Talking Social Media Apps with man in a park telugu story in audio and text… సరదాగా ఫోన్ వాడడం కన్నా ఫోన్ వాడడంలోనే సమయం గడిపిస్తే, మనిషిలో భ్రమలు కూడా వస్తాయి… వాకింగ్ చేస్తున్న వ్యక్తిలో సరదాగా సోషల్ మీడియా యాప్స్ సంభాసిస్తే ఒక చిన్న కధ చదివేయండి… లేదా ఈ క్రింది వీడియో చూసేయండి.
ఒక చిన్న కధ : Talking Social Media Apps
ఒక అందమైన ఉదయం, అరుణ్ అనే వ్యక్తీ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. చల్లని గాలి, పక్షుల కిల కిలలు
ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడే అతని ప్రక్కన ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించింది. హలో అరుణ్ అనే ఒక స్వరం
అతనికి వినిపించింది. అరుణ్ ఆశ్చర్యంగా అడిగాడు. ఎవరు మీరు? నేను పేస్ బుక్, నీ ఫ్రెండ్స్ అప్డేట్స్ చూపిస్తాను అని నవ్వింది.
కొద్దిసేపటికి మరో స్వరం హాయ్, నేను whatsapp నీ ఫ్రెండ్స్ తో చాట్ చేయడంలో నేను బెస్ట్. అరుణ్ ఆశ్చర్యపోయాడు.
ఇదేమిటి? యాప్స్ మాట్లాడుతున్నాయా? ఇంతలో youtube వచ్చి నేను నీకు విడియోలు చూపిస్తాను అంది. instagram ఫుల్
ఎంటర్ టైన్ మెంట్ అంది. telegram, ట్విట్టర్ చేరి, మేము కూడా ఉన్నాం అన్నాయి. అరుణ్ కొంచెం అలోచించి అన్నాడు.
మీరు అందరూ నాకు అవసరం, కాని నేను మీతో చాలా సమయం గడిపెస్తున్నాను. దాంతో నా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఉపయోగం కన్నాటైంవెస్ట్ ఎక్కువ అన్నాడు.
అప్పుడు యాప్స్ అతనితో అన్నాయి.. అవును, మమ్మల్ని ఉపయోగించు కాని సమయానికి నియంత్రించు అన్నాయి. అరుణ్
చిరునవ్వుతో ఇకపై అవసరానికి మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు. మిగతా టైం నా పనులకు, ఆరోగ్యానికి కేటాయిస్తాను అన్నాడు.
అలా చెప్పగానే యాప్స్ అన్ని మాయం అయ్యాయి. అరుణ్ ఆనందంగా వాకింగ్ కొనసాగించాడు.
నీతి: టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే, జీవితం సంతోషంగా ఉంటుంది.
తెలుగు ఎస్సేస్: ఆలోచనలకు అద్దం, ప్రేరణ, విద్య, సామజిక విషయాలలో…
Abhivruddiki Projects Enta Mukhyam? అభివృద్ధిలో ప్రాజెక్టుల పాత్ర
