పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం అయితే అన్నింటినీ పరిశీలించే మనసు, తననితానే పరిశీలన చేయడం మొదలు పెడితే, ఆ స్థితిన పండితులు అద్భుతం అంటారు. మనసు మనసుపై యుద్దం చేయడం అంటే, అందులో గెలవడం అంటే లోకాన్ని గెలిచినట్టే అంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

సాధారణంగా ఒకరికి సుఖం అయితే మరొకరికి దు:ఖం అయ్యే సందర్భాలు ఉంటాయని అంటారు. కానీ సుఖాలు, కష్టాలు కలిగించే కాలం దీర్ఘకాలం కష్టాలు ఇవ్వడం కోసం కరోనాని తెచ్చింది. ఈ కరోనా వలన అందరికీ కష్టమే… కష్టానికి, సుఖానికి భావన పొందేది మనసే, దాని నియంత్రణకు అదే సహకరించాలని అంటారు. ఎలా?

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం

లోకంలో అన్ని విషయాలను మనసు పరిశీలన చేస్తే ఆ విషయాల సారం మనసులోనే ఉంటుంది. మనసును మనసే పరిశీలన చేస్తే మనసులో దాగిన మర్మమేదో తెలియవస్తుంది. మనసును పరిశీలన చేయడం అద్భుతం అంటారు. దేనిపై దృష్టిపెడితే దానిపై ఆలోచన చేయడం మనసుకు అలవాటు అంటారు. ఆలోచనల ద్వారా అవగాహనను పెంచుకుంటుందని అంటారు.

అటువంటి మనసు తనని తానే పరిశీలన చేయడం అంటే అద్భుతం అంటారు. ఎందుకంటే లోకంలోని ఎన్నో విషయాలపై మనసు దృష్టిపడి ఉంటుంది. ఎన్నో విషయాలు మనసుకు తెలిసి ఉంటాయి. ఎన్నో విషయాలలో మనసుకు జ్ఙాపకాలుగా ఉంటాయి. కొన్ని విషయాల గురించి మరిచిపోలేని అనుభూతులు మనసులో ఉంటాయి.

నిత్యం ఏదో ఒక బంధంతో మాట్లాడే మాటల ఫలితాలు మనసులో నిక్షిప్తం అయ్యి ఉంటాయి. ఏదైనా వస్తువుతో ఏర్పడిన బంధం భావనలు మనసులో స్టోర్ అవుతాయి. మనసు ఏది చేస్తే అది గుర్తు పెట్టుకోవడం అలవాటుగా కలిగి ఉంటుంది. అది చేతలగా అలవాటు అయితే కొత్త విషయంపై పోతుందని అంటారు.

మనసొక అద్భుతంగా చెబుతారు పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం
మనసొక అద్భుతంగా చెబుతారు పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం

మనసొక అద్భుతంగా చెబుతారు. అటువంటి అద్భుతమైన మనసు మాత్రం నిత్యం ఏదో ఆలోచనను కలిగి ఉంటుందని అంటారు. అయితే దీనికి మరొక ప్రత్యేకత చెబుతారు. శ్రద్ధగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు మాత్రం తదేక దృష్టితో ఉంటుందని.. అలా కష్టంలో ఇష్టంగా ఉండే మనసు ఆ మనిషికి మరింత మేలు చేయగలదని అంటారు.

కదిలే కాలం కదలనీయకుండా మనిషిని కూర్చోబెడితే, గంటలతరబడి కూర్చుని పనిచేసేవారికే మనసు ఒకే దృష్టిపై నిలబెట్టడం సాధ్యం అంటారు. అయితే అదుపు లేని మనసుకు బుక్ రీడింగ్ ఒక మందు అంటారు. ఎందుకు అంటే అది ఊహాత్మక లోకంలోకి తీసుకుపోతుంది. బుక్ లో వ్రాయబడిన విషయంతో మనసు మమేకం కావడంలో నిమగ్నం అవుతుంది.

అభిరుచిని బట్టి ఆయా విషయాలలో బుక్స్ పరిజ్ఙానం పెంచుతాయిని అంటారు.

అద్భుతమైన మనసుకు బుక్స్ మనకు మంచి అవగాహనను అందిస్తాయి అంటారు. అభిరుచిని బట్టి ఆయా విషయాలలో బుక్స్ పరిజ్ఙానం పెంచుతాయిని అంటారు. మనకు తెలిసి ఉన్న విషయంలో ఇంకా విశ్లేషణాత్మకమైన బుక్స్ చదివితే మనకు తెలిసిన విషయంలో మరింత అవగాహన పెరిగే అవకాశం ఎక్కువ.

https://www.youtube.com/watch?v=7jFVRL0aXJw
పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం

ఉదాహరణకు శ్రీరాముడు దశరధుడి కుమారుడు విల్లునెక్కిపెట్టి సీతమ్మను పరిణయమాడాడు. తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు. సీతాపహరణ జరిగితే వాలీని చంపి సుగ్రీవుని చెలిమి చేశాడు. ఆంజనేయుని సాయంతో సీతమ్మజాడ తెలుసుకున్నాడు. ఆపై లంకకు పోయి రావణవధ చేశాడు… అని తెలుసు.

ఇక మనం రామాయణం పూర్తి బుక్ చదవడం మొదలు పెడితే, రామాయణంలో ఒక్కో ఘట్టం గురించి అవగాహన పెరుగుతూ ఉంటుంది. శ్రీరాముని ధర్మదీక్ష గొప్పతనం తెలియవస్తుంది. గురువుల గొప్పతనం తెలియవస్తుంది. కోపంతో కూడిన నష్టం గురించి అవగాహన ఏర్పడుతుంది. ధర్మాచరణ కష్టంతో కూడినా దాని కీర్తి ఏవిధంగా ఉంటుందో… తెలియబడుతుంది. ఓర్పు వలన ఏమి ఉంటుందో తెలియబడుతుంది. చూసే దృష్టిని బట్టి మనసుకు మరింత ధర్మావగాహన తెలియబడుతుందని అంటారు.

అదే యోగవాశిష్టం బుక్ రోజూ చదవడం మొదలుపెడితే… యుక్తవయస్సు ఏవిధంగా పోతుందో.. తెలియబడుతుంది. కోరికలకు మూలం ఏమిటో తెలియబడుతుంది. మనసుకు మూలం ఏమిటో తెలియబడుతుంది. మనసుకు ఏదో తెలిసినట్టుగా ఉంటుంది. కానీ దాని ఎరుకకు ఏదో చేయాలనే తపన పుడుతుంది. అసలు రాముడు అంతరంగం ఏమిటో తెలియబడుతుంది. రామాయణం తత్వం తెలియబడుతుందని అంటారు.

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం పెంపుకు దోహదపడతాయని అంటారు

ఇలా మనకు పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం పెంపుకు దోహదపడతాయని అంటారు. ఏవిధమైన బుక్స్ రీడ్ చేస్తే అటువంటి భావనలు బలపడతాయి. మన వృత్తి రిత్యా సాంకేతిక నిపుణులమై ఉంటే, సాంకేతిక అభివృద్దిపైన ఉండే బుక్స్ చదివితే సాంకేతికపరమైన విషయాలలో మరింత విషయ పరిజ్ఙానం పెరుగుతుంది.

మనం వృత్తిరిత్యా వైద్యులమైతే వైద్యానికి సంబంధించిన బుక్స్ చదువుతుంటే, వైద్యశాస్త్రపు విషయాలలో పరిజ్ఙానం పెంపుకు బుక్స్ దోహదం అవుతాయి. ఇంటి ఇల్లాలు అయితే, వంటింటి చిట్కాలు గురించిన బుక్స్ చదివితే, మరింత అవగాహన ఏర్పడుతుంది. వంటింటి పొపుల డబ్బా వైద్యరహస్యం కూడా తెలిబయడతాయని అంటారు. విషయ పరిజ్ఙానం పెంచుకోవడానికి బుక్ రీడింగ్ సహాయకారి కాగలదని అంటారు.

బుక్ రీడింగ్ అంటే చదివిన పుస్తకంలోని విషయంపై ఒక స్వీయదృష్టిని పెంపొందించుకోవడం అంటారు. ఒక వ్యక్తి విషయపరిజ్ఙానం బుక్ రూపంలో విశ్లేషణగా ఉంటే, ఆ విశ్లేషణ రీడర్లో మరొక ఆలోచన సృష్టించవచ్చును. ఆ విషయంలో మరింత పురోగతికి దోహదం కావచ్చును. బుక్ రీడింగ్ విషయాల పరిజ్ఙానం పెంపుకు దోహదపడవచ్చును.

ఏదైనా బుక్ చదవుతుంటే ఆబుక్ లోని విషయం మన మనసులో చేరుతుంది. చేరిన విషయం గుర్తుగా ఉంటుంది. బుద్ది వికసిస్తే, ఆ విషయం అసరానికి గుర్తుకు వస్తుందని అంటారు. స్కూల్లో చదివిన విషయాలు, పని చేస్తున్న సమయంలో పనిని సులువుగా చేయడానికి గుర్తుకు వచ్చినట్టుగా… బుద్ది వికసించాలని అంటారు.

బుక్ రీడింగ్ మంచి అలవాటు అయితే అందులోని అంశం మనమదిగదిలో గూడు కట్టుకుంటుంది. ఆ మది గూటిలో మంచి విషయాలు చేరితే మంచి మనిషిగా పేరు వస్తుందని చెబుతారు. చిన్ననాడు చదివిన చందమామ కధల సారం మనమదిలో గూడు కట్టుకుని ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో మనకు అవి గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది.

నీతి కధలు ఎక్కువగా చదివి ఉంటే, అవినీతి పనులపై ఆసక్తి పెరగదు. ఆసక్తి లేని పనిని మనసు ఎప్పటికీ చేయదు. మనసుకు ఎటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటే, అటువంటి పనులే చేస్తుందని… దానిని పరిశీలించిన పండితులు చెబుతారు.

పుస్తకాలలో పేజిలు, పేజిలో పేరాలు, పేరాలో వ్యాక్యాలు, వ్యాక్యంలో పదాలు, పదంలో అక్షరాలు అంతేగా.. మరి అలాంటి కూర్పులో ఉండి భావన బలమైనది మనిషికి విధానం తెలియజేస్తుంది. ఎటువంటి భావనలో కూడిన పుస్తకాలు అటువంటి భావనల మన మనసులో పెంచుతాయి.

మనసొక మంచి మిత్రుడు అనుకూల ఆలోచనలు పెరిగితే, మనసొక శత్రువు.. ప్రతికూల ఆలోచనలు పెరిగితే…

మనలో ఆలోచనలు బయటకు వస్తే, ఆ పనిని బట్టి మనకు పేరు వస్తుంది. ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటి పేరు అయితే మంచి పేరు కోసం మంచి బుక్ లేక మంచి మిత్రుడు అంటారు. ప్రతికూల ఆలోచనలు పెరిగే మనసే ఓ శత్రువుగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ శత్రు భావన ఎదుటివారికి ఆపాదిస్తూ, తను మననుండి తప్పించుకుంటుందని అంటారు. కోపం శత్రువైతే అది పుట్టడానికి కారణం మనసు, దాని ఆలోచనలే అంటారు.

మంచి మిత్రుడు మనకు ఎప్పుడూ పాజిటివ్ దృక్పధంతోనే మాట్లాడుతాడు. మనలో వచ్చిన నెగిటివ్ ఆలోచనకు స్వస్తి పలుకుతాడు. దారితప్పుతున్న మనసుకు మంచి ఆలోచనను చెబుతాడు… కానీ పాడైపోయే మిత్రుడికి మాత్రం నెగిటివ్ ఆలోచనలు చెప్పడు. అలా అవసర కాలంలో బుక్ కూడా మన మనసుకు మంచి ఆలోచనలను సృష్టించగలదు.

మనసు మంచి మిత్రుడు కావడానికి బుక్స్ దోహదపడతాయి. మన దృక్పదం సరిగా లేకపోతే మన మనసే మనకు ప్రతికూలంగా మారే ఆలోచనను కూడా పెంచుకోవచ్చును. కాబట్టి ఉత్తముల జీవితచరిత్రను ముందుగా మనకు తెలియబడాలి అంటారు. అపకారం చేసినవారికి కూడా ఉపకారం చేసిన మహానుభావులెందరో ఈ ప్రపంచంలో ఉంటారు.

అపకారికి ఉపకారం చేసిన మహానుభావుల జీవితచరిత్రలు మనకు మార్గదర్శకంగా ఉంటాయని అంటారు. కష్టకాలంలో వారి పాజిటివ్ దృక్పధం మన మనసులో కదలికలు సృష్టించగలవనే వాదన, వారి జీవితచరిత్రల బుక్స్ రీడ్ చేయడంవలన బలపడవచ్చును. బుక్ రీడింగ్ ద్వారా మన మనసును మనం ఓ మిత్రుడి మాదిరిగా మార్చుకోవచ్చును మంచి బుక్స్ రీడ్ చేస్తూ మనసొక మంచి మిత్రుడు లాగా మార్చుకోవచ్చును.

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం స్వీయ ఊహాశక్తిని పెంపొందించుకోవచ్చును.

సినిమా చూడడం అంటే దర్శకుని ఊహను ఫాలో అవ్వడం అయితే బుక్స్ రీడ్ చేయడం అంటే ఆ బుక్ లోని అంశంతో స్వీయ ఆలోచనకు మరింత పదును పెంచుకోడవం అంటారు.

ఒక సినిమాను సృష్టించిన దర్శకుడుకి బుక్ రీడింగ్ అనే అలవాటు ఉంటుందని అంటారు. పుస్తక జ్ఙానం వలన సామాజిక స్థితిపై అవగాహన ఉంటుంది. భవిష్యత్తు సమాజం గురించిన ఆలోచనలు పెరగవచ్చును. వ్యక్తి ప్రవర్తనకు పరిస్థితలు ప్రభావం గురించిన అవగాహన ఏర్పడవచ్చును. అవగాహన ఊహకు దారితీయవచ్చును. అనేక ఊహాలు కొన్ని సంఘటనలను ఊహించే వరకు సాగవచ్చును. బుక్స్ చదవడం వలన ఆ పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం పెరిగి స్వీయ ఊహాశక్తిని పెంపొందించుకోవచ్చును అంటారు.

పుస్తక జ్ఙానం వలన ఏర్పడిన విషయాల పరిజ్ఙానం మనసులో ఊహను సృష్టించగలదు అంటారు. భక్తి బుక్స్ చదివి చదివి, భక్తుల గురించి తెలుసుకుని తెలుసుకుని, భగవానుడి గురించి ఆలోచన చేసి చేసి భగవానుడు ఎలా ఉంటాడో మనం చూసిన విగ్రహరూపం మదిలో మెదిలి మెదలి… ఆ విగ్రహరూపం మనతో మాట్లాడడం మొదలుపెడితే ఆభక్తి పరాకాష్టకు ప్రతీక అంటారు. ఇలా ఆద్యాత్మిక పుస్తక జ్ఙానం వలన ఏర్పడిన భక్తి విషయాల పరిజ్ఙానం ఆ భగవంతుని స్వరూపాన్నే నింగినుండి నేలకు దింపగలదని అంటారు.

పుస్తకం వలన ఏర్పడిన జ్ఙానం పుస్తకాల ద్వారా ఏర్పడిన పరిశీలన పరిజ్ఙానం మరొక బుక్ సృష్టించే శక్తిని కూడా పొందగలదని అంటారు. ఏ విషయంలో బుక్స్ ఎక్కువగా చదివితే ఆ విషయాల పరిజ్ఙానం ఫలితంగా స్వీయ ఊహాశక్తిని పెంపొందించుకోవచ్చును. సినిమా రంగంతో పరిచయం ఉంటే ఒక కొత్త సినిమా కధను కూడా సృష్టించే ఊహాత్మక శక్తి బుక్ రీడింగ్ ద్వారా ఏర్పడగలదని అంటారు.

తెలుగు బుక్స్ రీడ్ చేయడం ద్వారా అవగాహన ఎక్కువ

తెలుగు బుక్ రీడ్ చేయడం ద్వారా తెలుగులో మరింత విజ్ఙానం పొందవచ్చును. తెలుగు వ్యాకరణం బుక్స్ రీడ్ చేస్తే, వ్యాకరణ నైపుణ్యం సంపాదించవ్చని అంటారు. తెలుగు భక్తి బుక్స్ రీడ్ చేస్తే, భక్తి పరమైన పరిపక్వత పెరుగుతుందని అంటారు. సినిమా బుక్స్ రీడ్ చేస్తే సినిమా జ్ఙానం పెరుగుతుందని అంటారు.

ఇలా ఏవిషయంలో ఎక్కువగా తెలుగుబుక్స్ రీడ్ చేస్తు ఉంటే, ఆయా విషయాలలో పరిజ్ఙానం పెరగవచ్చును. తెలుగుబుక్స్ రీడ్ ద్వారా అనేక విషయాలలో మనకు అవగాహన పెరగవచ్చును. అయితే తెలుగుబుక్స్ రీడ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రతతో కూడిన శ్రద్ద ముఖ్యమంటారు. ఏకాగ్రతతో చేస్తున్నప్పుడు మనసు దృష్టి చేస్తున్న పనిలో నిమగ్నమై ఉంటుంది. అది తెలుగుబుక్ రీడింగ్ అయితే ఆబుక్ లోని విషయంపై సరైన దృష్టితో ఉంటుంది. ఆబుక్ రీడ్ చేసిన ఫలితం పొందవచ్చుని అంటారు.

విషయం తెలుగులో ఉంటే, ఆ తెలుగుబుక్ ద్వారా మనకు అవగాహన తేలిక… కారణం మన మాతృభాష తెలుగు కాబట్టి.. అక్షరజ్ఙానంతో బాటు వాడుక భాష ద్వారా తెలుగులో అనేక పదాలకు అనుభవూర్వక ఆలోచనా శక్తి కూడా ఉంటుందని అంటారు. ఆవిధంగా తెలుగుబుక్ రీడ్ చేస్తుంటే, ఆ బుక్ లో ఉన్న విషయంపై మనకు మరింత అవగాహన ఏర్పడకపోదు.

మన వాడుక భాషలో బుక్ రీడ్ చేయడంద్వారా తెలుగులో అవగాహన బాగా ఉంటుంది. తెలుగుబుక్స్ అనేక వర్గాలలో మనకు లభిస్తాయి. గతంలో తెలుగుబుక్స్ రీడ్ చేయడానికి కొనుగోలుకు మరొక ప్రదేశానికి వెళ్ళవలసి ఉండేది. ఇప్పుడు కొన్ని వర్గాలలో ఉచితంగా తెలుగుబుక్స్ మనకు ఆన్ లైన్లో రీడ్ చేయడానికి ఉచితంగానే లభిస్తున్నాయి.

తెలుగులో బుక్స్ రీడ్ చేయడానికి ఆన్ లైన్ ద్వారా పిడిఎఫ్ బుక్స్ ఉచితంగా లభిస్తున్నాయి.