విషయములుఆలోచనపుస్తకం ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు మనసును ప్రభావితం చేస్తాయి. విషయములు ఆలోచనలు కలిగిస్తే, మంచి విషయాలు మంచి ఆలోచనలను కలిగిస్తాయి.
లోకంలో అనేక అంశములలో అనేక విషయాలు ఉంటాయి. అనేకమంది వ్యక్తులు, అనేక విషయాలతో సంఘం కలిగి ఉంటే, మరి ఆలోచనలు ఎన్ని ఉంటాయి?
విషయములతో ప్రభావం చెందే మనసుకు మొదట్లో తెలిసిందేమిటి? ఆలోచనలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి.
తనును తాను చూసుకోకుండా అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది మనసు. ఒకప్పుడు కష్టంలో తననితాను చూసుకుంటుంది. స్థితిని చూసుకుంటుంది. ఆలోచనలో పడుతుంది.
కష్టంలో ఓదార్పు అందుకునే మనసుకు మిత్రులు, బంధువులు, ఆత్మీయులు ఉంటారు. పుస్తకంపఠనం అలవాటు ఉన్నవారికైతే, పుస్తకం కూడా ఒక మిత్రుడు వంటివాడు.
పరిశోధనాత్మకమైన పుస్తకాలు చదివే అలవాటు అయితే, ఒక పరిశోదకుడు మనసుకు మిత్రుడుగా ఉంటాడు. భక్తిపరమైన బుక్స్ చదివే అలవాటు ఉంటే, ఓ భక్తపరాయణుడు మిత్రుడుగా మనసు లభిస్తాడు.
తాత్విక చింతనను ప్రబోదించే బుక్స్ అయితే ఓ తత్వవేత్త మనసుకు మిత్రుడుగా లభిస్తాడు. ఎటువంటి పుస్తకాలు చదువుతుంటే, అటువంటి మిత్రత్వం పుస్తకాల ద్వారా మనసుకు లభిస్తుంది.
పుస్తకపఠనం గొప్ప అలవాటుగా చెబుతారు. అంటే వ్యక్తికి ఉండవలసిన మంచి అలవాట్లలో పుస్తకం చదవడం అనే మంచి మంచి అలవాటు కూడా ఉండాలని చెబుతారు.
పుస్తకం చదవుతూ ఉన్నంతసేపూ మనసు ఒక విషయంపై ఏకాగ్రదృష్టితో దృష్టితో ఉంటుంది.
చదువుతున్న పుస్తకం ఇంకా భారతీయ సాహిత్యం అంటే మరీ మంచిదని అంటారు. పుస్తకం చదవడం అంటే అందులో వ్రాసి ఉన్న విషయంతో మనసు కాసేపు ప్రశాంతతో ప్రయాణం చేయడమే అవుతుందని అంటారు.
మనకు పుస్తకములు విశిష్టమైన విషయములను మనసుకు తెలియజేస్తాయి. చదివే పుస్తకంలోని విషయసారమును మనసులోకి చేరుస్తాయి. కొన్ని మనోవికాసం పుస్తకాలుమననుసు మందు వంటివి అంటారు. ఎలాంటి పుస్తక పఠనం ఉంటే, అలాంటి భావన పెరుగుతుంది.
భక్తిపుస్తకాలు చదవడం అలవాటు అయితే, మనసు భక్తి భావనతో ఉంటుంది. కాసేపు ఏదైనా ఒక భక్తి పుస్తకం చదువుతూ ఉంటే, మనసు కాసేపు ఏకాగ్రతతో ఆ దైవంపై భక్తిభావంతో ఉంటుంది…
మనోవిజ్ఙానం కలిగిన పుస్తకాలు మనసులో వికాసమును తీసుకువస్తాయి. తెలుగు సాహిత్యంలో గల విశిష్టమైన పుస్తకాలు విశిష్టమైన ఫలితాలనే అందిస్తాయి.. అయితే దృష్టి సారించడమే కష్టం అంటారు. మనసుపై మనసే యుద్ధం చేయాలంటే మనసు ఎందుకు సిద్దపడుతుందని కూడా అంటారు.
పుస్తకం మనసును ఒక విషయంపై దృష్టి పెట్టేలాగా చేస్తుంది. పుస్తకంలో ఉండే ప్రధాన లక్షణం ఇదే… ఈ లక్షణం వలన మన మనసు ఏకాగ్రత పెరుగుతుంది.
ఏదైనా ఒక పుస్తకం చదువున్నంతసేపూ మనసు ఆ పుస్తకంలోని అంశంతో మమేకమై ఆలోచనలను కొనసాగిస్తుంది. అలా ఒక విషయంపై విచారణ మనసుకు అలవాటు పడుతుంది.
విజ్ఙానంతో కూడిన పుస్తకాలు విషయములపై వివరణలు, విధానములను తెలియజేస్తాయి. అలాగే మనో విజ్ఙానంతో కూడిన పుస్తకాలు మనసు గురించిన స్వభావమును, మనసు తీరు తెలియజేస్తాయి.
ఇటువంటి మనోవిజ్ఙానమయ పుస్తకాలు రీడ్ చేయడం వలన మనసుకు మనసుతోనే చెలిమి ఏర్పడుతుందని అంటారు.
ఎక్కడ ఏది ఉందో చూసి తెలుసుకుంటాం. ఎక్కడ ఏది వినబడుతుందో విని తెలుసుకుంటాం. ఎక్కడ ఎలాంటి వస్తువు ఉందో తాకి తెలుసుకుంటాం…
కానీ చూడడం,వినడం, తాకడం తదితర విషయాలను తెలుసుకునే మనసు మాత్రం కనబడదు. చిత్రమైన మనసు విచిత్రమైన మనసుకు మనసే మిత్రుడు అవుతుంది. కొన్నిసార్లు శత్రువు కూడా అవుతుందని అంటారు.
ఇలాంటి మనసును కట్టడి చేయాలంటే, మనోమయవికాస పుస్తకాలు రీడ్ చేయాలి….
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికిపుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది.
భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది. ఆటోమేటిగ్గా ఆసక్తి కూడా వస్తుంది. అంటే ఒక వ్యక్తికి భగవంతుడు అంటే ఆసక్తి ఉంది. ఏ భగవంతుడు అంటే ఆసక్తి? అంటే వినాయకుడు అంటే ఆసక్తి ఉంది.
విఘ్నేశ్వరుడు ఎందుకంటే, ఏ శుభలేఖ చూసిన మొదటగా శ్రీరస్తు, శుభమస్తు అవిఘ్నమస్తు పదాలు కనబడతాయి. ఎవరంటే? వినాయకుడు అంటారు. విఘ్నేశ్వరుడిని చూస్తే, బొజ్జతో బొద్దుగా ముద్దుగా ఉంటాడు. కానీ ఏనుగు ముఖంతో ఉంటాడు. పామును పొట్టకు చుట్టుకుని ఉంటాడు. పరిశీలిస్తే ఒక దంతంతో ఉంటాడు. అంత పొట్ట వేసుకుని లావుగా ఉండేవాడు, చిట్టెలుకపై ప్రయాణం చేస్తాడు. అసలు ఆసక్తికే ఆసక్తి పుట్టించేలా రూపం ఉంటుంది. ఖచ్చితంగా ఆసక్తికరమైన భావన బలంగా ఉంటుంది. ఎందుకలా? గణేషుడు గురించి తెలిపే పుస్తకాలు చదివితే, గణపతి ఎవరు? లంభోధరుడు జననం ఎట్టిది? వినాయకుడు అవతార ప్రయోజనం? ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.
ఇంకొకరికి శివుడు అంటే ఆసక్తి, ఎందుకు?
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…
శివుడు అంటే ఎందుకు ఆసక్తి అంటే, శివుడికి మూడు కళ్ళు ఉంటాయి. కంఠం నీలంగా ఉంటుంది. పాము మెడలో ఉంటుంది. నంది మీద కూర్చుంటాడు. ఎందుకలా అనే దృష్టి వెళ్ళి, శివుడు గురించి తెలుసుకోవాలి. శివుడు ఎందుకలా ఉంటాడనే ఆలోచన, ఆలోచనకు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఇలా శివుడు గురించి కొందరికి ఆసక్తి పెరగవచ్చును.
కొందరికి విష్ణువు అంటే ఆసక్తి పెరుగుతుంది. నాలుగు భుజములు కలిగి ఉంటాడు. నల్లగా ఉంటాడు. పాముపై పడుకుని ఉంటాడు. అవతారములు ఎత్తుతూ ఉంటాడు. అనేక అవతారములతో పూజింపబడుతూ ఉంటాడు. ఎందుకు ఇన్ని అవతారములు ఎత్తాడు. మిగిలిన దేవతలకు లేనన్ని అవతారములు ఈ స్వరూపమునకే ఎందుకు? ఆసక్తికరమైన ప్రశ్న…
ఇక మూడవ ఆయన కానీ మనం మొదలు ఆయన సంకల్పంతోనే… ఆయనకు నాలుగు తలకాయలు ఉంటాయి. ఎక్కడ పూజలందుకోడు.. కానీ సృష్టికర్త. ఆ సృష్టికర్తే బ్రహ్మదేవుడు. నాలుగు తలకాయలు బ్రహ్మదేవుని స్వరూపం చూడగానే ఆయనకు ఎందుకు నాలుగు తలకాయలు అనే ఆసక్తి వస్తుంది. ఇలా ఆసక్తి పెరగడానికి మనకు కనిపించే దైవ స్వరూపములు ఉంటాయి. ఎందుకు దేవతా మూర్తుల అలా ఉంటారంటే, అలా ఉన్నవారిని చూసి ఆసక్తి పెరిగితే ఆలోచనతో జ్ఙానం వైపు మనిషిని మళ్లించడానికే అనే ఆసక్తికరమైన విషయం ద్యోతకమవుతుంది.
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…
భక్తి అనే ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…
ఆసక్తికరంగా ఉండే దేవతా మూర్తులు, వారిపై ఆసక్తి కలగగానే వారి వారి పురాణములు మనకు మనోవిజ్ఙానమును తెలియజేస్తాయి. ఏ పురాణము చూడండి.. మనసు, మనసు చేష్టలు, బలమైన మనసు, బలహీనమైన మనసు, ఆచారం కలిగిన మనసు, ఆచారం లేని మనసు… ఇలా మానసిక పరిస్థితులలో మనసు ఆయుధం ఎలా అవుతుంది. మనసు గురించిన విజ్ఙానమును అందిస్తూ, జీవిత పరమార్ధం గురించి తెలియజేస్తూ ఉంటాయి.
మనసును నియంత్రణలో పెట్టుకుంటే, కష్టంలో దాని పనితీరు బాగుంటంది. మనసు ఆకలికి తట్టుకోవడం అలవాటు అయి ఉంటే, ఉపవాసం చేయగలుగుతుంది. ఆకలికి తట్టుకునే అలవాటు లేకపోతే, ఆకలి తీర్చుకోవడానికి దొంగ కూడా మనిషిని మార్చే అవకాశం మనసుకు ఉంటుంది. అంటే నియంత్రణ అలవాటు అయిన మనసు ఆకలిని తట్టుకుని విజ్ఙతతో వ్యవహరిస్తుంది. ప్రకృతిలో తనకున్న పరిధిలో పరువుగా మనగలుగుతుంది.
Asakti gurinchi teliyajestu devata
ఆసక్తి గురించి తెలియజేస్తూ దేవతా స్వరూపములు గురించి ఎందుకు చెప్పానంటే? ఎక్కువమందికి తెలిసి ఉండే దేవతా మూర్తులు. ఇక పరిశీలన చేస్తే, మనోవిజ్ఙానం వైపు, జీవిత పరమార్ధం వైపు తీసుకువెళ్ళగలిగే పురాణ విజ్ఙానం ఆయా దేవతలపై ఉంటాయి. ఇక భక్తితత్వంలో మనసు ఉపశమనం పొందుతుందని పెద్దల మాట. భక్తి అనే ఆసక్తికిఆయుధంపుస్తకంఅయితే… భక్తి గురించిన పురాణాలు చదవాలనిపిస్తుంది. మనసు అంటే ఏమిటో? తెలుస్తుంది.
సరే ఇక ఆసక్తి ఇంకా ఇతర విషయములపై కలుగుతుంది. చూస్తున్న వస్తువులో గుణం గమనించడం వలన ఏర్పడే ఆసక్తి పరిశీలనాత్మకమైన ఆలోచనలను సృష్టిస్తుంది. ఇటువంటి ఆలోచనలు విద్యాభ్యాసంలో ఎక్కువగా ఉంటే, విద్యార్ధికి విద్యలో క్లారిటీ వచ్చేస్తుంది.
మనిషి ఎదురుగా లేకపోయినా వారితో నేరుగా మాట్లడగలగడం అనే సదుపాయం గలిగిన ఫోనుపై ఆసక్తి వస్తుంది. ఇంకా కొన్ని ఫోన్లు ద్వారా ఎక్కడో ఉన్న మనిషిని చూస్తూ, మాట్లడగలగడం మరింత ఆసక్తికరమైన ఆలోచనను పరిశీలిస్తే కలుగుతుంది. అయితే అలవాటు అయ్యాక అటువంటి పరిశీలన మనిషిలో కొరవడుతుంది. కానీ పరిశీలన చేస్తే, చూస్తున్న మొబైల్ ఫోనులో ప్రపంచం ఎలా కనబడుతుంది? అనే ఆసక్తి కలగక మానదు.
ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన చుట్టూ ఉండే వస్తువులు కానీ మొక్కలు కానీ ప్రదేశాలు కానీ దైవ స్వరూపములు కానీ మనలో ఆసక్తిని కలిగిస్తాయి. మనం పరిశీలన చేస్తే, చాలా విషయాలు ఆసక్తికరంగానే ఉంటాయి.
న్ని విషయాలు, అన్ని వస్తువులు, అన్ని అంశములు అందరికీ ఆసక్తి చూపడానికి మనసు
అయితే అన్ని విషయాలు, అన్ని వస్తువులు, అన్ని అంశములు అందరికీ ఆసక్తి చూపడానికి మనసు ఇష్టపడకపోవచ్చును. కొందరు దైవం అంటే భక్తి ఉంటే, కొందరికి దైవం అంటే భయం ఉంటుంది. కొందరికి దేవుడు ఎక్కడ అనే ఆసక్తి ఉంటుంది. కొందరికి వస్తువులను పరిశీలించడంపై ఆసక్తి ఉంటుంది. కొందరికి వస్తువు పనితీరుపై ఆసక్తి ఉంటుంది. కొందరికి మానవ శరీరం పనితీరు గురించిన ఆసక్తి కలగవచ్చును. కొందరికి కంపూట్యర్స్ అంటే ఆసక్తి పెరగవచ్చును.
ఇలా ఆసక్తి ఏర్పడడంలో కొందరికి కొన్నింటిపై ఉంటుంది. కొందరికి దీర్ఘమైన పరిశీలన ఏదో ఒక విషయంలో ఏర్పడుతుంది. ఎలా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. ఈ ఆలోచనే కలిగితే, ఆ భగవంతుడు కనిపించేవరకు ప్రయత్నం ఆగదు. ఇక ఇక్కడ వంద ఆలోచనలు లేవు. నిజంగా భగవంతుడినే చూడాలనే ప్రయత్నం అంతే. స్వామి వివేకానందకు భగవంతుడిని చూడాలి, అనే ఆలోచనతోనే రామకృష్ణ పరమహంసను కలవడం జరిగింది.
మరికొందరికి కంప్యూటర్ ఎలా పని చేస్తుంది. దాని బ్యాక్ గ్రౌండులో ఏం జరుగుతుంది. తెలుసుకోవాలనే ఆసక్తి. అదే తపన, అదే ఆలోచన… దాని గురించి తెలిసినవారి దగ్గర తెలుసుకోవడం, ఆలోచించడం సాధన చేయడం జరుగుతంది. ఇలా సుదీర్ఘమైన ఆసక్తి కొందరికి కలిగితే, వారి ప్రయత్న ఫలితం చాలామందికి మార్గదర్శకం కావచ్చును. ఇందుకు సాయపడే విషయాలలో పుస్తకం ఒక ఆయుధంలాగా ఉంటుంది.
ఎందుకు పుస్తకం ఆయుధం అంటే, అనుభవజ్ఙులు
ఎందుకు పుస్తకంఆయుధం అంటే, అనుభవజ్ఙులు తమన అనుభవ సారమును పుస్తక రూపంలో వివరించి ఉంచుతారు. కొన్ని సంస్థలు ఒక వస్తువు తయారి గురించి, దానికి ఉపయోగపడే మూల పదార్ధముల గురించి, వాటి వాటి గుణములు గురించి విధానములను ఒక పుస్తకరూపంలో మార్చుతారు. ఇలా ఏదైనా విజ్ఙానపరమైన విషయాలు పుస్తకంలోకి మారతాయి.
స్కూలులో పాఠాలు పుస్తకంలో వివరించబడిన విషయాలే. కానీ ఆ పుస్తకం కూడా ఎవరో ఒకరు వ్రాసినదే అయి ఉంటుంది. ఆ వ్రాసినవారికి పుస్తకం చదివే అలవాటు ఉంటుంది.
అంటే పుస్తకం విజ్ఙానం అందిస్తుంది. ఆసక్తిని బట్టి పుస్తకం మరింత అవగాహన కలిగించే విజ్ఙానం అందిస్తుంది. కొత్తగా సృష్టించబడిని విధానం మరలా పుస్తకం అందుకుని భద్రపరిచి భవిష్యత్తులో మరొకరికి అందేవిధంగా మారుతుంది. పుస్తకం ఓ విజ్ఙాన వారధిలాగా మారుతుంది.
దేనిపై ఆసక్తి కలిగితే, దానిపై వివరణలతో కూడిన బుక్స్ నేర్చుకునేవారి ముందుంటాయి. దీర్ఘకాలికమైన ఆసక్తి అందరికీ ఒకలాగా ఉండదు. కానీ అందరిలాగానే ఉంది అంటే అది కేవలం అనుభవించడం వరకే పరిమితం అవుతుంది.
ఎప్పుడూ అన్నం మాత్రమే తినేవారికి కొంచెం బిర్యాని తినిపిస్తే, బిర్యానిపై ఆసక్తి పెరుగుతుంది. మరలా బిర్యాని తినాలనిపిస్తుంది. ఇది అందరికీ కలిగేదే, తిని అనుభవించడం వరకు పరిమితం. కానీ బిర్యాని తయారి ఎలా? బిర్యాని ఎలా చేస్తారు? ఇది కొందరికి నేర్చుకునేవరకు పరిమితం. ఆసక్తి ఎక్కడవరకు పరిమతం అయితే అక్కడి వరకు మనసు విషయసంగ్రహణం చేస్తుంది.
Aasakti andariki untundi kani
ఆసక్తి అందరికీ ఉంటుంది. కొన్ని విషయాలలో అనుభవించడం వరకు పరిమితం అయితే ఏదో ఒక విషయంలో పూర్తిగా తెలుసుకునేవరకు ఉంటుంది. ఇలా ఒక విషయంలో పూర్తిగా తెలుసుకునేవరకు ఉండే, ఆసక్తికిఆయుధంపుస్తకంఅయితే… అవగాహన చేసుకోవడమే తరువాయి విషయసంగ్రహణం చేయవచ్చును.
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…
చంద్రుడు అత్యంత ఆసక్తికరమైన స్వరూపము. ఎందుకంటే చంద్రుడు మన కంటికి కనబడతాడు. ఈయన గురించి పురాణములలో చెప్పబడి ఉంది. ఇంకా మనకు ఉన్న తిధలు, చంద్రగమనం ఆధారంగానే సాగుతుంది. ఇంకా చంద్రుడు ఒక ఉపగ్రహంలాగా మనకు పుస్తకములలోనూ పరిచయం ఉంటుంది. పౌర్ణమి రోజున పూర్ణ చంద్రుడు మనసును ప్రభావితం చేస్తాడు. ఆరోజు చంద్రుడిని చూస్తూ ఆనందించేవారు ఉంటారు.
పరిశీలిస్తే ప్రకృతి చాలా ఆసక్తి. మనసులో కలిగిన ఆసక్తి బలం బట్టి ఆసక్తి మనకు విషయ పరిజ్ఙానం అందిస్తుంది. ప్రకృతిలో మన మనసు చూపించిన ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… మనసు దృష్టి సారించిన ఆసక్తిలో ఎంతో విషయ సేకరణ చేయవచ్చును. పుస్తకపఠనం విజ్ఙానంతో చెలిమి చేయడం వంటిది అంటారు. ఉపయోగించుకుంటే ఆసక్తి బలం.
తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలలోని చదివిన విజ్ఙాన విషయాలనే తిరిగి బోధిస్తారు. పుస్తకాలలోని విషయాలతోనే కొందరు శోధకులు పరిశోధనలు చేస్తారు.. పురాణేతిహాసాలు పుస్తక రూపంలో రామాయణం – పుస్తకం, భాగవతం – పుస్తకం, శాస్త్రం – పుస్తకం, పరిశోధన – పుస్తకం.. ఏదైనా పుస్తకంలోకి విజ్ఙానం నిక్షిప్తం చేయబడుతుంది. పుస్తకంలోని విజ్ఙానం పరిశీలించబడుతుంది. కొత్త కనుగొనబడుతుంది. పుస్తకం విజ్ఙానంతో ప్రయాణం చేస్తుంది.
విజ్ఙానం పరిశీలన చేస్తూ నేర్చుకుంటాం. బంధు మిత్రులు, టీచర్ల బోధనతో విజ్ఙానం వింటూ నేర్చుకుంటాం.. ఇలా చూస్తూ, వింటూ మరియు పుస్తకం చదువుతూ విషయపరిజ్ఙానం పెంచుకుంటాం. చిన్ననాడు పెరిగిన ఆసక్తో లేక పెరిగాక వచ్చిన ఆసక్తో కానీ పుస్తకంతో విజ్ఙాన పరిజ్ఙాన పరిశీలన ప్రారంభం అవుతుంది. ఏదో ఒక విషయంలోని ఆసక్తి పుస్తకాలవైపు దృష్టి మరలుతుంది. ఒకరికి సైన్సు ఇష్టం ఉంటే మరికొందరికి సోషల్ ఇష్టం ఉంటే ఇంకొందరికి మాథ్స్ ఇష్టం ఉంటుంది.
విద్యాపరంగా ఉపాదికోసం స్కూలు నుండి వివిధ పుస్తకాలు చదువుతాం. అయితే వీటితో పాటు పర్సనాల్టి మేనేజ్ మెంట్ కూడా అవసరం అని చెబుతారు. అంటే వ్యక్తిత్వ వికాసం అంటారు. వ్యక్తిత్వం పనిచేసేచోట మరింత మెరుగైన ఫలితాలను తీసుకురాగలదు, పొందగలదు అంటారు.
వ్యక్తిత్వ వికాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్వామి వివేకానంద మాటలే అంటారు. ఆయన మాటలు చాల శక్తివంతంగా ఉంటాయి. రీడర్లో స్ఫూర్తిని నింపేవిధంగా ఉంటాయని అంటారు. అలాగే భారతీయ విజ్ఙానంలో చాలా పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం గురించే ఉంటాయని అంటారు. మనసు నియంత్రించుకోవడంలో మనసుకే శిక్షణ ఇవ్వడం… మనసును మనసుచేతనే పరిశీలన చేయడం…ఇతరులతో ప్రవర్తన గురించిన సరైన అవగాహన ఏర్పరచుకోవడం తదితర అంశాలలో బుద్ది వికవసించాలని అంటారు.
బుద్ది వికాసం గురించి వ్యక్తిత్వ వికాసంపై గల తెలుగు పుస్తకాలు వివచించగలవు అంటరు. వ్యకిత్వ వికాసం వలననే వ్యక్తి తన జీవన పోరాటంలో విజయం సాధించగలడని అంటారు. విద్యకు వినయం తోడైతే, వ్యక్తి ఉన్నతికి బలమైన మెట్టు ఏర్పడ్డట్టేనని అంటారు. వినయంతో కూడిన మాటతీరు మనిషిని మరింత ఉన్నత స్థితికి చేర్చునని చెబుతారు. పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం గురించిన విజ్ఙానం మనకు అందిస్తాయి.
పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం గురించిన విజ్ఙానం మనకు అందిస్తాయి.
వ్యక్తిగత ధర్మం, సామాజిక ధర్మం, కుటుంబ ధర్మం, ఆద్యాత్మిక అవసరం ఇవ్వన్ని తెలుపుతూ ఉండేవి… ఇతిహాసాలు అంటారు. రామాయణం చదివితే ధర్మం ఎందుకు ఆచరించాలో తెలియవస్తుందిని చెబుతారు. కోపం వలన మనిషి జీవితం ఎటువంటి స్థితులకు మారుతుంది తెలియవస్తుందని అంటారు. ఇంకా స్త్రీ దు:ఖం ఎంత చేటు తెస్తుందో? రావణాసురుని తపస్సు, రావాణాసురుడి కోరికలు చూస్తే తెలియబడుతందని అంటారు. తెలుగు పుస్తకాలు రామాయణంపై ఉన్న అనేక రచనలను మనకు అందిస్తాయి.
భారతంలోని పాత్రలు ఎప్పటికీ ఎక్కడో చోట సమాజంలో కనబడుతూనే ఉంటాయని అంటారు. మహాభారతం వ్రాసిన వేదవ్యాసుడు కూడా భారతంలో లోకంలో ఉంటే అన్ని పాత్రల గురించిన వివరణ ఉంటుందని చెప్పినట్టుగా చెబుతారు. మహాభారతం నిశితంగా పరిశీలించవలసిన ఇతిహాసమని చెబుతారు. ధర్మసూక్ష్మం ఎక్కువగా ఉండేది మహాభారతంలోనే అని చెబుతారు. తెలుగు పుస్తకాలు మహాభారతం, భారతంలోని నీతి కధల ద్వారా మనకు మనో విజ్ఙానం అందిస్తాయి.
తెలుగు పుస్తకాలు భగవంతుని లీలలను తెలియజెబుతాయి.
మనిషికి ఎటువంటి బాధలు వచ్చినా తట్టుకునేది మనసు. సుఖం అయినా దు:ఖం అయినా మనసుకే ఫీలింగు. అది సుఖంగా ఉంటే మరొకరిని సంతోష పెట్టగలదు. అది దు:ఖంగా ఉంటే మరొకరికి బాధగా మారగలదు. మనిషి సుఖ:దు:ఖాలలో మనసు మరీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి మనసు తననితానే భరించలేకపోతే, ఆమనిషి అశాంతికి ఆలవాలంగా మారతాడు. అశాంతి మనిషి జీవితాన్ని పాడుచేస్తుంది.
ఇటువంటి సమయంలోనే మనిషికి తోడు భగవంతుడు అంటారు. సద్గురువుకు దగ్గరలో ఉంటే, సద్గురువే భగవానుడుగా ఉండగలడు. మంచి మిత్రుడైనా సరే…. ఎవరూ ఓదార్పు ఇవ్వలేని సమయంలో భగవానుడినే తలవాలి.. అటువంటి సమయంలో భగవంతుడు ఎటువంటివారిని ఎలా అనుగ్రహించాడు? భాగవతం ద్వారా తెలుసుకుంటే, ఆమనిషి మనసుకు ఊరట లభిస్తుందని అంటారు. తెలుగు పుస్తకాలు భగవంతుని లీలలను తెలియజెబుతాయి.
పురాణాలు, ఇతిహాసాలు వ్యక్తిగత, సామాజిక ధర్మాలను, ప్రకృతి నియమాలను తెలుపుతూ ఉంటాయి. ప్రకృతి ద్వారా భగవానుడి లీలలను తెలియజేస్తాయి. భక్తుల ద్వారా భగవానుడి లీలలను పుస్తకాలు తెలియజేస్తాయి. కీర్తనలు భగవంతుడి లీలలను ప్రస్తుతిస్తాయి. పుస్తకాలు భగవంతుడి గురించి ఆద్యాత్మిక మనో విజ్ఙానం అందిస్తాయి.
పుస్తకాలు విషయ విజ్ఙానం మనకు అందిస్తాయి
ఒకరు విజ్ఙానం పరంగా ఏదైనా విధానం గురించి బోధించినా, మరొకరు లెక్కలలో సూత్రాలు బోధించినా అవి పుస్తకాలలోనివే. అలాగే వాటిని చదువుకుని కొత్తవిధానం రూపొందించినా అవి మరలా పుస్తకాలలోకి చేరతాయి. లెక్కలలలో సూత్రాలు చదువుకుని కొత్త సూత్రాలు కనుగొన్నా అవి మరలా పుస్తకాలలోకి చేరతాయి. అంటే పుస్తకాలు బోధనా విషయాలను మనకు అందిస్తాయి. కనుగొనబడిన విషయాలను నిక్షిప్తం చేసుకుంటాయి. భవిష్యత్తులోకి ఆ విషయ విజ్ఙానం మోసుకుపోతాయి. తెలుగు పుస్తకాలు విజ్ఙానం అందిస్తాయి.
పరిశోధకులకు విషయ విజ్ఙానం పుస్తకాలే అందిస్తాయి. పుస్తకాలను చూసి బోధించని టీచర్ల దగ్గర ఆసక్తితో తెలసుకున్న విషయాలతో వచ్చే సంకల్పం మరింత శోధనకు దారి తీస్తుంది. అలా పుస్తక పఠనం ద్వారా విజ్ఙాన గనిని త్రవ్వడం ప్రారంభం అయితే. త్రవ్వే కొలది విజ్ఙానం తెలియబడుతుంది. తెలుసుకున్న జ్ఙానం కొత్త విజ్ఙానానికి నాంది కావవచ్చును. పుస్తకాలు పరిశోధనకు కావాల్సిన విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలు చదివే అలవాటు వలన పరిశోధనాత్మక బుద్ది పుట్టవచ్చును.
భక్తి తత్వం, భక్తి సారము, భగవన్నామ మహిమ, భగవన్నామ రహస్యము తదితర తెలుగు భక్తి పుస్తకములు ఉచితంగా చదవడానికి
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం అయితే అన్నింటినీ పరిశీలించే మనసు, తననితానే పరిశీలన చేయడం మొదలు పెడితే, ఆ స్థితిన పండితులు అద్భుతం అంటారు. మనసు మనసుపై యుద్దం చేయడం అంటే, అందులో గెలవడం అంటే లోకాన్ని గెలిచినట్టే అంటారు.
సాధారణంగా ఒకరికి సుఖం అయితే మరొకరికి దు:ఖం అయ్యే సందర్భాలు ఉంటాయని అంటారు. కానీ సుఖాలు, కష్టాలు కలిగించే కాలం దీర్ఘకాలం కష్టాలు ఇవ్వడం కోసం కరోనాని తెచ్చింది. ఈ కరోనా వలన అందరికీ కష్టమే… కష్టానికి, సుఖానికి భావన పొందేది మనసే, దాని నియంత్రణకు అదే సహకరించాలని అంటారు. ఎలా?
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం
లోకంలో అన్ని విషయాలను మనసు పరిశీలన చేస్తే ఆ విషయాల సారం మనసులోనే ఉంటుంది. మనసును మనసే పరిశీలన చేస్తే మనసులో దాగిన మర్మమేదో తెలియవస్తుంది. మనసును పరిశీలన చేయడం అద్భుతం అంటారు. దేనిపై దృష్టిపెడితే దానిపై ఆలోచన చేయడం మనసుకు అలవాటు అంటారు. ఆలోచనల ద్వారా అవగాహనను పెంచుకుంటుందని అంటారు.
Manasu tanani tane parisheelana
అటువంటి మనసు తనని తానే పరిశీలన చేయడం అంటే అద్భుతం అంటారు. ఎందుకంటే లోకంలోని ఎన్నో విషయాలపై మనసు దృష్టిపడి ఉంటుంది. ఎన్నో విషయాలు మనసుకు తెలిసి ఉంటాయి. ఎన్నో విషయాలలో మనసుకు జ్ఙాపకాలుగా ఉంటాయి. కొన్ని విషయాల గురించి మరిచిపోలేని అనుభూతులు మనసులో ఉంటాయి.
నిత్యం ఏదో ఒక బంధంతో మాట్లాడే మాటల ఫలితాలు మనసులో నిక్షిప్తం అయ్యి ఉంటాయి. ఏదైనా వస్తువుతో ఏర్పడిన బంధం భావనలు మనసులో స్టోర్ అవుతాయి. మనసు ఏది చేస్తే అది గుర్తు పెట్టుకోవడం అలవాటుగా కలిగి ఉంటుంది. అది చేతలగా అలవాటు అయితే కొత్త విషయంపై పోతుందని అంటారు.
మనసొక అద్భుతంగా చెబుతారు పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం
మనసొక అద్భుతంగా చెబుతారు. అటువంటి అద్భుతమైన మనసు మాత్రం నిత్యం ఏదో ఆలోచనను కలిగి ఉంటుందని అంటారు. అయితే దీనికి మరొక ప్రత్యేకత చెబుతారు. శ్రద్ధగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు మాత్రం తదేక దృష్టితో ఉంటుందని.. అలా కష్టంలో ఇష్టంగా ఉండే మనసు ఆ మనిషికి మరింత మేలు చేయగలదని అంటారు.
కదిలే కాలం కదలనీయకుండా మనిషిని కూర్చోబెడితే, గంటలతరబడి కూర్చుని పనిచేసేవారికే మనసు ఒకే దృష్టిపై నిలబెట్టడం సాధ్యం అంటారు. అయితే అదుపు లేని మనసుకు బుక్ రీడింగ్ ఒక మందు అంటారు. ఎందుకు అంటే అది ఊహాత్మక లోకంలోకి తీసుకుపోతుంది. బుక్ లో వ్రాయబడిన విషయంతో మనసు మమేకం కావడంలో నిమగ్నం అవుతుంది.
అభిరుచిని బట్టి ఆయా విషయాలలో బుక్స్ పరిజ్ఙానం పెంచుతాయిని అంటారు.
అద్భుతమైన మనసుకు బుక్స్ మనకు మంచి అవగాహనను అందిస్తాయి అంటారు. అభిరుచిని బట్టి ఆయా విషయాలలో బుక్స్ పరిజ్ఙానం పెంచుతాయిని అంటారు. మనకు తెలిసి ఉన్న విషయంలో ఇంకా విశ్లేషణాత్మకమైన బుక్స్ చదివితే మనకు తెలిసిన విషయంలో మరింత అవగాహన పెరిగే అవకాశం ఎక్కువ.
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం
ఉదాహరణకు శ్రీరాముడు దశరధుడి కుమారుడు విల్లునెక్కిపెట్టి సీతమ్మను పరిణయమాడాడు. తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు. సీతాపహరణ జరిగితే వాలీని చంపి సుగ్రీవుని చెలిమి చేశాడు. ఆంజనేయుని సాయంతో సీతమ్మజాడ తెలుసుకున్నాడు. ఆపై లంకకు పోయి రావణవధ చేశాడు… అని తెలుసు.
ఇక మనం రామాయణం పూర్తి బుక్ చదవడం మొదలు పెడితే, రామాయణంలో ఒక్కో ఘట్టం గురించి అవగాహన పెరుగుతూ ఉంటుంది. శ్రీరాముని ధర్మదీక్ష గొప్పతనం తెలియవస్తుంది. గురువుల గొప్పతనం తెలియవస్తుంది. కోపంతో కూడిన నష్టం గురించి అవగాహన ఏర్పడుతుంది. ధర్మాచరణ కష్టంతో కూడినా దాని కీర్తి ఏవిధంగా ఉంటుందో… తెలియబడుతుంది. ఓర్పు వలన ఏమి ఉంటుందో తెలియబడుతుంది. చూసే దృష్టిని బట్టి మనసుకు మరింత ధర్మావగాహన తెలియబడుతుందని అంటారు.
అదే యోగవాశిష్టంబుక్ రోజూ చదవడం మొదలుపెడితే… యుక్తవయస్సు ఏవిధంగా పోతుందో.. తెలియబడుతుంది. కోరికలకు మూలం ఏమిటో తెలియబడుతుంది. మనసుకు మూలం ఏమిటో తెలియబడుతుంది. మనసుకు ఏదో తెలిసినట్టుగా ఉంటుంది. కానీ దాని ఎరుకకు ఏదో చేయాలనే తపన పుడుతుంది. అసలు రాముడు అంతరంగం ఏమిటో తెలియబడుతుంది. రామాయణం తత్వం తెలియబడుతుందని అంటారు.
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం పెంపుకు దోహదపడతాయని అంటారు
ఇలా మనకు పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం పెంపుకు దోహదపడతాయని అంటారు. ఏవిధమైన బుక్స్ రీడ్ చేస్తే అటువంటి భావనలు బలపడతాయి. మన వృత్తి రిత్యా సాంకేతిక నిపుణులమై ఉంటే, సాంకేతిక అభివృద్దిపైన ఉండే బుక్స్ చదివితే సాంకేతికపరమైన విషయాలలో మరింత విషయ పరిజ్ఙానం పెరుగుతుంది.
మనం వృత్తిరిత్యా వైద్యులమైతే వైద్యానికి సంబంధించిన బుక్స్ చదువుతుంటే, వైద్యశాస్త్రపు విషయాలలో పరిజ్ఙానం పెంపుకు బుక్స్ దోహదం అవుతాయి. ఇంటి ఇల్లాలు అయితే, వంటింటి చిట్కాలు గురించిన బుక్స్ చదివితే, మరింత అవగాహన ఏర్పడుతుంది. వంటింటి పొపుల డబ్బా వైద్యరహస్యం కూడా తెలిబయడతాయని అంటారు. విషయ పరిజ్ఙానం పెంచుకోవడానికి బుక్ రీడింగ్ సహాయకారి కాగలదని అంటారు.
బుక్ రీడింగ్ అంటే చదివిన పుస్తకంలోని విషయంపై ఒక స్వీయదృష్టిని పెంపొందించుకోవడం అంటారు. ఒక వ్యక్తి విషయపరిజ్ఙానంబుక్ రూపంలో విశ్లేషణగా ఉంటే, ఆ విశ్లేషణ రీడర్లో మరొక ఆలోచన సృష్టించవచ్చును. ఆ విషయంలో మరింత పురోగతికి దోహదం కావచ్చును. బుక్ రీడింగ్ విషయాల పరిజ్ఙానం పెంపుకు దోహదపడవచ్చును.
ఏదైనా బుక్ చదవుతుంటే ఆబుక్ లోని విషయం మన మనసులో చేరుతుంది. చేరిన విషయం గుర్తుగా ఉంటుంది. బుద్ది వికసిస్తే, ఆ విషయం అసరానికి గుర్తుకు వస్తుందని అంటారు. స్కూల్లో చదివిన విషయాలు, పని చేస్తున్న సమయంలో పనిని సులువుగా చేయడానికి గుర్తుకు వచ్చినట్టుగా… బుద్ది వికసించాలని అంటారు.
Book reading manchi alavatu
బుక్ రీడింగ్ మంచి అలవాటు అయితే అందులోని అంశం మనమదిగదిలో గూడు కట్టుకుంటుంది. ఆ మది గూటిలో మంచి విషయాలు చేరితే మంచి మనిషిగా పేరు వస్తుందని చెబుతారు. చిన్ననాడు చదివిన చందమామ కధల సారం మనమదిలో గూడు కట్టుకుని ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో మనకు అవి గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది.
నీతి కధలు ఎక్కువగా చదివి ఉంటే, అవినీతి పనులపై ఆసక్తి పెరగదు. ఆసక్తి లేని పనిని మనసు ఎప్పటికీ చేయదు. మనసుకు ఎటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటే, అటువంటి పనులే చేస్తుందని… దానిని పరిశీలించిన పండితులు చెబుతారు.
పుస్తకాలలో పేజిలు, పేజిలో పేరాలు, పేరాలో వ్యాక్యాలు, వ్యాక్యంలో పదాలు, పదంలో అక్షరాలు అంతేగా.. మరి అలాంటి కూర్పులో ఉండి భావన బలమైనది మనిషికి విధానం తెలియజేస్తుంది. ఎటువంటి భావనలో కూడిన పుస్తకాలు అటువంటి భావనల మన మనసులో పెంచుతాయి.
మనసొక మంచి మిత్రుడు అనుకూల ఆలోచనలు పెరిగితే, మనసొక శత్రువు.. ప్రతికూల ఆలోచనలు పెరిగితే…
మనలో ఆలోచనలు బయటకు వస్తే, ఆ పనిని బట్టి మనకు పేరు వస్తుంది. ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటి పేరు అయితే మంచి పేరు కోసం మంచి బుక్ లేక మంచి మిత్రుడు అంటారు. ప్రతికూల ఆలోచనలు పెరిగే మనసే ఓ శత్రువుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ శత్రు భావన ఎదుటివారికి ఆపాదిస్తూ, తను మననుండి తప్పించుకుంటుందని అంటారు. కోపం శత్రువైతే అది పుట్టడానికి కారణం మనసు, దాని ఆలోచనలే అంటారు.
మంచి మిత్రుడు మనకు ఎప్పుడూ పాజిటివ్ దృక్పధంతోనే మాట్లాడుతాడు. మనలో వచ్చిన నెగిటివ్ ఆలోచనకు స్వస్తి పలుకుతాడు. దారితప్పుతున్న మనసుకు మంచి ఆలోచనను చెబుతాడు… కానీ పాడైపోయే మిత్రుడికి మాత్రం నెగిటివ్ ఆలోచనలు చెప్పడు. అలా అవసర కాలంలో బుక్ కూడా మన మనసుకు మంచి ఆలోచనలను సృష్టించగలదు.
మనసు మంచి మిత్రుడు కావడానికి బుక్స్ దోహదపడతాయి. మన దృక్పదం సరిగా లేకపోతే మన మనసే మనకు ప్రతికూలంగా మారే ఆలోచనను కూడా పెంచుకోవచ్చును. కాబట్టి ఉత్తముల జీవితచరిత్రను ముందుగా మనకు తెలియబడాలి అంటారు. అపకారం చేసినవారికి కూడా ఉపకారం చేసిన మహానుభావులెందరో ఈ ప్రపంచంలో ఉంటారు.
అపకారికి ఉపకారం చేసిన మహానుభావుల జీవితచరిత్రలు మనకు మార్గదర్శకంగా ఉంటాయని అంటారు. కష్టకాలంలో వారి పాజిటివ్ దృక్పధం మన మనసులో కదలికలు సృష్టించగలవనే వాదన, వారి జీవితచరిత్రల బుక్స్ రీడ్ చేయడంవలన బలపడవచ్చును. బుక్ రీడింగ్ ద్వారా మన మనసును మనం ఓ మిత్రుడి మాదిరిగా మార్చుకోవచ్చును మంచి బుక్స్ రీడ్ చేస్తూ మనసొక మంచి మిత్రుడు లాగా మార్చుకోవచ్చును.
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం స్వీయ ఊహాశక్తిని పెంపొందించుకోవచ్చును.
సినిమా చూడడం అంటే దర్శకుని ఊహను ఫాలో అవ్వడం అయితే బుక్స్ రీడ్ చేయడం అంటే ఆ బుక్ లోని అంశంతో స్వీయఆలోచనకు మరింత పదును పెంచుకోడవం అంటారు.
ఒక సినిమాను సృష్టించిన దర్శకుడుకి బుక్ రీడింగ్ అనే అలవాటు ఉంటుందని అంటారు. పుస్తక జ్ఙానం వలన సామాజిక స్థితిపై అవగాహన ఉంటుంది. భవిష్యత్తు సమాజం గురించిన ఆలోచనలు పెరగవచ్చును. వ్యక్తి ప్రవర్తనకు పరిస్థితలు ప్రభావం గురించిన అవగాహన ఏర్పడవచ్చును. అవగాహన ఊహకు దారితీయవచ్చును. అనేక ఊహాలు కొన్ని సంఘటనలను ఊహించే వరకు సాగవచ్చును. బుక్స్ చదవడం వలన ఆ పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం పెరిగి స్వీయ ఊహాశక్తిని పెంపొందించుకోవచ్చును అంటారు.
పుస్తక జ్ఙానం వలన ఏర్పడిన విషయాల పరిజ్ఙానం మనసులో ఊహను సృష్టించగలదు అంటారు. భక్తి బుక్స్ చదివి చదివి, భక్తుల గురించి తెలుసుకుని తెలుసుకుని, భగవానుడి గురించి ఆలోచన చేసి చేసి భగవానుడు ఎలా ఉంటాడో మనం చూసిన విగ్రహరూపం మదిలో మెదిలి మెదలి… ఆ విగ్రహరూపం మనతో మాట్లాడడం మొదలుపెడితే ఆభక్తి పరాకాష్టకు ప్రతీక అంటారు. ఇలా ఆద్యాత్మిక పుస్తక జ్ఙానం వలన ఏర్పడిన భక్తి విషయాల పరిజ్ఙానం ఆ భగవంతుని స్వరూపాన్నే నింగినుండి నేలకు దింపగలదని అంటారు.
తెలుగు బుక్స్ రీడ్ చేయడం ద్వారా అవగాహన ఎక్కువ
పుస్తకం వలన ఏర్పడిన జ్ఙానం పుస్తకాల ద్వారా ఏర్పడిన పరిశీలన పరిజ్ఙానం మరొక బుక్ సృష్టించే శక్తిని కూడా పొందగలదని అంటారు. ఏ విషయంలో బుక్స్ ఎక్కువగా చదివితే ఆ విషయాల పరిజ్ఙానం ఫలితంగా స్వీయ ఊహాశక్తిని పెంపొందించుకోవచ్చును. సినిమా రంగంతో పరిచయం ఉంటే ఒక కొత్త సినిమా కధను కూడా సృష్టించే ఊహాత్మక శక్తి బుక్ రీడింగ్ ద్వారా ఏర్పడగలదని అంటారు.
తెలుగు బుక్ రీడ్ చేయడం ద్వారా తెలుగులో మరింత విజ్ఙానం పొందవచ్చును. తెలుగు వ్యాకరణం బుక్స్ రీడ్ చేస్తే, వ్యాకరణ నైపుణ్యం సంపాదించవ్చని అంటారు. తెలుగు భక్తి బుక్స్ రీడ్ చేస్తే, భక్తి పరమైన పరిపక్వత పెరుగుతుందని అంటారు. సినిమా బుక్స్ రీడ్ చేస్తే సినిమా జ్ఙానం పెరుగుతుందని అంటారు.
ఇలా ఏవిషయంలో ఎక్కువగా తెలుగుబుక్స్ రీడ్ చేస్తు ఉంటే, ఆయా విషయాలలో పరిజ్ఙానం పెరగవచ్చును. తెలుగుబుక్స్ రీడ్ ద్వారా అనేక విషయాలలో మనకు అవగాహన పెరగవచ్చును. అయితే తెలుగుబుక్స్ రీడ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో కూడిన శ్రద్ద ముఖ్యమంటారు. ఏకాగ్రతతో చేస్తున్నప్పుడు మనసు దృష్టి చేస్తున్న పనిలో నిమగ్నమై ఉంటుంది. అది తెలుగుబుక్ రీడింగ్ అయితే ఆబుక్ లోని విషయంపై సరైన దృష్టితో ఉంటుంది. ఆబుక్ రీడ్ చేసిన ఫలితం పొందవచ్చుని అంటారు.
Vishayam Telugulo unte
విషయం తెలుగులో ఉంటే, ఆ తెలుగుబుక్ ద్వారా మనకు అవగాహన తేలిక… కారణం మన మాతృభాష తెలుగు కాబట్టి.. అక్షరజ్ఙానంతో బాటు వాడుక భాష ద్వారా తెలుగులో అనేక పదాలకు అనుభవూర్వక ఆలోచనా శక్తి కూడా ఉంటుందని అంటారు. ఆవిధంగా తెలుగుబుక్ రీడ్ చేస్తుంటే, ఆ బుక్ లో ఉన్న విషయంపై మనకు మరింత అవగాహన ఏర్పడకపోదు.
మన వాడుక భాషలో బుక్ రీడ్ చేయడంద్వారా తెలుగులో అవగాహన బాగా ఉంటుంది. తెలుగుబుక్స్ అనేక వర్గాలలో మనకు లభిస్తాయి. గతంలో తెలుగుబుక్స్ రీడ్ చేయడానికి కొనుగోలుకు మరొక ప్రదేశానికి వెళ్ళవలసి ఉండేది. ఇప్పుడు కొన్ని వర్గాలలో ఉచితంగా తెలుగుబుక్స్ మనకు ఆన్ లైన్లో రీడ్ చేయడానికి ఉచితంగానే లభిస్తున్నాయి.
తెలుగులో బుక్స్ రీడ్ చేయడానికి ఆన్ లైన్ ద్వారా పిడిఎఫ్ బుక్స్ ఉచితంగా లభిస్తున్నాయి.
శ్రీరామాయణంలో రాముడు చరిత్రను తెలియజేస్తూ, శ్రీరాముని ధర్మాచరణను తెలియపరుస్తుంది. అయితే యోగవాశిష్ఠము మోక్షసాధనకు మంచి పుస్తకంగా చెప్పబడుతుంది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…
యోగవాశిష్ఠము తెలుగుబుక్ ఎవరు చదవవచ్చు అంటే… ఈ బుక్ లో ఇలా వ్రాయబడి ఉంది. ‘నేను నాది అనే అహంకార బంధనంలో చిక్కుపడి, దు:ఖాలను అనుభవిస్తూ, ఈ సంసార బంధనాల నుండి విముక్తి కోరుకునేవారు అయ్యి ఉండి ఆ భావన బాగ బలపడి, మరీ అజ్ఙాని కాకుండా, పూర్తి జ్ఙాని కాకుండా ఉన్నవారు యోగవాశిష్ఠముతెలుగుబుక్ రీడ్ చేయవచ్చని’ వ్రాసి ఉన్నారు.
ఆరుకాండల శ్రీరామాయణంలో శ్రీరాముడు జననం, విద్యాభ్యాసం, వివాహం, అరణ్యాలకు వెళ్లడం, సుగ్రీవునితో కలవడం, హనుమంతుడు సీతాదర్శణం లాంటి ఘట్టాలతో ధర్మం తెలియజేస్తూ ఉంటే, యోగవాశిష్టము శ్రీరాముని వైరాగ్య భావనలు, వాటికి గురువుల బోధ ఉంటుంది. ఈ బోధలో తత్వం గురించి తెలియజేయబడుతుంది. శ్రీరాముడు జీవన్ముక్తుడు ఎలా అయ్యింది యోగవాశిష్ఠముతెలుగుబుక్ లో ఉంటుంది.
విద్యాభ్యాసం పూర్తయిన శ్రీరామునికితీర్ధయాత్రలు చేయాలనే ఆలోచన పుడుతుంది. వెంటనే శ్రీరామచంద్రమూర్తి దశరధ మహారాజుగారి అనుమతితో తీర్ధయాత్రలను బయలుదేరతాడు. పుణ్యనదులలో స్నానం చేస్తూ, పుణ్యక్షేత్రములను దర్శించుకుని తీర్ధయాత్రలు చేసిన శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వస్తాడు.
యోగవాశిష్ఠము శ్రీరామునికి వశిష్ఠ బోధ
అయోధ్యకు తిరిగి వచ్చినా శ్రీరామునిలో స్పష్టమైన మార్పు కనబడుతుంది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా మౌనంగానే ఉంటూ, ఒక తాపసిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు అయోధ్యకు రావడం జరుగుతుంది. అయోధ్యకు వచ్చిని విశ్వామిత్రమహర్షి శ్రీరామచంద్రమూర్తిని తనతో అడవులకు పంపవలసినదిగా దశరధుడిని అడుగుతాడు. అయితే మొదట్లో అందుకు అంగీకరించని దశరధుడు, వశిష్ఠుడి సలహాతో అంగీకరిస్తాడు. అప్పుడే దశరధుడు శ్రీరామునిలో తీర్ధయాత్రల తర్వాత కలిగిన మార్పు గురించి విశ్వామిత్రుడితో చెప్పి, శ్రీరాముని విశ్వామిత్రుడు, వశిష్ఠుల సమక్షంలోకి పిలిపిస్తాడు.
విశ్వామిత్రుడు – వశిష్ఠుల ముందర శ్రీరాముడు తన వైరాగ్యభావనలు తెలియజేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముని జ్ఙానిగా అభివర్ణించి, శ్రీరామునిలో ఆ జ్ఙానమును పరిపుష్టం చేయడానికిగాను వశిష్ఠుడిని శ్రీరామునకు బోధ చేయవలసినదిగా అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామునకు వివిధ ఉపాఖ్యానములుగా చేసిన తత్వబోధనే యోగవాశిష్ఠముగా చెప్పబడింది. యోగవాశిష్ఠముతెలుగుబుక్ రీడ్ చేయడం ద్వారా శ్రీరామునకు వివాహం కంటే ముందుగానే, అంటే యవ్వనంలోకి ప్రవేశించిన మొదట్లోనే వైరాగ్యం వచ్చినట్టుగానే తెలియవస్తుంది.
శ్రీరామాయణంలో రాముని ప్రవర్తన అందరికీ ఆదర్శంగా చెబుతారు. యోగవాశిష్ఠములో శ్రీరామాయణం ఆంతర్యంగా చూస్తే, శ్రీరామునకు వివాహం కంటే ముందుగానే తత్వం తెలియబడింది. గురువుల బోధతో మోక్షమునకు అన్వేషణ జరిగింది. అందుకే యోగవాశిష్ఠము భక్తిజ్ఙానం కోసం తాపత్రయపడుతూ, పలు భక్తి పుస్తకములపై విచారణ జరుపుతుండేవారు చదవడం వలన మరింత తాత్విక ప్రయోజనం కలుగుతుందంటారు.
యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… తెలుసుకునే ముందు కొంత పురాణ పరిశీలన అవసరం
యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… తెలుసుకోవడానికి ముందుగానే కొన్ని భక్తి పుస్తకములు చదివి ఉండడం మరియు వాటిలోని ధర్మ సూక్ష్మముల గురించి అవగాహన ఏర్పరచుకుని ఉండడం మేలు అని అంటారు. లేదా ప్రసిద్ద ప్రవచనకర్తల ప్రవచనములు వింటూ తాత్విక విచారణ చేస్తున్నవారు ఈ యోగవాశిష్ఠముతెలుగుబుక్ చదవవచ్చు. తత్వచింతన చేస్తున్నవారికి యోగవాశిష్ఠము మరింత ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుందనే విషయం ఈ బుక్ లోనే తెలియజేయబడింది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… తెలుసుకునే ముందు కొంత పురాణ పరిశీలన అవసరం అంటారు.
తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి.
తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు.
రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు.
తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు.
రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు.
తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు ఇతరత్రా భావనలు రేకెత్తిస్తూ…ఉంటాయి. మంచి మౌనం లాంటిది అయితే ఇతరములు అరుపులులాంటివి అవుతాయి. మౌనం మనిషిని కుదురుగా ఉంచితే, అరుపులు ఆవేశమును ప్రేరేపిస్తాయి. అలా పుస్తకములు మంచివి, మంచిని పెంచేవి ఎంపిక చేసుకుని చదువుకుంటే వాటి వలన మనసుకు విజ్ఙానం వస్తుంది.”
రీడ్స్: ”వాట్ ఇజ్ విజ్ఙానం”
తెలుగుతాతయ్య: ”విజ్ఙానం మీన్స్ నాలెడ్జ్ ఎబౌట అవర్ సర్కమ్ స్టేన్స్ విత్ నీడెడ్ థింగ్స్” అని తెలుగు ఇలా చెప్పనారంభించాడు తెలుగుతాత రీడ్స్…తో”విజ్ఙానం అంటే తెలిసి ఉండడం కాబట్టి, నిండుకుండ తొణకకుండా ఉన్నట్టు, అన్ని తెలిసిన మనసు అనవసరంగా ఆవేశపడకుండా ఆలోచనతో కూడిన ఆవేశాన్ని అవసరమైతేనే తీసుకుంటుంది. తెలిసిన మనసుకు తెలియని మనసుకు ప్రవర్తనలో తేడా ఉంటుంది. అలాగే ఎదుటివారిని ప్రభావితం చేయడంలోనూ అదే ప్రభావం చూపుతుంది. కాబట్టి మనసుకు అది నివసించే మనిషిని బట్టి తగు జ్ఙానం అవసరం అంటారు.
ఏమి తెలుసుకోవాలి…అంటే మనకు తెలియనవి చిన్ననాటి నుండి అమ్మనాన్న దగ్గర నుండి కొంత నేర్చుకుంటే, అన్నదమ్ములు, అక్కచెల్లెలు దగ్గరనుండి మరికొంత నేర్చుకుంటాము. తర్వాత గురువులు, గురుకులంలో స్నేహితుల ద్వారా మరికొంత నేర్చుకుంటూ పెరుగుతాము. అయితే అక్కడికే అవసరమైన జ్ఙానం బ్రతుకుబండిని నడపడానికి వచ్చేస్తుంది.”
రీడ్స్: ”వాట్ ఇజ్ గురుకులం….తెలుగుతానా”
తెలుగుతాతయ్య: ”గురుకులం అంటే స్కూల్” అని మరలా ఇలా చెప్పసాగాడు
”అయితే అనుకోని కష్టాలు వచ్చినప్పడు కూడా మనకు మునుపు చెప్పబడిన నీతులు కానీ మంచిమాటలు కానీ మరిచే అవకాశం ఉంటుంది. కొందరైతే నీతులు స్వీకరించకపోవచ్చును. ఇలాంటి సమయంలో మంచి పుస్తకం చదివే అలవాటు ఉంటే, కాలంలో కష్టం కలిగినప్పుడు అప్పటికి ఆ పరిస్థితులలో అవసరమైన జ్ఙానం ఇచ్చే పుస్తకం వైపే వెళ్లే అవకాశాలు ఎక్కువ అంటారు. కాబట్టి పుస్తకములు చదవడం అనేది మంచి అలవాటుగా చెబుతారు.
పుస్తకం ఎందుకు చదవాలంటే, పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకు ఒక ఊహాత్మక శక్తి అభివృద్ది చెందుతుంది, అంటారు. ఒక సినిమా తీసే దర్శకుడు అయినా ఒక రచయిత రచించిన ఊహాత్మక కల్పిత కధ ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తారు. అంటే కోట్టు ఖర్చు చేయించే ఊహాశక్తి కేవలం పుస్తకములు చదివి, ఆలోచించే అలవాటు ఉన్నవారికి సాధ్యం అన్నమాట!” అంటూ తెలుగు తాతయ్య ముగించాడు.
తెలుగు రీడ్స్ బ్లాగు విజిట్ చేయండి. తెలుగులో కొన్ని కేటగిరీలలో గల పోస్టులను రీడ్ చేయండి.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు
చిన్న పిల్లల తెలుగు పేర్లు గల పేజిలు దర్శించండి. అచ్చ తెలుగులో బాలబాలికల పేర్లు చూడండి. తెలుగులో రెండు, మూడు పదాలతో కూడిన పేర్లు కూడా మీకు ఆ పేజిలలో ఉంటాయి.
బాలుర కొరకు గల తెలుగు పేర్లను ఒక పేజిలో బాలికల కొరకు గల తెలుగు పేర్లను మరొక పేజిలో ఉంటాయి. అచ్చ తెలుగులో మన తెలుగు పేర్లను చూడండి.
ఇంకా ఈ తెలుగు రీడ్స్ బ్లాగులో బుక్స్ గురించి తెలుసుకోవచ్చును. అనేక రకాల తెలుగు ఆన్ లైన్ బుక్స్ మనకు పిడిఎఫ్ రూపంలో లభిస్తాయి.
వాటిని రీడ్ చేయడానికి ఈ బ్లాగుపోస్టులలో గల లింకును క్లిక్ చేసి తెలుగు బుక్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
పురాణాలలో గల తెలుగు బుక్స్ మీరు రీడ్ చేయడానికి ఈ బ్లాగు పోస్టులలో గల లింకుల ద్వారా మీ పరికర నిల్వలోకి దిగుమతి చేయవచ్చును.
తెలుగు పురాణ పుస్తకాలు శ్రీరామాయణం, శ్రీమద్భగవద్గీత, శ్రీమద్భాగవతం, మహాభారతం వంటి బుక్స్ పూర్తిగా పిడిఎఫ్ రూపంలో ఈ బ్లాగులో పోస్ట్ చేయబడిన లింకుల ద్వారా పొందవచ్చును.
పుస్తకం చదవడం మంచి అలవాటు అంటారు. పురాణ పుస్తకాలు చదవడం ఉత్తమమైన అలవాటు అంటారు. పురాణ విజ్ఙాన పుస్తకాలు చదవడం ఉపయుక్తమంటారు. ఎలాగైనా పుస్తకాలు మేలు అంటారు.
భక్తి పుస్తకాలు చదవడం అంటే భక్తి భావనతో మనసు కాసేపు ప్రశాంతతో ఉండడమే… భక్తి బలం కాలంలో కలిసి వస్తుందంటారు. భక్తిబలం స్త్రోత్రపఠనంతో పెరుగుతుందని అంటారు.
బుక్స్ గురించి చాల గొప్పగా చెబుతారు. పుస్తకం నిత్యం వెంట ఉండగలిగే మంచి స్నేహితుడు వంటిది. పుస్తకంలో చదివిన మంచి విషయాలు కష్టకాలంలో ఓ మిత్రుని మాదిరి సాయపడతాయని అంటారు.
మిత్రుడు బాహ్యంగా ఉంటాడు. పుస్తకం ఆంతర్యంలో నిత్యమిత్రుడుగా ఉంటుంది. అటువంటి మిత్రుడు ఎలాంటి పుస్తకాలు చదివితే అలాంటి మిత్రుడు మనమే తయారు చేసుకుంటాం.
స్నేహితుడు మన ప్రవర్తనను తెలిసి ఉండడం వలన, మనకు సరైన సమయంలో మంచి సలహా ఇవ్వగలడు. అలాగే మంచి పుస్తకం చదివే మనసుకు కూడా పుస్తకం ఓ స్నేహితుడులాంటిదే. మనతో ఉండే మిత్రుడు మంచి సలహానే ఇస్తాడు. అలాగే మంచి పుస్తకం ఎప్పుడూ మనసులో మంచి ఆలోచనలనే సృష్టిస్తాయి.
ఇంకా ఒక పుస్తకం మనసును ఒక విషయంపై దృష్టి పెట్టేలాగా చేస్తుంది. పుస్తకంలో ఉండే ప్రధాన లక్షణం ఇదే… ఈ లక్షణం వలన మన మనసు ఏకాగ్రత పెరుగుతుంది.
బుక్స్ గురించి తెలియజేస్తూ, టెక్నాలజీ గురించి, సినిమాల గురించి కూడా పోస్టుల ఉండగలవు.