరామదర్శనం అయింది. శ్రీరామనామము అంతటి శక్తివంతమని చెబుతారు. శ్రీరాముడు ధర్మము కోసం రాజ్యం విడిచాడు. అదే రాజధర్మం కోసం భార్యను దూరం చేసుకున్నాడు.

ప్రజలకు మార్గదర్శకంగా ఉండే రాజు, ప్రజల దగ్గర చులకన కాకుడదు. అలా చులకన అయ్యే పరిస్థితులు ఉంటే, ఆ పరిస్థితులలో రాజ్యం విడవడం లేక అందుకు కారణం అయ్యినవారిని విడిచిపెట్టడం చేయాలంటారు.

రావణాసురుడు అపహరించిన సీతమ్మను చేపట్టడం ఏమిటి? అని ఒక చాకలివాడు అన్నమాటను శ్రీరాముడు వింటాడు. వెంటనే శ్రీరాముడు తన ప్రాణానికి ప్రాణమైన సీతను వదులుకోలేకా, రాజ్యాన్ని ఎవరోఒకరు తీసుకోవాల్సిందిగా తన తమ్ములను కోరతాడు. అందుకు సోదరులు ఎవరూ అంగీకరించరు. చేసేదిలేక సీతను అడవులలో విడిచిరమ్మని లక్ష్మణుడిని రాముడు ఆజ్ఙాపిస్తాడు.

లక్ష్మణుడు సీతమ్మను అడవిలో వదిలేసి వెళతాడు. సీతమ్మను వాల్మీకి మహర్షి, తన ఆశ్రమమునకు తీసుకువెళతాడు. లోకపావనీ దేవిగా సీతమ్మ అక్కడ పిలవబడుతుంది. సీతమ్మకు కుశ,లవులు జన్మిస్తారు. వారు వాల్మీకి మహర్షి వద్ద శ్రీరామాయణం తెలుసుకుంటారు. గానంచేస్తారు. అలా వారు అయోధ్యలో కూడా రామకధను గానం చేస్తారు.

శ్రీరాముడు తలపెట్టిన అశ్వమేధ యాగంలో అశ్వమును కుశలవులు బంధిస్తారు. తత్ఫలితంగా శ్రీరాముడు వారితో తలపడడం, వారెవరో తెలుసుకోవడం జరుగుతుంది. రామనామ సంకీర్తన ఎక్కువగా వినబడుతుందీ సినిమాలో…. చూసి చూడంగానే నచ్చేమూవీ లవకుశ తెలుగు మూవీ.

శ్రీరామ కధా గానం లవకుశ తెలుగు మూవీ
సుగుణములు కలిగిన సుందరి గుణసుందరి తెలుగు మూవీ.

లోకంలో గుణములే అందములు అయితే, అటువంటి సుగుణముల గలవారిని కాలము పెట్టే పరీక్ష కఠినంగానే ఉంటుంది. పరమేశ్వరుని అనుగ్రహం వలననే సుగుణములు కలుగుతాయి. కానీ అటువంటి సుగుణములు కాలప్రభావం చేత పరీక్షకు గురై, ఎక్కువకాలం కీర్తింపబడతాయి. ఆకోవలోనే అలనాటి పాత తెలుగు సినిమాలు చాలావరకు ఉంటాయి. సుగుణములు కలిగిన సుందరి గుణసుందరి తెలుగు మూవీ.

పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఒకరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు పెద్దకుమార్తెలకు రాచరికపు మర్యాదలపై ఆసక్తి ఉంటే, చిన్నమ్మాయికి ప్రాతివ్రత్యపు కధలంటే మక్కువ. పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే సతుల కధలంటే ఇష్టం. ఆమె పేరు గుణసుందరి.

ఒకరోజు కొలువుదీరిన మహారాజును, నిండుసభలో అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే గుణసుందరి కూడా తండ్రిని గౌరవిస్తుంది, కానీ నాకు కాబోయే భర్తే దైవమంటుంది. రాజుకు కోపం వస్తుంది. ఇంకా పెళ్లైనా కాలేదు…. అప్పుడే ఇలా మాట్లాడుతుందేమిటి? అనుకుంటాడు. అన్ని అంగవైకల్యం ఉన్నవాడిని ఏరికోరి గుణసుందరికిచ్చి వివాహం చేస్తాడు.

రూపం ఎలా ఉన్నా, గుణసుందరిభర్తకు ఏ అంగవైకల్యం లేదనే విషయం బయటపడుతుంది. రాజు ఆశ్చర్యపడతాడు, భవంతిలో మెట్లపైనుండి క్రిందకు జారిపడతాడు. గాయంపాలైన రాజు మంచమెక్కుతాడు. గుణసుందరి తన భర్తతో పాటు బయటకు వెళ్ళిపోతుంది.

పూరిగుడిశెలో ఉంటున్నా, గుణసుందరి భర్తతో హాయిగా కాపురం చేస్తుంది. కానీ రాజుగారి గాయం మానదు. రాజుగారిగాయం నయం కావాలంటే, మహేంద్రమణి కావాలని రాజవైద్యులు చెబుతారు. మహేంద్రమణిని సాధించి, తెచ్చినవారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజు చాటింపువేయిస్తాడు.

రాజుగారి పెద్దల్లుళ్ళు ఇద్దరూ మహేంద్రమణి సాధించడానికి బయలుదేరతాడు. గుణసుందరి తన భర్తయొక్క గాధను, తన భర్తనోటివెంట తెలుసుకుంటుంది. వెంటనే తన తండ్రిని రక్షించవలసినదిగా అతనిని వేడుకుంటుంది. రాజుగారి చిన్నల్లుడు కూడా మహేంద్రమణి కోసం బయలుదేరతాడు.

రాజుగారి ముగ్గురల్లుళ్ళు మార్గమద్యంలో కలుసుకుంటారు. మహేంద్రమణిని సాధించడంలో యక్షకన్యలు పెట్టే పరీక్షలలో ఇద్దరూ ఫెయిల్ అవుతూ ఉంటారు. మూడోవాడు యక్షకన్యలను మెప్పిస్తాడు. అలా మూడోవాడు సాధించిన మహేంద్రమణిని, అతనిని మోసం చేసి, పెద్దవారిద్దరూ తస్కరిస్తారు.

మహేంద్రమణితో రాజుగారి దగ్గరకు వెళతారు. అయితే మంత్రంతో పనిచేసే మహేంద్రమణి పనిచేయదు. ఎందుకంటే వారు ఆ మంత్రం మరిచిపోతారు. పూర్వగాధలోని ఋషి శాపంచేత, బల్లూకముగా మారి గుణసుందరి భర్త స్వగృహమును చేరతాడు.

తీసుకురాబడిన మహేంద్రమణి పనిచేయాలంటే మంత్రం కావాలి. మంత్రం తెలిసినవ్యక్తి ఎలుగుబంటిగా మారాడు. ఎలుగుబంటిగా మారిని భర్తతో గుణసుందరి తన గుడిశెలోనే పరమేశ్వరుడిని ప్రార్ధిస్తుంది. చివరికి పార్వతీ, పరమేశ్వరులు ఎలుగుబంటితో సహా రాజమందిరం చేరి, అక్కడ నిజనిర్ధారణ చేయిస్తారు.

చివరికి రాజుగారిగాయం నయం అవుతుంది. గుణసుందరిభర్తకు శాపవిమోచనం కలుగుతుంది. తెలుగులో ఆనాటి మేటి మూవీస్ లో గుణసుందరి తెలుగు మూవీ.

తెలుగు మూవీస్ తెలుగురీడ్స్

తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్

తెలుగు ఓల్డ్ భక్తి మూవీస్ తెలుగులో లిస్టు. భక్తి సినిమాలు భక్తి భావనలను మరింత బలపరుస్తాయి. ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కేవలం భక్తి సినిమాల లిస్టు మాత్రమే ఒక్క చోట ఉంటే, అది భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని, భక్తి సినిమాల లిస్టు, మూవీ వీడియో లింకులతో ఈ పేజిలో జతచేయడం జరిగింది. ఇందులో చూపించబడిన డేటా పబ్లిక్ డొమైన్లలో ఉచితంగా లభిస్తుంది. అలా ఉచితంగా లభిస్తున్న డేటా ఆధారం ఈ లిస్ట్ చేయడం జరిగింది.

భక్తి తెలుగు పాత సినిమాలలో అలనాటి మేటి తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ మరియు లేటెస్ట్ భక్తి తెలుగు మూవీస్ జాబితాగా చేయడం జరిగింది. అయ్యప్పస్వామి జన్మ రహస్యం తెలుగు భక్తి మూవీ, అయ్యప్పస్వామి మహాత్యం తెలుగు భక్తి మూవీ, శ్రీకృష్ణుడిపై గల భక్తి తెలుగు మూవీస్, పౌరాణిక తెలుగు భక్తిరస మూవీస్, జానపద తెలుగు మూవీస్ ఇక్కడ లిస్ట్ చేయబడింది.

దక్షయజ్ఙం, శ్రీవేంకటేశ్వర స్వామి మహాత్యం, సోమవార వ్రత మహాత్యం, అన్నమయ్య, శ్రీరామదాసు ఓల్డ్ భక్తి మూవీస్, శ్రీరామదాసు న్యూ భక్తి మూవీ, సతీ అనసూయ, సతీ సుకన్య, సతీ సక్కుభాయి, శివలీలలు, జగన్నాత, దేవీ నవగ్రహ నాయకి, భక్త తుకారం, భీష్మ వంటి తెలుగు భక్తి మూవీస్ ఈ క్రిందగా ఉన్న చిత్రములకు ఆయా వీడియోల లింకులు జతచేయబడ్డాయి…. ఆయా ఫోటోలపై క్లిక్ చేసి, ఆయా భక్తిరస తెలుగు మూవీస్ చూడవచ్చును.

తెలుగు మూవీస్ లిస్టు హీరోల వారీగా ఇంకా కామెడీ మూవీస్, జానపద మూవీస్, పౌరాణిక మూవీస్, హిట్ మూవీస్ వంటి లిస్టులతో కూడిన మూవీమాయ మొబైల్ యాప్ ఉచితంగా ప్లేస్టోర్లో లభిస్తుంది. డౌన్ లోడ్ చేయడానికి ఈ క్రింది బటన్ తాకండి.

తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
శ్రీ ఆంజనేయ చరిత్ర తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
శ్రీ ఏడుకొండలస్వామి తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
భక్త ప్రహ్లాద తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
శివలీలలు తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
జగద్దురు ఆదిశంకర తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
వెంగమాంబ తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
శ్రీ శ్రీశైల భ్రమరాంబికా కటాక్షము తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
ఓంగణపతి తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
సీతా కళ్యాణం తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
సిద్ద లింగేశ్వర తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
భక్త కన్నప్ప తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
గౌరీదేవి మహిమలు
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
శ్రీ గౌరి మహాత్యం తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
శుక్రవారం మహాలక్ష్మీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
దేవీ నవగ్రహ నాయకి తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
లక్ష్మీపూజ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
అయ్యప్పస్వామి చరిత్ర తెలుగు భక్తి రసమయ మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
బాలనాగమ్మ జానపదా తెలుగు కధా చిత్రం
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
బాలభారతం పౌరాణిక తెలుగు మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
బొబ్బిలి యుద్ద చారిత్రాత్మిక తెలుగు మేటి సినిమా
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
తెలుగు మేటి సినిమాలలో దానవీరశూరకర్ణ కూడా ఒక్కటిగా చెబుతారు.
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
దక్షయజ్ఙం ఆనాటి మేటి భక్తిమయ పౌరాణిక తెలుగు సినిమా
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
గుణసుందరికధ అలనాటి మేటి జానపద భక్తిరస తెలుగు ఓల్డ్ సినిమా
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
లక్ష్మీకటాక్షం అలనాటి తెలుగు పాత సినిమాలు
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
లవకుశ అద్భుత తెలుగు పౌరాణిక భక్తి మూవీ
తెలుగు భక్తి ఓల్డ్ మూవీస్ లిస్ట్
మాయాబజార్ అలనాటి మేటి తెలుగు పౌరాణిక భక్తి తెలుగు సినిమా
నలదమయంతి పుణ్యప్రధమైన తెలుగు భక్తిరస సినిమా
పాండురంగ మహాత్యం తెలుగు భక్తి రసమయ పాత సినిమా
సత్యహరిశ్చంద్ర అలనాటి తెలుగు మేటి సినిమా

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ.

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి గుప్తదానం చేసి, అతని అదృష్టాన్ని పరీక్షించమని చెబుతాడు. ఆచార్యుడు చెప్పినట్టే ఒక బ్రాహ్మణ పండితుడికి వజ్రాలు, వైఢూర్యములతో కూడిన నగలు పైకి కనబడకుండా ఒక గుమ్మడి కాయలో పెట్టి రాజు దానం చేస్తాడు. దానం స్వీకరించిన పేద బ్రాహ్మణుడు ఆగుమ్మడికాయను రాజు సమక్షం నుండి బయటకురాగానే నేలకేసి కొట్టి, తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. అది చూసిన రాజు పరివారం అంతా ”ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కానీ గ్రహాల ప్రభావం కాదు” అని ఆచార్యులతో అంటారు. ఆచార్యులు ఎంత చెప్పిన నవగ్రహశాంతి పూజ చేయడానికి సత్యపాల మహారాజు ఒప్పుకోడు.

అకాలంలో పల్లెప్రజలు రాజధానికొచ్చి జేగంట మోగిస్తారు. సత్యపాలమహారాజుతో వారు తమపై క్రూర మృగాల దాడి ఎక్కువైందని చెప్పడంతో సేనాని వీరసేనుడు(రాజనాల), స్వయంగా వచ్చి మీ సమస్యను తీరుస్తారని అంటాడు. అతని సహచరులు కూడా మహారాజే స్వయంగా ఆపని చేస్తే బాగుంటుందని ప్రోత్సహిస్తారు. అయితే రాణి మరియు ఆచార్యులు రాజును నవగ్రహాలను పూజించి వెళ్లవలసినదిగా కోరతారు. కానీ సత్యపాల మహారాజు వారిమాటని త్రోసిరాజని వేటకు వెళతాడు.

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

వేటకొరకు ప్రయాణం చేసిన సత్యపాలమహారాజు విశ్రాంతి మందిరంలో నిద్రిస్తుండగా క్రూరమృగం శబ్ధం రావడంతో అడవిలోకి వెళతాడు. కానీ ముసుగులాంటి వేషధారణలో ఉన్న భటులు రాజును కొట్టి ఒక నూతిలో పడవేస్తారు. మహారాజు కనిపించడంలేదు అనే మిషతో అంత:పురానికి తిరిగి వచ్చిన వీరసేనుడు మహారాణిని అంత:పుర బందీగా ఉంచి, రాకుమారుని తీసుకుపోతాడు. మహారాజు అడవిలో నూతిలోనే కొన్ని రోజులపాటు ఉండిపోతాడు. నీటికోసం వచ్చిన కొందరు మనుషులు సత్యపాలుడిని పైకి లాగుతారు.

మహారాజుని వెతక్కుంటూ మహారాణి రాకుమారుడిని తీసుకుని అడవికి బయలుదేరుతుంది. సత్యపాల మహారాజు మరలా అంత:పుర ప్రవేశం చేస్తాడు. అయితే వంచకుడు వీరసేనుడు మహారాజుని వంచించి, మహారాజుని నిర్భందిస్తాడు. వీరసేనుడు సత్యపాలమహారాజును క్రూరంగా హింసించి, చనిపోయాడు అని భావించి, మహారాజును బయటిప్రారవేయిస్తాడు. అలా మహారాజు ఒక నాటకాల బృందానికి దొరుకుతాడు.

మహారాణి తన అన్నగారి దగ్గరకు వెళితే, అక్కడ ఆమెకు నిరాధారణ ఎదురవుతుంది. ఆమె దిక్కుతోచని స్థితిలో తిరుగు ప్రయాణం అవుతుంది. ఇలా సత్యపాల మహారాజు గ్రహాచారం బాగుండకపోవడం వలన అష్టకష్టాలు పడతాడు. అయితే మహారాజు తన కాళ్లు పోయినా, అది మానవ తప్పిదమే అంటాడు కానీ గ్రహాలను ప్రార్ధించడు. అయితే చివరకు మహారాజు ఆశ్రయం ఇచ్చిన వారి పసిపాపడు ప్రాణం పోవడంతో చలించిన మహారాజు, వారికోసం నవగ్రహాలను శరణువేడతాడు. వెంటనే మహారాజు కాళ్లు, చేతులు రావడం, చనిపోయిన పిల్లాడు బ్రతకడం జరుగుతుంది.

సత్యపాల మహారాజు తిరిగి తన రాజ్యనికి వెళ్లి, వీరసేనుడిని మట్టుపెడతాడు. తన గురువు ఆచార్యులను చెరశాల నుండి విముక్తి చేయించి, తిరిగి తన ఆస్థానంలో కూర్చుంటాడు. నవగ్రహాల శక్తిని తక్కువ అంచనా వేసి, గురువుగారి మాట విననందుకు, ఆచార్యులకు మహారాజు క్షమాపణ చెప్పి, ఇదంతా నవగ్రహ పూజా మహిమగా కొనియాడడంతో సినిమా శుభం అవుతుంది.

గ్రహస్థితి బాగుండనప్పుడు మనిషి బుద్ది ఎలా మందగిస్తుందో? చిన్న చిన్న తప్పులతో పెద్ద పెద్ద ఆపదలను కొని తెచ్చుకోవడమో లేక అవకాశాలను కోల్పోవడమో? ఇలాంటి సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ .

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ కి ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, కృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. అలనాటి పాత సినిమాలలో ఈ దీపావళి తెలుగు ఓల్డ్ మూవీ పౌరాణిక సినిమా…

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమాకు కమాలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా అరుణ్ గోవిల్, పద్మావతిగా భానుప్రియ నటించగా మిగిలిన పాత్రలలో తదితర తారాగణం నటించారు. ఈ తెలుగుసినిమాలో శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం బాగా చూపించారు.

శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుమూవీ ప్రారంభం శ్రీవినాయకుడు, వేదవ్యాసుడు మాటలతో ప్రారంభం అవుతుంది. వినాయకుడుకు, వ్యాసుడు శ్రీ ఏడుకొండలస్వామి అవతారం గురించి చెబుతూ, శ్రీమహావిష్ణువు ఏకారణం చేత వేంకటేశ్వరావతారం స్వీకరించిందీ, ఏడుకొండలు ఏఏ దేవతా స్వరూపాలు భూలోకంలో అవతరించింది వివరిస్తారు. తర్వాత పద్మావతి – వేంకటేశ్వరస్వామి పరిణయం ఘట్టం వెండితెరపై కనులవిందుగా ఉంటుంది. అలా శ్రీనివాసుడు ఎలా ఏడుకొండలపై పద్మావతి సమేతంగా శ్రీ ఏడుకొండలస్వామిగా ఎలా వెలసింది వినాయకుడికి వేదవ్యాసుడు వివరిస్తారు.

నారదుడు ఆకాశమార్గంలో నారాయణ జపం చేస్తూ, సంచారం చేస్తూ ఉండగా, నారదమహర్షికి శనైశ్చరుడు తారసపడతాడు. వారిద్దరి మద్య శ్రీ ఏడుకొండలస్వామి శ్రీనివాసుని గురించి ప్రస్తావన వస్తుంది. పరమశివుడినే కొన్ని ఘడియలపాటు పీడించిన నాకు, కలియుగంలో వేంకటేశుని పీడించడం ఏపాటిది, అని నారదునితో అని శ్రీ వేంకటేశ్వరుని నిలయానాకి చేరి అక్కడ భంగపడతాడు. శ్రీ ఏడుకొండలస్వామి మహిమ అర్ధం చేసుకున్న శనైశ్చరుడు ఆ ఏడుకొండలస్వామి గురించే తపస్సు చేస్తాడు.

శనైశ్చరుని తపస్సుకు మెచ్చిన శ్రీఏడుకొండలస్వామి, శనైశ్చరుని ముందు సాక్షాత్కరించిన శ్రీవేంకటేశ్వరుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు శనైశ్చరుడిని. అప్పుడు శనైశ్చరుడు శ్రీ ఏడుకొండలస్వామిని ఇలా రెండు వరాలు అడుగుతాడు. ఒకటవ వరం: ఒక్క శనివారం మాత్రమే నిన్ను పూజిస్తే, వారంలో మిగిలిన ఆరు రోజులు నిన్ను పూజించినంతటి పూజాఫలం అనుగ్రహించమని కోరతాడు. రెండవ వరం: గ్రహచారం ఉన్నవారు నీ భక్తుల అయినా సరే వారిని నేను పీడించడానికి నీవు ఆడ్డు పడకూడదు అని అడుగుతాడు. శ్రీనివాసుడు తధాస్తు అని అంతర్ధానం అవుతాడు.

శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

అప్పుడు వినాయకుడు, వ్యాసమహర్షితో ఇలా అంటాడు ”శనైశ్చరుడికి రెండవ వరం కూడా అనుగ్రహించడంలో శ్రీ ఏడుకొండలస్వామి ఆంతర్యం ఏమిటి” అని. బదులుగా వ్మాసమహర్షి ”ఆ జగన్నాధుని లీలలు అర్ధం అవ్వడం అంత సులభం కాదు, ఇదిగో ఆ జగన్నాటకంలో భాగంగా ఆయన ఆడిస్తున పాత్రలు చూస్తే ఆ పరమార్ధం నీకు అర్ధం అవుతందని” అంటాడు. శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం తెలుగు భక్తి సినిమా.

పెద్దలు అందరూ జయంతి, జయంత్ ల వివాహం నిశ్చయం చేసుకుంటారు. అయితే వరాహమిత్రుడు అనే బ్రాహ్మణస్వామి జాతక పరిశీలనలో జయంత్ కు అపమృత్యు దోషం బయటపడుతుంది. అయితే ఇద్దరికి వివాహం జరిగితే, జయంతి జాతకబలం చేత, జయంత్ జాతకంలోని దోషం పోతుందని వివాహం లగ్నం నిశ్చయం చేస్తారు. వివాహం జరిపించి వరాహమిత్రుడు జయంతితో మాట్లాడుతూ ”సరిగ్గా నేటి నుండి ఏడవ శనివారం నాడు, నీ భర్త జయంత్ కు మృత్యుగండం ఉంది” అని చెబుతాడు. అయితే శ్రీ ఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతం గురించి జయంతికి చెప్పబోతూ వరాహమిత్రుడు ప్రాణాలు కోల్పోతాడు.

జయంతితో ఎవరు ఏడుశనివారాల వ్రతం చేయిస్తారు? జయంత్ మృత్యు గండం నుంచి తప్పించుకున్నాడా? శ్రీ ఏడుకొండలస్వామి అనుగ్రహం వలన ఏవిధం జయంతి, జయంతుల జీవితం సంతోషమయం అయ్యింది? శ్రీ ఏడుకొండలస్వామి తెలుగు సినిమాలో చక్కగా చూపిస్తారు. ఆ ఏడుకొండలస్వామిని భక్తితో కొలిస్తే, ఎటువంటి గ్రహదోషం అయినా తప్పించుకోవచ్చు అనే విధంగా ఈ శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం సినిమా తీర్చిదిద్దారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం ఉంటుంది.

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

ఆదిశంకరాచార్య కంచికి వచ్చి అమ్మ అనుగ్రహం సంపాదించడం, అలాగే కంచి కామకోటి పీఠం నెలకొల్పమని కామాక్షి అమ్మవారు చెప్పడం, ఒక అమాయక పిల్లను కామాక్షి అమ్మ అనుగ్రహించి ఆమె నోటపలికిన మాటను వాస్తవం చేసే శక్తిని ప్రసాదించడం, ఇంకా మరిన్ని భక్తి సన్నివేశాలు ఈ  కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రంలో కనిపిస్తాయి.

జనని సినీ ప్రొడక్షన్స్ పతాకం పై కంచి కామాక్షి తెలుగు భక్తి చిత్రం జెమిని గణేషన్, సుజాత, శ్రీప్రియ, వై విజయ, శ్రీకాంత్, శ్రీవిద్య, రాజసులోచన తదితరులు నటించిన చిత్రానికి సంగీతం కెఎస్. రఘునాథన్, దర్శకత్వం కెఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం తెరకెక్కింది.

కాంచీపురం చుపుస్తూ కంచి గురించి చెబుతూ అమ్మవారి ఆలయం గురించి చూపుతూ అమ్మగురించి చెప్పడం చిత్ర ప్రారంభ సన్నివేశం. కంచి కామాక్షి గుడిలో అమ్మవారికి ఆలయ ధర్మకర్త వచ్చి పూలు పలహారాలు తెస్తే, అక్కడే ఒక స్వర్ణపుష్పంతో నిలబడి ఉన్న సిద్ధుడు, ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి పూజించి ఇవ్వమని చెబుతారు. ప్రధాన అర్చకులు ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గరపెట్టి పూజ చేసి ఆ సిద్దుడికి ఇస్తే, సిద్దుడు అక్కడ నిలబడి ఉన్నఆడువారిలో ఒకామెకు స్వర్ణపుష్పం ఇచ్చి వెళ్ళిపోతారు.

ఆమె ఆ స్వర్ణపుష్పం తీసుకుని వెళ్లి తన భర్తకు ఉన్న కుష్టిరోగాన్ని పోగొడుతుంది. ఆ తరువాత ఒక సాధు కొన్ని శక్తులతో మహిమలు చూపుతూ నేనే భగవంతుడిని నన్నే కొలవండి అని ప్రగల్భాలు పలుకుతుంటే, కంచి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పానికి అర్చన చేయించిన సిద్దుడు అక్కడికి వస్తాడు. అక్కడ ఆ సాదువుకి తన మహిమ చూపి అతనికి బుద్ది చెబుతారు సిద్దుడు. అక్కడికి కామాక్షి గుడిలో సిద్దుడి దగ్గర స్వర్ణపుష్పం పొందిన మహిళ రోగం తగ్గించుకున్న తన భర్తతో సిద్ధుడు దగ్గరికి వస్తుంది. అలా వచ్చిన ఆ దంపతులు తమను కంచి కామాక్షే మాకు మీరు వస్తారని చెప్పారని అందుకు మీరు ఎవరో చెప్పమని సిద్దుడిని ప్రాదేయపడతారు. సిద్దుడు అమ్మవారిని తలచుకుని స్పృహ తప్పితే, అక్కడకు మధుర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆ సిద్దుడు గురించి నాకు తెలిసినది చెబుతాను అని చెప్పడం మొదలుపెడతాడు.

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

ఆ సిద్దస్వామి పేరు బాల శివానందం అని, మీనాక్షి దూతగా అందరికి తెలుసనని చెబుతూ అతని పుట్టుక గురించి వివరిస్తుండగా, కంచి కామాక్షి చిత్ర సన్నివేశం మారుతుంది. స్వామి తల్లిదండ్రులు(జెమిని గణేషన్-సుజాత) కంచి కామాక్షి గుడిలో నలభై ఒక్కరోజులు దీక్ష చేసిన తరువాత ఒకరోజు కంచి కామాక్షి గుడిలో పడుకుని ఉన్న సుజాతకు కలలో అమ్మవారు కనబడి, “నీవు బిడ్డకోసమే కదా నా సన్నిధికి వచ్చింది, అలాగే మధుర మీనాక్షికి పార్వతి మాతలాగా కూడా ఒక బిడ్డకు ఆలనాపాలనా చూడాలని కోరికగా ఉందట, నీవు నీ భర్తతో కలిసి మధురకు చేరుకో అక్కడ మధురమీనాక్షి కోరిక నీ కోరిక తీర్చుతానని చెప్పి అంతర్ధానం అవుతుంది.” మెలుకువ వచ్చిన సుజాత లేచి జెమినీ గణేషన్ని లేపి విషయం చెప్పి ఇద్దరు దంపతులు మధుర మీనాక్షి అమ్మవారి గుడికి వెళతారు.

అలా మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించిన ఆ దంపతులు మాకు పుట్టిన బిడ్డని నీ పాదాలు దగ్గరే వదిలేస్తాను నీకోసం అని మొక్కుకుని అనుగ్రహించమని వేడుకుంటారు. కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం వలన ఆమెకు మగ కవలలు జన్మిస్తారు. అప్పుడు ఆ దంపతులు ఇద్దరినీ తీసుకుని మధుర మీనాక్షి గుడిలో మీనాక్షి అమ్మవారి దగ్గర పెడితే, ఒక పిల్లవాడు అమ్మవారువైపు మళ్ళితే, మరొకరు అమ్మవైపు మళ్లుతారు. ఆ సన్నివేశం చాలా చక్కగా భక్తిప్రదాయకంగా ఉంటుంది. ఆ పిల్లవాడిని మీనాక్షి అమ్మవారు రమ్మని ఆహ్వానించడం ఆ పిల్లవాడికే కనిపిస్తుంది.

అక్కడ నుండి ఆ దంపతులు వెనుదిరుగుతుంటే ఆలయధర్మ కర్త, పూజారి దంపతులను అడ్డుకుని పిల్లవాడిని తీసుకువెళ్లమంటారు. సుజాత, జెమినీ గణేషన్ దంపతులు మేము ఆ పిల్లవాడిని అమ్మవారికి అప్పగించేశాం, ఇక ఆ పిల్లవాడి భాద్యత మీనాక్షి అమ్మే చూసుకుంటుంది అని చెప్పి వారు ఇంటికి వెళతారు. గుడి ధర్మకర్త ఆలయఅర్చకులు ఎంత ప్రయత్నం చేసినా గుడి తలుపులు తెరుచుకోవు, తాళం రంద్రంలో నుంచి అమ్మవారి స్వరూపం చూసి భయపడతారు వారు.

ఇంటికి చేరిన జెమిని గణేషన్-సుజాత దంపతులు ఆ పిల్లవాడిని అమ్మవారు దగ్గరే పూజారులు ఉంచారా బయట పడవేశారా అని సందేహం దిగులు చెంది, తెల్లవారగానే గుడికి చేరుకుంటారు. పూజారులకు ఎంత ప్రయత్నం చేసిన తెరుచుకొని గర్భగుడి తలుపులు ఆమె తీయగానే తెరుచుకుంటాయి. అమ్మవారి గర్భాలయంలో ఆడుకుంటున్న పిల్లవాడు కనబడతాడు, అమ్మవారి ముక్కు పుడక, బంగారు ఉగ్గుగిన్నె పిల్లవాడి చేతిలో ఉంటాయి. ఇదంతా మీనాక్షి అమ్మవారే మహిమ ఆ తల్లి పిల్లవాడి ఆలనాపాలనా చూసుకుంటుంది అని భావించి వారు వెనుతిరుగుతారు. ఆ పిల్లవాడే ఈ సిద్దుడు అని మధుర నుండి వచ్చిన వ్యక్తి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పం గ్రహించిన దంపతులకు చెబుతారు.

మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల గురించి

ఈలోపు తేరుకున్న ఆ సిద్దుడు నా గురించి కాదు చెప్పుకోవలసింది, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల గురించి చెప్పుకుంటే, పుణ్యం పరమార్ధం అని కంచి కామాక్షి అమ్మవారి గురించి చెప్పడం మొదలు పెడతారు.

బండాసురుడు తప్పస్సు చేసి బ్రహ్మను మెప్పించి, భూలోకంలో మానుష జాతిలో అడామగ కలవకుండా ఐదేళ్ళ బాలిక పుట్టాలి, ఆ విధంగా బాలిక పుడితే ఆ బాలిక చేతిలో మాత్రమే మరణం ఉండాలి అని వరం కోరుకుంటాడు. వరబలంతో బండాసురుడు దేవతలను హింసిస్తూ ఉంటే, అందరూ దేవతలు కలిసి కైలాసం పరమశివుడి దగ్గరికి వెళతారు. కైలాసం నుండి పరమశివుడు సలహాపై జగన్మాతని ప్రార్ధించడానికి కంచికి చేరుకుంటారు.

కంచిలో సర్వదేవతలు జగన్మాతని ప్రార్ధన చేయడం వలన ప్రకృతి మరియు సర్వదేవతల శక్తి నుండి ఒక ఐదేళ్ళ పాప ఉద్బవిస్తుంది. బండాసురుడు ఆ పాపతో యుద్ధం చేసి మరణిస్తాడు. బండాసురుడుని అంతుతేల్చిన ఆ బాలిక త్రిమూర్తుల దగ్గరికి వచ్చి నాకు గుడికట్టండి అని చెబితే, మయుడు శివుని అజ్ఞా మేరకు కంచిలో ఆలయం నిర్మిస్తారు. మరుసటి ఉదయం దేవతలంతా గుడికి చేరితే ఆ పాప అమ్మవారుగా గర్భగుడిలో దర్శనం ఇస్తుంది. బాలగా అవతరించి బండాసురుడుని అంతం చేసి, కన్యగా గర్భగుడిలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని చూసి పరమశివుడు ఆదిపరాశక్తి అని పిలిస్తే, ఆ తల్లి నేను  కామాక్షిని, అలాగే అందరిని అనుగ్రహిస్తాను అని బదులిస్తుంది. ఆ విధంగా సిద్దుడు వారికి ఇంకా కామాక్షి అమ్మవారి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఉంటారు.

భద్రయ్య అను భక్తుడిని అనుగ్రహించిన Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

తిరువాయూర్లో ఒక అమ్మవారి భద్ర అనే భక్తుడికి సిద్దుడు “ఒక శుబ్రపరిచిన గదిలో 101 భోజనం చేసే ఆకులు పరచి 100మంది కన్యలను లోపలి పంపించు, భోజనాలు పెడుతూ ఉండు, రోజు 100 ఆకులు మాత్రమే భోజనం చేసి ఉంటాయి, కానీ ఏరోజు అయితే 101 ఆకులు భోజనం చేస్తున్నట్టు కనిపిస్తుందో, ఆ రోజు అమ్మవారు వచ్చి భోజనం చేసినట్టు, అలాగే భోజనం పూర్తయిన తరువాత వారికి 101 రవికలు పంచిబెట్టు, ఏరోజు 101 ఆకులు భోజనం ముగింపు ఉంటుందో ఆరోజే 101 రవికలు సరిపోతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు”.

కామాక్షి గుడి ఊరిమధ్యలో ఉండకూడదు, నేను ఆ మండపాన్ని తీసివేసి, కోర్ట్ కడతాను అని ఆంగ్ల కలెక్టర్ అమ్మవారి భక్తుడు అయిన భద్రయ్యతో గొడవపతాడు, కలెక్టర్ వాళ్ళ అమ్మగారి మాట మీద గుడి దగ్గరి నుండి వెళ్ళిపోతాడు. అదే ఊళ్ళో మిడతంబొట్లు అనే వ్యక్తి అమ్మవారి గుడికి ధర్మకర్తగా ఉంటూ వడ్డీవ్యాపారం చేస్తూ, అమ్మవారి గుడిలో కానుకలు కూడా ఇంటికే తీసుకుపోతూ ఉంటూ ఉంటాడు. సిద్దుడు చెప్పిన భద్రయ్య భక్తుడు అదే వ్యాపారి దగ్గర తన ఆస్తి పత్రాలు మిడతం బొట్లు దగ్గర కాళీనోటు పేపర్ పై వేలుముద్రలు వేసి, డబ్బు అప్పు తీసుకుని క్రమంగా 101 విస్తర్లు వేసి 100 మందికి భోజనం పెడుతూ భక్తిగా అమ్మవారిపై నమ్మకం ఉంచుతాడు.

ఒకరోజు మిడతం బొట్లు భద్రయ్య ఇంటికి వచ్చి ఉన్నపళంగా ఇల్లు కాళీచేసి వెళ్ళమంటాడు, ఎందుకు అని అడిగితే నీవు చేసిన అప్పు చాల వుంది అని చెప్పి దొంగపత్రాలు పట్టుకుని కోర్టుకి వెళతాడు. అమ్మవారుపై నమ్మకం ఉంచిన భక్తుడు అయిన భద్రయ్య కామాక్షి అమ్మే వచ్చి తనవైపు సాక్ష్యం చెబుతుంది అని కోర్టులో వాదిస్తాడు. మోసపూరిత పత్రాలను బట్టి ఆంగ్ల కలెక్టర్ భద్రయ్యపై తీర్పు మరుసటి రోజుకి వాయిదా వేస్తాడు. అయితే తరువాయి తీర్పు వ్రాసే సమయంలో కలెక్టర్ కలం కదలదు, ఎంతా ప్రయత్నం చేసిన కలం కదలదు. అమ్మవారు కలెక్టర్ అమ్మరూపంలో వచ్చి తీర్పు భక్తుడు అయిన భద్ర నిరపరాధి వ్రాయి అది నిజం అయితే, నీ కలం కదులుతుంది. అని చెబుతుంది. అలా భద్రయ్య అయిన అమ్మవారి భక్తుడిని నిర్దోషిగా తీర్పు వ్రాసిన కలెక్టర్, అమ్మవారి గుడిలో ఉన్న భక్తుడి దగ్గరికి వస్తాడు.రేపు భోజనాలు 101 విస్తర్లలో 100 మందికి పెట్టే చోటకి అమ్మ కామాక్షి వచ్చి భోజనం చేస్తుంది. రేపు 101 విస్తర్లలో భోజనం పూర్తవుతుంది అని చెప్పి సిద్దుడు, కలెక్టర్ భద్రయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం చేసుకుంటారు.

భద్రయ్య ఇంటిలో 100 మంది కన్యలతో కలిసి భోజనం చేసిన Kanchi Kamakshi అమ్మవారు.

తరువాత సిద్దుడు చెప్పగా ఒక శుబ్రపరిచిన గదిలో 101మందికి విస్తర్లు వేసి 100 కన్యలను గదిలోకి పంపించి భోజనాలు పెడతారు. అప్పుడు ఆంగ్ల కలెక్టర్, సిద్దుడు, భద్రయ్య గమనించగా 101 మంది భోజనం చేస్తూ కనబడతారు. భోజనాలు పూర్తయ్యాక 101 రవికలు పంచిబెడితే, ఒక రవికపై కలెక్టర్ సైన్ చేస్తారు. తరువాత గుడికి వెళ్లి చూస్తే, కలెక్టర్ సంతకం చేసిన వస్త్రం అమ్మవారి మెడలో కనిపిస్తుంది. అందరు అమ్మవారి మహిమను కీర్తిస్తారు. ఇంకా సిద్దుడు కంచి కామాక్షి అమ్మవారి గురించి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఆదిశంకరాచార్యులు కంచికి వచ్చి, అర్చించి అమ్మని మెప్పించన వైనం చెబుతారు.

కంచిలో ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తి భక్తులను నమ్మించి అమ్మవారికి బలులు ఇవ్వాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రకృతిలో హింస, అధర్మం పెరిగితే, దైవశక్తి నిమ్మకుండడం ప్రకృతి ప్రకోపించడం సాదరణమే కదా. ఆది శంకరాచార్యులు కంచికామాక్షి గుడికి వచ్చి అమ్మవారికి బలులు ఇవ్వవద్దని చెప్పి అమ్మవారిని స్త్రోత్రం చేస్తే, అమ్మ వర్షం కురిపిస్తుంది. అది చూసిన ఊరిప్రజలు, ఆ క్షుద్ర వ్యక్తి ఆదిశంకరాచార్యులు పాదాలపై పడతారు. అమ్మవారు ఆది శంకరచార్యులకు ప్రత్యక్షం అయ్యి, కంచి కామకోటి పీఠం కంచిలో స్థాపించి, ఆ పీఠం నీవు  అధిష్టించి కీర్తిని గడిస్తావు అని చెబుతుంది.

కంచి కామాక్షి ఆలయ కోశాధికారి సుబ్రహ్మణ్య శాస్త్రికి ఒకసారి చిన్నపాప కనిపిస్తే ఇంటికి తీసుకువచ్చి తన మనుమరాలుగా పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఆ పాప(మహాలక్ష్మి) పెరిగాక తన తల్లిదండ్రుల గురించి అడిగితే, నీ అమ్మ ఆ కామాక్షి అని చెప్పి, నీ తండ్రి హిమాలయాల్లో వైద్యం చేయించుకుంటున్నట్టు చెబుతాడు. అయితే అమ్మని చూపించమంటే ఆ పూజారి ఆ పాప మహాలక్ష్మికి గుడిలో కామాక్షిని చూపి నీతల్లి అని చెబితే, అప్పటినుండి ఆపాప అమ్మనే చూస్తూ ఉంటూ ఉంటుంది.

అక్షరజ్ఞానం లేని పాపను అనుగ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు. Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్త దుర్బుద్ధి తెలుసుకుని, ఇన్నాళ్ళు నేను ఒక పాపపు సొమ్ము తిని పెద్దపాపం చేశాను కాశికి వెళ్లి ఆ పాపం పోగొట్టుకుంటాను అని చెప్పి ఆ పాప మహాలక్ష్మితో కాశికి బయలుదేరతాడు. అలా బయలుదేరుతున్న సుబ్రహ్మణ్య శాస్త్రిని ఆ ప్రక్కనే ఉంటున్న ఇద్దరు దంపతులు పాపను కాశికి తీసుకువెళ్ళడం ఎందుకు మేము ఆపాపను చూసుకుంటాం అని చెప్పి, పాపను సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర నుండి తీసుకుంటారు. మహాలక్ష్మి పాపకు శక్తులు ఉన్నాయి అందుకే పాప ఎప్పుడు అమ్మవారి ఆలయంలో ఉంటుంది అని చెప్పి ఆ పాపను తీసుకున్న దంపతులు ప్రచారం చేస్తారు.

మహాలక్ష్మి పాపపై ప్రచార మహిమలు గురించి విన్న భక్తలు పాపదగ్గరికి వస్తారు. అప్పుడు ఆ దంపతులు పాపతో ఒక ఇల్లాలితో ఆమె భర్త పదిరోజులలో చనిపోతాడని అబద్దం బలవంతంగా పాపతో చెబుతారు. పది బంగారు కాసులు తెస్తే కాపాడతానని కూడా ఆ పాపతో చెప్పిస్తారు. ఆ ఇల్లాలు రోదిస్తూ వెళ్ళిపోతుంది. నిద్రపట్టని పాప మహాలక్ష్మి అబద్దం చెప్పినందుకు మనోవేదనకు గురి అయ్యి అమ్మవారి పాదాలపై తలకొట్టుకుని చనిపోదామని నిశ్చయించుకుని బయలుదేరుతుంది.

పాప అంతరంగం గ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు అనంతలక్ష్మితో కలిసి గర్భాలయం వెలుపలికి వచ్చి పాపను ఆపి, ఆ పాపతో నేనే నీ తల్లిని అని చెప్పి పాప మహాలక్ష్మి నాలుకపై తన నాలుకతో బీజాక్షరాలు వ్రాస్తుంది. తరువాత పాప మహాలక్ష్మితో నీనోటితో ఏది పలికితే అది జరుగుతుంది అని చెప్పి పాపను గుడిలోనే పడుకో బెడుతుంది అమ్మవారు. అలా అమ్మ అనుగ్రహం పొందిన ఆ పాప మహాలక్ష్మి మహిమలు చూపించి, దుష్ట బుద్దితో ఉన్న దంపతులకి పాప మహాలక్ష్మి వారికి బుద్ది చెప్పుతుంది. తరువాత కంచి మహారాజు అయిన పల్లవరాజుకి చాళక్యరాజుపై విజయాన్ని కూడా కట్టబెడుతుంది.

అమ్మని మనసారా నమ్మితే, అమ్మ అనుగ్రహానికి ఎదురులేదని ఈ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram ద్వారా తెలియవస్తుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద తెలుగు బాలభక్తుడి సినిమా. తన్మయమైన భక్తితో దైవాన్ని రప్పించిన భక్తిరసకరమైన చలనచిత్రం. భక్తుడు పరమాత్మ తత్వంతో తన్మయత్వం చెందుతూ ఉంటే, ఆ భక్తికి భక్తులు, భగవంతుడు పరవసిస్తే, మరి చిన్నారి బాలుడు పరబ్రహ్మంతో తన్మయుడై హరిభక్తిని చాటుతుంటే, శ్రీహరి ఉగ్రనారసింహ అవతారం ఎత్తించిన భక్తిరసభరిత తెలుగు మూవీ.

అమ్మకడుపులోనే భగవతత్వం గురించి తెలియబడడం వలన, చిన్ననాటి నుండే నారాయణ మంత్రంతో మనసుని నింపేసుకున్నబాలుడి భక్తి తత్పరత చాల భక్తిభావాన్ని పెంచుతుంది.

భక్తప్రహ్లాద తెలుగు భక్తి మూవీలో భగవంతుడిగా హరనాథ్ నటిస్తే, బాల భక్తుడిగా రోజారమణి చాల చక్కగా నటించారు. చిన్నారి భక్తుడి తండ్రి హిరణ్యకశిపుడుగా ఎస్వి రంగారావు (SV Rangarao) నటిస్తే, హిరణ్యకశిపుడు భార్య లీలావతిగా అంజలిదేవి నటించారు. చిన్నారి భక్తుడికి  గురువులుగా రేలంగి నరసింహారావు, పద్మనాభంలు నటించారు. నారదుడుగా బాల మురళి కృష్ణ నటించారు.

తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద సాంకేతిక వర్గం

Banner/బ్యానర్: AVM Productions/ఏవిఎం ప్రొడక్షన్స్
Direction/దర్శకత్వం:Ch Narayana murthy సిహెచ్. నారాయణమూర్తి
Actor Actress/నటినటులు: SV Rangarao/ఎస్వి రంగారావు, Balamurali Krishna/బాల మురళి కృష్ణ, Relangi/రేలంగి, Padmanabham/పద్మనాభం, Haranath/హరనాథ్, dhoolipala/ధూళిపాళ, Ramana Reddy/రమణారెడ్డి, Nagaiah/నాగయ్య. AnjaliDevi / అంజలీదేవి, Jayanti/జయంతి, Baby Rojaramani/బేబీ రోజారమణి, L Vijayalakshmi/ఎల్ విజయలక్ష్మి, Geetanjali/గీతాంజలి, Vanisri/వాణిశ్రీ, Nirmala/నిర్మల తదితరుల్ Bhakta Prahlada/భక్తప్రహ్లాద చిత్రంలో నటించారు.
Story/కధ: DV Narasaraju/నరసరాజు
Sangitam/సంగీతం: S Rajeswara Rao/ఎస్ రాజేశ్వరరావు

జయ విజయులకు మునుల నుండి శాపం భక్తప్రహ్లాద మూవీలో

వైకుంఠములో ద్వారాపాలకులుగా జయవిజయులు వైకుంఠద్వారం దగ్గర నిలబడి ఉంటారు. సనకసనంద మహర్షులు వైకుంఠములోనికి ప్రవేశించబోతే, వారిని జయవిజయులు అడ్డుకుంటారు.

మహర్షులు తమకు శ్రీమహావిష్ణువు దర్శనం అత్యవసరం అన్నా అడ్డుకుంటారు, శ్రీహరి లక్ష్మీసమేతులై ఏకాంతంగా ఉన్నారని లోనికి ఎవరిని అనుమతించం అని అడ్డుకుంటారు. శ్రీహరి భక్తవత్సలుడు భక్తులకు, శ్రీహరికి ఎవరూ అడ్డుకాకూడదు మీరు అడ్డుతోలగమని చెప్పినా జయవిజయులు సనకసనంద మహర్షులను అడ్డుకుంటారు.

కోపగించిన మహర్షులు రాక్షసులై భూలోకంలో జన్మించమని జయవిజయులకు శాపానుగ్రహం ఇస్తారు. జగన్నాటక సూత్రదారి వచ్చి జరిగిన విషయం గ్రహించి, జయవిజయులు చేసింది తప్పు దానికి మీరు శిక్ష అనుభవించాలంటే, జయవిజయులు శ్రీహరిని ప్రార్ధిస్తారు.

అప్పుడు శ్రీమహావిష్ణువు జయవిజయులు శాపఫలం అనుభవించాక, వారు తిరిగి వైకుంఠము వచ్చేలా అనుమతి ఇవ్వవలసినదిగా తాపసులను కోరితే, బదులుగా సనకసనంద మహర్షులు దానికి మేమంతవారము నీవెట్లా అనుగ్రహించిన మాకు సమ్మతమే అని చెబుతారు.

నాకు విరోధులుగా మూడు జన్మలు ఎత్తి తరువాత వైకుంఠము చేరతారా ? నాకు భక్తులుగా ఏడు జన్మలు ధరించిన తరువాత వైకుంఠము చేరతారా ? అని జయవిజయులకు శ్రీహరి చెబితే. బదులుగా జయవిజయులు స్వామి నీకు దూరంగా ఏడు జన్మల కాలం మేము ఉండలేము, విరోధులుగా మూడు జన్మలకాలం తరువాత వైకుంఠప్రాప్తిని అనుగ్రహించమని వేడుకుంటారు. అలా జయవిజయులు మూడు జన్మలు శ్రీహరికి శత్రువులుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

మొదటి జన్మలో దితి కడుపునా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా రెండవ జన్మములో రావణ, కుంభకర్ణులుగా మూడవ జన్మములో శిశుపాల, దంతవర్తులుగా భూలోకములో జన్మించి, నన్ను విరోధించినా, నిరంతరం నాపై ధ్యాసనే కలిగి ఉండి, తదుపరి వైకుంఠము చేరగలరని శ్రీహరి సెలవిస్తారు.

హిరణ్యాక్షమరణం, హిరణ్యకశిపుడు తపస్సు, ప్రహ్లాద జననం

తరువాయి సన్నివేశంలో కశ్యప ప్రజాపతి సంద్యాసమయంలో తన ఆశ్రమంనందు ధ్యాననిమగ్నుడై ఉండగా, అయన భార్య అయిన దితి అక్కడికి వస్తుంది. వసంతకాలం ప్రకృతి ప్రభావరిత్యా ఆమె కామప్రభావానికి లోనై కశ్యపప్రజాపతి చెంతచేరుతుంది, విరహభావంతో.

కశ్యప ప్రజాపతి ఆమెను వారించగా ఆమె తిరస్కార వైఖిరికి ఆమె కోరికను తీర్చుతారు. తత్ఫలితంగా అనతికాలంలో ఆ దంపతులకు ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వారికీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు నామకరణం చేసిన కశ్యప ప్రజాపతి, వారు రాక్షసులై లోకకంటకులుగా శ్రీహరి విరోధులు అవుతారని చెబుతారు. దానికి దితి దుఃఖిస్తే, నీ మనుమడు మాత్రం శ్రీహరి భాక్తాగ్రేసుడై కీర్తిని సముపర్జిస్తాడని ఆమెను ఊరడిస్తారు.

దైత్యుడైన హిరణ్యాక్షుడు ప్రజలను పీడిస్తూ, సాదుజనులను హింసిస్తూ, భూమాతను కూడా హిరణ్యాక్షుడు హింసిస్తూ, భూమిని రక్షించడానికి శ్రీహరి ఆదివరాహఅవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి, శిష్టరక్షణ చేస్తారు.

విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఇదంతా శ్రీహరి వలననే జరిగింది, అందుకు శ్రీహరిపై విరోధం ఇంకా పెంచుకుంటాడు. ఎలాగైనా శ్రీహరిని ఓడించాలని శ్రీహరిపై యుద్దానికి సంసిద్ధుడు అవుతుంటే, గురువు బోధనచేత యుద్దకాంక్ష పక్కనపెట్టి, తపస్సు చేయడానికి బయలుదేరతాడు.

బ్రహ్మదేవుడి గురించి ఘోరతపము ప్రారంభిస్తాడు, బ్రహ్మ ప్రత్యక్ష్యం అయ్యేదాకా కఠోర తపము చేస్తే, బ్రహ్మగారు హిరణ్యకశిపుడు తపస్సునకు మెచ్చి, వచ్చి వరం కోరుకో అంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏడేడు పదునాలుగు లోకాలలో గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, అస్త్ర, శస్త్రాలతో, దిక్కులలో, పగలు, రాత్రి, ఇంటా, బయటా, పైన, క్రింద, జంతువులు, మనుషులు, దేవతలు, కిన్నెర, కింపుర్శ, గంధర్వులు, అన్ని వస్తువుల ద్వారా మరణం లేని వరం అడిగితే, బ్రహ్మగారు అనుగ్రహిస్తారు.

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం తపము చేస్తున్న సమయంలో గర్భిణిగా ఉన్న లీలావతిని ఇంద్రుడు చెరపట్టి తీసుకువెళుతుంటే, నారద మహర్షి అడ్డుపడి, ఆమెగర్భంలో ఉన్నది రాక్షస జాతి బాలుడే అయినా మహాభక్తుడు కాగలడు, కావునా ఆమెను విడిచిపెట్టమని వారిస్తాడు. తదుపరి లీలావతిని నారదమహర్షి తన ఆశ్రమంలోకి తీసుకువెళతారు.

ఆ ఆశ్రమంలో గర్భిణిగా ఉన్న లీలావతితో నారద మహర్షి బ్రహ్మజ్ఞానం భోదిస్తుంటే, ఆమె నిదురిస్తుంటే, ఆమె గర్భంలో ఉన్నఆ నెలల బాలుడు ఆ జ్ఞానసారాన్ని గ్రహిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు లీలావతి ప్రసవిస్తే, సుపుత్రుడిగా తపస్సు పూర్తిచేసుకుని వచ్చిన హిరణ్యకశిపుడుకి పరిచయం చేస్తారు. లీలావతి మరియు నారదులు. ఆ బాలుడికి ప్రహ్లాదుడిగా నామం నారద మహర్షే సూచిస్తారు.

వరగర్వం వలన హిరణ్యకశిపుడు ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతుంది. సర్వసాదులను హింసిస్తూ, ప్రజలందరినీ నన్నే దేవుడుగా కొలవవలసినదిగా ఆజ్ఞలు జారి చేస్తాడు. ఇంద్రుడిని జయించి, స్వర్గాన్ని ఆక్రమించి ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు. సాధువులు, మునులు శ్రీహరిని వేడుకొనగా అందుకు శ్రీహరి హిరణ్యకశిపుడు సుపుత్రుడు నాకు మహాభక్తుడై ఉంటాడు, అందువల్లే హిరణ్యకశిపుడు అంతం కూడా అవుతుంది అని చెబుతారు.

భక్తప్రహ్లాద హరిభక్తి నివారణ ప్రయత్నం చేసే హిరణ్యకశిపుడు

నారాయణనామం పలుకుతుంటే ఎంతమధురంగా ఉంటుందో పలికేవారికీ తెలుస్తుంది అంటారు, కానీ ఈ మూవీలో నారాయణనామం గొప్పతనం కనబడుతుంది. నారాయణనామం యొక్క రుచి ప్రహ్లాద త్రాగినట్టుగా ఈ మూవీ కల్పిస్తుంది. నారాయణనామజపం వలన మరణ భయంపొందని దృఢమైన మనస్సుని పొందిన బాలుడు భక్తి భావన ముగ్ధమనోహరంగా కనిపిస్తుంది, ఈ భక్తప్రహ్లాద మూవీలో. నారాయణమంత్రం తల్లి కడుపులో ఉండగానే నారద మహర్షిచే బోధించబడుతుంది.

మదిలో భక్తిభావనలు పెంపొందించుకోవడానికి భక్తప్రహ్లాద చిత్రం ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది. భక్తి ధ్యాసలో భవభందాలా భయం లేదని చాటి చెప్పే చిత్రం, చూస్తున్నవారిలో కూడా నారాయణ నామంపై మమకారం పెంచుతుంది. భక్తుడి భక్తి తత్పరతతో రాతిస్థంభం నుండి కూడా భగవంతుని రప్పించవచ్చని చాటి చెప్పే తెలుగు భక్తి మూవీ భక్తప్రహ్లాద .

అధర్మ కర్మవలననే ప్రజాపతి సంతానం ద్రుష్టబుద్దితో పుడితే, ధర్మపరివర్తనతో లీలావతి వలన ద్రుష్ట రాక్షసుడికి సుపుత్ర సంతానం కలిగింది. అంతటా హరినామం నిషేదిస్తే, నిషేదించిన ఇంటే హరినామ కీర్తన జరగటం జగన్నాటక సూత్రదారి మాయ ఎంతగొప్పదో అర్ధం అవుతుంది.

నారదుల ఆశ్రమం నుండి ఇంటికి వచ్చిన బాలుడు ఎప్పుడు శ్రీహరి ధ్యాసలోనే ఉండి, ధ్యానం చేస్తూ ఉంటాడు. ముల్లోకాలు జయించిన హిరణ్యకశిపుడుకి కంటిమీద కునుకు లేకుండా చేసేది, తన సుపుత్రుడు భక్త ప్రహ్లాద ప్రవర్తన. రాక్షస బుద్దులు రాకుండా ప్రసన్నంగా ఉండడం దానవాగ్రేసురుడుకి అసలు నచ్చదు. అలా ఉన్న ఆ బాల ప్రహ్లాదుడిని గురుకులంలో విద్యాబుద్దులకోసం చండామార్కుల ఆశ్రమంకు పంపుతారు.

గురుకులంలో ప్రహ్లాదుడి హరిభక్తి కీర్తనలు

గురుకులంలో చేరిన ప్రహ్లాదుడు గురువుల దగ్గర అన్ని విద్యలు, వేదపాటాలు నేర్చుకుంటాడు, కానీ హరిభక్తిని మరువడు. వేదవిద్యలు ఇట్టే పట్టిన ప్రతిభను చూసి ముచ్చటపడి, ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు వద్దకు తీసుకువెళతారు.

హిరణ్యకశపుడు పుత్రుడిని తనతొడపై కూర్చొనబెట్టుకుని, ప్రహ్లాదుడుని నీవు నేర్చుకున్న విద్యలలో సారం ఏమిటో చెప్పమని అడిగితే, తండ్రి తొడపై కూర్చోని ప్రహ్లాదుడు వేదసారమైన పరమాత్మ తత్వాన్ని శ్రీహరిపై పొగుడుతూ పద్యం చెబుతాడు. శ

్రీహరి మాట తనపుత్రుని నోట విన్న హిరణ్యకశిపుడుకి కోపం వస్తుంది. హరిభక్తి మనకు తగదని చెప్పినా, హరి భక్తితత్పరుడైన బాలుడు దృఢమైన మనసుతో శ్రీమహావిష్ణువునే స్తుతిస్తాడు.

తనపుత్రుడికి రాక్షసజాతికి అవసరమైన శాస్త్రవిద్యలు సరిగా బోధించమని మరలా గురుకులానికి ప్రహ్లాదుడిని పంపిస్తారు. తిరిగి గురుకులం చేరిన ప్రహ్లాదుడు, అక్కడి ఉన్నవారందరికీ హరిభక్తి భోదిస్తూ ఉంటాడు.

అది చూసిన చండామార్కులవారు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపునికి అప్పజెప్పి, ప్రహ్లాదుడిని మార్చడం మావల్ల కాదు అని చెబుతారు. హరిభక్తి మానతవా లేదా అని కఠినంగా అడిగినా ప్రహ్లాదుడు హరిభక్తి మానలేను అంటాడు. ఇక ప్రహ్లాదుడిని చంపమని, భటులకు అజ్ఞా ఇస్తాడు, హిరణ్యకశిపుడు.

ఏనుగుతో తొక్కించినా, ఎత్తైన కొండలపై నుండి తోసివేసినా, పాములతో కరిపించినా ఎలా ప్రయత్నించిన శ్రీహరి అనుగ్రహంతో బ్రతికే ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలకు మరణం దరిచేరని ప్రహ్లాదుడిని చూసి, హిరణ్యకశిపుడు తన పుత్రుడిని నిలదీస్తాడు.

నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చూపించు అని, ప్రహ్లాదుడి భక్తికి పరవశిస్తూ ఉండే, శ్రీమహావిష్ణువు, ప్రహ్లాదుడు చూపించిన రాతికట్టడమైన స్థంభం నుండి పై సగ భాగం సింహంగా, క్రింద భాగం నరుడుగా కలిగి నృసింహస్వామిగా  ఉద్భవించి, పగలు, రాత్రి కానీ సంద్యా సమయంలో ఇంటా బయటా కానీ గడపపై ప్రాణం లేని గోళ్ళతో హిరణ్యకశిపుడిని సంహరిస్తారు. చివరగా భక్తప్రహ్లాద (BhaktaPrahlada) స్త్రోత్రంతో తృప్తిపడి, ప్రహ్లాదునికి వరాలు ఇస్తాడు.

ఇందుకలడని అందుకలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కలడు శ్రీహరి అని పడే ప్రహ్లాద పద్యం చక్కగా ఉంటుంది.

భక్తిమార్గం సులభమార్గం అని అదే చివరివరకు తోడు అని భక్త ప్రహ్లాదుడి చరితను చెబుతారు. ఈ భక్తి మూవీ అదే చూపుతుంది.

ధన్యవాదాలు

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా

శ్రీరాముడు రాశిభూతమైన ధర్మము అంటారు. ధర్మము పూర్తి మానవుడుగా మారి, చక్రవర్తి అయితే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అంటారు. సీతమ్మ తల్లి రామయ్యను అనుసరించిన మహాసాద్వి. సీతారాముల గురించిన సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ గురించి…

బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్
చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులు
సంగీతం : కేవి మహదేవన్
నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
దర్శకత్వం: బాపు

తెలుగు భక్తి మూవీలో శోభన్ బాబు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. రామచంద్రమూర్తి భార్య సీత పాత్రలో చంద్రకళ నటించారు. శ్రీరామాయణంలో అసురుడు అయిన రావణాసురుడు పాత్రలో ఎస్వీ రంగారావు నటించారు. సంపూర్ణ రామాయణం తెలుగు భక్తి మూవీకి బాపు దర్శకత్వం వహించారు.

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

అలనాటి పాత తెలుగు సినిమాలు మంచి సందేశం కలిగి ఉంటే, భక్తి సినిమాలు అంటే పరమధర్మమునే తెలియజేస్తాయని అంటారు. భక్తి మూవీస్ వాచ్ చేయడం వలన భగవానుడిపై భక్తిని పెంచుకోవడానికి మనసుకు మంచి ఆలంబనం అవుతుంది.

పుస్తకం చదువుతూ ఉంటే ఒక ఊహాశక్తి మనసులో మెదులుతుంది. సినిమా చూస్తుంటే, చూస్తున్న మూవీ సీన్స్ మనసులో కదలాడుతూ ఉంటాయి. మంచి సీన్స్ మనసులో ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటారు.

శ్రీమహావిష్ణువు తదితర దేవతల అవతార సన్నివేశం సంపూర్ణ రామాయణం భక్తి .

వైకుంఠములో లక్ష్మినారాయణులు ఆదిశేషుని కొలువుతీరి ఉండగా దేవతలు అంతా వచ్చి రావణ రాక్షస అకృత్యాలపై మొరపెట్టుకుంటారు. ద్రుష్ట శిక్షణ చేయడానికి నేను నరుడిగా అవతరిస్తాను. మీరు మీ మీ అంశలతో వానరాలుగా అవతరించండి, అని శ్రీమహావిష్ణువు వెల్లడి చేస్తారు.

ఎందుకంటే రావణుడు మనుషులపై చులకన భావంతో మనుషులు, వానరులు తప్పించి మిగిలిన వారితో మరణం లేని వరం కలిగి ఉంటాడు. వేరొక సన్నివేశంలో రావణాసురుడు వేదవతిని వేదిస్తుంటే, ప్రతిగా వేదవతి నేను మరో జన్మలో నీ మరణానికీ కారణం కాగలనని రావణుడిని శపించి ఆత్మాహుతి చేసుకుంటుంది.

దేవతలు వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు మొదలైనవారు అవతరిస్తే, శ్రీమహావిష్ణువు రామునిగా, రాముని తమ్ములుగా శంఖు, చక్ర, గదలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా దశరద మహారాజుకి జన్మిస్తారు.

తనఇంట రావణుడు శివ పూజ చేస్తుండగా, పూజ పుష్పం నుండి ఒక బాలిక ఉద్బవిస్తుంది. ఆ శిశువుని రావణాసురుడు పారవేయమని చెబుతాడు. అలా రావణాసురుని ఇంట ఉద్బవించిన శిశువు పొలం దున్నుతున్న జనక మహారాజుకి దొరుకుతుంది.

అలా జనకమహారాజుకి దొరికిన బాలికకు సీత అను పేరు పెడతారు. సీత జగదేక ప్రసిద్ది పొందుతుంది అని జనకమహారాజు గురువులు శతానందులు సెలవిస్తారు.

అయోధ్యలో రామయ్య కౌసల్య – దశరదుల వద్ద అల్లారుముద్దుగా పెరిగి, గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తీచేసుకుంటాడు.  జనకమహారాజు స్వగృహంలో పెరుగుతున్న సీతమ్మ ఒకరోజు అటాడుకుంటూ ఉండగా బంతి ఒక ధనుస్సు ఉన్న బాక్స్ క్రిందకు వెళుతుంది.

అప్పుడు సీతమ్మ తల్లి a పెట్టెని ఇట్టే జరిపి ఆ పెట్టే కింద ఉన్న బంతిని తీసుకుని మరలా ఆటలోకి వెళుతుంది. అది గమనించిన జనక మహారాజు, వారి గురుదేవులు ఆశ్చర్యచకితులు అవుతారు. వేలమంది తోస్తేకాని జరగని ఆ ధనుస్సు కలిగిని పెట్టెని, ఇట్టే జరిపిన సీతమ్మతల్లికి స్వయంవరంలో ఎవరైతే శివదనుస్సుని ఎక్కుపెడతారో వారికే ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటారు.

రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట కానలకు వెళ్ళడం, శ్రీరామాయణం తెలుగు భక్తి మూవీ

ఒకరోజు సభలో దశరధ మహారాజు గురువు వసిష్ఠ మహర్షితో కొలువు దీరి ఉండగా, అక్కడకు విశ్వామిత్ర మహర్షి కూడా వస్తారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాకకు కారణం వివరిస్తూ, రామ చంద్రుని తనతో అడవులకు పంపమని దశరధుని విశ్వామిత్ర మహర్షి అడుగుతారు.

దానికి దశరధ మహారాజు సంశయిస్తే, అప్పుడు వసిష్ఠ మహర్షి నచ్చచెప్పడంతో దశరధ మహారాజు రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి వెనుక పంపడానికి అంగీకరిస్తే, అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు తండ్రి అజ్ఞాపాలన మేర విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

విశ్వామిత్రుని వెనుకు రామలక్ష్మణుల నడక సాగుతుండగా తాటక రాక్షసి కనిపిస్తుంది, ఆ రాక్షసి వారి ముగ్గురిపై రాళ్ళతో దాడి చేస్తుంటే, విశ్వామిత్ర మహర్షి అజ్ఞా మేరకు, రాముడు తాటకిని సంహరిస్తాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు కొన్ని శక్తి అస్త్రశస్త్రాలను ఉపదేశిస్తారు.

విశ్వామిత్ర మహర్షి మరియు ఇతర మునులు జరుపుతున్న యజ్ఞం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సుబహువు రాక్షసుడుని రాముడు అంతమొందించి, మారీచుడుని రామ బాణంతో కొన్ని యోజనాల దూరంలో పడేటట్టు చేస్తాడు. యాగం సంపూర్తి అవుతుంది.

నారద మహర్షి కూడా అక్కడకు వచ్చి రామచంద్రుడిని దర్శించుకుని, విశ్వామిత్ర మహర్షితో సీతాస్వయంవరం గురించి వివరిస్తారు. అదేవిధంగా ఆ విషయం రావణుడి చెవికి చేరవేస్తాడు. రావణుడు సీతాస్వయంవారానికి బయలుదేరితే, రామలక్ష్మణులు ఇద్దరూ గురువు విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

దారిలో అహల్యకు శాపవిమోచనం కావించి, రామలక్ష్మణ మహర్షులు జనకమహారాజు సభకి చేరుతారు. స్వయంవరానికి విచ్చేసిన మహావీరులందరు ప్రయత్నించి విఫలమైతే, రావణాసురుడుకి కూడా గర్వభంగం అవుతుంది. ఇక గురువు విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదంతో రామచంద్రులు శివధనుస్సు ఎక్కుపెట్టగానే, ధనుస్సు విరుగుతుంది.

సీతారాముల వివాహం అంగరంగవైభవంగా ఇరువురి బంధుమిత్ర సపరివారం మద్య జరుగుతుంది. శివధనుస్సుని విరిచింది ఎవరు అంటూ వచ్చి, అంతకు వేయిరెట్లు అధిక శక్తి కలిగిన హరివిల్లుని కూడా ఎక్కుపట్టమని పరశురాముడు చెబితే, ఆ హరివిల్లుని కూడా ఎక్కుబెట్టిన రాముడు, పరశురాముడుకి శ్రీమహావిష్ణువుగా దర్శనం అయ్యి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తంలో సీతారామలక్ష్మణులు అడవులకు

తరువాతి సన్నివేశంలో భరత, శత్రుఘ్నుడు ఇద్దరు వారి మావగారి గృహానికి వెళతారు. మరొక సందర్భంలో  దశరధ మహారాజు తన సభలో పెద్దలు, ప్రజలు, గురువుగార్ల సమక్షంలో నేను వృద్దుడిని అవుతున్న కారణంగా శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తానని అనగానే అందరు హర్షిస్తారు.

శ్రీరాముడు కేవలం నా పెద్దకుమారుడు కావడం మాత్రమే కాకుండా శ్రీరామునికి చాలా మంచి గుణాలు ఉన్నాయని అందుకే పట్టాభిషేకం చేస్తానని అంటే సభ మరొకసరి సంఘీభావం తెలియజేస్తే, అక్కడికి వేంచేసిన శ్రీరామునికి పట్టాభిషేక విషయం వివరించి, రేపటి పట్టాభిసేకనికి సంసిద్దుడివి కమ్మని చెబుతాడు.

మరుసటి రోజు అయోధ్య అంతా సంబరాలు జరుపుకుంటూ ఉంటే, కైకేయి మందిరానికి వచ్చిన మందర నూరిపోసిన వాక్కుల వలన కైకేయి మనసు చెదిరి, దశరధ మహారాజుని వరాలు అడగడంతో శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి, అదే సమయానికి సీతారామ లక్ష్మణులు అడవులకి బయలుదేరవలసి వస్తుంది.

అంతా ఈశ్వరేచ్చ అని భావించి, సీతారామలక్ష్మణులు అడవులకి వెళతారు, అలా రధంలో బయలుదేరిన రాముని ఎడబాటు భరించలేని దశరధ మహారాజు మరణిస్తారు. తదుపరి వచ్చిన భరతుడు విషయం గ్రహించి తల్లిని మందలించి అన్నగారి వద్దకు అడవులకి బయలుదేరతాడు.

అడవిలో సీతారామలక్ష్మణులు నార దుస్తులు ధరించి ముని ఆశ్రమంలో ఉండగా, భరతుడు సపరివార సైన్యంతో రావడం చూసి లక్ష్మణుడు భారతునిపై సందేహం వెలిబుచ్చుతాడు. కానీ భరతుడు అన్నగారు అయిన శ్రీరామచంద్రుడినే రాజ్యం స్వీకరించాలని, తనతల్లి చేసిన తప్పుకు తానూ ఈ శిక్ష భరించలేనని అంటాడు.

అలాగే కైకేయి తదితర వారంతా శ్రీరాముని అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేయవలసినదిగా కోరితే, శ్రీరాముడు తాను తండ్రికి మాటకు మచ్చ రానివ్వను అంటూ రాజ్యభారం ప్రస్తుతం భరతుడే నిర్వహించవలసినదిగా చెబుతారు. శ్రీరామ పాదుకలు తీసుకుని భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి పాలిస్తానని, గడువు ముగిసే సమయానికి నీవు రాకపోతే, నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి అయోధ్యకు వెనుతిరుగుతాడు.

రావణుడు సీతాపహరణం చేయడం… సంపూర్ణ రామాయణ తెలుగు భక్తి మూవీ

మరొక సన్నివేశంలో రామలక్ష్మణులను చూసిన శూర్పణఖ మోహితురాలై వారి వెంటబడితే, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కొస్తే, ఆమె రావణ సభకి వెళ్లి మొరపెట్టుకుంటుంది. అంతేకాకుండా సీత అందచందాలు పొగిడేసరికి, రావణుడిలో దుర్బుద్ధి పెరిగి సీతాపహరణకు పధకం వేస్తాడు.

పధకం ప్రకారం మారీచుడు బంగారు లేడి వేషంలో సీతారామలక్ష్మణుల ఆశ్రమం ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. ఆ బంగారులేడిని చూసిన సీతమ్మ ఆ లేడిని తనకు తెచ్చి ఇవ్వవలసినదిగా రాముని కోరితే, రాముడు బంగారులేడి వెనుక వేట బాణాలతో బయలుదేరతారు. కొంచెంసేపటికి రాముని ఆర్తనాదం విన్న సీతమ్మ లక్ష్మణుడిని కూడా రాముని బాట పట్టిస్తుంది.

ఇక మారువేషంలో వచ్చిన రావణాసురుడు సీతను అపహరిస్తాడు. ఆకాశమార్గంలో సీతమ్మని తీసుకునిపోతున్న రావణుడిపై జటాయువు పోరాటం చేసి రెక్కలు పోగొట్టుకుంటాడు.

తిరిగి వచ్చిన రాముని దుఃఖానికి హద్దు ఉండదు. లక్ష్మణ ఓదార్పుతో తేరుకుని శ్రీరామలక్ష్మణులు సీతమ్మని వెతుక్కుంటూ బయలుదేరతారు. మధ్యలో కనిపించిన శబరి ఆతిద్యం స్వీకరించాక, శబరి మాటల ప్రకారం వారిరువురు ఋష్యమూక పర్వతం చేరుకుంటారు.

వాలితో ఉన్న తగువు కారణంగా రాజ్యానికి దూరంగా నివసిస్తున్న సుగ్రీవుడు ఆ పర్వతంవైపు వస్తున్న శ్రీరామలక్ష్మణులను చూసి, తనమంత్రి అయిన హనుమతో వాళ్ళెవరో వివరాలు తెలియగోరతాడు.

అప్పుడు ఆ అంజనిపుత్రుడు శ్రీరామలక్ష్మణుల వద్దకు కామరుపంలో వెళతాడు. కానీ కామరుపంలో ఉన్న హనుమని శ్రీరామచంద్రుడు గుర్తించగా, లక్ష్మణుడు తమ వివరాలు చెప్పగా మళ్ళి రాముడు హనుమ సంభోదిస్తే, హనుమ తన నిజ స్వరూపంతో స్వామిని ఋష్యమూక పర్వతంపైకి తీసుకువెళతాడు.

ఋష్యమూక పర్వతంపై శ్రీరామసుగ్రీవుల స్నేహం కుదురుతుంది. సీత గురించి చెబితే, హనుమ సీతమ్మవారి నగలు తెచ్చి రామునికి ఇస్తాడు. నగలు సీతమ్మవే అని గుర్తించి మరల శ్రీరాముడు దుఃఖిస్తాడు. తరువాత సుగ్రీవుడు తన కధని శ్రీరామునికి చెపుతాడు.

అధర్మంగా సుగ్రీవుని రాజ్యబహిష్కరించి, సుగ్రీవుని భార్య అయిన రుమని వాలి అనుభవించడం విన్న శ్రీరామచంద్రమూర్తి వాలిని చంపడానికే నిశ్చయిస్తాడు. వాలి సుగ్రీవుల ద్వంద్వ యుద్దంలో పూలమాల లేని వాలిని శ్రీరాముడు చెట్టు చాటునుండి బాణంతో కొడతాడు. రామబాణం తగిలిన వాలి రాముని చూసి ఇదేమి ధర్మం చెట్టు చాటునుండి బాణప్రయోగం ఏమిటి ? అని అడిగితే.

దానికి రాముడు వ్యన్యమృగాలను చెట్టు చాటునుండి కొట్టడం ధర్మమే, అందులోను నీవు అధర్మం వైపు ఉన్నావు కాబట్టి ఈ విధంగా శిక్షించాను అని చెబుతాడు. అంగదుడుని సుగ్రీవునికి అప్పగించి వాలి మరణిస్తాడు.

సీతాన్వేషణకు హనుమ, జాంబవంత, అంగద తదితర వానరులు బయలుదేరడం…

సుగ్రీవ పట్టాభిషేకం తరువాయి సుగ్రీవుడు రాజ్యభోగాలలో ఉండి, సీతాన్వేషణ విషయం రాముని విషయం మరుస్తాడు. లక్ష్మణస్వామి ఆగ్రహించి సుగ్రీవుని వద్దకు వస్తే, తార మాటలతో చల్లబడ్డ లక్ష్మణస్వామితో సుగ్రీవుడు క్షమాపణ వేడుకుని, రాముని వద్దకు చేరి, సీతాన్వేషణకు వానరాలను నలుదిశలకు పంపుతాడు.

హనుమతో కూడిన అంగద, జాంబవంతుడు మొదలైన వానరులు దక్షిణంవైపు వెళతారు. అయితే హనుమ రాముని నుండి గుర్తుగా ఉంగరం పొంది ఉంటాడు. అలా దక్షిణదిక్కులో ఉన్న సముద్రం దాటే విషయమై వానరులు అందరూ తర్జనబర్జన పడి, చివరికి హనుమనే వేడుకుని, ఆంజనేయస్వామి శక్తిని వేనోళ్ళ పొగుడుతారు.

ఇతరులు గుర్తుచేస్తేకానీ తనశక్తిని గుర్తించలేని మునిశాపం నుండి విముక్తుడై సీతాన్వేషణకు రామబాణంలా సముద్రం దాటుతాడు, హనుమ.

హనుమ లంకలో కావలి కాస్తున్న లంకిణిని ఓడించి, లంకలో ప్రవేశిస్తాడు. అప్పటికి లంకలో రావణుడు సీతమ్మకి రెండూ మసాల గడువు విదించి వెళతాడు. దుఃఖితరాలుగా సీతమ్మ కూర్చుని ఉన్న చెట్టుపై ఉన్న హనుమ రామకధ వినిపించి, అయిన రాక్షస మాయేమో అని శంకించిన సీతమ్మకి రామచంద్రుని ముద్రికను సీతమ్మకి చూపుతాడు.

తనబుజాలపై కూర్చోతల్లి రాముని చెంతకు చేర్చుతాను అని హనుమ పలికితే, సీతమ్మ రాముడే తనభార్యని అయిన నన్ను యుద్దంలో రావణుడిపై గెలిచి తీసుకువెళ్లాలని చెప్పి, తన చూడామణిని హనుమకి ఇచ్చి పంపుతుంది.

వెనుకకు వెళ్తూ హనుమ వనమంతా చెట్ల కొమ్మలు విరిచి కొంతమంది రాక్షసులను నిర్జిస్తాడు. ఇక రావణుడు కొడుకు బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి, పట్టుబడతాడు, హనుమ. సభలో ఆంజనేయస్వామి తన శక్తిని చూపి రామచంద్రుని శరణువేడుకో అని హితవు చెప్పగా, దానికి బదులుగా రావణుడు ఆంజనేయస్వామితోకకి నిప్పంటించమని చెబుతాడు.

ఎవరు అంటించిన నిప్పు వారినే తగలబెట్టినట్టు, ఆంజనేయ స్వామి తనతోకతో లంకలో కొన్ని భవంతులను కాల్చి మరీ రాముని చెంతకు వెళతాడు.

రామరావణ యుద్ధం – శ్రీరామ పట్టాభిషేకం సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ

సీతమ్మ ఇచ్చిన చూడామణి చూసి రామలక్ష్మణులు, సుగ్రీవాది వానరులతో కలిసి యుద్దానికి బయలుదేరతాడు. సముద్రుడు సహకారంతో సముద్రంపై వారధి ఏర్పరచుకుని రామలక్ష్మణులు యుద్ద సైన్యం అంతా లంక చేరతారు.

యుద్ధం మొదలై అనేకమంది వానర యోధులు యుద్ద విన్యాసాలు, లక్ష్మణస్వామి యుద్దనైపుణ్యం, రామరావణుల సంగ్రామంలో రావణుడు మరణిస్తాడు. రావణమరణానంతరం విభీషణుడికి పట్టాభిషేకం చేసి, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, సుగ్రీవుడు మొదలైనవారితో అయోధ్య చేరతారు. అయోధ్యలో శ్రీరామపట్టాభిషేకం జరిగాక, రామచంద్రమూర్తి పరిపాలనలో అయోధ్య ధర్మపదంలో నడుస్తుంది.

శ్రీరామపట్టాభిషేకంతో సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ ముగుస్తుంది.

రామాయణం రాముని చరితము, హనుమాన్, సుందరకాండ వినడం అంటే అది అదృష్టం అయితే, గురువుగారు చాగంటి కోటేశ్వర రావు గారి నోట పలికిన అమృతపలుకులు వినడం మరీ అదృష్టమే.

తెలుగురీడ్స్.కామ్

అచ్చ తెలుగులో చిన్న పిల్లల పేర్లు తెలుగు బాయ్స్ నేమ్స్, తెలుగు గర్ల్ నేమ్స్ తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోనులో…. ఈ క్రింది బటన్ టచ్ చేయండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?