సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ

పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం. సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా తెలుగు మూవీగా నిలిచింది.

మారుతున్నా సామజిక పరిస్థితిలో భాగం ఎక్కువమంది ఉన్నత కుటుంబంలో తమ పిల్లల్ని ఇతరదేశాలలో చదివించడం పరిపాటి.

అలా ఇతర దేశాలలో చదువుకుని ఇంటికి వచ్చి ఒక ఉన్నత కుటుంబ కుర్రాడుగా వెంకటేష్ నటిస్తే, సనాతన ధర్మం కల్గిన భారతదేశంలో సగటు మహిళగా, ఒక ఫాక్టరీలో ఉద్యోగిగా సౌందర్య చక్కగా నటించిన తెలుగు మూవీ , పవిత్రబంధం.

సకుటుంబ సపరివారంగా చూడదగిన తెలుగు చిత్రాలలో పవిత్రబంధం ఒకటిగా ఉండి, భారతీయ స్త్రీమూర్తి సహనం, పతిసేవా తత్పరతను తెలియజేసే తెలుగు పుల్ లెంగ్త్ మూవీ పవిత్రబంధం.

సెంటిమెంట్ మూవీస్ దర్శకులుగా పేరుపొందినవారిలో ముత్యాల సుబ్బయ్య గారు ఒకరు. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై పోసాని కృష్ణ మురళి కధ అందిస్తే, ఎంఎం కీరవాణి సంగీతం అందివ్వగా పవిత్రబంధం తెలుగుమూవీని వెంకట రాజు – శివరాజులు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మించారు.

విశ్వనాధ్(SP బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆస్తిపరుడైన అతనికి ఒక కొడుకు విజయ్(విక్టరివెంకటేష్) ఫారిన్లో చదువుపూర్తీ చేసుకుని స్వదేశానికి ఇంటికి వస్తాడు.

అలా ఇంటికి వచ్చిన విజయ్ తో విశ్వనాధ్ పెళ్లి చేసుకుని బిజినెస్ వ్యవహారాలు చూసుకోవలసినదిగా కోరతాడు. స్వేచ్చగా స్వదేశం వదిలి విదేశంలో తిరగడం అలవాటు పడిన విజయ్ కేవలం సంతోషకరమైన విషయాలతో సంతోషిస్తూ ఉంటాడు.

రాధ (సౌందర్య) మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈమె తన కుటుంబ పోషణార్ధం విశ్వనాధ్ ఆఫీసులో విశ్వనాధ్ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది.

రాధ (సౌందర్య) కుటుంబంలో అన్న నిరోద్యోగిగా ఉంటూ ఉంటే, పెళ్ళైన ఆమె అక్క జబ్బుతో బాధపడుతూ ఇంటిలోనే ఉంటుంది. పెళ్లికావాల్సిన చెల్లెలు ఉంటుంది. కుటుంబ పోషణ మొత్తం రాదే చూసుకుంటూ ఉంటుంది.

విజయ్ ఇంటికి వచ్చాక పాశ్చాత్య ధోరణిలో ఉంటూ క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పెళ్లి సంభందం గురించి మాట్లాడితే విజయ్ చెప్పిన మాటలకు విశ్వనాధ్ అవాక్కవుతాడు.

నేను పెళ్లిచేసుకుంటాను కానీ ఆమెతో సంవత్సరం కాపురం చేసాక మా ఇద్దరికీ ఇష్టంగా ఉంటే కాపురం కొనసాగిస్తాం, ఒకవేళ సంవత్సరం తరువాత అలా ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా విడిపోవటానికి అంగీకరించిన అమ్మాయి అయితే నాకు సరే అని చెబితే అవాక్కవ్వని తెలుగు తండ్రి ఉండడు.

ఆ విధంగా కొడుకు ప్రవర్తనకు కారణం తల్లిలేకుండా ఉండడం ఒకటి, విదేశ సంస్కృతిలో అలవాటు పడి ఉండడం ప్రధాన కారణం అని గ్రహించిన విశ్వనాధ్.

విజయ్ (విక్టరివెంకటేష్) రాధ(సౌందర్య) అగ్రిమెంట్ వివాహం

ఆఫీసులో తనకు పర్సనల్ సెక్రటరీగా చేస్తున్న రాధను చూసి ఈమె అయితే తన కొడుకు విజయ్నిమార్చగలదు అని భావించి, ఆమెకు తన కొడుకుని పెళ్లి చేసుకోవలసినదిగా కోరతాడు.

ఆత్మాభిమానం కలిగిన రాధ తన కుటుంబ కష్టాలు తీరాలంటే డబ్బు అవసరం, ఆ డబ్బు విశ్వనాధ్ గారి అబ్బాయి కండిషన్ తెలిసి, పెళ్లి తరువాత ప్రేమతో విజయ్ ని మార్చుకుంటాననే నమ్మకంతో ఆమె పెళ్ళికి ఒప్పుకుంటుంది.

అయితే విశ్వనాధ్ గారి బరోస వలననే ఆమె తనపై తనకు గల నమ్మకంతో విజయ్ ని పెళ్లి చేసుకుంటుంది రాధ.

పెళ్లికి ముందే అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు చేసుకుంటారు కాబోయే భార్య భర్తలు. తర్వాత రాధవిజయులు అన్యోన్యంగా కలిసి ఉండడం ముచ్చటగా ఉంటూనే, మరోప్రక్క విజయ్ అగ్రిమెంట్ ఆసక్తిగా కధనం సాగుతుంది. రాధ కుటుంబ కష్టాలు విశ్వనాధ్ గారు తీర్చుతారు.

రేచీకటితో బాధపడే సుధాకర్, బ్రహ్మానందం హాస్య సన్నివేశాలు మద్య మద్యలో వస్తూ ఉంటాయి.

సంవత్సరం గడిచేలోపు విజయ్ కి ఆక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో రాధ అతనికి సేవలు చేసి అతనిని కాపాడుకుంటుంది. ఆ క్రమంలో వచ్చే పాట అపురూపమైనది అమ్మ ఆడజన్మ అంటూ సాగే సాంగ్ చిత్రీకరణ కధలో భాగమై సాగుతుంది.

పాట పూర్తీ అయ్యేసరికి సంవత్సరం గడవడం అగ్రిమెంట్ ప్రకారం తనకు రాధపై ఫీలింగ్స్ లేవని వివాహం రద్దు చేసుకుందామని అంటే, విజయ్ తండ్రి బ్రతిమాలినా వినని విజయ్ విచిత్రంగా విడిపోవడానికి ఇష్టపడతాడు. విజయ్ ఇష్టప్రకారం రాధ తన పుట్టింటికి వెళుతుంది.

అలా పుట్టింటికి వెళ్ళిన రాధ లేని లోటు విజయ్ కి తెలిసి వచ్చి, ఆమెపై తనకి ఉన్న ప్రేమను గుర్తించి రాధ కోసం రాధ పుట్టింటికి వెళితే విజయ్ ని రాధ తిరస్కరిస్తుంది. ఎవరు చెప్పిన రాధ వినకుండా ఒంటరిగా ఉంటూ అందరి చేత మాటలు పడుతుంది.

అలా ఎందుకు రాధ చేసింది అనేది చిత్రం చూడడమే బాగుంటుంది. చివరికి ఇద్దరు ఒకటవటంతో తెలుగు మూవీ కధ ముగుస్తుంది. అయితే ఆద్యంతం కుటుంబ వాతావరణ సన్నివేశాలతో చిత్రం సాగుతుంది.

రాధ పాత్రలో సౌందర్య నటన అద్బుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ – సౌందర్యల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటే, విశ్వనాధ్ పాత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగారి నటన సెంటిమెంట్ బాగా పండిస్తుంది. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన పవిత్రబంధం తెలుగు పుల్ మూవీ , చాల పవిత్రమైన బంధం విలువని తెలియజేస్తుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?