Anta naaku telusu ane bhavana

Anta naaku telusu ane bhavana? ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా?

ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా? మనలో చాలా మందికి ఒక దశలో “ఇది నాకు ఇప్పటికే తెలుసు” అనే భావన వస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. కానీ ఈ ఒక చిన్న ఆలోచనే “Anta naaku telusu ane bhavana” బలపడుతుంది. మన అభివృద్ధిని ఆపేసే పెద్ద కారణంగా మారుతుంది.

ఈ వ్యాసంలో, ఈ భావన ఎలా మన జ్ఞానాన్ని తగ్గిస్తుంది? ఎందుకు ఇది ప్రమాదకరం? ఎలా దాన్ని మార్చుకోవాలి? అన్న విషయాలను లోతుగా తెలుసుకుందాం.

“Anta naaku telusu ane bhavana” అంటే ఏమిటి? illusion of knowledge

ఇది ఒక మానసిక స్థితి. మనకు కొంత సమాచారం ఉన్నప్పుడు, అది పూర్తిగా తెలుసుకున్నట్టు భావించడం.

మన మెదడు ఇలా ఎందుకు చేస్తుంది అంటే:

  • మనం తెలిసిన విషయాన్ని “పూర్తి సత్యం”గా భావిస్తాం
  • ఇతర అభిప్రాయాలను తప్పుగా అనుకుంటాం

సైకాలజీలో దీనిని “illusion of knowledge” అని అంటారు. అంటే మనకు నిజంగా తెలియని విషయాన్ని కూడా తెలిసినట్టు భావించడం.

1. నేర్చుకునే ప్రక్రియ ఆగిపోతుంది because of illusion of knowledge – ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా?

“నాకు తెలుసు” అనే భావన వచ్చినప్పుడు, మన మాటతీరు ఎదుటివారి వద్ద మారిపోతుంది… డంబం వలన ఎదుటివ్యక్తి మనల్ని అజ్ఞానిగా భావిస్తారు. అంతేకాకుండా….

  • కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోతుంది
  • ప్రశ్నలు అడగడం ఆపేస్తాం

దాని ఫలితం: మన జ్ఞానం అక్కడే ఆగుతుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా….

ముఖ్యంగా ఈ భావన ఎవరిలో ఉండకూడదు…

ఇది విద్యార్థులలో అసలు ఉండకూడదు…. తెలిసిన జ్ఞానం పరిక్షలలో సత్తా చాటడానికే కాని పెద్దవారి వద్ద డంబం ప్రదర్శించడానికి కాదు… మరి టీచర్ కు తెలియాలి కదా విద్యార్ధి ప్రతిభ అంటే? క్లాసులో టీచర్ అడిగిన ప్రశ్నలకు తగు సమాధానాలు చెబితే చాలు… టీచర్ గ్రహిస్తారు… విద్యార్ధి ప్రతిభను…

ఈ భావన విద్యార్ధిలో ఉంటే, భవిష్యత్తులో తోటివారి వద్ద అభాసుపాలు కావడానికి కారణం కాగలదు… కావునా విద్యార్ధి దశలో ముఖ్యంగా “ఇంకా నేర్చుకోవాలి” అనే భావనతోనే, విద్యార్ధికి చిరస్మరణీయమైన విజయం వస్తుంది.

తెలియకపోయినా తెలిసినట్టు అనిపించడం

సైకాలజీలో ఒక ప్రసిద్ధ సిద్ధాంతం ఉంది — Dunning-Kruger Effect అంటే:

  • తక్కువ జ్ఞానం ఉన్నవారు తమకు ఎక్కువ తెలుసు అనుకుంటారు
  • ఎక్కువ జ్ఞానం ఉన్నవారు ఇంకా నేర్చుకోవాల్సి ఉందని అనుకుంటారు

అంటే,
“విషయాల గురించి తక్కువగా తెలిసినవాళ్లే, ఎక్కువగా తెలిసినట్టు నమ్మకం కనబరుస్తారు”

అంతా నాకు తెలుసు అనే భావన
Anta naaku telusu ane bhavana

ఇది ఎందుకంటే:

  • తమకు తెలుసు అనే భావనల వలన, తెలుసుకోవలసినది ఏమి లేదనే భావన ఉండడం చేత,  విషయాలపై అవగాహన ఆగిపోతుంది. తద్వారా వారికి తమ లోపాలు తెలియవు
  • ఇంకా తమ తప్పులను గుర్తించే సామర్థ్యం కూడా ఉండదు

వీరు తమ తప్పులను అంగీకరించలేకపోవడం

“నేనే కరెక్ట్” అనే భావన ఉన్నవారు:

  • ఇతరులు చెప్పేది వినడానికి ఉత్సుకత చూపరు
  • వారివైపు నుండి వారికి తప్పులు తెలియకపోవడం వలన తమ తప్పులను ఒప్పుకోరు.

ఫలితం:

  • చేసిన తప్పులు మరల మరలా చేస్తూ ఉంటారు
  • విషయ పరిజ్ఞానం ఆగిపోతుంది.

నిజానికి, నేర్చుకోవడం అంటే తప్పులను అంగీకరించడం.

ఇతరుల నుండి నేర్చుకునే అవకాశం కోల్పోవడం – Anta naaku telusu ane bhavana

మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మనకు ఏదో ఒకటి నేర్పగలడు. ఎందుకంటే ప్రతివారిలో ప్రత్యెక టాలెంట్ ఉంటుంది.

కానీ “నాకు అన్నీ తెలుసు” మనలో ఉంటే:

  • ఇతరుల అభిప్రాయాలతో ఏకిభవించలేము
  • చుట్టూ ఉన్నవారితో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు.

ఫలితం:

  • కొత్త ఆలోచనలు మనకు చేరవు, వాస్తవాలు తెలుసుకునే అవకాశం తక్కువ. అపోహలో ఉండే అవకాశం ఉంటుంది.
  • మన లోకజ్ఞానం అంతంత మాత్రమే అవుతుంది.

సోషల్ మీడియా ప్రభావం వలన “Anta naaku telusu ane bhavana”

ఇప్పటి కాలంలో ఈ సమస్య మరింత పెరిగింది.

సోషల్ మీడియా వల్ల: మాట్లాడుకోవడం మానేసి, ఎవరికీవారే వారి వారి ఫోన్లు పట్టుకు కూర్చోవడం ఎక్కువ. కావున

  • చిన్న వీడియోలు చూసి ఎక్కువ జ్ఞానం వచ్చిందని భావించే అవకాశం ఉంటుంది.
  • ప్రతి ఒక్కరూ అనుభవజ్ఞులు వలె మాట్లాడతారు.

ఇది ఒక ప్రమాదకరమైన ట్రెండ్. ఎందుకంటే
“సమాచారం ≠ జ్ఞానం”

ఎంతసేపు స్క్రోల్ చేస్తే మనకు తెలిసే జ్ఞానం అంతంత మాత్రమే, కానీ అది నిజమైన అవగాహన కావాలంటే, సదరు విషయంలో జ్ఞానం ఉన్నవారితో మాట్లాడాలి, మంచి పుస్తకాలూ చదవాలి.

నిజమైన జ్ఞానం vs తప్పుడు నమ్మకం

అంశంనిజమైన జ్ఞానంనాకు తెలుసుభావన
దృక్పథంనేర్చుకోవాలినాకు తెలుసు
స్పందనవినడంవాదించడం
అభివృద్ధిపెరుగుతుందిఆగిపోతుంది
ఆలోచనలోతుగాపైపైనె

అభివృద్ధి ఎందుకు ఆగిపోతుంది?

ఈ భావన వల్ల మూడు ముఖ్యమైన సమస్యలు వస్తాయి:

1. Curiosity (ఆసక్తి) తగ్గిపోతుంది

2. Feedback (సలహా) తీసుకోరు

3. Adaptability (మార్పుకు సరిపడడం) తగ్గిపోతుంది

ఈ మూడు లేకపోతే ఎదుగుదల అసాధ్యం

సైకాలజీ కారణాలు

దీని వెనుక కొన్ని మానసిక కారణాలు ఉన్నాయి: Anta naaku telusu ane bhavana తో అపోహపడడం. తెలిసిన సమాచారం ఖచ్చితం అనుకోవడం. సగం సగం జ్ఞానం వలన చేసిన తప్పు ఒప్పుకోకపోవడం.

ఈ సమస్య నుండి బయటపడాలంటే?

ఈ భావనను మార్చుకోవడం చాలా అవసరం. కొన్ని సరళమైన మార్గాలు:

ముఖ్యమైన సూచన: అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందట… అలాగే విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నవారు… అవసరం అయితే మాట్లాడతారు… అనవసరంగా ఎవరి ముందు డంబం ప్రదర్శించారు.ఇది బలహీనత కాదు, బలం.

ప్రతి రోజు తెలుసు అనే భావన కన్నా, మనకు తెలియనది ఏమిటి? ప్రశించుకోవడం. ఒక కొత్త విషయం గురించి శోధించడం. అది చిన్న విషయమే అయినా సరే

ప్రధానంగా ఇతరులు వద్ద తెలుసుకోవసిన విషయం మనం తెలుసుకోవాలంటే? ఇతరులు చెప్పే సోది అయినా వినే ఓపిక మనలో ఉండాలి. ఎందుకంటే చెప్పేవారికి వినేవారు లోకువ కాబట్టి ఎక్కువమంది స్ట్రైట్ గా విషయం చెప్పరు.

ముఖ్యంగా గుర్తించవలసిన విషయం: ప్రతి వ్యక్తి ద్వారా ఒక పాఠం గ్రహించవచ్చు.

ప్రశ్నలు అడగండి: ఇతరులు చెప్పింది విని ఊరుకోవడం కన్నా సహేతుకమైన ప్రశ్నలు జ్ఞాన సముపార్జనకు ఉపయుక్తం.

తప్పులను స్వీకరించండి: మన తప్పులు మనమే గ్రహించడం గొప్ప విషయమే కానీ వాటిని అంగీకరించడం అంతకన్నా గొప్ప విషయం.

తప్పులు తెలుసుకోవడం = నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉండడం.

ముగింపు

“అంతా నాకు తెలుసు” అనే భావన మనకు కనిపించని ఒక అడ్డంకి, అది మనకి మొదటి శత్రువు.

ఇది:

  • నేర్చుకోవడాన్ని ఆపేస్తుంది
  • జ్ఞానాన్ని తగ్గిస్తుంది
  • అభివృద్ధిని నిలిపేస్తుంది

నిజమైన తెలివి అంటే
“ఎంత తెలుసు” కాదు
“ఇంకా ఎంత తెలుసుకోవాలి” అనేది తెలుసుకోవడం, ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం ఎలా? ప్రశ్న పునః పునః మనసులో మెదలాలి. Anta naaku telusu ane bhavana undaradu.

telugureads channel

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts