Introduction :
Inter Tarvata Students Chese 12 Pedda Tappulu 10th class పూర్తయ్యాక విద్యార్ధికి ఇంట్లోవారిని నుండి కొంత స్వేఛ్చ లభిస్తుంది. మొదటి సరి జీవితంలో విజయం వచ్చేది, స్వేచ్చ లభించేది ఇప్పుడే. కాని అది దుర్వినియోగం అయ్యేది కూడా ఇక్కడే. student common mistakes.
ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ప్రతి స్టూడెంట్ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ తెలియక, తొందరపడి లేదా ఇతరుల ప్రభావంతో కొన్ని పెద్ద తప్పులు (common mistakes) చేస్తారు.
ఈ ఆర్టికల్‌లో Inter Tarvata Students Chese 12 Pedda Tappulu ఏమిటి? వాటిని ఎలా నివారించాలి? అన్నది క్లియర్‌గా తెలుసుకుందాం.
ఆసక్తి లేకుండా కోర్స్ ఎంచుకోవడం ఒక student common mistake
చాలామంది తమకు ఇష్టమైన ఫీల్డ్ కాకుండా ఇతరులు చెప్పిన కోర్స్ తీసుకుంటారు. జీవితంలో ఏం సాధించాలి అనే గోల్ లేకపోతె, చదవవలసిన వాటిపై కూడా అవగాహన తక్కువగా ఉండడం లేదా ఆసక్తి చూపకుండా ఉండడం జరుగుతుంది… అప్పుడు ఎదో కోర్స్ జాయిన్ అవ్వడం తర్వాత చింతించడం జరుగుతుంది.
👉 దీని ఫలితం: చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది
✔️ సలహా: మీ interest + strengths ఆధారంగా కోర్స్ ఎంచుకోండి. ఇష్టము – లక్ష్యము – బలము కలసి ఉన్నప్పుడు మాత్రమే చదువులో రాణింపు ఉంటుంది.
ఫ్రెండ్స్‌ను ఫాలో అవ్వడం మరొక student common mistake
“అందరూ B.Tech చేస్తున్నారు… నేనూ అదే చేస్తా” అనే మెంటాలిటీ చాలా డేంజరస్. స్నేహితులను అనుసరించవచ్చు కానీ జీవితాన్ని ప్రభావితం చేసేవాటిలో ఈ క్రింది విధంగా పరిశీలించి tarvata నిర్ణయం తీసుకోవాలి.
- ఇంట్లో వారి సలహా
- నిపుణుల అభిప్రాయం
- టీచర్ సలహా
- అంతరాత్మ ప్రభోధం
✔️ సలహా: మీ జీవితం మీద మీరే నిర్ణయం తీసుకోండి, అలోచించి తీసుకునే నిర్ణయం మంచి ఫలితం ఇస్తుంది.
పేరెంట్స్ ప్రెషర్ అతి పెద్ద student common mistake
Inter Tarvata Students Chese 12 Pedda Tappulu లో పేరెంట్స్ ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. వారి కోరిక పిల్లల నెత్తిన రుద్దుతారు. అది వారికి ఇష్టం అయితే సరే, లేకపోతె చదువు అంటే అంతగా ఆసక్తి ఉండదు. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ తమ ఇష్టం స్టూడెంట్స్ మీద impose చేస్తారు.
✔️ సలహా: మీ parents తో ఓపెన్‌గా మాట్లాడండి, ఈ విషయంలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒకరికొకరు ఓపెన్ గా మాట్లాడుకోవాలి.
ట్రెండ్ చూసి కోర్స్ ఎంచుకోవడం
అందరూ ఎంచుకుంటున్న కోర్స్ మనం కూడా ఎంపిక చేసుకోవడం పొరపాటు అవుతుంది. మన బలం బలహీనతలు మరియు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కోర్స్ చూజ్ చేసుకోవాలి. ఒక ఫీల్డ్ ట్రెండింగ్‌లో ఉందని దానిని blindly ఫాలో అవ్వడం తప్పు.
✔️ సలహా: future scope + మీ skill చూసి నిర్ణయం తీసుకోండి
టైమ్ వృథా చేయడం
చేద్దాం లే, చూద్దాం లే అంటూ కాలక్షేపమ చేయడం, టైం వెస్ట్ తప్పితే ఉపయోగం ఉండదు. చివరికి సమయం లేక ఎదో ఒక కోర్స్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్ తర్వాత gap తీసుకుని time waste చేయడం student common mistake.
✔️ సలహా: early planning చాలా ముఖ్యం
ప్లాన్ లేకుండా చదవడం
మూడు ఏళ్ళు వరుసగా పరీక్షల్లో పాస్ అయిన తర్వాత, సహజంగా కొంత నిర్లిప్తత ఉంటుంది. కాబట్టి చదువులో ప్లాన్ లేకుండా ఉండడం వల్ల consistent results రావు.
✔️ సలహా: ముందు చిన్న చిన్న లక్ష్యాలు సాధిస్తూ ముందుకు సాగాలి. daily schedule + weekly goals పెట్టుకోండి
చాలా ఎగ్జామ్స్ ఒకేసారి ట్రై చేయడం
ఒకేసారి multiple exams try చేస్తే focus పోతుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుంది అలాగే ఎక్కువ పరిక్షలు కోసం ప్రయత్నం చేస్తే, ప్రయత్నంలో నాణ్యత ఉండదు.
✔️ సలహా: 1–2 clear goals మాత్రమే పెట్టుకోండి
కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా చదవడం
ముఖ్యంగా rote learning వల్ల long-term knowledge ఉండదు. టెక్స్ట్ బుక్ పూర్తిగా అవగాహన చేసుకోవడం, విషయాలలో అవగాహన ఏర్పరచుకోవడం వలన ఫలితాలు బాగుంటాయి..
✔️ సలహా: concepts మీద focus చేయండి
ఆన్లైన్ మీద ఎక్కువ డిపెండెన్స్
మొబైల్ ఫోన్ మన చేతిలో లేనంతకాలం బంధువుల ఫోన్ నంబర్ల అన్ని గుర్తు ఉంటాయి… ఎప్పుడైతే మొబైల్ ఫోన్ ఒక సంవత్సరం ఉపయోగిస్తామో? అప్పటికి చాలా నంబర్స్ మరిచిపోతూ ఉంటాము. అలాగే ఎక్కువగా చదువులో ఆన్ లైన్ పై డిపెండ్ అయినా అంతే. YouTube, సోషల్ మీడియా మీద over-dependence concentration తగ్గిస్తుంది.
✔️ సలహా: limited usage + self-study balance maintain చేయండి
Inter Tarvata Students Chese 12 Pedda Tappulu లో మెంటల్ స్ట్రెస్ ఫీల్ కావడం
ప్రెషర్ వల్ల చాలా మంది stress కి గురవుతున్నారు. ఒత్తిడికి గురి కాకుండా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి…. మనిషి ఒత్తిడికి గురి అవ్వడానికి మనసే కారణం అవుతుంది. ఒత్తిడి నుండి మనసే బయటపడడానికి కారణం కాగలదు…
✔️ సలహా: breaks తీసుకోండి, healthy routine maintain చేయండి
స్కిల్స్ డెవలప్ చేయకపోవడం
Degree alone సరిపోదు, skills కూడా అవసరం. ఈరోజుల్లో కేవలం డిగ్రీ ఉంటె సరిపోదు… అదనపు నైపుణ్యం చాలా అవసరం… కాబట్టి డిజిటల్ మీడియా, ఏఐ వంటి స్కిల్స్ నేర్చుకోవాలి.
✔️ సలహా: communication, technical skills నేర్చుకోండి
క్లియర్ గోల్ లేకపోవడం
Goal లేకపోతే direction ఉండదు. లక్ష్యం లేకుండా మనసు కుదురుగా ఉండదు… నిర్దిష్టమైన లక్ష్య సాధనకు విద్యార్ధి దశ నుండే కృషి అవసరం.
✔️ సలహా: short-term + long-term goals fix చేసుకోండి
Conclusion
Inter Tarvata Students Chese 12 Pedda Tappulu
ఇంటర్ తర్వాత చేసే చిన్న చిన్న తప్పులు కూడా మీ కెరీర్‌పై పెద్ద ప్రభావం చూపుతాయి. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, మీ interest, skills, future scope అన్నీ consider చేసి smartగా plan చేసుకుంటే మీ future bright అవుతుంది.
👉 గుర్తుంచుకోండి:
“Right decision at right time = Successful life”


