గూగుల్ యాడ్ సెన్స్ అమోదం

మీయొక్క వెబ్ సైట్ ద్వారా కొంత డబ్బు సంపాదించే మార్గములలో యాడ్ సెన్స్ కు అప్లై చేయడం ఒక మార్గము. చాలా రకాల మానిటైజేషన్ సైట్స్ ఉన్నప్పటికీ గూగుల్ యాడ్ సెన్స్ అంటే అందరికీ ఎక్కువ నమ్మకం. చాలా మంది గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ప్రపంచంలో గూగుల్ అతి పెద్ద సెర్చ్ ఇంజన్. ఆ సంస్థ నుండే వచ్చిన గూగుల్ యాడ్ సెన్స్ ఎక్కువ వెబ్ సైట్స్ మానిటైజ్ చేయబడి ఉంటాయి. అది ఒక ఉత్తమమైనదిగా భావిస్తారు. అయితే అంత సులభంగా గూగుల్ యాడ్ సెన్స్ నుండి అమోదం లభించదు అంటారు.

ఎలా గూగుల్ యాడ్ సెన్స్ నుండి మీ వెబ్ సైటుకు అనుమతి పొందడం?

ఉపయోగపడే కంటెంట్ గల వెబ్‌సైట్‌లకు Google AdSense ఆమోదం లభించవచ్చును. అనవసరపు కంటెంటుతో కూడిన వెబ్ సైట్లు Google AdSense ఆమోదాన్ని పొందలేవు. సెర్చ్ ఇంజన్లో సమాచారం శోధించే శోధకుడికి ఉపయోగపడేవిధంగా ఉన్న కంటెంటుతో కూడిన వెబ్ సైట్లు త్వరగా గూగుల్ యాడ్ సెన్స్ అమోదం పొందగలవు.

శోధకుడికి ఉపయోగపడే కంటెంటు మీ వెబ్ సైటు ద్వారా లభించి ఉండవచ్చును. కానీ అది కాపీ చేసిన కంటెంటు అయి ఉండరాదు. మీరు స్వంతంగా కంటెంటుని మీ వెబ్ సైటు ద్వారా ప్రచురితం చేయబడి ఉండాలి.

మీ వెబ్ సైటు ప్రచురితం చేసిన పోస్టులు, మీ వెబ్ సైటులోనే ఇతర పోస్టులలో లింక్ చేయడం ద్వారా సెర్చ్ ఇంజన్లో త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఇంకా వెబ్ సైటు చూడచక్కగా ఉండాలి. ఆకర్షణీయమైన డిజైనింగ్ మీ వెబ్ సైటుకి అదనపు బలం అవుతుంది.

ఆమోదం పొందిన గూగుల్ యాడ్ సెన్స్

ఆమోదం పొందిన గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా మీ జిమెయిల్ ఆధారంగా చేసుకుని ఉంటుంది.

కాబట్టి జిమెయిల్ ఖాతా పాస్ వర్డ్ సెక్యూర్ గా ఉండాలి. మీ జిమెయిల్ ఖాతాకు అథంటికేషన్ ఏక్టివ్ చేసుకోవడం మేలు.

గూగుల్ యాడ్ సెన్స్ కలిగిన బ్లాగు

ఇంకా గూగుల్ యాడ్ సెన్స్ కలిగిన బ్లాగుని కూడా మీరు వాడుతున్న పరికరాల్లో పదే పదే ఓపెన్ చేయరాదు. అలా మీ బ్లాగుని మీ పరికరాల్లో ఓపెన్ చేసి, గూగుల్ యాడ్స్ఏ క్లిక్ చేస్తే, గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

కావున గూగుల్ యాడ్ సెన్స్ ఆమోదం పొందిన పిమ్మట, బ్లాగులో అనవసరంగా క్లిక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గూగుల్ యాడ్ సెన్స్ అమోదం

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

kadhalu

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం