By | August 2, 2022

పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో నాలుగు మంచి మాటలు వినాలి అంటారు. ఈ రోజు ఒక మంచి మాట వినడం ఒక అలవాటు చేసుకోవాలి అంటారు. చెడు చెప్పకుండానే చేరువవుతుంది కానీ మంచి చెప్పగ చెప్పగా వింటారని అంటారు. కాబట్టి మంచి మాటలు వినడం వలన మంచి పనిని చేయడానికి మనసు సంసిద్దమవుతుందని అంటారు. అనుభవజ్ఙులు అనగా పెద్దలు చెప్పే మాటలలో మంచి భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంటుందని అంటారు. అందుకని పెద్దలు చెప్పిన మంచి మాటలు ఆలకించాలని చెబుతారు.

పెద్దలు చెప్పిన మంచి మాటలు తెలుగులో

లక్ష్యం లేని జీవితం నిరర్ధకం అంటారు.

వ్యక్తి జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ముఖ్యంగా యువతకు లక్ష్యం ఉండాలి. ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉన్నప్పుడు యువత, తమ శక్తిని సరిగ్గా వినియోగించగలదు. వారి లక్ష్యం వారికే కాదు వారిపై ఆధారపడినవారికి కూడా శ్రేయస్సు కలిగించేవిధంగా ఉంటే, అది ఉత్తమ లక్ష్యంగా చెబుతారు. ఒక వ్యక్తి ఐఏఎస్ అధికారి కావాలని పెట్టుకుంటే, అతను ఐఏఎస్ అధికారి అయితే, అతనితో బాటు, అతని కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండగలరు.

గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు.

ఎంతటి జ్ఙానమున్నా, తను గొప్పవాడినని అహంకరిస్తే, అది అక్కరకు రాదు. కొత్త కష్టాలను తెచ్చి పెడుతుంది. ఎన్ని తెలివితేటలు ఉన్నా, నేను తెలివైనవాడిననే గర్వము వలన వ్యక్తికి గర్వభంగం కలగవచ్చును. విద్యతో పాటు వినయం ఉండడమే ప్రధానం. విద్య నేర్చుకునేటప్పుడు గురువు యొక్క సంరక్షణలో మనసు కూడా సంస్కరింపబడుతుందని అంటారు. గురువు వలన శిష్యుడు ఉత్తమ సాధన చేసి, మనో రుగ్మతలకు దూరంగా ఉండగలడని అంటారు. కావునా గురువు లేని విద్య గుడ్డి విద్యగా చెప్పి ఉండవచ్చును.

చినిగిన చొక్కా కొనుక్కో గానీ మంచి పుస్తకం వదులుకోకు…

పుస్తకం ఒక విషయమును సవివరంగా తెలియజేయగలదు. పుస్తకం విషయ పరిజ్ఙానాన్ని అందించగలదు. పుస్తకము సాహిత్యమును అందించగలదు. పుస్తకాలు చదవడం వలన మనసులో ఊహాశక్తి పెరగగలదు. మంచి పుస్తకం మనసులో మంచి ఆలోచనలు పుట్టించగలదు. కావునా పెద్దలు చినిగినా చొక్కా తొడుక్కో గాని మంచి పుస్తకం కొనే అవకాశం వదులుకోకు అంటారు.

పెద్దలు చెప్పిన మంచి మాటలు వినడం వలన ఆసక్తిపై నియంత్రణ ఉంటుంది.

ప్రతి వ్యక్తికీ ఏదో విషయంపై ఆసక్తి ఉంటుంది. ఏదో ఒక విషయంలో పట్టు ఉంటుంది. మనసుకు ఉండే శక్తిని సద్వినియోగం చేసుకోవడంలోనే జీవితంలో మంచిస్థాయిని సాధించడానికి మార్గం అంటారు. అటువంటి నియంత్రణకు గురువుగారి సంరక్షణ మేలు చేస్తుంది. పుస్తక పఠనం సాయపడుతుంది. పెద్దల మాటలు ఆలకించడం వలన మనసుకు ఆసక్తిపై నియంత్రణ ఆవశ్యకత తెలియవచ్చును.

ప్రేరణ తెలుగు పదము అర్ధము

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

తెలుగు వ్యతిరేక పదాలు

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

తెలుగురీడ్స్.కమ్

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

telugureads

బాధ్యత అంటే ఏమిటి?

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు