శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం ఉంటుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

ఆదిశంకరాచార్య కంచికి వచ్చి అమ్మ అనుగ్రహం సంపాదించడం, అలాగే కంచి కామకోటి పీఠం నెలకొల్పమని కామాక్షి అమ్మవారు చెప్పడం, ఒక అమాయక పిల్లను కామాక్షి అమ్మ అనుగ్రహించి ఆమె నోటపలికిన మాటను వాస్తవం చేసే శక్తిని ప్రసాదించడం, ఇంకా మరిన్ని భక్తి సన్నివేశాలు ఈ  కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రంలో కనిపిస్తాయి.

జనని సినీ ప్రొడక్షన్స్ పతాకం పై కంచి కామాక్షి తెలుగు భక్తి చిత్రం జెమిని గణేషన్, సుజాత, శ్రీప్రియ, వై విజయ, శ్రీకాంత్, శ్రీవిద్య, రాజసులోచన తదితరులు నటించిన చిత్రానికి సంగీతం కెఎస్. రఘునాథన్, దర్శకత్వం కెఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం తెరకెక్కింది.

కాంచీపురం చుపుస్తూ కంచి గురించి చెబుతూ అమ్మవారి ఆలయం గురించి చూపుతూ అమ్మగురించి చెప్పడం చిత్ర ప్రారంభ సన్నివేశం. కంచి కామాక్షి గుడిలో అమ్మవారికి ఆలయ ధర్మకర్త వచ్చి పూలు పలహారాలు తెస్తే, అక్కడే ఒక స్వర్ణపుష్పంతో నిలబడి ఉన్న సిద్ధుడు, ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి పూజించి ఇవ్వమని చెబుతారు. ప్రధాన అర్చకులు ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గరపెట్టి పూజ చేసి ఆ సిద్దుడికి ఇస్తే, సిద్దుడు అక్కడ నిలబడి ఉన్నఆడువారిలో ఒకామెకు స్వర్ణపుష్పం ఇచ్చి వెళ్ళిపోతారు.

ఆమె ఆ స్వర్ణపుష్పం తీసుకుని వెళ్లి తన భర్తకు ఉన్న కుష్టిరోగాన్ని పోగొడుతుంది. ఆ తరువాత ఒక సాధు కొన్ని శక్తులతో మహిమలు చూపుతూ నేనే భగవంతుడిని నన్నే కొలవండి అని ప్రగల్భాలు పలుకుతుంటే, కంచి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పానికి అర్చన చేయించిన సిద్దుడు అక్కడికి వస్తాడు. అక్కడ ఆ సాదువుకి తన మహిమ చూపి అతనికి బుద్ది చెబుతారు సిద్దుడు. అక్కడికి కామాక్షి గుడిలో సిద్దుడి దగ్గర స్వర్ణపుష్పం పొందిన మహిళ రోగం తగ్గించుకున్న తన భర్తతో సిద్ధుడు దగ్గరికి వస్తుంది. అలా వచ్చిన ఆ దంపతులు తమను కంచి కామాక్షే మాకు మీరు వస్తారని చెప్పారని అందుకు మీరు ఎవరో చెప్పమని సిద్దుడిని ప్రాదేయపడతారు. సిద్దుడు అమ్మవారిని తలచుకుని స్పృహ తప్పితే, అక్కడకు మధుర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆ సిద్దుడు గురించి నాకు తెలిసినది చెబుతాను అని చెప్పడం మొదలుపెడతాడు.

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

ఆ సిద్దస్వామి పేరు బాల శివానందం అని, మీనాక్షి దూతగా అందరికి తెలుసనని చెబుతూ అతని పుట్టుక గురించి వివరిస్తుండగా, కంచి కామాక్షి చిత్ర సన్నివేశం మారుతుంది. స్వామి తల్లిదండ్రులు(జెమిని గణేషన్-సుజాత) కంచి కామాక్షి గుడిలో నలభై ఒక్కరోజులు దీక్ష చేసిన తరువాత ఒకరోజు కంచి కామాక్షి గుడిలో పడుకుని ఉన్న సుజాతకు కలలో అమ్మవారు కనబడి, “నీవు బిడ్డకోసమే కదా నా సన్నిధికి వచ్చింది, అలాగే మధుర మీనాక్షికి పార్వతి మాతలాగా కూడా ఒక బిడ్డకు ఆలనాపాలనా చూడాలని కోరికగా ఉందట, నీవు నీ భర్తతో కలిసి మధురకు చేరుకో అక్కడ మధురమీనాక్షి కోరిక నీ కోరిక తీర్చుతానని చెప్పి అంతర్ధానం అవుతుంది.” మెలుకువ వచ్చిన సుజాత లేచి జెమినీ గణేషన్ని లేపి విషయం చెప్పి ఇద్దరు దంపతులు మధుర మీనాక్షి అమ్మవారి గుడికి వెళతారు.

అలా మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించిన ఆ దంపతులు మాకు పుట్టిన బిడ్డని నీ పాదాలు దగ్గరే వదిలేస్తాను నీకోసం అని మొక్కుకుని అనుగ్రహించమని వేడుకుంటారు. కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం వలన ఆమెకు మగ కవలలు జన్మిస్తారు. అప్పుడు ఆ దంపతులు ఇద్దరినీ తీసుకుని మధుర మీనాక్షి గుడిలో మీనాక్షి అమ్మవారి దగ్గర పెడితే, ఒక పిల్లవాడు అమ్మవారువైపు మళ్ళితే, మరొకరు అమ్మవైపు మళ్లుతారు. ఆ సన్నివేశం చాలా చక్కగా భక్తిప్రదాయకంగా ఉంటుంది. ఆ పిల్లవాడిని మీనాక్షి అమ్మవారు రమ్మని ఆహ్వానించడం ఆ పిల్లవాడికే కనిపిస్తుంది.

అక్కడ నుండి ఆ దంపతులు వెనుదిరుగుతుంటే ఆలయధర్మ కర్త, పూజారి దంపతులను అడ్డుకుని పిల్లవాడిని తీసుకువెళ్లమంటారు. సుజాత, జెమినీ గణేషన్ దంపతులు మేము ఆ పిల్లవాడిని అమ్మవారికి అప్పగించేశాం, ఇక ఆ పిల్లవాడి భాద్యత మీనాక్షి అమ్మే చూసుకుంటుంది అని చెప్పి వారు ఇంటికి వెళతారు. గుడి ధర్మకర్త ఆలయఅర్చకులు ఎంత ప్రయత్నం చేసినా గుడి తలుపులు తెరుచుకోవు, తాళం రంద్రంలో నుంచి అమ్మవారి స్వరూపం చూసి భయపడతారు వారు.

ఇంటికి చేరిన జెమిని గణేషన్-సుజాత దంపతులు ఆ పిల్లవాడిని అమ్మవారు దగ్గరే పూజారులు ఉంచారా బయట పడవేశారా అని సందేహం దిగులు చెంది, తెల్లవారగానే గుడికి చేరుకుంటారు. పూజారులకు ఎంత ప్రయత్నం చేసిన తెరుచుకొని గర్భగుడి తలుపులు ఆమె తీయగానే తెరుచుకుంటాయి. అమ్మవారి గర్భాలయంలో ఆడుకుంటున్న పిల్లవాడు కనబడతాడు, అమ్మవారి ముక్కు పుడక, బంగారు ఉగ్గుగిన్నె పిల్లవాడి చేతిలో ఉంటాయి. ఇదంతా మీనాక్షి అమ్మవారే మహిమ ఆ తల్లి పిల్లవాడి ఆలనాపాలనా చూసుకుంటుంది అని భావించి వారు వెనుతిరుగుతారు. ఆ పిల్లవాడే ఈ సిద్దుడు అని మధుర నుండి వచ్చిన వ్యక్తి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పం గ్రహించిన దంపతులకు చెబుతారు.

మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల గురించి

ఈలోపు తేరుకున్న ఆ సిద్దుడు నా గురించి కాదు చెప్పుకోవలసింది, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల గురించి చెప్పుకుంటే, పుణ్యం పరమార్ధం అని కంచి కామాక్షి అమ్మవారి గురించి చెప్పడం మొదలు పెడతారు.

బండాసురుడు తప్పస్సు చేసి బ్రహ్మను మెప్పించి, భూలోకంలో మానుష జాతిలో అడామగ కలవకుండా ఐదేళ్ళ బాలిక పుట్టాలి, ఆ విధంగా బాలిక పుడితే ఆ బాలిక చేతిలో మాత్రమే మరణం ఉండాలి అని వరం కోరుకుంటాడు. వరబలంతో బండాసురుడు దేవతలను హింసిస్తూ ఉంటే, అందరూ దేవతలు కలిసి కైలాసం పరమశివుడి దగ్గరికి వెళతారు. కైలాసం నుండి పరమశివుడు సలహాపై జగన్మాతని ప్రార్ధించడానికి కంచికి చేరుకుంటారు.

కంచిలో సర్వదేవతలు జగన్మాతని ప్రార్ధన చేయడం వలన ప్రకృతి మరియు సర్వదేవతల శక్తి నుండి ఒక ఐదేళ్ళ పాప ఉద్బవిస్తుంది. బండాసురుడు ఆ పాపతో యుద్ధం చేసి మరణిస్తాడు. బండాసురుడుని అంతుతేల్చిన ఆ బాలిక త్రిమూర్తుల దగ్గరికి వచ్చి నాకు గుడికట్టండి అని చెబితే, మయుడు శివుని అజ్ఞా మేరకు కంచిలో ఆలయం నిర్మిస్తారు. మరుసటి ఉదయం దేవతలంతా గుడికి చేరితే ఆ పాప అమ్మవారుగా గర్భగుడిలో దర్శనం ఇస్తుంది. బాలగా అవతరించి బండాసురుడుని అంతం చేసి, కన్యగా గర్భగుడిలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని చూసి పరమశివుడు ఆదిపరాశక్తి అని పిలిస్తే, ఆ తల్లి నేను  కామాక్షిని, అలాగే అందరిని అనుగ్రహిస్తాను అని బదులిస్తుంది. ఆ విధంగా సిద్దుడు వారికి ఇంకా కామాక్షి అమ్మవారి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఉంటారు.

భద్రయ్య అను భక్తుడిని అనుగ్రహించిన Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

తిరువాయూర్లో ఒక అమ్మవారి భద్ర అనే భక్తుడికి సిద్దుడు “ఒక శుబ్రపరిచిన గదిలో 101 భోజనం చేసే ఆకులు పరచి 100మంది కన్యలను లోపలి పంపించు, భోజనాలు పెడుతూ ఉండు, రోజు 100 ఆకులు మాత్రమే భోజనం చేసి ఉంటాయి, కానీ ఏరోజు అయితే 101 ఆకులు భోజనం చేస్తున్నట్టు కనిపిస్తుందో, ఆ రోజు అమ్మవారు వచ్చి భోజనం చేసినట్టు, అలాగే భోజనం పూర్తయిన తరువాత వారికి 101 రవికలు పంచిబెట్టు, ఏరోజు 101 ఆకులు భోజనం ముగింపు ఉంటుందో ఆరోజే 101 రవికలు సరిపోతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు”.

కామాక్షి గుడి ఊరిమధ్యలో ఉండకూడదు, నేను ఆ మండపాన్ని తీసివేసి, కోర్ట్ కడతాను అని ఆంగ్ల కలెక్టర్ అమ్మవారి భక్తుడు అయిన భద్రయ్యతో గొడవపతాడు, కలెక్టర్ వాళ్ళ అమ్మగారి మాట మీద గుడి దగ్గరి నుండి వెళ్ళిపోతాడు. అదే ఊళ్ళో మిడతంబొట్లు అనే వ్యక్తి అమ్మవారి గుడికి ధర్మకర్తగా ఉంటూ వడ్డీవ్యాపారం చేస్తూ, అమ్మవారి గుడిలో కానుకలు కూడా ఇంటికే తీసుకుపోతూ ఉంటూ ఉంటాడు. సిద్దుడు చెప్పిన భద్రయ్య భక్తుడు అదే వ్యాపారి దగ్గర తన ఆస్తి పత్రాలు మిడతం బొట్లు దగ్గర కాళీనోటు పేపర్ పై వేలుముద్రలు వేసి, డబ్బు అప్పు తీసుకుని క్రమంగా 101 విస్తర్లు వేసి 100 మందికి భోజనం పెడుతూ భక్తిగా అమ్మవారిపై నమ్మకం ఉంచుతాడు.

ఒకరోజు మిడతం బొట్లు భద్రయ్య ఇంటికి వచ్చి ఉన్నపళంగా ఇల్లు కాళీచేసి వెళ్ళమంటాడు, ఎందుకు అని అడిగితే నీవు చేసిన అప్పు చాల వుంది అని చెప్పి దొంగపత్రాలు పట్టుకుని కోర్టుకి వెళతాడు. అమ్మవారుపై నమ్మకం ఉంచిన భక్తుడు అయిన భద్రయ్య కామాక్షి అమ్మే వచ్చి తనవైపు సాక్ష్యం చెబుతుంది అని కోర్టులో వాదిస్తాడు. మోసపూరిత పత్రాలను బట్టి ఆంగ్ల కలెక్టర్ భద్రయ్యపై తీర్పు మరుసటి రోజుకి వాయిదా వేస్తాడు. అయితే తరువాయి తీర్పు వ్రాసే సమయంలో కలెక్టర్ కలం కదలదు, ఎంతా ప్రయత్నం చేసిన కలం కదలదు. అమ్మవారు కలెక్టర్ అమ్మరూపంలో వచ్చి తీర్పు భక్తుడు అయిన భద్ర నిరపరాధి వ్రాయి అది నిజం అయితే, నీ కలం కదులుతుంది. అని చెబుతుంది. అలా భద్రయ్య అయిన అమ్మవారి భక్తుడిని నిర్దోషిగా తీర్పు వ్రాసిన కలెక్టర్, అమ్మవారి గుడిలో ఉన్న భక్తుడి దగ్గరికి వస్తాడు.రేపు భోజనాలు 101 విస్తర్లలో 100 మందికి పెట్టే చోటకి అమ్మ కామాక్షి వచ్చి భోజనం చేస్తుంది. రేపు 101 విస్తర్లలో భోజనం పూర్తవుతుంది అని చెప్పి సిద్దుడు, కలెక్టర్ భద్రయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం చేసుకుంటారు.

భద్రయ్య ఇంటిలో 100 మంది కన్యలతో కలిసి భోజనం చేసిన Kanchi Kamakshi అమ్మవారు.

తరువాత సిద్దుడు చెప్పగా ఒక శుబ్రపరిచిన గదిలో 101మందికి విస్తర్లు వేసి 100 కన్యలను గదిలోకి పంపించి భోజనాలు పెడతారు. అప్పుడు ఆంగ్ల కలెక్టర్, సిద్దుడు, భద్రయ్య గమనించగా 101 మంది భోజనం చేస్తూ కనబడతారు. భోజనాలు పూర్తయ్యాక 101 రవికలు పంచిబెడితే, ఒక రవికపై కలెక్టర్ సైన్ చేస్తారు. తరువాత గుడికి వెళ్లి చూస్తే, కలెక్టర్ సంతకం చేసిన వస్త్రం అమ్మవారి మెడలో కనిపిస్తుంది. అందరు అమ్మవారి మహిమను కీర్తిస్తారు. ఇంకా సిద్దుడు కంచి కామాక్షి అమ్మవారి గురించి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఆదిశంకరాచార్యులు కంచికి వచ్చి, అర్చించి అమ్మని మెప్పించన వైనం చెబుతారు.

కంచిలో ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తి భక్తులను నమ్మించి అమ్మవారికి బలులు ఇవ్వాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రకృతిలో హింస, అధర్మం పెరిగితే, దైవశక్తి నిమ్మకుండడం ప్రకృతి ప్రకోపించడం సాదరణమే కదా. ఆది శంకరాచార్యులు కంచికామాక్షి గుడికి వచ్చి అమ్మవారికి బలులు ఇవ్వవద్దని చెప్పి అమ్మవారిని స్త్రోత్రం చేస్తే, అమ్మ వర్షం కురిపిస్తుంది. అది చూసిన ఊరిప్రజలు, ఆ క్షుద్ర వ్యక్తి ఆదిశంకరాచార్యులు పాదాలపై పడతారు. అమ్మవారు ఆది శంకరచార్యులకు ప్రత్యక్షం అయ్యి, కంచి కామకోటి పీఠం కంచిలో స్థాపించి, ఆ పీఠం నీవు  అధిష్టించి కీర్తిని గడిస్తావు అని చెబుతుంది.

కంచి కామాక్షి ఆలయ కోశాధికారి సుబ్రహ్మణ్య శాస్త్రికి ఒకసారి చిన్నపాప కనిపిస్తే ఇంటికి తీసుకువచ్చి తన మనుమరాలుగా పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఆ పాప(మహాలక్ష్మి) పెరిగాక తన తల్లిదండ్రుల గురించి అడిగితే, నీ అమ్మ ఆ కామాక్షి అని చెప్పి, నీ తండ్రి హిమాలయాల్లో వైద్యం చేయించుకుంటున్నట్టు చెబుతాడు. అయితే అమ్మని చూపించమంటే ఆ పూజారి ఆ పాప మహాలక్ష్మికి గుడిలో కామాక్షిని చూపి నీతల్లి అని చెబితే, అప్పటినుండి ఆపాప అమ్మనే చూస్తూ ఉంటూ ఉంటుంది.

అక్షరజ్ఞానం లేని పాపను అనుగ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు. Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్త దుర్బుద్ధి తెలుసుకుని, ఇన్నాళ్ళు నేను ఒక పాపపు సొమ్ము తిని పెద్దపాపం చేశాను కాశికి వెళ్లి ఆ పాపం పోగొట్టుకుంటాను అని చెప్పి ఆ పాప మహాలక్ష్మితో కాశికి బయలుదేరతాడు. అలా బయలుదేరుతున్న సుబ్రహ్మణ్య శాస్త్రిని ఆ ప్రక్కనే ఉంటున్న ఇద్దరు దంపతులు పాపను కాశికి తీసుకువెళ్ళడం ఎందుకు మేము ఆపాపను చూసుకుంటాం అని చెప్పి, పాపను సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర నుండి తీసుకుంటారు. మహాలక్ష్మి పాపకు శక్తులు ఉన్నాయి అందుకే పాప ఎప్పుడు అమ్మవారి ఆలయంలో ఉంటుంది అని చెప్పి ఆ పాపను తీసుకున్న దంపతులు ప్రచారం చేస్తారు.

మహాలక్ష్మి పాపపై ప్రచార మహిమలు గురించి విన్న భక్తలు పాపదగ్గరికి వస్తారు. అప్పుడు ఆ దంపతులు పాపతో ఒక ఇల్లాలితో ఆమె భర్త పదిరోజులలో చనిపోతాడని అబద్దం బలవంతంగా పాపతో చెబుతారు. పది బంగారు కాసులు తెస్తే కాపాడతానని కూడా ఆ పాపతో చెప్పిస్తారు. ఆ ఇల్లాలు రోదిస్తూ వెళ్ళిపోతుంది. నిద్రపట్టని పాప మహాలక్ష్మి అబద్దం చెప్పినందుకు మనోవేదనకు గురి అయ్యి అమ్మవారి పాదాలపై తలకొట్టుకుని చనిపోదామని నిశ్చయించుకుని బయలుదేరుతుంది.

పాప అంతరంగం గ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు అనంతలక్ష్మితో కలిసి గర్భాలయం వెలుపలికి వచ్చి పాపను ఆపి, ఆ పాపతో నేనే నీ తల్లిని అని చెప్పి పాప మహాలక్ష్మి నాలుకపై తన నాలుకతో బీజాక్షరాలు వ్రాస్తుంది. తరువాత పాప మహాలక్ష్మితో నీనోటితో ఏది పలికితే అది జరుగుతుంది అని చెప్పి పాపను గుడిలోనే పడుకో బెడుతుంది అమ్మవారు. అలా అమ్మ అనుగ్రహం పొందిన ఆ పాప మహాలక్ష్మి మహిమలు చూపించి, దుష్ట బుద్దితో ఉన్న దంపతులకి పాప మహాలక్ష్మి వారికి బుద్ది చెప్పుతుంది. తరువాత కంచి మహారాజు అయిన పల్లవరాజుకి చాళక్యరాజుపై విజయాన్ని కూడా కట్టబెడుతుంది.

అమ్మని మనసారా నమ్మితే, అమ్మ అనుగ్రహానికి ఎదురులేదని ఈ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram ద్వారా తెలియవస్తుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి