ఇతిహాసం మహాభారతంలోని పర్వాలు పేర్లు

మహా భారతంలోని పర్వాలు పేర్లు. మహా భారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి. మహాభారతం రాసింది ఎవరు అంటే సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారత రచన చేస్తే, ముగ్గురు తెలుగు కవులు తెలుగులోకి అనువాదం చేశారు. ఈ పద్దెనిమిది పర్వాలను కవిత్రయంగా పిలవబడే నన్నయ్య, తిక్కన, ఎఱ్ఘాప్రగడ తెలుగులోకి అనువదించారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

జయ సంహిత అను నామము మహాభారతం మరొక పేరు అంటారు. మహాభారతం చదువుతుంటే, మనసుకు జయం కలుగుతుందని అంటారు. ఎన్నో రకాల స్వభావాల గురించి, మహాభారతం రీడ్ చేయడం వలన తెలియబడుతుందని చెబుతారు. కాబట్టి మనసులో మంచి చెడుల నియంత్రణ చక్కగా నిర్వహించుకునే శక్తి మహాభారతం చదివినవారికి ఏర్పడుతుందని అంటారు. మహాభారతం వచనంలో వ్రాయబడిన బుక్స్ మనకు ఆన్ లైన్లో లభిస్తాయి.

తెలుగులో మహాభారతం వచనం తెలుగు బుక్ ఫ్రీగా డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ లేదా టచ్ చేయండి.

ధర్మం తెలిసిన వ్యక్తి పెద్దగా ఉంటే, అతనిని అనుసరంచేవారికి కూడా రక్షణ ఏవిధంగా ఉంటుందో మహాభారతం రీడ్ చేయడం వలన తెలియబడుదుంది. ఎంతటి శక్తి ఉన్నా ధర్మం పాటించకపోతే, శక్తివంతులు కూడా పతనం కాక తప్పదనే భావన మహాభారతం చదివితే అవగతం అవుతుంది. అధర్మం ప్రక్కన మహామహులు నిలబడినా, ధర్మం ప్రక్కన భగవంతుడే నిలబడతాడు… ధర్మవిజయం జరిగేవరకు అండగా ఉంటాడని మహాభారతం పఠనం వలన తెలియబడుతుంది.

మహాభారతం చదివితే, మన మన:స్థితి గురించి మనకు బాగా అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుందని అంటారు.

ఇతిహాసం మహా భారతంలోని పర్వాలు పేర్లు

ఆది పర్వము

సభా పర్వము

అరణ్య పర్వము

విరాట పర్వము

ఉద్యోగ పర్వము

భీష్మ ప

ద్రోణ పర్వము

కర్ణ పర్వము

శల్య పర్వము

సౌస్తిక పర్వము

స్త్రీ పర్వము

శాంతి పర్వము

అనుశాసన పర్వము

అశ్వమేధిక పర్వము

ఆశ్రమ వాసిక పర్వము

మౌసల పర్వము

మహా ప్రస్థాన పర్వము

స్వర్గారోహణ పర్వము

ఇలా పద్దెనిమిది పర్వముల మహా భారతంలో నుండి శ్రీమధ్భాగవతం ప్రత్యేకత కలిగి ఉంటుంది. భగవద్గీత భగవానుడు నరుడికి బోధించిన గీత. మహా భారత యుద్ద ఆరంభంలోనే భగవంతుడి చేత చెప్పబడింది కావునా భగవద్గీతగా పిలువబడుతుంది.

ఇంకా చివరగా హరివంశము కూడా చెప్పబడుతుంది. శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణ వంశము గురించి ఇందులో వివరించబడి ఉంటుంది.

మహా భారతంలోని పర్వాలు పేర్లు ఉప పర్వాలతోనూ, ఉపాఖ్యానాలు కలిగి ఉంటాయి. ఒక కాలం నుండి మరొక కాలంలోకి కధలు మన మనసుని తీసుకుపోతూ ఉంటాయి.

ఆది పర్వము

ఆదిపర్వములో మహా భారతము గురించి సంగ్రహముగా చెప్పబడుతుంది. ధర్మరాజాదుల, దుర్యోధనాదుల పుట్టుకకు ముందు జరిగిన అనేక సంఘటనలు అనేక కారణాలను ఉటంఘిస్తూ అనేక ఉపాఖ్యానాలు మహా భారతంలో ఉంటే, ఆది పర్వములో ఎక్కువగా కనబడతాయి. భీష్మ, ద్రోణ, కర్ణ ప్రముఖుల పుట్టుకకు కారణాలు, సంఘటనలు వివరించబడతాయి. పాండురాజు శాపం పొందడం, కౌరవులు, పాండవుల పుట్టుక, బాల్యంలోనే వారి మద్య తగాదాలు, ధర్మరాజు యువరాజుగా పట్టాభిశక్తుడు కావడం. పాండవులను లక్క ఇంట్లో తగలబెట్టడానికి దుర్యోధనుడు కుట్ర పన్నడం, విదురుని సూచన మేరకు పాండవులు లక్క ఇంటి నుండి బయపడడం, ఘటోత్కచుడు జననం, పాండవులు బ్రాహ్మణ రూపంలో ఏకచక్రపురంలో కాలం గడపడం. ఏకచక్రపురంలో భీముడు బకాసురుడుని మట్టుబెట్టడం, అర్జునుడు ద్రౌపదిని స్వయం వరంలో గెలవడం. పంచపాండవులు ద్రౌపదిని వివాహమాడుట, శ్రీకృష్ణ ప్రవేశం. కౌరవులకు, పాండవులకు రాజ్య పంపకం. ధర్మరాజు పట్టాభిషేకం. ఇంద్రప్రస్థం నిర్మాణం, కృష్ణార్జునులు ఖాండవదహనం చేయడం. మయసభ నిర్మాణం తదిరత ఉపాఖ్యానాలు ఉంటాయి.

సభా పర్వము

ఇంద్రప్రస్థమును పరిపాలిస్తున్న ధర్మరాజుకు నారదుడు రాజసూయ యాగ ప్రతిపాదించడం. ఆ యాగమును ధర్మరాజు తలపెట్టడం జరుగుతుంది. దానికి గాను భీమాదులు నలుగురు నలు దిక్కులకు వెళ్లి రాజులను జయించడం జరుగుతుంది. మహా భారత యుద్దానికి బీజాలు బలపడడానికి కారణం ఈ సభాపర్వములోని వివిధ సంఘటనే కారణం అవుతాయి.

రాజసూయ యాగంలో ధర్మరాజు ప్రభ చూసి అసూయతో రగిలిపోయే ధుర్యోధనుడికి మయసభలో అవమానంగా అనిపించడంలో యుద్దానికి మరింతగా భావనలు బలపడతాయి. ఇక ఆపై శకుని వ్యూహంలో భాగంగా ధర్మరాజును జాదానికి ఆహ్వానించడం, జూదంలో ధర్మరాజు అపజయం పొందడం, తనను ఓడిపోయి, తనతో బాటు అందరినీ కోల్పోవడం, నిండు సభలో ప్రతివ్రతను అవమానించడం జరిగిపోతుంది. తత్ఫలితంగా భీముడి శపధాలు అన్నదమ్ముల మద్య వైరమును మరింతగా పెంచుతాయి. ఇంకా మరొకమారు జూదము జరుగుట అందులోనూ పరాజయం పాలైన ధర్మరాజాదులు కానలకు పోవుట జరుగుతుంది.

అరణ్యపర్వము – మహా భారతంలోని పర్వాలు పేర్లు

అనేకమంది బ్రాహ్మణులతో ధర్మరాజాదులు అడవిలోకి చేరడం. సూర్యుని ప్రార్ధించి, ధర్మరాజు అక్షయపాత్రను పొందడం జరుగుతుంది. రాబోవు యుద్దంలో పాండవుల బలం పెరగడానికి వ్యాసుడు, నారదుడు, కృష్ణుడు వంటి వారు సలహాలు, సూచనలు చేయడం అరణ్య పర్వంలో జరుగుతుంది. అర్జునుడు పరమశివుని కోసం తపస్సు చేయడం, ఆ మహాదేవుడిని నుండి పాశుపతాస్త్రం పొందడం జరుగుతుంది. ఆపై అర్జునుడు ఇంద్రుడి వద్దకు వెళ్ళడం, అక్కడ ఊర్వశితో శాపానుగ్రహం పొందడం జరుగుతుంది. ఈ అరణ్య పర్వంలోనే నలదమయంతుల ఉపాఖ్యానం వస్తుంది. పాండవులు తీర్ధయాత్రలు చేయడం, దుర్యోధనాధులు పాండవులను అవమానించే ప్రయత్నంలో ఘోష యాత్రచేసి వారే అవమానం పాలవ్వడం జరుగుతుంది.

ఈ అరణ్యపర్వములోనే ఒక ప్రక్క పాండునందనుల బలం పెరుగుతూ ఉంటే, మరొక ప్రక్క దుర్యోధనుడి చుట్టూ ఉన్నవారి బలం బలహీనపడడానికి అవసరమ్యే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పైకి అభేద్యంగా కనబడే యోధలు మరణానికి మార్గములు ఏర్పడుతూ ఉంటాయి. అరణ్యపర్వములోనే ధర్మమునకు కట్టుబడి ఉంటే, పరోక్షంగా కాలం ఎలా సహాయపడుతుందో బాగా తెలియబడుతుంది.

విరాటపర్వము

అరణ్యపర్వములో పాండవులకు పరోక్షంగా సహాయం అందితే, విరాట పర్వములో బౌతికంగా వారికి మరింత బలం పెరగడానికి, పాండవుల శక్తి సామర్ధ్యముల గురించి మరింతగా కౌరవులకు తెలియబడుటకు విరాటపర్వము సహాయపడుతుంది. అజ్ఙాతవాసంలో భాగంగా పాండవులు మారు రూపంలో విరాట రాజు వద్ద పనిలో చేరతారు. అక్కడ కీచక వధ జరుగుతుంది. పరస్త్రీ వ్యామోహంతో కీచకుడు మరణిస్తాడు. కౌరవులు గోగ్రహణం చేయడానికి ప్రయత్నించడం, పాండవులు వాటిని అడ్డుకోవడం, పాండవుల ఉనికిని కనుగొన్నట్టుగా దుర్యోధనుడు భావించడం జరుగుతుంది. అయితే ధర్మనందనుడు మాటతో తన అభిప్రాయం తప్పని దుర్యోధనుడు గ్రహిస్తాడు. విరాట రాజు కూతురుని అర్జునుడు కొడుకు అయిన అభిమన్యుడుకు భార్యగా స్వీకరిస్తాడు.

ఉద్యోగపర్వము

సంజయుడి మనోగతము ద్వారా దృతరాష్ట్రుడి ఆలోచనను గ్రహించిన ధర్మరాజు, క్షత్రియధర్మమును అనుసరించి, కనీసం ఐదు ఊళ్ళును కోరుతాడు. అందుకు హితమును స్వీకరించే గుణములేని దుర్యోధనుడితో సంధి కోసం ధర్మరాజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకు శ్రీకృష్ణుడునే రాయబారిగా ఎంచుకుంటాడు. వినేవానికి వ్యక్తి చెప్పిన సరిపోతుంది కానీ విననివానికి భగవంతుడే చెప్పిన హితము కర్ణమునకు చేరదు. కాబట్టి శ్రీకృష్ణరాయభారము విఫలమై యుద్దమునకు పరిస్థితులు స్వాగతం చెబుతాయి. ఇందులో భాగంగానే ఇరు పక్షాలు తమ తమ ప్రయత్నాలు సాగిస్తాయి. పాండవుల పక్షపాతి అయిన శల్యుడిని ధుర్యోధనుడు ఆకర్షించడం జరుగుతుంది. శ్రీకృష్ణుడిని తన సారధిగా అర్జునుడు పొందడం జరుగుతుంది. ఇలా యుద్ధంలో ఎవరెవరు ఎటువంటి పనులకు నియోగించుకోవాలో అందుకు తగు ప్రయత్నములను ఉద్యోపర్వములో చూడవచ్చును.

భీష్మపర్వము

మహాభారత యుద్దము పద్దెనిమిది రోజులు జరిగితే, అందులో పదిరోజులపాటు యుద్ధాన్ని కొనసాగించింది భీష్ముడే. పది రోజుల యద్ధానంతరం శిఖండి వలన భీష్ముడు అస్త్రసన్యాసం చేస్తాడు. తత్ఫలితంగా భీష్ముడి శరీరం శరములో నిండిపోతుంది. యుద్దరంగంలోనే భీష్ముడు బాణములపై పండుకుని ఉంటాడు. అర్జునుడు తన బాణములతో చేసిన తలగడ ఆధారంగా భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

ద్రోణపర్వము

భీష్ముడి సైన్యాధ్యక్షుడిగా లేకపోవడంతో, ద్రోణుడు కురు సైన్యానికి అధ్యక్షుడవుతాడు. వెంటనే దుర్యోధనుడికి ఏమి కావాలో కోరుకోమనగానే, దుర్యోధనుడు ధర్మరాజను ప్రాణాలతో పట్టివ్వమని ద్రోణుడిని అడుగుతాడు. అందుకు ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. ఈ పద్మవ్యూహంలోనే అభిమన్యుడు మరణించి, ధర్మరాజు కౌరవులకు చిక్కకుండా కాలం కాపాడుతుంది. చివరికి ధర్మరాజు తొలిసారి అసత్యమాడే ప్రయత్నంలో భాగంగా ద్రోణుడు కూడా అస్త్రసన్యాసం చేయడం, అతను మరణించడం జరిగిపోతుంది.

కర్ణపర్వము

ద్రోణుడు తర్వాత ఆ స్థానంలో వచ్చిన కర్ణుడు యుద్ధాన్ని కొనసాగిస్తాడు. అయితే కర్ణుడు తన సారధి శల్యుడి వలన అనేక మాటలను పడతాడు. కర్ణార్జునుల యుద్ధం జరుగుతుంది. అయితే కర్ణుడి స్వయంకృతాపరాధల వలన తెచ్చుకున్న శాపాలు అన్నీ యుద్దరంగంలో కర్ణుడికి ప్రతిబంధకాలవుతాయి. తత్కారణంగా కర్ణుడి మరణం కూడా అర్జునుడి చేతుల మీదుగా జరిగిపోతుంది.

శల్యపర్వము

యోధులందరూ ఒక్కొక్కరిగా పడిపోవడం దుర్యోధనుడికి వేదననే మిగుల్చుతుంది. కర్ణుడి స్థానంలోకి వచ్చిన శల్యుడు ఘోరమైన యుద్దమే చేస్తాడు చివరికి ధర్మరాజు చేతిలో మరణిస్తాడు.

భీముడు దుర్యోధనుడు తొడలను పగులగొట్టి ప్రతిజ్ఙ నెరవేర్చుకుంటాడు.

సౌప్తికపర్వము

అశ్వద్ధామ కోపంతో పాండుపుత్రులైన ఉపపాండవులను చంపేస్తాడు. అయితే ఉపపాండవులు నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగడతాడు. ఈ దారుణం విన్న తర్వాత దుర్యోధనుడు మరణిస్తాడు. తర్వాత అశ్వద్దామ బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉత్తర గర్భంపై చేస్తాడు. ఉత్తర గర్భంలోని శిశువుని ఉత్తర ప్రార్ధన మేరకు కృష్ణ భగవానుడు రక్షిస్తాడు.

స్త్రీపర్వము

అధర్మప్రవర్తన కలిగినవారికి, వారిని నమ్మి వచ్చిన స్త్రీలకు ఎటువంటి గతి పడుతుందో స్త్రీ పర్వములో కనబడుతుంది. కురుక్షేత్ర యుద్దంలో చనిపోయిన రాజుల భార్యలందరూ యుద్దరంగానికి వస్తారు. ఇక్కడే గాంధారికీ వ్యాసుడు చూపు ప్రసాదిస్తాడు. అయితే తన కుమారులు మరణించడం, కోడళ్ళ దుంఖం చూసిన గాంధారీ కోపం కట్టలు తెంచుకుంటుంది. దీనికంతటికీ మూల కారణం కృష్ణుడని భావించి, కృష్ణుడితో సహా యాదవులందరూ నశించాలని శపిస్తుంది.

శాంతిపర్వము

కర్ణుడి జన్మవృత్తాంతం ధర్మరాజుకు తెలియడంతో, ధర్మరాజు మనసు చలించి, పట్టాభిషేకానికి అంగీకరించకపోవడం జరుగుతుంది. అందరూ అనేక కారణాలను చెప్పి ధర్మరాజును పట్టాభిషేకానికి ఒప్పిస్తారు. భీష్ముడు దగ్గర ధర్మరాజు అనేక ధర్మముల గురించి తెలుసుకుంటాడు.

అనుశాసనపర్వము

భీష్ముడు – ధర్మరాజు మద్యలో జరిగిన మంచి మాటల వాదన ఈ పర్వములో ఉంటుంది. ఇక్కడే విష్ణు సహస్రం భగవానుని చూస్తూ భీష్ముడు చెప్పడ జరుగుతుంది. ఈ తర్వాత భీష్మ మరణం జరుగుతుంది.

అశ్వమేధికపర్వము

అశ్వమేధ యాగము తలపెట్టుట, సోదరుల సాయంతో ధర్మరాజు అశ్వమేధయాగమును విజయవంతం చేయుట జరుగుతుంది. బ్రాహ్మణ గీత అర్జునుడికి శ్రీకృష్ణుడి చేత ఉపదేశింపబడుతుంది.

ఆశ్రమవాసికపర్వము

ధృతరాష్ట్రుడు, గాంధారి అడవులకు ప్రయాణం. కుంతీదేవి కూడా వారిని అనుసరించడం జరుగుతుంది. సంజయుడు హిమాలయాలకు వెళ్ళుట జరుగుతుంది.

మౌసలపర్వము

గాంధారి శాప ఫలితంగా యదువంశం నశించడం జరుగుతుంది. శ్రీకృష్ణ నిర్యాణం జరగడంతో అర్జునుడి అస్త్ర విద్య ప్రభావం పోతుంది. పాండవులకు శ్రీకృష్ణ నిర్యాణం తీవ్రవిచారం కలుగుజేస్తుంది.

మహాప్రస్థానికపర్వము

పరీక్షత్తుకు పట్టాభిషేకం జరుగుతుంది. ధర్మరాజాధులు ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయడం వారి వెనకు ఒక కుక్క కూడా రావడం జరుగుతుంది. కుక్కరూపంలో ఉన్న యమదర్మరాజు పరీక్షలో ధర్మరాజు నెగ్గడం జరుగుతుంది.

స్వర్గారోహణపర్వము

స్వర్గంలో కూడా ధర్మరాజు తన సోదరుల కోసం చూడడం, సోదరుల కంటే ముందుగా దుర్యోధనుడు స్వర్గంలో ధర్మరాజుకు కనబడడం. అందుకు తగు కారణములు తెలియబడడం జరుగుతుంది. చివరికి ధర్మరాజుకు స్వర్గంలో తన సోదరులు, బంధు మిత్రులు కనబడడం జరుగుతుంది.

ఇతి ఐతిహ్యం… ఇది ఇలానే జరిగింది… వ్యాసుడు రచించిన మహాభారతం పద్దెనిమిది పర్వాలు కలిగి ఉంటే, అందులోని భగవద్గీత మహామాయను పొగొట్టే జ్ఙానంగా చెప్పబడుతుంది. అజ్ఙానం నుండి దూరంగా జరగడానికి భగవద్గీత పఠనం ఉపయుక్తం అంటారు.

భగవంతుడు భక్తునికి చెప్పిన గీత భగవద్గీత. భగవంతుడు ధర్మరాజుకు జయం కట్టబెట్టడానికి పూనుకున్న గాధ మహాభారత గాధలు. మహాభారతం పఠనం చేయడం వలన మనసు మంచి మార్గములోకి మళ్లడానికి మంచి ప్రయత్నం అంటారు.

భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని

భగవద్గీత తెలుగులో శ్లోకాలు రీడ్ చేయడం వలన భక్తీ భావం బలపడుతుంది.

మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?

మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి

పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన..

తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి.

ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి…

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా

ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

మన మహనీయుడు వేమన యోగి

పివి నరసింహారావు మన మహనీయుడు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానం.

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది

తెలుగు అమ్మ వంటిది అమ్మ లేని జీవితం ఉండదు మాతృభాష

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

ప్రతీకారం తీర్చుకున్న యువతి అంబ -మహాభారతం-బామ్మ చెప్పిన పురాణకధలు 

నేను మా బామ్మ ద్వారా విన్న పురాణకధలు మహాభారతం – శంతన మహారాజు-2

నేను మా బామ్మ ద్వారా విన్న పురాణకధలు – మహాభారతం -శంతన మహారాజు