Vidya unnavadu enduku gelichadu telugu reads story? చదువు జీవితాన్ని మార్చేస్తుంది?

చదువు జీవితాన్ని మార్చేస్తుంది? Vidya unnavadu enduku gelichadu telugu reads story? kadha prarambham

చదువుకున్న వ్యక్తి ఎదగడం అంటే, విషయ పరిజ్ఞానం సమయస్పూర్తి ఉపయోగించి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, లాభాలను ఆర్జించి పెట్టడం. కానీ చదువు లేకపోవడం వలన విస్తరణ ఉండదు.

విజయవాడ నగర సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో ఇద్దరు మిత్రులు ఉండేవారు.
వారిలో ఒకడు వికాస్… మరొకడు ఆకాష్. ఆకాష్ అక్షర జ్ఞానం ఉంది, వికాస్ విద్యావంతుడు పట్టభద్రుడు అయ్యాడు.

ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. కానీ వారి జీవిత మార్గాలు మాత్రం వేరు అయ్యాయి.

వికాస్ డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్లపై కూడా మంచి అవగాహన సంపాదించాడు.
ఆకాష్ మాత్రం పదో తరగతి తర్వాత చదువు మానేశాడు. అప్పటికి అవకాశాలు అందుకుంటున్నాడు.
ఇక “డబ్బు సంపాదించాలంటే చదువు అవసరం లేదు” అని అతని నమ్మకం.

ఒకరు పని చేస్తున్నా, ఒకరు ఆడుకుంటున్నా, ఎవరు ఏమి చేస్తున్నా కాలం ఆగదు… అది గడిచింది.

ఒకే ఆలోచన ఇద్దరికీ రావడం తప్పు కాదు కాని ఎవరు ఎలా? ఎంత సమర్ధవంతంగా అమలు చేసారనేది? ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకరోజు ఆ మిత్రుల ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది.

“మొబైల్ షాప్ పెడితే బాగుంటుంది” అని.

అలా ఒకే వీధిలో రెండు వేరు వేరు మొబైల్ షాపులు ప్రారంభమయ్యాయి.

ఒకటి “వికాస్ డిజిటల్ వరల్డ్”
మరొకటి “ఆకాష్ మొబైల్స్”

వికాస్ డిజిటల్ వరల్డ్ వికాస్ ప్రొఫెషనల్ గా ఉన్నాడు. ఆకాష్ మొబైల్స్ లో ఆకాష్ అందరితో కలివిడిగా ఉంటూ ఆకాష్ మొబైల్స్ ని ఆ టౌన్ లో టాప్ లో నిలబెట్టాడు.

రెండు షాపులూ బాగానే నడిచాయి. పోటి పడి బిజినెస్ చేసుకునేవారు.

ఆకాష్‌కు మాట్లాడే తీరు బాగుండేది. వచ్చిన కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడేవాడు. అందుకే మొదటి కొన్ని నెలలు అతని షాప్ కూడా రద్దీగానే ఉండేది. ఆకాష్ ఆలోచన అక్కడ వేగంగా పాతుకుపోవాలి.

కానీ వికాస్ మాత్రం వ్యాపారాన్ని వేరే కోణంలో చూశాడు. విస్తరించాలి… వివిధ ప్రాంతాలలో కూడా వ్యాపార విస్తరణ జరగాలి.

అతను కంప్యూటర్‌లో స్టాక్ నమోదు చేసేవాడు.
ఆన్‌లైన్‌లో కొత్త మొబైల్ మోడల్స్ గురించి తెలుసుకునేవాడు.
డిజిటల్ పేమెంట్స్, EMI సదుపాయాలు, సోషల్ మీడియా ప్రచారం—అన్నీ ప్రవేశపెట్టాడు.

ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు: చదువు జీవితాన్ని మార్చేస్తుంది? అనడానికి కారణం ఆలోచనలో విబిన్నత

“మనం కేవలం మొబైల్ అమ్మితే సరిపోదు. సర్వీస్ సెంటర్ కూడా పెడితే కస్టమర్లు పెరుగుతారు. ముఖ్యంగా కస్టమర్లకు మంచి సౌకర్యం అనుకున్నాడు”

అలా షాప్ పక్కనే చిన్న సర్వీస్ విభాగం ప్రారంభించాడు. అందులో ఒక టెక్నీషియన్ ను పెట్టుకున్నాడు.

మరోవైపు ఆకాష్ మాత్రం లాభాలు చూసుకుని కేవలం అదే పద్దతిలో ముందుకు సాగాడు.

వికాస్ ని చూసి ఆకాష్ “ఇంత కంప్యూటర్లు, బిల్లులు, ఆన్‌లైన్ ప్రచారాలు ఎందుకు?” అని నవ్వుకునేవాడు.

కాలం గడిచేకొద్దీ తేడా కనిపించడం మొదలైంది. Vidya unnavadu enduku gelichadu చదువు జీవితాన్ని మార్చేస్తుంది?

వికాస్ షాప్‌లో ప్రతిరోజూ కొత్త కస్టమర్లు. షాపులో పనివారు పెరిగారు.. సోషల్ మీడియాని వికాష్ సద్వినియోగం చేసుకున్నాడు. డెలివరీ సదుపాయం ఉండడం చేత ఆన్లైన్ ఆర్డర్స్ కూడా రావడం మొదలయ్యాయి.
Google Maps లో షాప్ పేరు.
WhatsApp ద్వారా ఆర్డర్లు.
YouTubeలో మొబైల్ రివ్యూలు.
బ్యాంక్ నుంచి సులభంగా లోన్ కూడా వచ్చింది.

రెండు సంవత్సరాల్లోనే అతను మరో చోట స్టాక్ కోసం బ్రాంచ్ కూడా ప్రారంభించాడు.

ఆకాష్ షాప్ మాత్రం అదే స్థాయిలో ఉండిపోయింది. చదువు జీవితాన్ని మార్చేస్తుంది? కానీ చదువు తక్కువైతే?

కొంతమంది కస్టమర్లు కొత్త మోడల్స్ అడిగితే, కొత్త మోడల్స్ గురించి కూడా సమాచారం అందకుండా పోయింది.
“నాకు తెలియదు… వచ్చే వారం చూడండి” అని చెప్పేవాడు.

స్టాక్ లెక్కలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. చదువు అంతంత మాత్రం చేత మోసపోవడం కూడా జరుగుతుంది.
కొన్నిసార్లు నష్టపోయినా అతనికి తెలియదు.

ఒక రోజు ఆకాష్ ఒంటరిగా కూర్చొని వికాస్ షాప్ వైపు చూశాడు.

“మనిద్దరం ఒకేసారి మొదలుపెట్టాం… కానీ ఇతను ఇంత ముందుకు ఎలా వెళ్లాడు?” అని ఆలోచించాడు.

ఒక ఆలోచన ఇద్దరినీ కార్యోన్ముఖులను చేసింది కాని వారి చదువులు వారిని వేరు వేరు స్థాయిలో నిలబెట్టింది. అయితే ఇప్పుడు మరలా వారి జీవితంలో ఇంకొక సంఘటన

వికాష్ షాపులోకి అప్పుడే అక్కడికి వచ్చింది స్నేహ అనే అమ్మాయి.

ఆమె ఇద్దరికీ చిన్నప్పటి పరిచయం.

స్నేహకు మంచి ఆలోచనలు, లక్ష్యాలు ఉన్న యువకుడు కావాలి.

ఆకాష్ ఆమెను ఇష్టపడేవాడు.
వికాస్ కూడా ఆమెను గౌరవించేవాడు.

ఒకరోజు స్నేహ తండ్రి ఇద్దరి గురించి తెలుసుకోవాలని నిర్ణయించాడు.

ముందుగా ఆకాష్ షాప్‌కి వెళ్లాడు.

షాప్‌లో సరైన లెక్కలు లేవు.
బిల్లులు గజిబిజిగా ఉన్నాయి.
భవిష్యత్తు గురించి అడిగితే ఆకాష్ నవ్వుతూ,
“ఏదో ఇలా నడుస్తోంది అంకుల్…” అన్నాడు.

తర్వాత వికాస్ షాప్‌కి వెళ్లాడు.

అక్కడ ఉద్యోగులు పని చేస్తున్నారు.
కంప్యూటర్‌లో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయి.
వికాస్ చెప్పాడు:

“ఇంకో ఏడాదిలో ఆన్‌లైన్ స్టోర్ కూడా ప్రారంభించాలి అనుకుంటున్నాను అంకుల్. ఇంకా యువతకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను.”

ఆ మాటలు విన్న స్నేహ తండ్రి చిరునవ్వు నవ్వాడు.

కొన్ని రోజుల తర్వాత స్నేహ తన నిర్ణయం చెప్పింది.

“నాకు డబ్బు మాత్రమే కాదు… ఎదగాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కావాలి. చదువు మనిషిని మార్చుతుంది. ఆలోచనలను విస్తరిస్తుంది. అందుకే నేను వికాస్‌ను ఎంచుకుంటున్నాను.”

ఆ మాటలు ఆకాష్ గుండెల్లో బలంగా తాకాయి.

కానీ అతను కోపపడలేదు.

ఆ రాత్రే వికాస్ దగ్గరకు వెళ్లి అన్నాడు:

“నిజంగా నిన్ను గెలిపించింది నీ చదువు కాదు వికాస్… ఆ చదువు వల్ల వచ్చిన ఆలోచన.”

వికాస్ నవ్వుతూ చెప్పాడు:

“చదువు అంటే కేవలం పుస్తకాలు కాదు ఆకాష్… కొత్త విషయాలు నేర్చుకోవడం. నువ్వూ ఇప్పటి నుంచి నేర్చుకోవచ్చు.”

ఆ మాటలు ఆకాష్ జీవితాన్ని మార్చేశాయి.

కొన్ని నెలల తర్వాత ఆకాష్ కంప్యూటర్ కోర్సులో చేరాడు.
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు.
తన షాప్‌లో కూడా కొత్త మార్పులు తీసుకొచ్చాడు.

ఈసారి అతను గ్రహించాడు— Vidya unnavadu enduku gelichadu చదువు జీవితాన్ని మార్చేస్తుంది?

వ్యాపారం చేతులతో నడుస్తుంది… కానీ అభివృద్ధి మాత్రం జ్ఞానంతో వస్తుంది.

cinema sandadi

Leave a Comment