నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ప్రజలు ఆర్ధిక వనరుల బాగా ఉన్నచోట, నివాసానికి అనువుగా ఉన్నచోట, సౌకర్యాలు లభించే ప్రాంతాలలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు… బహుశా నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు ఇంకా ఇలా ఉండవచ్చును. ప్రధానంగా నగరములలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. విశ్వవిద్యాలయములు నగరములలోనే ఉంటాయి. స్వయం ఉపాధి అవకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరమైన సేవలు నగరములలో ఎక్కువగా లభిస్తాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నగరములలో ఎక్కువ. నగరములలో వ్యాపార, వాణిజ్యములు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి […]

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా? పూర్వం పెద్దలు వస్తువు మన్నిక మరియు నాణ్యతతో బాటు వస్తువు ద్వారా కలగబోయే చేటును కూడా అంచనా వేసి, వస్తువులను ఇంటికి తెచ్చుకునేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వస్తువు కొనండి… ఈ వస్తువు వలన కలుగు ప్రయోజనాలు ఇవి… ఈ వస్తువుతో మీకు పనులు చాలా సులభం… అంటూ తదితర విషయాలతో వివిధ వస్తువుల మార్కెటింగ్ మనపై జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాకా, […]

మోజులో పడి జీవితం కోల్పోకు

మోజుగా ఉన్నప్పుడు మనసంతా మోహమే కమ్ముకుని ఉంటుంది. కాబట్టి తప్పొప్పులు కూడా విచారించకుండా మనసు మోజులో పడిపోతుంది. మోజు పడ్డ మనసు, వ్యసనం బారిన పడిన వారి మాదిరిగా ప్రవర్తిస్తుంది… కావునా మోజులో పడి జీవితం కోల్పోకు, జీవితం చాలా విలువైనది… ప్రపంచంలో వెలకట్టలేని మెషీన్ ఉందంటే, అది మనిషి శరీరమే… దానిని మోజులో పడి పాడు చేయకు… ఈమోజు ఒక వస్తువుపై కలగవచ్చును. పురుషుడికి స్త్రీపై, స్త్రీకి పురుషుడిపై మోజు కలగవచ్చును… మితిమీరిన మోహం కలిగితే, […]

మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు.

అపకారికి కూడా ఉపకారం చేసేవారి గురించి, ఏమి ఆశించకుండా సాయపడే గుణం ఉన్నవారి గురించి, ద్వితీయాలోచన లేకుండా సాయం చేయడానికి చూసేవారి గురించి, తమ చుట్టూ ఉన్నవారి గురించి మంచినే చెబుతూ ఉండేవారి గురించి… ఇలా ఏదైనీ ఒక మంచి గుణ విశేషంగా ఉన్నప్పుడు మంచి వ్యక్తిగా గుర్తిస్తారు… ఎక్కువగా మంచి గుణాలు గల మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు. తనకు అవసరమైనప్పుడు సాయం అందించకుండా మోసం చేసిన మిత్రునికి అవసరమైప్పుడు సాయం చేసేవారుంటే, […]

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి పని మూడు ఉంటే…. ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసే వ్యక్తి, వేళకి తింటారు. వేళకి నిద్రిస్తారు… ఏదైనా కల్తీ వలన కానీ ఏదైనా అంటువ్యాది సోకితే, ఆనారోగ్యంపాలు అవుతారమో కానీ వారి శరీరం వలనే వారికి ఆనారోగ్యం కలగదు… కారణం కష్టం చేసే కాయంలో వృధా కొవ్వు ఉండదు. వేళకి తినడం, నిద్రించడం ఉంటుంది. ఇలా వ్యక్తికి కాయకష్టం లేకపోతే, ఆరోగ్యంగా […]

మనిషి జీవితం ఎలా ఉంటుంది!

సాధించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. సాదించకుంటే అంత గొప్పగా ఉండదు. సమాజంలో మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనిషికి తన చుట్టూ ఏర్పడి ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులో తన లక్ష్యం… తన లక్ష్యానికి ఉపయోగపడే వనరులు… కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అంది వచ్చిన అవకాశం అందుకుంటే అందలమైనా అందుతుందని అంటారు. వ్యక్తి జీవితం అతని స్వభావం… దాన్ని బట్టి సమాజం నుండి స్పందన, సామాజిక స్పందనను బట్టి వ్యక్తి ప్రతిస్పందన… ఇరువురి ప్రతిస్పందనల మద్య మనసు […]

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి! నీటి ఎద్దడి ఎదుర్కొనేవారికి నీటి విలువ తెలుస్తుంది. వారు నీటిని పొదుపుగా వాడతారు. నీరు వాడడంలో నీటి వృధా కానివ్వరు. నీటి యొక్క ఉపయోగాలు బాగా గుర్తెరిగి ఉంటారు. నీటి వృధా చేసేవారికి నీటి విలువ తెలియకుండానే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు… ఎవరు ఎలా ఉపయోగించినా గాలి తరువాత మనిషి మనుగడకు నీరు చాలా చాలా అవసరం. త్రాగు నీరు లేనిదే మనిషి మనుగడ లేదు… అలాగే భూమిమీద […]

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు

మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు కొన్నింటిని…. మంచి విద్యార్ధిగా ఉన్నప్పుడు మంచి లక్షణాలు ఉండడం చేత ఉపాధ్యాయుని వద్ద మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా ఉపాధ్యాయుడు మంచి లక్షణాలు గల విద్యార్ధులకు పాఠాలు చెప్పడంలో ఆసక్తి చూపుతారు. అంటే ఒక విద్యార్ధికి మంచి లక్షణాలు ఉంటే, అవి తోటివారికి కూడా సాయపడతాయి… అనుకరణలో విద్యార్ధులు ఒకరిని చూసి మరొకరు చేస్తూ ఉంటారు… కాబట్టి మంచి లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్ధి తమ వైఖిరి పట్ల తాము […]

నేర్చుకోవాలి అనే తపన ఉంటే

నేర్చుకోవాలి అనే తపన ఉంటే, అదే మన వృద్దికి కారణం కాగలదని అంటారు. తపించే స్వభావం, తాపత్రాయం నెరవేరేదాకా ఊరుకోదు. తపనే లేనప్పుడు ఎవరూ, ఏమి చేయలేరు. విద్యార్ధికి నేర్చుకోవాలనే తపన బలంగా ఉంటే, కరోనా కాలంలో కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యను అభ్యసించడానికి కృషి చేస్తారు… ఆ తపన లేకుంటే మాత్రం, ఎలా స్కూల్ కు సెలవు పెట్టాలనే తలంపు తలుస్తారు. తపను ఉంటే అందుకు అనుగుణంగా తలంపులు పుడతాయి. నేడు నేర్చుకోవాలనే […]

పండుగ అంటే ఏమిటి వివరించండి?

పండుగ అంటే ఏమిటి వివరించండి? ప్రతి సంవత్సరం తెలుగు కాలమానం ప్రకారం తెలుగు మాసములలో గల పక్షములో, నిర్ధిష్ట తిధి ఆధారంగా వచ్చే పండుగలు కొన్నింటిని పర్వదినాలుగా చెబుతారు… ఆయా రోజులలో ప్రత్యేకంగా దైవపూజలు చెబుతూ ఉంటారు. ఉదాహరణ: చైత్రమాసంలో తొలి తిధి ఉగాది పరిగణించబడుతుంది. ప్రతిసంవత్సరం చైత్రమాసంలో వచ్చే మొదటి తిధి ఉగాది పండుగ జరుపుకుంటూరు. అలా తెలుగు కాలమానం ప్రకారం కొన్ని ప్రత్యేక తిధులలో పండుగలు జరుపుకుంటారు. అయితే ఈ పండుగలలో శారీరకంగా, మానసికంగా […]

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

వ్యక్తి శరీరంలోనే అనేక వ్యవస్థలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ… తదితర వ్యవస్థలు. ఇలా వ్యక్తి శరీరంలో ఉండే అన్ని వ్యవస్థల పనితీరు సక్రమంగా ఉంటేనే, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆయుష్సు ఉన్నంతవరకు జీవించగలడు. లేకపోతే ఆ వ్యక్తి అనారోగ్యపాలు అవుతాడు… అలాగే సమాజం కూడా అనేక వ్యవస్థలతో కలిసి ఉంటుంది. వ్యక్తిలో వ్యవస్థల మాదిరిగానే, సమాజంలో వ్యవస్థల పనితీరు సమాజంపై పనిచేస్తుంది… ఇటువంటి వ్యవస్థ అంటే ఏమిటి… వ్యవస్థల ప్రభావం తెలుగు […]

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

కుటుంబ వ్యవస్థను అర్ధం చేసుకోవాలి. ముందుగా మనకున్న కుటుంబం గురించి తెలుసుకోవాలి. మన కుటుంబంలో పూర్వీకుల ఆచార వ్యవహారాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలి. ఇంట్లో పెద్దవారిపై ఎందుకు గౌరవం కలిగి ఉండాలో, తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఒకరంటే ఒకరికి నమ్మకం… ఒకరి స్వభావం గురించి ఒకరికి అవగాహన కలిగి ఉంటూ, ఒకరిపై ఒకరికి సదభిప్రాయం కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనం ఏం చేయాలో మనకొక ఆలోచన పుడుతుంది. కుటుంబంలో సభ్యుల వలన […]

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

అటువంటి అంశాలు తాత్కలిక కాలంలో ప్రభావం చూపనట్టుగా ఉంటూ, తర్వాతి కాలంలో ప్రభావం చూపుతాయి…. అంటే రహస్యంగా మనపై నిఘా పెట్టిన వ్యక్తి మనతో మాములుగానే మాట్లాడుతూ ఉంటూ, మనకు సంబంధించిన అంశాలలో వారికి అవసరమైన విషయం తెలిసేవరకు ఓపిక పట్టినట్టుగా దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు కూడా మొదట్లో వాటి ప్రభావం చూపక, ఆపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి…. తెలివిగా ఉంటే, మనతో మాట్లాడే వ్యక్తి స్వభావం కనిపెట్టవచ్చును అలాగే దీర్ఘకాలిక ప్రభావం చూపించే అంశాలను […]

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం… గురించి ఈ వ్యాసం. పత్రికల కధనాలు సామాజిక భవిష్యత్తును లేక సామాజిక చరిత్రను సృజిస్తూ ఉంటాయి. అవి రచయిత సామాజిక దృష్టి లేక మనోవిజ్ఙానం ఆధారంగా పత్రికలలో ప్రచురితం అవుతూ ఉంటాయి… విశ్లేషణాత్మక కధనాలు సామాజిక ప్రయోజనార్ధం ప్రచరురించడం లేదా వ్యాఖ్యానాల రూపంలో టివిలలో వస్తూ ఉంటాయి. వార్తాపత్రికలు రోజూ సమాజంలో జరిగిన విషయాలను తెలియజేస్తూ, నిత్యం జరిగే విషయాల గురించి ఆన్ లైన్ […]

తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి?

తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి? తెలివి అంటే తెలిసి ఉన్న విషయ పరిజ్ఙానంతో చురుకుగా ఆలోచిస్తూ, పనిని సులభంగా పూర్తి చేయడం… పనితనంలో తెలివి అయితే, తెలిసిన విషయ విజ్ఙానంతో అప్పటికప్పుడు అవసరమైన మాటలు మాట్లాడడం మాటకారి… లేదా తెలివిగా మాట్లాడుతారని అంటారు. ఎరుకతో వ్యవహరించడం అంటే మేట్కోని ఉండడం తెలివిగా వ్యవహరించడం… ఏదైనా మెదడు పనితీరుకు తెలివి తార్కాణంగా నిలుస్తుంది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో అంశంలో గొప్ప తెలివిని ప్రదర్శించగలరు. అందరూ […]

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో…. పెద్దల మాట చద్ది మూట అన్నది నిజం. ఎందుకంటే పెద్దవారి జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి. ఏది మంచో, ఏది చెడో వారికి అనుభవంలోకి వస్తాయి. పెద్దవారు సమాజంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలన చేసి ఉంటారు. వారికి అనేక విషయాల పట్ట అవగాహన, జ్ఙానం కలిగి ఉంటారు. కావునా వారు మాటలు, మన భవిష్యత్తు కార్యాచరణలో అనుభవంలో ఎదురవుతాయి. అలాంటి మాటలే పెద్దలు పలుకుతూ ఉంటారు. వర్తమానంలో […]

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి.

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి. త్యాగం అంటే తన దగ్గర ఉన్నదానిని ఫలితం ఆశించకుండా ఇచ్చేయడమే… లేదా ఖర్చు చేయడమే. త్యాగమూర్తుల త్యాగ ఫలితం భవిష్యత్తు తరం కూడా అనుభవిస్తుంది. సాయం ఒకరికే ఉపయుక్తం కావచ్చును… కానీ త్యాగ ఫలితాలు మాత్రం ఒక తరానికి లేదా కొన్ని తరాలకు సమాజంలో ఉపయోగపడుతూనే ఉంటాయని అంటారు. ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనంలో కొంత ధనం ఇతరులకు అందిస్తే, అది సాయం అవుతుంది. అదే తన దగ్గర ఉన్న […]

విద్యార్థులు మంచి మాటలు వినడం వలన

విద్యార్థులు మంచి మాటలు వినడం వలన

మంచి మాటలు విద్యార్థులకు ప్రేరణను అందిస్తాయి. అవి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. చదువుకునే వయస్సులో మంచి మాటలు విద్యార్ధుల మనసులలో బాగు నాటుకుంటాయని అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దవారు పిల్లలకు మేలు చేసే మాటలే చెబుతారు. మంచి మాటలు వినడం వలన మానవత్వం, నైతిక విలువలు, సమాజంలో ఎలా ప్రవర్తించాలో వంటి అంశాలపై అవగాహన పెరుగుతుంది. కావునా అనుభవజ్ఙులు చెప్పే మంచి మాటలు వింటూ ఉండాలి. మంచి మాటలు వినడంలో ఆసక్తి చూపడం […]

కోవిడ్ కారణంగా చదువు అయితే

కోవిడ్ కారణంగా చదువు అయితే, ఆగుతుంది…. నడుస్తుంది… కానీ పూర్తి విద్యా సంవత్సరం కొనసాగింపు కావడంలేదు… కారణం కరోనా వైరస్…. కాబట్టి ఒక విద్యా సంవత్సరం నిర్విరామరంగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పుడే, విద్యాభ్యాసం బాగుంటుందని అంటారు. అయితే కోవిడ్ కారణంగా చదువును వాయిదా వేయడం విద్యార్ధిగా తప్పు చేసినట్టే… ఎందుకంటే…. ఈ తెలుగు వ్యాసంలో చదువు వలన ఏమి తెలుసుకుంటాము? పరీక్షలెందుకు? అవగాహన చేసుకుందాం…. ఆటలంటే ఆసక్తి ఉంటే, ఖాళీ లభించినప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యదాయం […]

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి. అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్టులుంటాయి… కొందరికి అటువంటి ఆస్తి ఉండదు… కానీ పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడుతూ ఉంటారు… కొందరు జీవితం గురించి కలలు కంటారు. కానీ కాలంలో తాము కన్న కలలు నెరవేరవని తెలుసుకుని వాటిని విరమించుకుంటారు. […]

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు… అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు… అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా లభిస్తుంది. చేసిన మేలు మరిచేవాడిని కృతఘ్నుడు అంటాము… కృతఘ్నుడికి క్షమా బిక్షలేదని అంటారు. మరి చెట్టు మానవజాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి… కాబట్టి చెట్లకు నీరు అందించి వాటిని సంరక్షించాలి. చెట్లను తొలగించడము అంటే, […]

పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా?

పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ హిట్ కానీ సినిమా క్లైమాక్స్ ఆసక్తిగా లేదని అభిప్రాయాలు. పాటలు సూపర్ హిట్ కానీ సినిమా ముగింపులో ఆసక్తికరంగా లేదు… సుకుమార్ డైరక్షన్ సూపర్ కానీ సినిమ క్లైమాక్స్ తేలిపోయింది… సినిమాలో అన్నీ బాగున్నాయి కానీ నిడివి ఎక్కువైంది…. రకరకాల అభిప్రాయాలతో సినిమా డివైడింగ్ టాక్ తెచ్చుకుందని తేల్చేసినవారు కొందరు. ఈ సినిమా హిట్టా… ఫట్టా అని […]

ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం

ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన పర్వదినం. ముక్కోటి ఏకాదశి తిధిన తలంపులన్నీ భగవంతుడి కోసం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణీ పుట్టక తప్పదు. జీవనయాత్రలో ఎన్నో పుట్టుకలు, మరెన్నో మరణాలు అయితే జనన మరణ సమయాలలో తీవ్రమైన బాధను భరించవలసి ఉంటుంది. జీవి యాత్రలో మరణం లేని దశకు చేరే అవకాశం మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఉంటే, అది ఏకాదశి తిధి రోజున సార్ధకం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని […]

నా ఇష్టమైన గేమ్ షెటిల్

నా ఇష్టమైన గేమ్ షెటిల్. ఎందుకంటే నేను ఉదయం వేళల్లో షెటిల్ ఆడితే, అది నాకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా షెటిల్ ఆడడం వలన నేను ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడడానికి ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్… కానీ గేమ్ చూడడం వలన కలిగే సంతోషం కన్నా ఆడితే వచ్చే సంతోషం ఎక్కువ… కాబట్టి వీలైనన్ని రోజులు ఉదయం వేళ మరియు సాయం వేళల్లో షెటిల్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజులో నాచుట్టూ ఉండేవారు […]

విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు.

విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు. ఎందుకంటే పబ్ జీ గేమ్ ఒక అలవాటుగా మారి అది చివరికి వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. వ్యసనం వ్యక్తి పతనానికి నాంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్ జీ వంటి గేమ్స్ ఆడేందుకు విద్యార్ధులను అనుమతించరాదు. పబ్ జీ గేమ్ ఇది ఒక స్మార్ట్ ఫోన్ ఇది ఆడుతూ ఉన్నప్పుడు చేతిలో ఉన్న ఆయుధాలతో అవతలివారిని చంపుకుంటూ వెళ్లాలి. లేకుంటే ప్రత్యర్థి చేతుల్లో చావాల్సి ఉంటుంది. అంటే […]

జీవితంలో నా లక్ష్యం గురించి

మనిషి జీవితంలో నా లక్ష్యం గురించి ఒక వ్యాసం వ్రాయడానికి… మనకు లక్ష్యం ఖచ్చితంగా మనం ఏర్పరచుకున్నదో లేక పెద్దలు చెప్పగా విని మనం ఏర్పరచుకోవడమో… ఏదో ఒక విధంగా లక్ష్యం ఏర్పడుతుంది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అది ఆర్ధికంగా బాగా ఎదగాలి అని కొందరికి ఉంటే, మంచి ఉద్యోగం సంపాదించాలి. మంచి స్థాయిగల ఉద్యోగం పొందాలి. క్రీడలలో అగ్రస్థానం సంపాదించాలి… ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో […]

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి. ధూమపానం అంటే పొగ తాగడం అంటారు. అంటే చుట్ట, బీడి, సిగరెట్ తదితర వాటితో హానికరమైన ధూమపానం చేయడం ప్రమాదకరం. చుట్ట, బీడి, సిగరెట్ వంటివి తాగుతూ, పొగ బయటికి వదలడంతో, ఆ పొగ పీల్చినవారికి కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు అంటారు. చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటితో పొగ త్రాగుట లేదా పీల్చుట ఆరోగ్యానికి హానికరం…. కాబట్టి ధూమపానం చేయరాదు. ధూమపానం చేయడం వలన […]

ఇతిహాసం మహాభారతంలోని పర్వాలు పేర్లు

మహా భారతంలోని పర్వాలు పేర్లు. మహా భారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి. మహాభారతం రాసింది ఎవరు అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారత రచన చేస్తే, ముగ్గురు తెలుగు కవులు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ పద్దెనిమిది పర్వాలను కవిత్రయంగా పిలవబడే నన్నయ్య, తిక్కన, ఎఱ్ఘాప్రగడ తెలుగులోకి అనువదించారు. జయ సంహిత అను నామము మహాభారతం మరొక పేరు అంటారు. మహాభారతం చదువుతుంటే, మనసుకు జయం కలుగుతుందని అంటారు. ఎన్నో రకాల స్వభావాల గురించి, మహాభారతం రీడ్ చేయడం వలన […]

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి. భవిష్యత్తు గురించి విశ్వాసంతో ఉంటూ, సానుకూల దృక్పధంతో సానుకూల ఆలోచనలు చేయడం అయితే దీనికి విరుద్ధంగా నిరాశావాదం ఉంటుందని అంటారు. ఆశావాదం వ్యక్తికి పాజిటివ్ అయితే, నిరాశావాదం వ్యక్తికి నెగిటివ్ అంటారు. ఆశతో జీవిస్తూ, ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ జీవితం సాగించాలి కానీ ఆశాభంగం జరిగినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కాకుడదని ప్రధానం పెద్దలు చెబుతూ ఉంటారు. ఆశావాదం అంటే మంచి ఫలితం వస్తుందనే ఆశతో పనులు చేయడం. అయితే […]

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి! శాంతిగా ఉండే మనసు బాగా ఆలోచన చేయగలిగితే, అశాంతితో ఉండే మనసు అసహనంతో ఉంటుంది. పరిష్కార ధోరణి కానరాదు. శాంతియుత వాతావరణంలో వ్యక్తి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. శాంతస్వభావం ఉన్నవారి మాటతీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. శాంతము లేని చోట సౌఖ్యముండదని అంటారు. దైనందిన జీవితంలో సమస్యల వలయం ఏర్పడుతూనే ఉంటే, అశాంతితో ఉన్నవారు ఆ వలయంలో చిక్కుకుంటారు. శాంత చిత్తంలో ఆలోచించేవారు సమస్యలకు పరిష్కార ధోరణితో ముందుకు సాగగలరు. మనిషి శాంతిగా […]

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి! ”బలవంతుడు భరిస్తాడు… బలహీనుడు అరుస్తాడు” అంటూ ఒక తెలుగు సినిమా డైలాగ్ ఉంది. కాబట్టి సహజంగానే సమర్ధుడుకి సహనం ఎక్కువగా ఉంటుందని అంటారు. ఎట్టి పరిస్థితులలోనూ సమర్ధుడు తన సహనాన్ని కోల్పోకుండా విచక్షణతో ఉండాలని పెద్దలంటారు. బలవంతుడు భరించే సహన గుణం లేకపోతే, అతని కోపానికి అర్ధం లేకుండా పోతుంది. సమర్ధత అనేది వ్యక్తి యొక్క నైపుణ్యానికి సంబంధించినది అయితే, ఆ వ్యక్తి ఎంతటి నైపుణ్యతను కలిగి ఉంటే, అతడు […]

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు. తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో కార్యసాధనకు బీజం పడుతుందని అంటారు. ఒక వ్యక్తి బాగా లెక్కలు చేయగలడు… అంటే అతనికి లెక్కలు గురించి […]

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది. అమ్మ మాట్లాడే భాషలోనే పెరిగిన పిల్లలు, అదే భాష ద్వారా విషయాలను గ్రహించడంలో అలవాటు పడి ఉంటారు. కావునా మాతృభాషలో విద్య వలన త్వరగా విద్యార్ధులకు విషయావగాహన ఉంటుందని అంటారు. మాతృభాషలో విద్య మీరు […]

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది. అలా కాకుండా మనమనే భావన కొరవడితే, అది కుటుంబంలో బంధాలను బలహీనపరుస్తుంది. కావునా కుటుంబంలో సభ్యులందరిలోనూ మనమనే ఏక భావన ఉండడం, ఆ కుటుంబానికి శ్రేయష్కరం అంటారు. మనమనే ఐక్యతా భావన ఒక కుటుంబానికి బలమైన భావనగా చెబుతారు. కుటుంబ సభ్యులంతా కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉండడం వలన, సదరు కుటుంబానికి సమాజంలో ఆకుటుంబ పెద్దకు మంచి విలువ ఉంటుంది. ఇంకా ఆ కుటుంబంలో సభ్యులంతా మనమనే భావనతో ఉండడం […]

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి? ప్రధానంగా ప్రధమ పుత్రుడు కానీ ఏకైక పుత్రుడు కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా జీవించాలని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. పితృవాక్య పరిపాలన ప్రధాన కర్తవ్యంగా జీవించాలని రామాయణం మనకు బోధిస్తుంది… రామాయణం ప్రకారం ఆలోచిస్తే, తండ్రిమాటకు విలువనిచ్చి జీవించడం కుమారుడి ప్రధాన లక్షణంగా కనబడుతుంది. మంచి కుమారుడు తండ్రిమాట వినాలి అంటారు. ఇంకా సమాజంలో తండ్రికి తలవొంపులు తేకుండా ప్రవర్తించాలి. మంచి విషయాలలో తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా […]

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం. మనిషికి ఉండకూడని వ్యసనంగా పెద్దలు చెబుతారు. కానీ ఈ వ్యసనం నేటి సమాజంలో ఎక్కువమందికి ఉండడం దురదృష్టకరం అంటారు. అందుకు కారణం మద్యపానం వలన మత్తులో ఉంటూ, బాధని మరిచిపోతామనే అపోహలో ఉంటారని, ఇంకా మద్యపానం వలన జరిగే నష్టం గురించి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం అంటారు. మద్యపానం మూలంగా కలిగే వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి. తాగుడు వలన అతిగా మాట్లాడుట అలవాటు అవుతుంది. తాగుడు వలన […]

మన మహనీయుడు వేమన యోగి

మన మహనీయుడు వేమన యోగి, తన పద్యములతో వ్యక్తులను ప్రశ్నించాడు. సూటిగా ప్రశ్నించే భావములు వేమన పద్యాలలో ఉంటాయి. యోగి వేమన సుమారు 1652 – 1730 మధ్య కాలములో జీవించారిన చరిత్ర. కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని చెబుతారు. వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలోకి వచ్చాయి. లోకం తీరు గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి స్వభావం గురించి ఆలోచించే విధంగా వేమన పద్యాలు ఉంటాయి. వేమన […]

పింగళి వెంకయ్య మన మహనీయుడు

పింగళి వెంకయ్య మన మహనీయుడు. ఈయన మన భారతదేశపు జాతీయ జెండా రూపకల్పన చేశారు. మన పింగళి వెంకయ్య గారి జన్మస్థలం: నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణజిల్లాలోని మచిలీపట్నంకు దగ్గరగా ఉన్న మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. పింగళి వెంకయ్య గారి తల్లిదండ్రులు : వెంకటరత్నమ్మ – హనుమంతరాయుడు | పుట్టిన తేదీ : 2వ తేదీ ఆగష్టు నెల 1976 వ సంవత్సరం. | చదువు : మచిలీపట్నం హైస్కూల్ నందు, కొలొంబోలోని సిటి […]

పివి నరసింహారావు మన మహనీయుడు

మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన […]

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు. అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన మాటలే కాదు పద్యాలు పలికిన మహానుభావులు మన తెలుగు పూర్వీకులు. మన కవులు అందించిన కవిత్వంలోని మాధుర్యం […]

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటుగా ఉండడం వలన నాకు రాజకీయం గురించి కొంచె అవగాహన కలుగుతుంది. గత కొంతకాలంగా దేశ రాజకీయాలు అయితే జాతీయతా భావం ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజల ఆలోచనా తీరు గమనిస్తున్న రాజకీయ పార్టీలు జాతీయతా భావమునే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని దేశ రాజకీయాలలో తమ ప్రభావం చూపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైనా ఒక విషయంలో ఒక ప్రాంతంలో ఎంత […]

తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా

తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా మన తెలుగుకు మనం దగ్గరగానే ఉన్నామా…. మన మాతృభాష అయిన తెలుగును మరిచి పోయావా? ఎందుకు అంటున్నారంటే, నేటి పిల్లల్లో తెలుగు పుస్తకం చదవడానికి కష్టపడుతున్నారు. ఇంగ్లీషులో పుస్తకం ఈజీగా చదివేస్తున్నారు. అవును నేటి కాలంలో టాలెంటుతో బాటు ఇంగ్లీషు అవసరం అనర్ఘలంగా మాట్లాడగలిగితేనే కార్పోరేట్ రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. కానీ మాతృభాష అయిన తెలుగులో మాత్రం చదవడానికి ఇబ్బందులు పడే పిల్లలకు రేపు తత్వపరమైన పుస్తకం రీడ్ […]

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం

దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా ఇచ్చే ఫలితాలు ఉండవు. కాలహరణం కూడా చేస్తాయి. విమర్శలుపాలు అవుతాయి. ఇలా ముందుగానే నెగటివ్ ప్రభావాన్ని దీర్ఘకాలిక ప్రణాలికలు పొందే అవకాశం కూడా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాలికల ఫలితం తొలుత చిన్న ప్రకాశం మాదిరిగానే కనబడుతుంది. ప్రయత్నం చేయగా, దీర్ఘకాలంలో ప్రకాశం ఎందరికో వెలుగును చూపగలదు. మారుతున్న కాలంలో వేగంగా ఫలితాలను పొందుతున్న రోజులలో దీర్ఘకాలిక చర్యలు అందరికీ సంతృప్తికరంగా అనిపించకపోవడంలో ఆశ్చర్యపడనవరం లేదని అంటారు. అయితే అన్నింటిలోనూ దీర్ఘకాలిక చర్యలు తగదని […]

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో విశ్వసనీయత ప్రధానమని తెలుగులో వివరించండి. విశ్వసనీయత జీవితంలో చాలా ముఖ్యమైనది. విశ్వాసం ఏర్పడిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం వ్యక్తికి చాలా అవసరం. విశ్వాసం కోల్పోతే అర్హతను కోల్పోవలసి ఉంటుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా చివరికి ఒక ప్రాంతమైనా విశ్వసనీయత ప్రధానమైన ప్రభావం చూపగలదు. ఒక ప్రాంతంలో దారి దోపిడి దొంగలు ఎక్కువ అని సమాజంలో ప్రాచుర్యం పెరిగితే, ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రాంతంపై ప్రజలలో విశ్వసనీయత ఉండదు. ఆ […]

పావురం గురించి తెలుగులో వ్యాసం

పావురం గురించి తెలుగులో వ్యాసం ! ప్రధానంగా తెల్లని పావురం శాంతికి సంకేతంగా చెబుతారు. పావురం ప్రధానంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్నవాటిని కూడా ఇవి గుర్తించగలవు. 16గంటలు అవిశ్రాంతంగా ఆకాశంలో ఎగురగలవు. అందుకే వీటిని పూర్వపు కాలంలో సందేశాలు ఒక ప్రాంతం నుండి మరొక సుదూర ప్రాంతానికి పంపడానికి ఉపయోగించేవారు. పావురాలు తలను పైకెత్తకుండానే ఆహారాన్ని స్వీకరించగలవు. కానీ ఇతర పక్షలు పావురం మాదిరి ఆహారాన్ని స్వీకరించలేవని అంటారు. ఇంకా పావురం గుండె […]

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన ఆలోచనలు లేని సమాజంలో స్త్రీ పూజింపబడదు అంటారు. అయితే మనదేశంలో స్త్రీ పూజింపబడింది. స్త్రీ గౌరవింపబడింది. స్త్రీ పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తన కలిగి ఉన్న సమాజం మన భారతీయ సమాజం అని ప్రపంచం కీర్తించింది. అయితే ఇప్పుడు అదే దేశంలో కూడా స్త్రీ లైంగిక వేధింపులకు గురి అవుతుందనే వార్తలు సమాజాన్ని కలచివేస్తున్నాయి… దారుణం అందులో చిన్నారులు కూడా ఉండడమేనని పెద్దలు వాపోతున్నారు. స్త్రీల పట్ల […]

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి ! అంటే వ్యక్తి యొక్క తత్వమును తెలియజేయునదిగా చెప్పబడుతుంది. సమాజంలో వ్యక్తి తన యొక్క తత్వముతో ప్రభావం చూపుతూ ఒక గుర్తింపును పొందుతూ ఉంటే, ఆ తత్వమును అతని యొక్క వ్యక్తిత్వముగా చెబుతూ ఉంటారు. వ్యక్తిత్వంలో వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు, అభిరుచులు మొదలైనవి మిళితమై ఉంటాయి. వ్యక్తి తనకు ఉన్న విశిష్టమైన లక్షణాల వలన, గుణాలు వలన, అభిరుచుల వలన తన యొక్క ప్రవర్తనతో వివిధ పరిస్థితులలో వివిధ విధాలుగా […]

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి! జీవితంలో కర్తవ్య నిర్వహణ పాటించినవారికి జీవితపు లక్ష్యం నెరవేరగలదని అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏర్పడే లక్ష్యాలు, తాము నిర్వహించే కర్తవ్యమును అనుసరించి ఉండే అవకాశం ఉంటుందని అంటారు. వ్యక్తి కర్తవ్య నిర్వహణలో కృతకృత్యుడైతే, వచ్చే గుర్తింపు కలకాలం కొనసాగుతుందని అంటారు. వృత్తిరిత్యా కర్తవ్యతా దృష్టితో ఉండేవారి మనసు వృత్తిలో తమ పనిని తాము సమర్ధవంతంగా నిర్విహించగలగడానికి వారి మనసు సహకరించగలదని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. ఒక పోలీసు తన కర్తవ్య […]

మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా?

మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా? నేటి స్మార్ట్ సమాజంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ కారణంగా మాట్లాడే వాయిస్ కాల్ రికార్డింగ్ అయ్యే అవకాశం ఉండవచ్చు. బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు… నెలవారీ డేటా ప్లాన్స్… స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా వివిధ పనులు సులభంగా చక్కబెట్టగలగడం… వెరసీ స్మార్ట్ ఫోన్ అవసరం అందరికీ ఏర్పడడంతో… అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయింది. నార్మల్ ఫోన్ అయితే ఆఫోన్ కంపెనీ వారు […]

డిసెంబర్ 31 జనవరి 1

డిసెంబర్ 31 జనవరి 1 ఒకటి వస్తుందని ముందురోజే ఒక రాత్రిని ఖర్చు చేయడమనే అలవాటు ఆలవాలం డిసెంబర్ 31 ఎందుకంటే జనవరి 1 వస్తుంనే సంతోషం… అయితే ఆ సంవత్సరంలో ఏంచేయాలో నిర్ణీత ప్రణాళిక వేసుకున్నవారికి… మాత్రం అది మంచి ఫలితాన్నే ఇస్తుందని అంటారు. నూతన సంవత్సరపు కొత్త ఆలోచనలు… ఆత్మ నిత్యనూతనం… ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉండే మనసుకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చి పరాకు చెబుతూ ఉంటాయి. ఎప్పుడూ కష్టంగా గడిచే కాలంలో సంతోషాలు […]

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు. ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం […]

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి? చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా నిరక్షరాస్యులు ప్రయాణం చేసేటప్పుడు, వారికి ఎదురయ్యే అనుభవాలు బాగుంటాయి. నిరక్షరాస్యులు ఏమి తెలియని కొత్త ప్రదేశాలలో ప్రయాణం చేయాలంటే, వారు వారి గమ్యస్థానం చేరేవారికి ఇతరులపై ఆధారపడాలి. అయితే సమాజంలో మంచివారు ఉంటారు. మోసం చేసేవారు ఉంటారు. మంచివారు ఎదురైతే వారికి మేలు కలగవచ్చును. కానీ మోసం చేసేవారు ఎదురైతే మాత్రం నష్టపోతారు. అంటే చదువు రాకపోతే […]

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత. అనేక మత గ్రంధాలు ఉన్నా, గ్రంధానికి జయంతి జరుపుకోవడం భగవద్గీతకే చెల్లిందని అంటారు. శ్రీ మద్భగద్గీత గొప్ప స్వయంగా భగవానుడే చెప్పడం చేత, దీనికి ఈ ప్రత్యేకత అంటారు. ఇక ఈ గీతాజయంతి ఎప్పుడు జరుపుకుంటారు? అంటే ప్రతిఏడాది మార్గశీర్ష మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిధి రోజున గీతాజయంతిగా జరుపుతారు. ఎందుకంటే ఆరోజే భవగతుండి గీతాసారం అర్జునుడికి బోధించినరోజుగా చెబుతారు. మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశీ తిధినే మోక్ష […]

ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం

ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం ఉంటుందని అంటారు! ఎంతవరకు ఏమిటి అని విశ్లేషిస్తే… బాగా కష్టపడి చదివినవారు పరీక్ష వ్రాస్తారు. బాగా చదవకుండా కూడా పరీక్ష వ్రాస్తారు. కష్టపడి చదివి పరీక్ష వ్రాసినా, కాఫీ కొట్టి పరీక్ష వ్రాసినా, సరైన సమాధానములకు మార్కులు వస్తాయి. ఆ రీతిలో పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులవుతారు. చదివి, చదవనివారు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటే, మరి కష్టపడి చదవడం ఎందుకు? కష్టపడి చదివి పరీక్ష వ్రాసిన విద్యార్ధి, తనకు ఫలితం […]

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు. ఈ వ్యాక్యం ఆధారంగా ఒక వ్యాసం వ్రాయాలంటే, మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనకో అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులలో, ఆ పరిస్థితులను ప్రభావితం చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలిసి ఉండాలి. ఇంకా ఎవరెవరు ఎటువంటి ప్రభావం చూపుతున్నారో తెలియబడి ఉండాలి. ఇలా మన చుట్టూ ఉన్న స్థితి మనకు అవగాహన ఉంటే, మన చుట్టూ మనకో మార్గదర్శకుడు కనబడతారు. ఒక వ్యక్తి చుట్టూ ఒక […]

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు. సమయం అంటే కాలం. కదిలే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే మనకొక నానుడి కూడా ఉంది. అదేటంటే కాలం కాంచన తుల్యం అని అంటారు. అంటే క్షణ కాలం అయినా బంగారంతో సమానమని అంటారు. సంపాదించేవారు ఎప్పుడూ సమయానికి ప్రాధన్యతనిస్తారు. వారు చేసే దినచర్య ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయపాలనను పాటిస్తారు. అందుకే వారు కాలాన్ని ధనముగా మార్చగలరు. ఏది చేయాలన్నా మనకున్న కాలంలోనే సాధ్యం. మనం లేని […]

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి , జనుల యందు ఎవరిలో అయితే ఎల్లప్పుడూ మంచి లక్షణాలను కలిగి ఉంటారో, వారిని సజ్జనులుగా లోకం కీర్తిస్తూ ఉంటుంది. తమకు ఎటువంటి పరిస్థితి ఉన్నాసరే తమయందు ఉన్న గొప్పగుణముల లక్షణాలను కోల్పోనివారిని సజ్జనులుగా లోకం గుర్తు పెట్టుకుంటుంది. సహజంగానే వీరికి సహనం ఉంటుంది. ఎటువంటి స్థితిలోనూ తమ సహనాన్ని కోల్పోరు. సజ్జనులు లక్షణాలు మంచి గుణములుగా మరొకరికి మార్గదర్శకంగా ఉంటాయిని అంటారు. సాహసంగా వ్యవహరించగలరు. క్లిష్ట సమయాలలో సమయస్పూర్తితో వ్యవహరించడంలో […]

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు కాదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి వద్ద విద్యాభ్యాసం చేసిన పిమ్మటనే అతను తనకు నచ్చిన అంశములో నైపుణ్యతను పెంపొందించుకోగలడు. ఒకవ్యక్తి పరిఫూర్ణమైన జ్ఙానం సంపాదించుకోవడంలో గురువు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. చూసి నేర్చుకునే విద్యైనా, చదివి తెలుసుకునే విద్య అయినా సరే గురువు ద్వారా నేర్చుకునే విద్యకు రాణింపు ఉంటుంది. మంచి గుర్తింపుతో బాటు మనోవిద్య కూడా […]

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది. ముఖ్యంగా తాత-ముత్తాతలు, అమ్మమ్మ, అమ్మకు అమ్మమ్మలు మాటలు పిల్లలలో మంచ అవగాహనను కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు చూపుకునే ప్రేమాభిమానాలు ఎదుగుతున్న పిల్లలో ఒంటరితనం అనే భావన లేకుండా, పాజిటివ్ దృక్పధం పెరిగే అవకాశాలు ఎక్కువ. […]

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సమయానికి శ్రద్దతో ఆహారం స్వీకరించేవారు శక్తివంతులుగా ఉంటారు. సమయానికి ఒత్తిడి కారణంగా ఆహారం స్వీకరించక ఉండేవారు బలహీనతను కొని తెచ్చుకుంటారు. జీవనశైలి వలన వచ్చు వ్యాధులు, వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకునేవారి జీవనశైలితో వారు సంతోషంగా ఉండగలరు. ఒత్తిడికి తలొగ్గి కనీస సమయపాలన కూడా పాటించిన జీవనశైలి గలవారు అనారోగ్యవంతులు అవుతారని అంటారు. అంటే ఎవరి ఆరోగ్యం వారి […]

Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు

Moto G31 మోటోజి31 మొబైల్ ఫీచర్లు. బడ్జెట్ ధరకు అటుఇటుగా ఆకట్టుకునే ఫోన్లు ఏమున్నాయో అనే ఆత్రుత అందరికీ సహజం. మనకు ఆన్ లైన్ సౌకర్యం వలన ఇటువంటి ఆత్రుత ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రాబోతున్న స్మార్ట్ ఫోన్లలో లెనోవో వారి మోటోరోలా కంపెనీ యొక్క స్మార్ట్ ఫోన్ నేమ్ మోటోజి31 న్యూ ఫోన్ త్వరలో ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. గ్రే అండ్ బ్లూ కలర్లలో ఈ మోటోజి31 న్యూ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి […]

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు. మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే అవకాశం జ్యోతిష్య శాస్త్రములో ఉంటుందనే భావన బలపడుతుంది. నక్షత్రము యొక్క పాదమును బట్టి రాశి, రాశిలో గ్రహసంచారం, […]

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం. సామాజిక ఆస్తుల మనవి, మన ఆస్తులను మనం రక్షించాలే కానీ వాటికి హాని తలపెట్టరాదు. తమ వంతు ప్రయత్నంగా సామాజిక ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. సమాజంలో వివిధ వ్యవస్థలు లేక సంస్థలు మానవుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతూ ఉన్నాయ. వాటిని కాపాడడం అందరి సామాజిక బాధ్యత. సమాజంలో ఏ వ్యవస్థకు నష్టం జరిగినా, తిరిగి ఆనష్ట భారం మనపైనే పడుతుందనేది వాస్తవం. కాబట్టి […]

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి. సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఎదిగే కొలది బంధువుల పిల్లల, స్కూల్లో సహవాసం ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈకాలంలో వ్యక్తి ఖచ్చితమైన […]

కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి.

కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి. కరోనా వైరస్ చైనాలో పుట్టినా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అన్ని దేశాలలోనూ కరోనా వైరస్ తన ప్రతాపం చూపించింది. ఎందరలో మనషులను హరించింది. తదుపరి కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ మరింత ప్రభావం ప్రపంచంపై చూపుతుంది. సాదారణ వ్యక్తి మాదిరిగానే కనబడినా కరోనా లేదనుకోవడానికి వీలు లేదంటారు. కారణం కరోనా వైరస్ బారిన పడినవారు వెంటనే అనారోగ్యంపాలు కాకపోవచ్చును. వైరస్ తీవ్రత పెరిగాక రోగలక్షణాలు కనబడవచ్చును. కాబట్టి వైరస్ […]

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు. స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను హరించే గర్హించాలి. సమాజంలో మనుషులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కుంది. కాబట్టి వ్యక్తి ఎదిగేవరకు సంరక్షకుల నియంత్రణలో ఉన్నా […]

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి. పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి? మొక్కగా ఉన్నప్పుడే […]

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, అనే నానుడి చాలా ప్రసిద్ది… మినప గారెలు మనకాయమునకు బలము అయితే మహాభారతం మన మనసు జవము అంటారు. అంటే మనం మహాభారతం రీడ్ చేయడం వలన మన మనసును మరింత శక్తివంతం చేయవచ్చనే భావన పై నానుడి వలన కలుగుతుందని చెప్పవచ్చును. కారణం మినపగారెలు రుచిగా ఉంటాయి… అవి తిని అరిగితే, వాటి మన శరీరమునకు […]

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో

వెలకట్టలేని ఓటు విలువ తెలుసుకో! ఓటు వేయడం అంటే, ప్రజలు తమకు నచ్చిన అభిమాన నాయకుడిని గెలిపించడమే కాదు తమ తమ సంస్తృతి సంప్రదాయాలపై ప్రభావం చూపుతూ, సామాజిక భవిష్యత్తుని శాసించే అధికారాన్ని కొందరికి అప్పగించడమే అవుతుంది. కష్టం చేసి కుటుంబాన్ని పోషించే కార్మికుడు కానీ శ్రామికుడు కానీ ఉద్యోగి కానీ అధికారి కానీ నిర్వహణాధికారి కానీ ఎవరైనా సమాజంలో భాగమే… అందరికీ ఓటు ఉంటుంది. అందరూ తమ కుటుంబ సభ్యుల కోసమే సంపాదించడానికి వివిధ వృత్తులు […]

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత. ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది. ఐకమత్యమే బలం అయితే అనైక్యతే బలహీనత అంటారు. ఐకమత్యం అంటే ఒక విషయంలో గాని, ఒక అంశంలో గానీ అందరూ ఒక్క మాటపై ఉండడం అయితే అనైక్యత అంటే ఒక విషయంలో గాని, ఒక […]

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో

స్టడీ సర్టిఫికెట్ రిక్టెస్ట్ లెటర్ తెలుగులో వ్రాయడం అంటే వ్యక్తిత్వ ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన పత్రాలను కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ వ్రాయడం. ధృవీకరణ పత్రము కొరకు అభ్యర్ధన మీపేరు, మీరు చదివిన తరగతి, మీ స్కూల్ పేరు. టు, ది ప్రిన్సిపాల్, స్కూల్ పేరు. విషయము: వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు కొరకు అభ్యర్ధన అయ్యా, నా పేరు______________________ నా యొక్క తండ్రి పేరు__________________. నేను__________________ స్కూల్ […]

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం? వ్యక్తికి శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యక్తులందరూ శ్రీరామాయణం చదవడం వలన సమాజానికి ప్రయోజనం ఏమిటి? శ్రీరామాయణం రీడ్ చేయడం వలన కలుగు మేలు ఏమిటి? ఎన్ని ప్రశ్నలు సంధించుకున్నా, ఆ ప్రశ్నకోణంలోనే, తగు సమాధానం మనసులో ధ్యోదకం అయ్యేలాగా శ్రీరామాయణం చేయగలదని పండితులు అంటారు. ఎన్ని సార్లు చదివినా కొత్తగా చదువుతున్న అనుభూతి కలగడంతో బాటు శ్రీరామాయణం చదవడం వలన శ్రద్ధాసక్తులు పెరుగుతాయని అంటారు. ప్రధానంగా ధర్మము తెలిసి […]

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఓటు వేయడం అంటే అయిదు సంవత్సరాల కాలంపాటు ఒకరికి అధికారాన్ని అప్పగించడం. ఓటు అనేది మన సమాజం కోసం మనన్ని పరిపాలించడానికి మనం […]

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది. ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో బోధకులు ఇలా నిత్యం బాలల వెన్నంటి బాలల శిక్షణకు, బాలల ఉత్తమ క్రమశిక్షణ కోసం పాటుపడే వ్యవస్థ […]

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును. ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు? కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు. […]

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పుస్తక పఠనం వలన ఉపయోగాలు చాలానే ఉంటాయని అంటారు. పుస్తకాలు చదవడం వలన జ్ఙానం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం వలన విషయాలలో సారం అర్ధమవుతుంది. ఎందుకంటే పుస్తకాలలో వివిధ విషయాల సారం వివరించబడి ఉంటుంది. పుస్తకాలలో వివిధ విధానాల గురించి లేక పద్దతుల గురించి వివరించబడి ఉంటుంది. పుస్తకాలు చదవడం వలన ఒక విధానం గురించి అర్ధం అవుతుంది. అది వస్తు తయారీ విధానం కావచ్చును. సంస్కృతి సంప్రదాయం కావచ్చును. ఏదైనా ఒక పద్దతి గురించి అక్షర […]

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే జీవితమే అద్భుతము అంటారు. ఒక దీర్ఘము తేడా రెండు పదాలలోనూ అక్షరాలు ఒక్కటే, వాటిని ఉపయోగించకుంటే ఉన్నత స్థితికి చేరవచ్చును అంటారు. కలంతో చైతన్యవంతమైన విషయమును పంచుకోగలం… కాలం ఉపయోగించుకుంటే, అంతకన్నా బంగారం ఉండదు. కలం ఉపయోగిస్తూ కాలంలో కరిగిపోనీ కీర్తిని గడించవచ్చును… అందుకు తగిన సాధన అవసరం అంటారు. కలము అంటే పెన్ను. కత్తి కంటే కలము గొప్పది అనే నానుడి ప్రసిద్ది. అంటే […]

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము

వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకోవడానికి చాలా రకాల అంశములలో వివిధ విషయములు ఉంటాయి. అయితే తెలిసి ఉన్న రంగంలో మనకు బాగా తెలిసిన విషయంలో అయితే వ్యాసం బాగా వ్రాయగలుగుతాం. కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశం ఎంచుకోవడంలో బాగా తెలిసిన అంశమునే ఎంచుకోవాలి. విద్యార్ధులకు అయితే ప్రశ్నాపత్రములో ముందుగానే అంశము చెప్పి, దానిపై మీ సొంత వ్యాక్యాలలో వ్యాసం వ్రాయమని ప్రశ్నరూపంలో అడుగుతారు. ప్రశ్నాపత్రములో పాఠ్యాంశము నుండి కానీ లేదా సామాజిక అంశము నుండి […]

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువు గురించి చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఆ బంధం అట్టేకాలం కొనసాగదు. సహచరుల విషయంలో చెడు […]

ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా?

ఒక రంగం వృద్ది చెందితే, అనుబంధంగా మరికొన్ని రంగాలు ఎలా అర్ధికంగా వృద్ది చెందుతాయి?  ఒక రంగానికి అనుషంగికంగా ఉండే మరికొన్ని రంగాలు వృద్ది చెందుతాయి. ప్రపంచంలో ఒక రంగం వృద్ది చెందితే క్రికెట్ పోటీలు జరిగే వేళ టివీ రంగం ఆర్ధిక ప్రయోజనం కలుగుతాయి. అదే సమయంలో టివి ప్రకటనలు ఇచ్చే సంస్థలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. టివి ప్రకటనలలో వచ్చే వాణిజ్య ప్రకటనదారు కంపెనీల అమ్మకాలు పెరగవచ్చును. ఇలా అనుబంధంగా ఉండే సంస్థలకు ఆర్ధిక […]

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ పుట్టిస్తాయి. విద్యార్ధులకైతే ఏదైనా సాధించాలనే లక్ష్యము ఏర్పడగలదు. తన జీవితములో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వాస్తవిక దృష్టితో […]

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి. కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది… మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం. వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా చెబుతారు. అనేక ఆలోచనలు సృష్టించే మనసు వివిధ విషయాలపై వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇలా […]

చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో

చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో దీపావళి పండుగ ప్రారంభం చేయడం లక్ష్మీ పూజ భక్తిశ్రద్దలతో ఆచరించడం అలక్ష్మిని దూరం చేయడం దీపావళితో సంతోషాల పర్వం మనసులో నూతనోత్తేజం దీపారాధన చేయడంతో ప్రారంభం… చిన్ని చిన్ని దీపాల వరుసతో తైల దీపాలను వెలిగిస్తూ, భక్తితో భగవంతుడికి నమస్కరించడంతో చుట్టూ ఉండే పరిసరాలలోని గాలిలోకి మంచి గాలి తోడు అయ్యే విధంగా పూర్వపు దీపాల వరుస ప్రకృతికి మేలు చేయడానికే అన్నట్టుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే […]

తెలుగు నాట దీపావళి పండుగ

తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి. ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా అవతారం స్వీకరించింది. కృష్ణుడికి ఆమె భార్య అయ్యింది. వరప్రసాదం వలన నరకుడు తనకన్నా శక్తివంతుడు లేడని లోకంలో […]

దీపావళి శుభాకాంక్షలు తెలుగులో దివాలి విషెస్ కోట్స్

వెలుగు ఇచ్చే దీపం సైజు చిన్నదే కానీ దాని వెలుతురు గదంతా వెదజల్లుతుంది. దీపం వెలుగు ఇచ్చినట్టే, జీవితం కూడా మరొక జీవితానికి దారి చూపుతుంది. మానవ జీవన మనుగడ అంతా ఒకరు మరొకరితో జతకట్టి ధర్మబద్దంగా జీవిస్తూ మరొక ధార్మిక జీవితానికి పునాది వేస్తూ… తమ జీవిన ప్రయాణం మోక్షపదానికి చేరడమే మనుజుని లక్ష్యం అయితే అటువంటి జీవన ప్రయాణానికి దారి చూపించే వెలుగు మనిషిలో ఉండే చైతన్యమంటారు. అటువంటి చైతన్యమే విశ్వమంతా నిండి ఉంటే, […]

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం? వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక క్రమశిక్షణ దోహదపడుతుంది. ఒక వ్యక్తి సామాజిక స్థితిని ఆర్ధిక పరిస్థితి శాసిస్తుంది. సమాజంలో గౌరవం వ్యక్తి యొక్క ఆర్ధిక స్థితి ఆధారంగా ఉంటుంది. కుటుంబ జీవనంలో ఆర్ధిక వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. సామాజిక […]

మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని

మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని అడ్డుపెట్టుకుని, మనసుపై పట్టు సాధించడం వలన స్వీయ నియంత్రణ పెరుగుతుందని అంటారు. మనిషికి మనసే బలం మనసే బలహీనత అంటారు. విద్యార్ధి దశలో చిన్న చిన్న పొరపాట్లే అలవాట్లుగా మారకుండా జాగ్రత్తపడాలి. నేర్చుకుంటూ ఏవో కొన్ని విషయాలను అలవాటుగా మార్చుకునే గుణం మనసుకు విద్యార్ధి దశలో ఉంటే, మంచి విషయాలలో ఆసక్తి అలవాటుగా మారితే, అవి జీవితానికి ఉపయోగపడతాయని అంటారు. రోజూ ఆడుకోవడం ఇష్టం కాబట్టి ప్రతిరోజూ ఆట ఆడుకునే సమయానికి […]

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది. ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావులలో ధర్మరాజు గొప్పవానిగా కీర్తింపబడ్డాడు. క్షత్రియ ధర్మం ప్రకారం రాజ్యాధికారిగా ఉండేకాలంలో రాజుగా ఉండాలి కాబట్టి శ్రీకృష్ణునితో ధర్మరాజు చెప్పే మాటలు […]

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు కూడా అమ్మ సంతోషం కోసం అమ్మ చేత కట్టబడ్డాడు… కాబట్టి తల్లి సంతోషం కన్నా కొడుకు సాధించేదేముంటుంది? […]

చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం

పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు… పాఠశాలలు ప్రత్యేకించి క్రమపద్దతిలో పాఠ్యాంశాలు బోధించడానికి ఉంటే, స్మార్ట్ ఇష్టానుసారం విషయ సంగ్రహణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్మార్ట్ ఫోన్ తగదని అంటారు. కానీ కొన్ని పరిస్థితులలో హోమ్ వర్క్ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే… ఎంతవరకు దానిని వాడుకోవాలి? కొందరు విద్యార్ధులు పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సెర్చ్ చేయడం చేస్తూ ఉంటారు. కూడికలు చేయడానికి […]

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు ఉంటే, వారిని సమర్ధులుగా లోకం కీర్తిస్తుంది. కానీ వీరు ఎవరో గుర్తిస్తారని తల్లిదండ్రుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేయరు. తమ తల్లిదండ్రులపై వారికి గల ప్రేమకొలది, తమ తల్లిదండ్రులకు సహాయకులుగా మారతారు. మనదేశంలో వ్యవసాయ ఆధారిత ఉపాధి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్ధికంగా మద్యతరగతి కుటుంబీకులు సాదారణ ఉద్యోగస్తులుగా జీవన సాగిస్తూ ఉంటారు. ఇంకా ఆర్ధికంగా దిగువ మద్యతరగతి కుటుంబాలలో భార్యభర్తలిరువురు కుటుంబ పోషణకు జీవనోపాధి కోసం పాటు పడుతూ […]

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. కేవలం వృత్తి పనితో బాటు తగిన చదువు ఉంటే, వ్యక్తి తనకు వచ్చిన పనితోనైనా జీవనం కొనసాగించగలడు. లేదా ఇతర కార్యాలయములలో ఉపాధి అవకాశాలు చూసుకోగలడు. కావునా […]

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు. ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మ విషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే, అమ్మ పంచిన ప్రేమను తరిచి చూస్తే చాలు… పదాలు ప్రవహిస్తూ పేరాలుగా ఏర్పడుతూ పేజీలకు పేజీలు పెరుగుతూనే […]

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద కుటుంబాలు తక్కువగానే ఉంటున్నాయని అంటూ ఉంటారు. సాదారణంగా చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. కారణం పెద్ద కుటుంబాల వలన పెత్తనం ఉండే పెద్దవారి చాదస్తంతో చిన్నవారు ఇబ్బందులు ఎదర్కొంటున్నారనేది ఒక సమస్యగా ఏర్పడడంతో ఇటువంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చును. ఇంకా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ నినాదం కూడా పుట్టడానికి కారణం తక్కువమంది […]

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం. స్మార్ట్ ఫోను వాడుక సర్వ సాధారణం అయింది. అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోను ఉంటుంది. కారణం స్మార్ట్ ఫోను ఉపయోగించి సులభంగా కొన్ని పనులు చేయొచ్చు… ఇతరులతో చూస్తూ మాట్లాడుట, మెసేజ్ చేయడం, ఫోటోలు వీడియోలు ఎడిట్ సోషల్ మీడియాలో పెట్టడం ఇలాంటివి వ్యక్తిగత అభిరుచులు బట్టి ఉంటాయి. డబ్బులు పంపించడం, కరెంట్ బిల్ పే చేయడం, లొకేషన్ షేర్ చేయడం వంటివి అవసరాన్ని బట్టి స్మార్ట్ […]

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు. దీపావళి పండుగ ప్రతియేడాది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ అమావస్యనాడు వస్తుంది. ఇంగ్లీషు కేలండర్లో ఒక్కోయేడాది ఒక్కో తారీఖున వస్తుంది. అయితే ఎక్కువగా నవంబర్ మాసంలోనే ఈ దీపావళి పండుగ వస్తుంటే, దీపావళి ఎందుకు చేసుకుంటారు? పురాణ ప్రవచనాలు లేదా పురాణ కధనాలు ప్రకారం నరకాసురుని వధించిన తర్వాతి రోజు లోకాన్ని పట్టి పీడించిన నరకాసురుడు మరణం సందర్భంగా సాధు జనుల సంతోషంగా దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటున్నట్టుగా చెబుతారు. […]

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా… ఇది వంటబట్టించుకున్న వ్యక్తి అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అందరితో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఆ మాటలోనే చాలా ఆంతర్యం ఉంటుంది. పోరు అంటే పోరాటం లేక యుద్ధం అంటారు. పొందు అంటే సఖ్యత, స్నేహం, […]

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి వంటిది అంటారు. మనిషి ఒక వనరుగా ఉంటే, మానవ వనరు అంటే, ఒక సంస్థకు పనిచేసే మనుషులను మానవ వనరులు అంటే, ఒక సంస్థలో నియమితులైన సిబ్బందినే హ్యుమన్ రిసోర్సెస్ అంటారు. సంస్థకు ఉండే […]

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు చుట్టూనే ఈ తల్లిదండ్రుల బంధం పెనవేసుకుని ఉంటుంది. వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారసత్వంగా ఆస్తిని ఆచారాన్ని అందిస్తారు. వారిని వీరు చూస్తున్నంతకాలం వృద్దులకు కూడా కుటుంబంలో పిల్లలవలె అనిపిస్తారు. పిల్లలను చిన్ననాటి […]