ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా? కరోనా కారణంగా ఇంటి నుండే పని చేయడానికి అవకాశం ఏర్పడింది. కొందరు ఇంటినుండే పనిచేయడం ప్రారంభించారు. కొందరు కొనసాగిస్తున్నారు. అయితే అదే కొనసాగించడం ఎంతవరకు కరెక్టు? ఆఫీసుకు వెళ్ళే పనిచేయడం మేలా? అయితే అదే పనిగా కూర్చోవడం మంచిది కాదు. ఇష్టానుసారం పని చేయడం మేలు చేయదు. నిర్ధిష్ట సమయ పాలన అవసరం అంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే, ఇంటినుండి పనిచేయడం అనవసరం అనిపిస్తుంది.
ఇంటి నుండి పని చేయడం మంచిదా? కాదా? పోస్టు పూర్తిగా చూద్దాం.
ఇంటికి, ఆఫీసుకు నడిచివెళ్ళే దూరం లేదా వాహనంపై వెళ్ళే దూరం…. నివాసానికి, పనిచేసే చోటుకు ఆమాత్రం దూరం ఉంటుంది. అలా పనిచేసే చోటు, రోజులో ఓ పూట విశ్రాంతి తీసుకునే చోటు వేరు వేరుగా ఉండడం మానసికంగా కూడా మంచిదేనని అంటారు. ముందుగా మనసులో మార్పు ఉంటుంది. మారే గుణం గల మనసుకు ప్రకృతిపరంగా మార్పులు కూడా అవసరమే అంటారు. ఈ సమాధానంతో ఇంటినుండి పనిచేయడం కన్నా ఆఫీసుకు పోయి పనిచేసుకోవడం మేలు అనే భావన కలుగుతుంది.
ఖచ్చితంగా కొన్ని రకాలుగా ఆలోచిస్తే, ఇంటినుండి కాకుండా ఆఫీసుకు వెళ్ళి పని చేయడం మేలు అనిపిస్తుంది. ఇంటిలో ఉండే పిల్లలు, ఇంటిలో ఉండే కుటుంబ సభ్యులు పూర్తిగా స్వేచ్ఛ మీ నుండి కోరుకుంటారు. మీరు ఇంట్లోనే ఉండి పని చేస్తుంటే, మీరు వారికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది.
ఇంకా ఇంటి నుండి పని చేయడం వలన వ్యక్తిగతంగా ఎలాంటి భావనలు ఉంటాయి?
ముందుగా పని విషయంలో సమయపాలన ఉండకపోవచ్చును. అయితే పనిని ఎక్కువసేపు కొనసాగించడం లేదా తక్కువ సేపు పనిచేసి, మిగిలిన పనిని వాయిదా వేయడం జరగవచ్చును. ఒకవేళ పనివిషయంలో పై అధికారులు ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటే, కొన్నాళ్ళకు ఇల్లు కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. శాంతికి ఆలవాలం కావాల్సిన ఇల్లు, అశాంతికి అవకాశం ఇస్తుంది.
సరే పని విషయంలో పైవారి పర్యవేక్షణ లేదు. అప్పుడు సమయ పాలన విషయంలో ఎంతవరకు ఖచ్చితంగా వ్యవహరిస్తున్నామో? చూసుకోవాలి. ఇంట్లోనే కదా ఉన్నాము… ఈ పనిని రేపు పూర్తి చేద్దామనే నిర్లక్ష్యం వచ్చే అవకాశం ఉంటుంది. అది పూర్తిగా ఉద్యోగ ధర్మానికి విరుద్ధం. ఇంకా అత్యుత్సాహంతో రేపటి పనిని కూడా ఈ రోజే చేసేద్ధాం అనిపించవచ్చును. అటువంటి ఆలోచనలకు అన్ని వేళలా మేలు కాదని అంటారు.
ఇంట్లోనే ఉండి ఎక్కువసేపు పని చేయడం రోజూ కొనసాగుతుంటే, అది అనారోగ్యానికి కూడా కారణం కాగలదని అంటారు. శరీరానికి తగినంత వ్యాయామం ఉండాలి. అయితే దీర్ఘసమయం కూర్చుని ఉండడం వలన శరీరానికి అవసరమైన వ్యాయామం జరగకపోతే, అది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఇష్టానుసారం పనిని ప్రారంభించడం లేదా ఇష్టానుసారం పనిని ముగించడం జరిగే అవకాశం ఇంటి నుండే పనిని చేయడంలో ఉంటుంది. ఎందుకంటే పని కేటాయించబడింది. పనిని కేటాయించినవారి అజమాయిషీ ఉండదు. ఒకరి అజమాయిషీలో పనిచేసే మనసుకు స్వేచ్ఛ లభిస్తే, అది స్వేచ్ఛను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా పనిలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది.
ఆఫీసులో పని చేయడం లేదా ఇంటి నుండి పని చేయడం ఏది ఉత్తమం?
రెండింటిలో ఏది మంచిది? ఏది మంచిది కాదు? అనే ప్రశ్నలకు ముందు పని చేసే ప్రాంతం, ఆప్రాంతంలోని పరిస్థితులు కూడా ప్రధానంగా చూడాలి. రోజు ఉద్యోగం చేయడం కోసం, ఎక్కువసేపు ప్రయాణం చేస్తూ ఉంటే, నిర్ధిష్టమైన సమయపాలనతో, ఇంటినుండి పనిచేయడం మేలు అంటారు. ఇంకా నగరవాతావరణంలో కాలుష్యం అధికంగా ఉన్నప్పుడు కూడా నిర్ణయించుకున్న సమయంలో ఇంటి నుండే పనిని చేయడం మేలు అంటారు.
ఇంటికి కొద్ది దూరంలో ఆఫీసు, లేదా వాహనంతో కాసేపు సమయంలోనే ఆఫీసుకు చేరుకునే అవకాశం ఉంటే, ప్రతి రోజూ కార్యాలయమును పోయి, పనిని చేయడం మేలు అంటారు.
ఇంటినుండి ఒక కిలోమీటరు దూరంలో కార్యాలయం ఉంటే, రోజు నడిచి వెళ్ళి రావడం మేలు అంటారు.
ఆఫీసులో పనిని చేయడం
ఉద్యోగి తన ఆఫీసులో తన అధికారి సూచనల మేరకు పనిని చేయడం వలన అతనిపై అంతగా ఒత్తిడి ఉండదు. అదే ఇంటి నుండి అయితే ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.
పై అధికారి పర్యవేక్షణలో అయితే కొత్త పనిని కూడా సులభంగా పూర్తి చేయవచ్చును. అదే ఇంటి నుండి అయితే, వేచి ఉండవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చును.
ప్రధానంగా ఆఫీసు టైమింగ్స్ కార్యాలయ సమయం నిర్ధిష్టంగా ఉంటుంది. అవే సమయాలలో పనిని ప్రారంభించడం, ముగించడం ఖచ్చితంగా రోజూ జరగాలి. అందుచేత పనిలోకానీ పని నాణ్యతలో కానీ పని విధానంలో కానీ మార్పులు ఉన్నా అవి మంచి ఫలితానికి దారితీయగలవు.
ఒకవేళ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ, తనకుతానే పనులను పురమాయించుకునే నిర్వహణ సామర్ధ్యం ఉన్నవారు ఎక్కడి నుండైనా పనులు చేయించగలరు. ఇంకా తమ పనిని తాము సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఉండేవారు కూడా ఎక్కడినుండైనా పనులు చేయగలరు. కానీ ఆఫీసు పనితీరుకు కొంచెం భిన్నంగానే ఉండవచ్చని అంటారు.
సొంత ఆఫీసు అయినా ఇంటికి దూరంగానే నిర్వహించేవారు ఉంటారు.
కొందరు సొంతంగా ఉండే వ్యాపార సంస్థల కార్యాలయాలు ఇంటి నుండే నిర్వహించే అవకాశం ఉన్నా, ఆఫీసుని ఇంటికి దూరంగానే ఏర్పాటు చేసుకుంటారు. కొందరు ఉత్పత్తిదారులు అయితే, ప్యాక్టరీలలో కూడా ఆఫీసుని దూరంగా పెడతారు. అలాగే ఇంటికి కూడా దూరంగా పెడతారు. అంటే ఫ్యాక్టరీలో పని వాతావరణం వేరు. ఆఫీసు పని వాతావరణం వేరు. ఇంటి వాతావరణం వేరు. అని ఖచ్చితమై అవగాహన ఉంటుంది. ఇంకా ఒక వాతావరణంలో మరొక వాతావరణం తెచ్చి పెట్టడం వలన పని విధానంలో కూడా మార్పులు ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం కావచ్చును.
వీరి దృష్టి ఎక్కడ చేయవలసిన పనిని అక్కడే చేయించాలనే ఉద్దేశ్యం బలంగా ఉండడమే కారణం అంటారు.
యజమాని ఎక్కడి నుండైనా పనిని చేయించగలరు.
కార్యనిర్వహణాధికారి కూడా.
క్రమశిక్షణతో పనిచేసేవారు… తదితరుల పనితీరు ఎట్టి పరిస్థితులోనూ మారదు అంటారు. అంటే వారి పనితీరు లాభదాయకంగానే సాగుతుంది.
అనుకరిస్తూ పని చేసేవారు.
అనుజ్ఙ ఆధారంగా పని చేసేవారు.
సూచనల మేరకు పనిని చేసేవారు…
ఇలా కొన్ని రకాల పనులు ఇంటివాతావరణం లో కన్నా ఆఫీసు వాతావరణమే మేలు అంటారు.
ఇలా కొన్ని రకాల ఆలోచన తీరుని పరిశీలిస్తే, ఇంటి నుండి పని చేయడం కన్నా ఆఫీసుకు వెళ్ళి, ఆఫీసు పనులు ముగించుకుని, ఇంటికి హాయిగా తిరిగి రావడం మేలు అనిపిస్తుంది.
ధన్యవాదాలు.
మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు
ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా
తెలుగురీడ్స్
10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022
బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో
యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!
ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022
తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి