తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

పర్యాయ పదాలు అంటే ఒక పదమును వచ్చే భావమే ఇతర పదాలకు అనువర్తించబడుతుంటే పర్యాయ పదాలు అంటారు. కొన్ని పదాలు ఒకే అర్ధాన్నిస్తాయి… అటువంటప్పుడు ఆ పదాలలో ఏపదాన్నైనా ఉపయోగిస్తూ వ్యాక్యము పూరించవచ్చును. తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

దివ్వె పర్యాయపదాలు దీపము, దివ్యము, దీవె, దివిటీ, కాగడా, జ్యోతి, గృహమణి, ఇలాయి, దీపిక, తిల్లిక…

చంద్రుడు పదానికి పర్యాయ పదాలు జాబిల్లి, సోముడు, వెన్నెలరేడు, ఇందుడు, హిమాంశువు, సుదాంశుడు, ఓషధీశుడు, శశిధరుడు, చందమామ, చంద్రముడు మొదలైన పదాలు.

వేగు పర్యాయ పదాలు చారుడు, గూఢాచారుడు, వేగులవాడు, అపసర్పుడు తదితర పదాలు.

చిటికెనవేలు పర్యాయ పదాలు చిట్టివ్రేలు, కనిష్టము, ఊర్మిక, పిల్లవ్రేలు తదితర పదాలు.

చెరువు పర్యాయ పదాలు తటాకము, నీటిగుంట, పద్మాకరము, సరస్సు తదితర పదాలు.

కాంతి పదానికి పర్యాయ పదాలు ప్రభ, ధామము, వెలుగు, జ్యోతి, ద్యుతి, వన్నె తదితర తెలుగు పదాలు.

సురభి పదానికి పర్యాయ పదాలు కామధేనువు, వేల్పుటావు.

దిక్కు పర్యాయ పదాలు దిశ, కడ, కకుభము, దెస

తెలుగులో ఈ విధంగా ఒక పదం ఇచ్చే అర్దమునే కలిగి ఉండే పదాలు మరికొన్ని పదాలు ప్రతి పదానికి ఉండే అవకాశం ఉంటుంది.

ఇంగ్లీషులో స్నేక్ అని పిలవబడే తెలుగులో భుజంగము అను పదానికి పర్యాయ పదాలు

భుజంగము, పాము, పన్నగము, ఫణి, శేషు ఇలా ఈ పదాలను ఏ పదాన్ని చూసినా పామే అంటారు.

అయితే పాము ఒక విష జంతువు. ఇది నేలపై మెలికలు తిరుగుతూ నేలపై పాకుతూ నడుస్తుంది. దీనికి భయం ఎక్కువ అలాగే పగబట్టే స్వభావం ఎక్కువ. దీని కోరలయందు విషం ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన విషం. పాము కాటుకు ప్రాణాపాయ ప్రమాదము ఉంటుంది.

భూమి తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

భూమి అంటే గ్రహముగా సామాన్య శాస్త్రములో చెప్పబడుతుంది. ప్రకృతిలో సకల జంతు జాలము జీవించడానికి అనువుగా ఉండే వాతావరణం కలిగినది భూమి. ముఖ్యంగా మనిషికి భూమిపై నివసించడానికి అనుకూలం. మనిషి మనుగడకు ఆధారం భూమి. ఇంకా భూమి అంతర్గతంలో అనే ఖనిజ సంపద కూడా దాగి ఉంది…

ధరణి, వసుధ, నేల, పృద్వి, మహి, పుడమి, ధరిత్రి, కాశ్యపి, సుధ, అచల, విశ్వంభర, క్షితి, ఉర్వి, అవని, రత్నగర్భ, ధాత్రి, అచల తదితర తెలుగు పదాలు భూమికి పర్యాయ పదాలుగా ఉంటాయి. ఇన్ని పదాలు పర్యాయ పదాలుగా ఉండడం అంటే అన్ని రకాలుగా భూమి నుండి మనిషికి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

పార్వతి పర్యాయపదాలు కాత్యాయనీ, ఉమాదేవి, గౌరీ, హైమవతి, శైలజ, రుద్రాణి, ఈశ్వరి, అపర్ణ, దుర్గ, అంబిక, కాళీ, ఈశ్వరి, గిరిజ, దాక్షాయని, నారాయణీ, ముక్కంటివెలది…

కరము పదానికి చేయి, కిరణం, తొండం తదితర పదాలు చెబుతారు.

అర్ధి పదానికి యాచకుడు, సేవకుడు, ధనవంతుడు తదితర పదాలు చెబతారు.

వనం పదానికి తోట, అడవి మొదలైన పదాలు.

పావురవము పర్యాయపదాలు కపోతము, కలరవము, పావురాయి…

శరీరము తెలుగు పదానికి పర్యాయ పదాలు

కాయము, తనువు, దేహం వంటి పదాలు శరీరం వలె ఒకే భావమును కలిగి ఉంటాయి. పుడుతూ కలిగి ఉండే ఆకృతి రూపము మార్చుకుంటూ వృద్ది చెందుతూ తిరిగి నశించే స్వభావము ఉండే ప్రకృతి పదార్ధములతో కూడి ఉండేది అంటారు. ఒక యంత్రము వలె ఆహారమును స్వీకరిస్తూ, పెరుగుతుంది. పెరిగిన శరీరము నశించే స్థితికి కాలంలో చేరుతుందిద. భూమిపై పుట్టి పెరిగే చలన జీవరాశికి ఉండేది. శరీరము పర్యాయ పదాలు అంగము, బొంది, మేను, దేహము, కాయము, ఒడలు మొదలైన పదాలు.

ఛాయ పదానికి పార్వతి, నీడ, పోలిక పదాలు చెబుతారు.

కులము పదానికి వంశము, జాతి, ఇల్లు తదితర పదాలు చెబతారు.

సముద్రం పదానికి సాగరం, తోయధి, కడలి, జలది తదితర తెలుగు పదాల.

అనృతం పదానికి పర్యాయ పదాలు అసత్యం, అబద్దం మొదలగు పదాలు.

కంకణం పదానికి చేతికి ధరించే ఆభరణం అంటే తోరము వంటి పదాలు.

గుడి తెలుగు పదానికి కోవెల, ఆయతనము, ఆలయం, దేవాలయం, దేవళము మొదలైన పదాలు.

భార్య తెలుగు పదమునకు పర్యాయ పదాలు

వివాహం జరిగిన స్త్రీ యొక్క బంధాన్ని భార్యగా పిలుస్తారు. ఎవరితో వివాహం జరిగనదో వారి భార్యగా సంభోదించబడుతుంది. కుటుంబంలో భర్తకు సహదర్మచారిణిగా ఉంటూ, ఇంటిని చక్కపెట్టే స్త్రీని భార్య అంటారు. ఈమెనే జీవిత భాగస్వామిగా ఉంటుంది. వివాహ ధర్మములో భార్యపాత్ర ప్రధానమైనది. భర్తను అనుసరిస్తూ కుటుంబంలో పిల్లల వృద్దికి తనవంతు ప్రయత్నంలో దోషంలేకుండా చేస్తుంది.

మన తెలుగు భాషలో భార్యకు పర్యాయ పదాలు పత్ని, సతి, అర్ధాంగి, ఆలు, ఇల్లాలు, గృహిణి తదితర తెలుగ పదాలు భార్యకు పర్యాయ పదాలు.

తమస్సు పదానికి పర్యాయ పదాలు చీకటి, అంధకారం, తిమిరం తదితర పదాలు.

రైతు పర్యాయ పదాలు అంటే కర్షకుడు, హలకుడు, వ్యవసాయదారుడు…

మనిషి పర్యాయ పదాలు నరుడు, మానవుడు, వ్యక్తి, మర్త్యుడు మొదలైన పదాలు.

బుద్ది పదానికి పర్యాయ పదాలు మేధ, మేధస్సు, ప్రజ్ఙానం, ప్రజ్ఙ, మతి మొదలైన పదాలు.

యముడు తెలుగు పదమునకు పర్యాయ పదాలు

నరకాధిపతిని యముడుగా పిలుస్తారు. భూమిపై జీవించు జీవి యొక్క ఆయువు తీరిన తర్వాత ప్రాణములను గొనిపోవువానిగా యముడుని చెబుతారు. యమలోకంలో జీవుల పాపములకు తగు శిక్ష విధించువానికి సమవర్తి అనే నామమును కలిగి ఉంటాడు మరికొన్ని పేర్లతో యముడిని పిలుస్తారు.

అష్టదిక్కులలో దక్షిన దిక్కుకు అధిపతిగా చెప్బబడే యమునికి పర్యాయ పదాలు కాలుడు, సమవర్తి, పాశి, మృత్యువు, శమనుడు తదితర నామములో పిలవబడతాడు.

పాపము పర్యాయపదాలు కిల్బిషము, కలుషము, పంకము, దురితము, కల్మషము, దుష్కృతము, దోషము మొదలైన పదాలు.

మగువ పదానికి పర్యాయ పదాలు కాంత, ఇంతి, పడతి పదాలు.

తిండి పదానికి పర్యాయ పదాలు భోజనము, భుక్తి, ఆహారం, కూడు తదితర తెలుగు పదాలు.

పుస్తకము పర్యాయ పదాలు గ్రంధం, కావ్యం, పొత్తం తదితర పదాలు.

పారిజాతము పర్యాయ పదాలు మందారము, పారిభద్రము, పారజము.

గ్రామము పదానికి పర్యాయ పదాలు పల్లె, జనపదం తదితర పదాలు.

నిజం పర్యాయ పదాలు నిక్కము, సత్యము, వాస్తవం మొదలైన పదాలు.

తరువాత తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఇంగ్లీషులో నెక్ట్స్ అంటూ ఉంటారు. దానినే తెలుగులో తరువాత అంటారు. దాటవేసే సమయానికి తరువాత అంటూ చెబుతారు. ప్రస్తుతం నుండి దాటవేయడం. తరువాత చెబుతాను. తరువాత వస్తాను. తరువాత వెళ్తాను. తరువాత మాట్లాడుతాను. తరువాత చేస్తాను. తరువాత కలుస్తాను… అంటే క్రియను ప్రస్తుతములో కాకుండా భవిష్యత్తులో చేయబోయేదిగా చెప్పడానికి తరువాత అనే పదమును ఉపయోగిస్తూ ఉంటారు. తరువాత పదానికి పర్యాయ పదాలు అంటే తరువాయి, పిదప, పిమ్మట తదితర తెలుగు పదాలు…

సమూహం పదానికి పర్యాయ పదాలు బృందము, గుంపు, వివహం తదితర తెలుగు పదాలు.

స్మృతి పదానికి పర్యాయ పదాలు తలంపు, తలచుట, జ్ఙప్తి, ఎరుక, స్మరణ తదితర తెలుగు పదాలు.

కొడుకు పదానికి పర్యాయ పదాలు సుతుడు, కుమారుడు, పుత్రుడు, తనయుడు తదితర తెలుగు పదాలు చెబుతారు.

కూతరు పదానికి పర్యాయ పదాలు కుమార్తె, సుత, తనయి, పుత్రిక మొదలైన తెలుగు పదాలు.

ఉక్తి పర్యాయ పదాలు మాట, పలుకు, వచనము మొదలైన పదాలు.

సిరులు తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

సిరి అంటే లక్ష్మీ అంటారు. లక్ష్మీనే సిరిగా పిలుస్తారు. లక్ష్మీని అష్టలక్ష్మీగా కూడా కీర్తిస్తారు. అంటే ఎనిమిది రకాలుగా లక్ష్మీని చెబుతారు. లక్ష్మీ అంటే సంపద ఎనిమిది రకాల సంపదను అష్టలక్ష్మీగా అష్ట సిరులుగా చెబుతారు. లక్ష్మీని ఏకవచన పదంగా చూసినప్పుడు చాలా పదాలు వచ్చే అవకాశంగా ఉంది. అయితే బహువచనంగా చూసినప్పుడు సిరులు పదానికి కొన్ని పర్యాయ పదాలు….

శ్రీ, సొమ్ములు, సంపదలు, ఆస్తులు, ఐశ్వర్యములు, అష్టైశ్వర్యములు, విభూతులు, భగములు తదితర బహువచన పదాలు సిరులకు పర్యాయ పదాలుగా చెప్పవచ్చును.

కోపము పర్యాయ పదాలు ఆగ్రహము, క్రోధము, రోషము, కినుక తదితర తెలుగు పదాలు.

కొప్పు పదానికి పర్యాయ పదాలు సిగ, శిఖ, మౌళి మొదలైన తెలుగు పదాలు.

సంశయము తెలుగు పదానికి పర్యాయ పదాలు

సంశయము అంటే అనుమానము అర్ధము. దేహికి పుట్టే సంశయము కాబట్టి సందేహము అని కూడా అంటే ఒక కోణంలో ఇది ప్రమాదకరమైన మనోరుగ్మతగా చెబుతారు. మరొక కోణంలో పరిశోదనాత్మక మనోవికాసముగా కూడా చెబుతారు. మనిషి మనో దృష్టిని బట్టి భావము ఉండవచ్చును.

ఎక్కువగా అనుమానం పెనుభూతం అనే నానుడి ఉందంటే, ఇది మనసులో పుట్టినప్పుడు మనిషికి శాంతి దూరం అవుతందనే భావనకే బలం చేకూరుతుంది. ఈ సంశయము తెలుగు పదానికి పర్యాయ పదాలు అనుమానము, ఆంతకము, త్రుటి, శంక, సందేహము.

సంపద తెలుగు పదానికి పర్యాయ పదాలు – తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆస్తినే సంపద అంటారు. శాస్త్ర ప్రకారం సంపద అంటే సిరి అంటారు. సిరి అంటే పురాణ దేవత అయిన లక్ష్మీకి పర్యాయ పదం. లక్ష్మీనే అష్టలక్ష్మీగా చెబుతారు. సంపన్నమైన కుటుంబంలో పుట్టినవారు లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారిగా లోకం కీర్తిస్తూ ఉంటుంది.

లక్ష్మీ, సిరి, లచ్చి, భూతి, ఐశ్వర్యము, శ్రీ, కలిమి, విభూతి తదితర పదాలు సంపదగా చెబుతూ ఉంటారు. అయితే కేవలం ఒక నామవాచకంగా చూస్తే మరిన్ని పర్యాయ పదాలు ఉంటాయి. రమ, ఇందిరా, కమల అంటూ చాలా పదాలు ఉంటాయి.

సమయం తెలుగు పదానికి పర్యాయ పదాలు

ఆంగ్లములో టైమ్ తెలుగులో సమయం అంటారు. సమయాన్ని రెప్పపాటు సమయం నుండి సంవత్సరాల సమయం వరకు చెబుతూ ఉంటారు. రెప్పపాటు సమయం, రెప్పపాటు కాలం అంటూ ఉంటారు. కొన్ని నిమిషాల సమయం, ఒక పావుగంట సమయం, అర్ధగంట సమయం, ఒక గంట సమయం, కొన్ని గంటల సమయం అంటూ సమయాన్ని నిమిషాలలో గంటలలో చెబుతూ ఉంటారు.

దీనికి పర్యాయ పదాలు కాలం, సమయం, వ్యవధి, గడువు అంటూ చెబుతూ ఉంటారు.

బంగారం పదానికి పర్యాయ పదాలు

మానవ జీవనములో ఐశ్వర్యమునకు ప్రతీకగా ఒంటిపై బంగారం కనబడుతుంది. స్త్రీపురుషులు ఆభరణాలుగా ధరించే లోహములో బంగారం చాలా ప్రధానమైనది. బంగారంతో చేసిన ఆభరణములు వ్యక్తి హుందాగా సూచిస్తూ ఉంటుంది. విలువైన ఆభరణములు తయారు చేసే బంగారం భూమిలోనే లభిస్తుంది. ఈ బంగారానికి పర్యాయ పదాలు స్వర్ణము, పుత్తడి, పసిడి, సువర్ణము, కాంచనము, కనకము…

ప్రశంస పదానికి పర్యాయ పదాలు

కీర్తించడాన్ని ప్రశంస అంటారు. వ్యక్తి గొప్పదనాన్ని కానీ వస్తువు గొప్పదనాన్ని కానీ కీర్తిస్తూ చెప్పబడే భావమును ప్రశంసగా చెప్పబడుతుంది. గొప్పగా గుర్తింపబడుటగా చెబుతారు. ఉపయుక్తమైన పనులకు ప్రశంసలు పొందుట సహజంగా జరుగుతుంటుంది.

ఈ ప్రశంస పదానికి పర్యాయ పదాలు అంటే కీర్తి, పొగడ్త, గొప్పతనం వంటి పదాలు.

నాలుక పదానికి పర్యాయ పదాలు

జిహ్వ, అర్రు అను పదాలు నాలుకకు చెప్పినట్టే చెబుతారు. నోట్లో ఉండే నాలుక పదార్ద రుచిని తెలియజేస్తుంది. నోట్లో జరిగే జీర్ణ క్రియలో ఆహారమును జీర్ణం చేయడంలో నాలుక కీలకమైనది.

తగాదా పదానికి పర్యాయ పదాలు

మనుషుల మద్య తగువులు సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇద్దరి మద్య వచ్చే వివాదమును తగాదా అని అంటూ ఉంటారు. మాటలతో వచ్చే వాదులాటను తగాదా అని కూడా అంటారు. తగువు, గొడవ వివాదము, జగడము, రగడ, పోరు వంటి వాటిని తగాదాగా చెబుతారు. అయితే ఇవి యుద్ధం వంటివిగా కాకుండ వ్యక్తుల మద్యం ఉండే గొడవగా చిన్న చిన్న గొడవులనే తగాదాలు అంటారు.

కొండ పదానికి పర్యాయ పదాలు

భూమిపై ఎత్తుగా ఉండే ప్రదేశాలను కొండలు అంటారు. భూమికి సమాంతరంగా కాకుండా ఎక్కువ ఎత్తులో ఉంటూ, వాటిపై చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలతో కలసి కొండలు ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లో ఎత్తైన కొండ ఒక్కటైనా ఉంటుంది. కోరుకొండ, కోటప్పకొండ తదితర ఊళ్ళల్లో కొండలు ఉంటాయి. కొండకు పర్యాయ పదాలు కొండ, గిరి, అద్రి, శిఖరం, పర్వతం.

శివుడు పదానికి పర్యాయ పదాలు

పురాణములలో పరమేశ్వరునికి పేరు శివుడని. శివుడు అంటే జ్ఙానమని చెబుతారు. శివుడికి 108 నామాలు చెబుతారు. ఇంకా వెయ్యికిపైగా నామాలు చెబుతారు. శివుడు, హరుడు, రుద్రుడు, ముక్కంటి, ఈశ్వరుడు, శంకరుడు, పీనాకపాణి, మహేశ్వరుడు, చంద్రశేఖరుడు, నీలకంఠుడు, గరళకంఠుడు తదిరత పేర్లు చెబుతారు.

మేఘం పదానికి పర్యాయ పదాలు

వర్షించే గుణము కలిగిన మబ్బులు మనకు ఆకాశంలో దర్శనం అవుతూ ఉంటాయి. ఆకాశంలో కనిపించే మేఘమునకు పర్యాయ పదాలు అంటే మబ్బు, ధారధరము, జలధరము, అబ్దము, నీరదము, పయోధరము తదితర పదాలు చెబుతారు.

నీరు పదానికి పర్యాయ పదాలు

గంటకు గంటకు గ్లాసు నీరు తాగకుండా ఉండలేము. భూమిపై నివసించే ప్రతి జీవి కూడా నీటిని త్రాగితే మనగలవు. అలా జీవరాశికి ఉపయోగపడుతూ ఉండే నీరు భూమిపై ప్రవహిస్తూ సకల జీవరాశుల దాహం తీరుస్తుంది. అటువంటి నీరుని అనేక రకాలుగా పుస్తకాలలో కీర్తించేవారు ఉంటారు. నీటి గురించి పరిశోధనలు చేసేవారు ఉంటారు. జీవించడానికి అవసరమైన నీరు తెలుగు పదానికి పర్యాయ పదాలు… జలము, ఉదకము, నీరము, తోయము, పానీయము, జీవజనీయము తదితర తెలుగు పదాలు.

మహిషం పదానికి పర్యాయ పదాలు

మూర్ఖత్వమునకు మహిషం వంటిది అని పోలుస్తూ ఉంటారు. మహిష తెలుగు పదానికి దున్నపోతు అనే పదాన్ని పర్యాయ పదముగా చెబుతారు.

పురము పదానికి పర్యాయ పదాలు

రాజల కాలంలో రాణులకు ఉండడానికి అంత:పురము నిర్మించేవారు. అన్ని వసతులతో ఉండే అంత:పురములు నిర్మింపబడుతూ ఉండేవంటారు. పురము అంటే నివాసయోగ్యముగా ఉండే ప్రాంతము అయితే అందులో అనేకమంది నివాసం ఉండడానికి అనువుగా నిర్మింపబడుతుంది. కొన్ని ఊర్లకు కూడా పేరు చివర పురము ఉంటుంది. రామాపురము, సిరిపురము వంటివి. పురమునకు పర్యాయ పదాలు పట్టణము, ఊరు, ఇల్లు, శరీరము మొదలైనవి.

అమరుడు పదానికి పర్యాయ పదాలు

అమరుడు అంటే మరణమును జయించినవాడు. కాబట్టి మరణమును జయించినవాడిని మృత్యంజయుడు అని కూడా అంటారు. ఇంకా దేవుడు అని కూడా అంటారు. మరణములేనివానిని కూడా అమరుడు అంటారు. మనిషి అమరుడు అవ్వడం అంటే ఆత్మతో సంయోగం చెందే అహంకారం అంటారు. ఇలా అమరుడు పదానికి బహువచన పదంగా చూస్తే, దేవతలు, సురులు, త్రిదశులు తదితర పదాలు చెప్పవచ్చును.

విషం పదానికి పర్యాయ పదాలు

విషయంలో ‘య’ తీసివేస్తే విషం మిగులుతుంది. అలాగే మనసులో చేరిన విషయాలు చెడు విషయాలు అయితే చివరకు అవి విషమునే మిగులుస్తాయని అంటారు. విషమునకు పర్యాయ పదాలు హాలాహలము, గరళము మొదలైన పదాలు.

కాకి తెలుగు పదానికి పర్యాయ పదాలు వాయసము, అరిష్టము, చిరజీవి తదితర తెలుగు పదాలు అంటారు.

శోకం పదానికి పర్యాయ పదాలు

మిక్కిలి బాధ పొందిన వ్యక్తి పొందే అవేదనను శోకము అంటారు. ఇది కొన్నాళ్లపాటు మనిషిక సుఖశాంతులు లేకుండా చేస్తుంది కాబట్టి శోకము పదాన్ని చెబుతూ ఉంటారు. దీనిలాగే అర్ధము వచ్చేలా దు:ఖము, చింతన, చింత తదితర పదాలు వాడుతూ ఉంటారు.

సొగసు పదానికి పర్యాయ పదాలు సోయగం, సోకు

ఉప్పు పదానికి పర్యాయ పదాలు లవణము, కటకము, అబ్దము, క్షారము, సాముద్రము, వశిరము తదితర తెలుగు పదాలు

కష్టాలు పదానికి పర్యాయ పదాలు కడగండ్లు, బాధలు, ఆపదలు,

పాలు పదానికి పర్యాయ పదాలు

ఇంగ్లీషులో మిల్క్ తెలుగులో పాలు పదానికి పర్యాయ పదాలు ఔదస్యము, అవదోహము, పాడి, క్షీరం, సోమజం, గోరసం, పాయి తదితర తెలుగు పదాలు.

బ్రహ్మ పదానికి పర్యాయ పదాలు

ఈ సృస్ఠికి కర్తగా పిలవబడే బ్రహ్మ త్రిమూర్తులలో ఒకడు. ఈయన పరబ్రహ్మము ద్వారా నియమితుడవుతాడని పురాణ ప్రవచనం. బ్రహ్మ తెలుగు పదానికి పర్యాయ పదాలు విధాత, చతుర్ముఖుడు, హంసవాహనుడు, విధాత, కమలాసనుడు తదితర తెలుగు పదాలు.

ప్రాణము పదానికి పర్యాయ పదాలు ఉసురు, ఊపిరి, అసువులు తదితర తెలుగు పదాలు.

రహస్యము పదానికి పర్యాయ పదాలు గుప్తము, మంతనము, గూఢము, మర్మము, గోప్యము మొదలైన పదాలు చెబుతారు.

రోగము పదానికి తెలుగు పర్యాయ పదాలు జబ్బు, అస్తవ్యస్తము, వ్యాధి, సుస్తీ, అనారోగ్యము మొదలైన తెలుగు పదాలు.

దుస్తులు పర్యాయ పదాలు

ధరించేవాటిని దుస్తులు అంటారు. శరీరమును కప్పి ఉంటే బట్టలను దుస్తులు అంటారు. దుస్తులకు పర్యాయ పదాలు వస్ర్తాలు, వలువలు, గుడ్డలు మొదలైన పదాలు చెబుతారు.

కబురు పదానికి పర్యాయ పదాలు వార్త, గాద, సంగతి, వర్తమానము, ఊసులు తదితర తెలుగు పదాలు.

మెరుపు పదానికి పర్యాయ పదాలు ఆకాశంలో వానలు కురిసే మందు కానీ వానలు కురుస్తున్నప్పుడు కానీ శబ్దం కన్నా ముందే ప్రయాణం చేస్తూ ఆకాశంలో కనిపించే కాంతి పుంజం. సౌదామిని, నీలాంజన, మేఘవహ్ని మొదలైన పదాలు.

ఆలోచన పదానికి పర్యాయ పదాలు

ఇంగ్లీషులో థింకింగ్ ను తెలుగులో ఆలోచించడం అంటారు. ఆలోచించడం మనసు యొక్క సహజ లక్షణం. ఆలోచకు పర్యాయ పదాలు ఊహ, స్మరణ, తలంపులు తదితర తెలుగు పదాలు.

సమీపం తెలుగు పదానికి పర్యాయ పదాలు చేరువ, సన్నిహితం, దగ్గర వంటి పదాలు

ముగింపు పర్యాయపదాలు చాలించు, ముగించు, స్వస్తి తదితర పదాలు

సంవత్సరం పర్యాయ పదాలు ఏడాది, అబ్దం తదితర పదాలు.

మంచితనం పర్యాయపదాలు

మంచిని తలిచేవారిలో ఉండే గుణం గురించి మాట్లాడేటప్పుడు మంచితనం పదము వాడుతూ ఉంటాము. దీనికి పర్యాయపదాలు సౌజన్యం, సుజనత్వం.

ధనము పర్యాయపదాలు ద్రవ్యము, విత్తము, అర్ధము, పైకము, సొమ్ము, రొక్కము,

కోదండము పర్యాయపదాలు ధనుస్సు, చాపము, ధనువు, విల్లు, శరాసనము, కార్ముకము తదితర తెలుగు పదాలు.

ధైర్యము పర్యాయపదాలు ధృతి, బింకము, బిగువు, బెట్టు, చేవ మొదలైన పదాలు

శబ్దం పదానికి పర్యాయ పదాలు ధ్వని, నిననదము, రవము, నాదము, రొద, చప్పుడు, కూత, ఘోష, రంకె మొదలైన పదాలు

నది పదానికి పర్యాయపదాలు తరంగిణి, నదము, తటిని, శైవలిని, తరణీ, వరద, కడలివెలది, ఆపగ, నిర్ఘరిణి, హ్రాదిని మొదలైన పదాలు.

నమస్కారము పదానికి పర్యాయ పదాలు

పెద్దలకు, గౌరవనీయులకు, గురువులకు నమస్కరించడం చేస్తూ ఉంటాము. నమస్కారము వలన పెద్దల అనుగ్రహం సంపాదించగలం. ఈ నమస్కారమునకు పర్యాయపదాలు జోతము, గిడిగిడి, దండము, జేజే, ప్రణామము, దీవెనకోల, వందనము, చేమోడ్పు, జోహారు, మ్రొక్కు మొదలైన పదాలు.

నాడి పదానికి పర్యాయ పదాలు నరము, తంత్రి, ధమని, శిర, త్రిపుటము మొదలైన పదాలు.

బాలుడు పదానికి పర్యాయపదాలు చిన్నవాడు, పిన్నవయస్కుడు, పిల్లవాడు, పసివాడు, బాలకుడు తదితర పదాలు.

చెవి పదానికి పర్యాయపదాలు శ్రోతము, శ్రవణము, వీను, శృతి, శబ్దగ్రహము, కర్ణము మొదలైన పదాలు.

చేమంతి పదానికి పర్యాయపదాలు సేమంతిక, చామంతి, శతపత్రిక తదితర పదాలు.

బడాయి పదానికి పర్యాయ పదాలు ఆడంబరం, డాబు, డంబము మొదలైన పదాలు

స్త్రీ పదానికి పర్యాయ పదాలు మహిళ, లలన, పడతి, అంగన, వనిత, తరుణి పదాలు

జంట పదానికి పర్యాయపదాలు కవ, ద్వంద్వము, ద్వయము, జోడి తదితర పదాలు.

జాతిఫలము పదానికి పర్యాయ పదాలు జాజికాయ, జాతిసారము, జాతిజము, మధ్యసారము మొదలైన పదాలు.

గురువు పదానికి పర్యాయ పదాలు ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, ఒజ్జ, ఉపదేశకుడు తదితర పదాలు.

పేరు పదానికి పర్యాయపదాలు నామము, నామవాచకము, అభిదానము, ఆఖ్య మొదలైన పదాలు.

స్నేహం పదానికి పర్యాయ పదాలు మైత్రి, సాంగత్యం, సహవాసం, చెలిమి, దోస్తి మొదలైన పదాలు.

ప్రపంచం పదానికి పర్యాయపదాలు లోకము, జగత్తు, జగతి, జగత్తు, భువనము మొదలైన పదాలు.

శిల పదానికి పర్యాయ పదాలు పాషాణము, ప్రస్తరము, గ్రావము, ఉపలము

సతతము పదానికి పర్యాయపదాలు సంతతము, ఎపుడు, ఎడపక, ఉడుగక, ఎల్లప్పుడు,  సదా, నిరతము, ఎడతెగనిది.

రాత్రి పదానికి పర్యాయ పదాలు

చీకటిని రాత్రిగా చెబుతారు. అసుర, నిశీధము, నిసి తదిరత పదాలు చెబుతారు.

జీతము పదానికి పర్యాయ పదాలు : బత్తెము, బాడుగ

పండుగ పర్యాయపదాలు ఉత్సవము, పబ్బము, పండువు మొదలైన పదాలు.

ఊయల పదానికి పర్యాయప దాలు డోల, డోలిక, జోల, తొట్టె, ఉయ్యాల మొదలైన పదాలు.

ముని పదానికి పర్యాయ పదాలు కవి, ఋషి, తాపసి, తపస్వి, మౌని, మునీంద్ర, తాపసుడు, జడబారి మొదలైన పదాలు.

పర్యాయపదాలు

ఏనుగు పదానికి పర్యాయ పదాలు కరి, కుంజరము, మాతంగము, దంతి, గజము, ఇభము మొదలైన పదాలు.

ఒకటి పదానికి పర్యాయ పదాలు ఏకము, ఒండ్రు, ఒక్కడు, ఒక్కటి, ఒకడు మొదలైన పదాలు.

పీత పదానికి పర్యాయ పదాలు ఎండ్రి, ఎండ్రిక, ఎండ్రకాయ మొదలైన పదాలు.

ఎద్దు పర్యాయ పదాలు ఋషబము, ఉక్షము, భద్రము, వృషభం, మావు మొదలైన పదాలు.

ఎముక పర్యాయ పదాలు శల్యము, అస్థి, కీకసము మొదలైన పదాలు.

ఎరుపు పదానికి పర్యాయ పదాలు లోహితము, రోహితము, తొగరు తదితర పదాలు.

ఎలుక పర్యాయపదాలు మూషికము, ఎలిక, ఇలికము, రంద్రబభ్రువు, మూసము తదితర పదాలు.

ఒంటరి పర్యాయ పదాలు ఏకాంతము, ఏకతము, మంతనము మొదలైన పదాలు.

బొబ్బర్లు పర్యాయ పదాలు అలసందలు, కల్మాషము, యవకము, అలచందలు తదితర పదాలు.

అవమానము పదానికి పర్యాయ పదాలు అవహేళన, అగౌరవము, పరాభావం, అనాధరణ, తిరస్కృతి, పరీభావము మొదలైన పదాలు.

గుర్రము పర్యాయ పదాలు అశ్విని, అశ్వము, హరిహయము, తురంగము తదితర పదాలు.

గర్వము పర్యాయ పదాలు అభిమానము, అహంకారము, మన్యువు, తలబిరుసు తదితర పదాలు.

ఒట్టు పర్యాయ పదాలు ప్రతిజ్ఙ, ప్రతిన, ఆన, ప్రమాణము, శపధం మొదలైన పదాలు.

ఓర్పు పదానికి పర్యాయ పదాలు క్షమ, తితిక్ష, ఓరిమి, ఓర్చుట, ఓపిక, సైరణము మొదలైన పదాలు.

కుండ పర్యాయ పదాలు భాండము, కడవ, ఘటము, పాత్ర, కలశ, కర్కము, కుటము మొదలైన పదాలు.

సోదరుడు పదానికి పర్యాయ పదాలు అనుజుడు, సహోదరుడు, కసిష్టుడు, తమ్ముడు, అనుజుడు తదితర పదాలు.

కత్తి పదానికి పర్యాయ పదాలు కరవాలము, ఖడ్గము, కైదువు, కృపాణము మొదలైన పదాలు.

ఆకు పదానికి పర్యాయ పదాలు పత్రము, ఛదనము, దళము, పర్ణము, బర్హము మొదలైన పదాలు

అమ్మ పదానికి పర్యాయ పదాలు జనయిత్రి, మాత, తల్లి, జనని, ప్రసువు, కన్నతల్లి తదితర పదాలు.

నాట్యము పదానికి పర్యాయ పదాలు తాండవము, నటనము, నర్తించటు, లాస్యము, నృత్యము, నృత్తము, నర్తనము తదితర పదాలు.

ఆలస్యము పదానికి పర్యాయ పదాలు జాగు, తడవు, కాలహరణము, కాలక్షేపము తదితర పదాలు.

ఆసక్తి పదానికి పర్యాయ పదాలు ఆపేక్ష, పరాయణత, వ్యసనము, అనురక్తి తదితర పదాలు.

కడుపు పదానికి పర్యాయ పదాలు గర్భము, జఠరము, డొక్క, బొజ్జ, పొట్ట, ఉదరము మొదలైన పదాలు.

అడవి పదానికి పర్యాయ పదాలు కోన, అరణ్యము, అటవి, కాననము, వనము తదితర పదాలు.

కోతి పదానికి పర్యాయ పదాలు కపి, మర్కటము, కీశము, వనోకసము, ప్లవంగము మొదలైన పదాలు.

క్రౌంచము పర్యాయ పదాలు కొంగ, కహ్వము, బంధురము, కొక్కరాయి తదితర పదాలు.

జీతము పర్యాయ పదాలు భృతి, వేతనము, భరణము, పణము, కర్మణ్య తదితర పదాలు.

కోరిక పదానికి పర్యాయ పదాలు కామము, వాంఛ, అభిలాష, దోహదము, ఇచ్చ తదితర పదాలు.

కౌగిలి పదానికి పర్యాయ పదాలు పరిష్వంగనము, ఉపగూహనము, అభిషంగము, ఆలింగనము మొదలైన పదాలు.

రాజు పర్యాయ పదాలు

బాహుజుడు, విరాట్టు, ప్రభువు, ఏలిక, రాచకుడు, మహిక్షితుడు, పార్ధివుడు, అధీశ్వరుడు మొదలైన పదాలు.

బుట్ట పదానికి పర్యాయ పదాలు తట్ట, గంప, పిటము మొదలైన పదాలు

గడ్డి పర్యాయపదాలు తృణము, తుంగ, పచ్చిక, అర్జునము, ఘ్రాసము, కసవు, గరిక తదితర పదాలు.

కార్తీకేయుడు పదానికి పర్యాయ పదాలు కుమారస్వామిని అనేక పేర్లతో పిలుస్తారు. ఆ స్వామికి గల పర్యాయపదాలు దేవసేనాని, షణ్ముఖుడు, స్కంధుడు, శరవణభవ, అగ్నిభువు, పార్వతీనందుడు, మహాసేనుడు, తారకజిత్తు, శక్తిధరుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైన పేర్లు.

గుడిసె పదానికి పర్యాయ పదాలు కుటిక, కుటీరము, ఇలువరము, ఇల్లు, గుడుసు, ఇలారము మొదలైన పదాలు.

శుభం పదానికి పర్యాయ పదాలు క్షేమం, మేలు, మంచి, శ్రేయస్సు మొదలైన పదాలు.

కారము పదానికి పర్యాయ పదాలు క్షారము, కటువు, గాటు, ఉగ్రము…

కావ్యము పదానికి పర్యాయ పదాలు ప్రబంధము, కృతి, పొత్తము, గ్రంధము.

కుంపటి పదానికి పర్యాయ పదాలు హసని, అంగారధాని, అంగారశకటి.

కుబేరుడు పదానికి పర్యాయ పదాలు ధనదుడు, ధనాధిపుడు, వైశ్రవణుడు, ఐలబిలుడు, శ్రీదుడు, నరవాహనుడు, కిన్నేరశ్వురుడు, యక్షరాట్టు, గుహ్యకేశ్వరుడు.

దువ్వెన పర్యాయ పదాలు చిక్కంటి, చిక్కోల, ఈర్పెన, కంకతము…

ఇంద్రుడు పర్యాయ పదాలు దివస్పతి, శచీపతి, మేఘవాహనుడు, దేవేంద్రుడు, పురందరుడు, మరుత్వంతుడు, వజ్రి, జిష్ణువు, సుత్రాముడు, పులోమజిత్తు, హరిహయుడు, తురాహాసుడు, సహస్రాక్షుడు, ప్రాచీనబర్హి, వాసవుడు…

దేశము పదానికి పర్యాయ పదాలు జనపదము, రాజ్యము, రాష్ట్రము, సీమ తదితర పదాలు.

దొర పదానికి పర్యాయ పదాలు ఆర్యుడు, అధిపతి, నాధుడు, ప్రభువు, స్వామి, భరణ్యుడు మొదలైన పదాలు.

నేర్పరి పదానికి పర్యాయ పదాలు విజ్ఙుడు, నిపుణుడు, ప్రవీణుడు, నిష్ణాతుడు, అభిజ్ఙుడు, శిక్షితుడు తదితర పదాలు.

నోరు పదానికి పర్యాయ పదాలు ఆననము, లసనము, తుండము, మూతి, చర్వణము.

నిద్రించు పదానికి పర్యాయ పదాలు పవళించు, శయనించు, పండుకొను, పరుండు.

పండితుడు పదానికి పర్యాయ పదాలు ప్రాజ్ఙుడు, విద్వాంసుడు, విచక్షుణుడు, సూరి…

దినము పదానికి పర్యాయ పదాలు దివసము, పగలు, పవలు, ఘస్రము.

పాన్పు పదానికి పర్యాయ పదాలు పడక, తల్పము, పఱపు, శయనము, మెత్త, శయ్య.

పద్మము పదానికి పర్యాయ పదాలు నళినము, అరవిందము, తామరపువ్వు, శతపత్రము, కమలము, శ్రీపర్ణము…

కర్మ పదానికి పర్యాయ పదాలు పని, కరజము, కృత్యము, క్రియ, చేత, వ్యాపారము…

పీఠిక పదానికి పర్యాయ పదాలు భూమిక, విషయసూచిక, విన్నపము, తొలిపలుకు…

జన్మ పదానికి పర్యాయ పదాలు పుట్టుకు, ఉద్భవము, జాతము, ప్రసవము, ఉత్పత్తి, భవము…

పసుపు పర్యాయ పదాలు గౌరము, హరిద్రము, హళది, కాంచని…

పాదము పర్యాయ పదాలు అడుగు, చరణము, పదము, మూలము…

ప్రవాహము పర్యాయ పదాలు నీటిపారుదల, ధార, వేగము….

ప్రత్యుష పర్యాయ పదాలు ప్రభాతము, పాత:కాలము, అహర్ముఖము, ఉషస్సు మొదలైన పదాలు.

ప్రేమ పర్యాయ పదాలు అనురాగము, ఆబంధము, ప్రణయము, రాగము, అనురక్తి.

దాత పర్యాయ పదాలు ఉదారుడు, త్యాగి, వితరణశీలి తదితర పదాలు.

చుట్టాలు పదానికి పర్యాయ పదాలు బంధువులు, బంధుగులు, భాంధవ్యులు తదితర పదాలు.

ప్రేరణ తెలుగు పదము అర్ధము

తెలుగు వ్యతిరేక పదాలు

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

తెలుగురీడ్స్.కమ్

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

telugureads

telugureads blog

బాధ్యత అంటే ఏమిటి?

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు