పుస్తకం చదువుట మంచి అలవాటు?

తెలుగుతాతయ్య, మనవడు రీడ్స్ మరలా సాయంవేళ ఒకచోట ఉండగా రీడ్స్ ఫోన్లో ఏదో వీక్షిస్తుండగా…వాని తాతగారు అక్కడికి వచ్చి…ఇలా…ప్రశ్నించడంతో సంభాషణలు ప్రారంభం చదవండి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

తెలుగుతాతయ్య: ”ఏరా…రీడ్స్…ఏమి చేస్తున్నావు…” అన్నాడు.

రీడ్స్: ”ఫోను చూస్తున్నా…తెలుగుతానా” అని బదులిచ్చాడు.

తెలుగు తాతయ్య: ”చూడు…రీడ్స్…ఎప్పుడూ ఆ నొక్కుకునే ఫోను వలన ఏమి ప్రయోజనం, దానికన్నా ఏదైనా మంచి పుస్తకం చదువుకో…బాగుపడతావు” అన్నాడు.

రీడ్స్: ”వై..ఎందుకు…నేను పుస్తకం చదవాలి” అన్నాడు.

తెలుగుతాతయ్య: ”మంచి పుస్తకము ఎప్పుడూ మంచి భావనలే తీసుకువస్తే, ఇతర పుస్తకములు ఇతరత్రా భావనలు రేకెత్తిస్తూ…ఉంటాయి. మంచి మౌనం లాంటిది అయితే ఇతరములు అరుపులులాంటివి అవుతాయి. మౌనం మనిషిని కుదురుగా ఉంచితే, అరుపులు ఆవేశమును ప్రేరేపిస్తాయి. అలా పుస్తకములు మంచివి, మంచిని పెంచేవి ఎంపిక చేసుకుని చదువుకుంటే వాటి వలన మనసుకు విజ్ఙానం వస్తుంది.”

రీడ్స్: ”వాట్ ఇజ్ విజ్ఙానం”

తెలుగుతాతయ్య: ”విజ్ఙానం మీన్స్ నాలెడ్జ్ ఎబౌట అవర్ సర్కమ్ స్టేన్స్ విత్ నీడెడ్ థింగ్స్” అని తెలుగు ఇలా చెప్పనారంభించాడు తెలుగుతాత రీడ్స్…తో”విజ్ఙానం అంటే తెలిసి ఉండడం కాబట్టి, నిండుకుండ తొణకకుండా ఉన్నట్టు, అన్ని తెలిసిన మనసు అనవసరంగా ఆవేశపడకుండా ఆలోచనతో కూడిన ఆవేశాన్ని అవసరమైతేనే తీసుకుంటుంది. తెలిసిన మనసుకు తెలియని మనసుకు ప్రవర్తనలో తేడా ఉంటుంది. అలాగే ఎదుటివారిని ప్రభావితం చేయడంలోనూ అదే ప్రభావం చూపుతుంది. కాబట్టి మనసుకు అది నివసించే మనిషిని బట్టి తగు జ్ఙానం అవసరం అంటారు.

ఏమి తెలుసుకోవాలి…అంటే మనకు తెలియనవి చిన్ననాటి నుండి అమ్మనాన్న దగ్గర నుండి కొంత నేర్చుకుంటే, అన్నదమ్ములు, అక్కచెల్లెలు దగ్గరనుండి మరికొంత నేర్చుకుంటాము. తర్వాత గురువులు, గురుకులంలో స్నేహితుల ద్వారా మరికొంత నేర్చుకుంటూ పెరుగుతాము. అయితే అక్కడికే అవసరమైన జ్ఙానం బ్రతుకుబండిని నడపడానికి వచ్చేస్తుంది.”

రీడ్స్: ”వాట్ ఇజ్ గురుకులం….తెలుగుతానా”

తెలుగుతాతయ్య: ”గురుకులం అంటే స్కూల్” అని మరలా ఇలా చెప్పసాగాడు

”అయితే అనుకోని కష్టాలు వచ్చినప్పడు కూడా మనకు మునుపు చెప్పబడిన నీతులు కానీ మంచిమాటలు కానీ మరిచే అవకాశం ఉంటుంది. కొందరైతే నీతులు స్వీకరించకపోవచ్చును. ఇలాంటి సమయంలో మంచి పుస్తకం చదివే అలవాటు ఉంటే, కాలంలో కష్టం కలిగినప్పుడు అప్పటికి ఆ పరిస్థితులలో అవసరమైన జ్ఙానం ఇచ్చే పుస్తకం వైపే వెళ్లే అవకాశాలు ఎక్కువ అంటారు. కాబట్టి పుస్తకములు చదవడం అనేది మంచి అలవాటుగా చెబుతారు.

పుస్తకం ఎందుకు చదవాలంటే, పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకు ఒక ఊహాత్మక శక్తి అభివృద్ది చెందుతుంది, అంటారు. ఒక సినిమా తీసే దర్శకుడు అయినా ఒక రచయిత రచించిన ఊహాత్మక కల్పిత కధ ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తారు. అంటే కోట్టు ఖర్చు చేయించే ఊహాశక్తి కేవలం పుస్తకములు చదివి, ఆలోచించే అలవాటు ఉన్నవారికి సాధ్యం అన్నమాట!” అంటూ తెలుగు తాతయ్య ముగించాడు.

గురుకుల్ అనే వెబ్ సైటులో అనేక రకాల బుక్స్ వివిధ వర్గాలుగా విభజించి పి.డి.ఎఫ్ ఫార్మట్లో ఉచితంగా లభిస్తున్నాయి. అక్కడ మీకు నచ్చిన మీరు మెచ్చిన పుస్తకము మీ కంప్యూటర్ / ట్యాబ్/ స్మార్ట్ ఫోను ఇతర సాంకేతిక పరికరములలో చదువుకోవచ్చును.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్….