Telugulo manchi matalu quotes గొప్ప మాటలు మనలో ప్రేరణ కలిగిస్తాయి. మంచి మాటలలో అంతర్యం అర్ధం చేసుకుంటే, అది జీవితంపై ప్రభావం చూపుతుంది అంటారు. కొన్ని మంచి / గొప్ప మాటలు .
మన జీవితంలో కొన్ని మాటలు మన ఆలోచనలను మార్చగల శక్తి కలిగి ఉంటాయి. ఒక మంచి మాట మనసును ప్రేరేపిస్తుంది, మనలో ధైర్యాన్ని నింపుతుంది, మన ప్రయాణాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. ముఖ్యంగా తెలుగులో ఉన్న మంచి మాటలు, కోట్స్ మన సంస్కృతి, విలువలను ప్రతిబింబిస్తూ మన జీవన విధానాన్ని మెరుగుపరుస్తాయి. రోజు ఒక కోట్ వినడం Telugulo manchi matalu quotes…. అలవాటు చేసుకోండి.
వ్యాసాలలో ఉండే భావం Telugulo manchi matalu quotes గొప్ప మాటలు సింగిల్ లైన్లో
- జీవితం ఒక ప్రయాణం…
- గమ్యం కాదు. కష్టాలు లేకుండా విజయం రాదు.
- ఓటమి చివరి కాదు… అది కొత్త ఆరంభం.
- ప్రతి రోజు ఒక కొత్త అవకాశం.
- నీకు నీవు నమ్మకం ఉంటే అసాధ్యం ఏదీ లేదు.
- కష్టం చేస్తేనే ఫలితం తీయగా ఉంటుంది.
- విజయం సాధించేవాడు ఎప్పుడూ ప్రయత్నం ఆపడు.
- చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయానికి దారి.
- ఓటమిని భయపడితే విజయం దూరమే.
- కలలు కంటూ ఉండకండి… వాటిని సాధించండి.
- 3నిన్ను నువ్వు మార్చుకుంటే ప్రపంచం మారుతుంది.
- ఆలోచనలు మారితే జీవితం మారుతుంది.
- నమ్మకం ఉంటే మార్గం కనిపిస్తుంది.
- నువ్వు మొదలు పెడితేనే మార్పు మొదలవుతుంది.
- అవకాశం కోసం ఎదురు చూడకు… అవకాశం సృష్టించు.
వినవలసిన Telugulo manchi matalu quotes
కొన్ని వ్యాక్యాలు తెలుగు వ్యాసాల భావాన్ని తెస్తాయి.
ఒక్క అలవాటుని జయించినా మనసులో గొప్ప మార్పుకు పునాది అంటారు.
ప్రకృతిలో పంచభూతాలకు మంచివానికి ఉపయోగపడతాయి, చెడ్డవానికి ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మంచివాడు మాత్రమేనని అంటారు.
వితండ వాదన వ్యక్తి అహంకారం నిరూపించుకోవడానికి ప్రయత్నంగా కనబడితే, సంవాదన మంచి ప్రయోజనాల కొరకు చర్చగా మారుతుందని అంటారు. రోజూ అద్దంలో ముఖం చూసుకున్నట్టుగానే, అప్పుడప్పుడూ మనసుని కూడా పరిశీలించుకోవడం వలన మనసు మరో కోణం కనబడుతుందని అంటారు.
నీ పనితనం నీకో గుర్తింపు తెచ్చి పెడితే, నీ నిర్లక్ష్యం నీ అభివృద్దికి అడ్డంకి అవుతుందని అంటారు.
అందమైన శరీరం భగవంతుడిచ్చింది అయితే, అందమైన మనసు మాత్రం నీ ప్రయత్నం వలననే ఏర్పడుతుంది. మనసును బట్టి పెరిగే బంధాలు, ఆ వ్యక్తిని చిరకాలం గుర్తు పెట్టుకుంటాయని అంటారు.
తల్లిదండ్రులు భగవంతుడిచ్చే గురువులు అయితే, వ్యక్తి ఆసక్తిని బట్టి మరొక గురువుపై, అతని దృష్టి నిలబడుతుంది… ఈ ముగ్గురి ఆశయాలకు బట్టి వ్యక్తి భవిష్యత్తు ఆధారపడవచ్చని అంటారు.
Telugulo manchi matalu quotes – గొప్ప మాటలు
లోకం అద్దంవంటిది? అద్దంలో మన ముఖ కవళికలను మనకు చూపినట్టు, లోకం మన ప్రవర్తనకు ప్రతి ఫలం అందిస్తుందని అంటారు.
నీ మనసును అందం కట్టిపడేయలేదు కానీ సుగుణాల స్వభావం నీ మనసుపై మంచి ప్రభావం చూపుతుందని అంటారు.
కోపం కలిగినప్పుడు ఆవేశపడితే వచ్చే ఫలితం కన్నా కోపం కలిగినప్పుడు ఆలోచనలో పడితే, కోప గుణాన్ని కూడా మంచిగా మలచవచ్చని అంటారు.
కళాకారుడు అందమైన శిల్పాన్ని చేయగలడు… గుణవంతుడు తన చుట్టూ ఉండే వారిలో మంచిని పెంచగలడని అంటారు.
ముసలితనం బాలుని వలె ఉంటే, పిల్లవానిని లాలించినట్టే, ముసలివారిని లాలించడం చేత, వారు ఆ ఆప్యాయతలోనే ఉపశాంతి పొందగలరని అంటారు.
అసలైన సంపద అంటే నిత్యం సంతోషిగా, తృప్తిగా జీవించగలగడం అని అంటారు.
ఇతరుల వలన బాధ కలుగుతుందని భావించడం కన్నా కాలం వలన బాధలు వస్తూ పోతున్నాయనే భావన వలన మనసుకు శాంతి కలుగుతుందని అంటారు.
విధి రాసిన రాతను సైతం మార్చుకోగలరని పురాణ పురుషులు జీవితాలు నిరూపిస్తాయని అంటారు, పురాణ పఠనం మనోబలం పెంచుతుందని అంటారు.
Telugulo manchi matalu quotes – గొప్ప మాటలు
మనసుతో ఏర్పడే విషయానుబంధమే, మనసును నడిపిస్తాయి. ఎటువంటి విషయాలు ఎక్కువగా చేరితే, అటువంటి మార్గములో మనసు నడుస్తుందని అంటారు.
ఆకర్షణీయమైన కాయము ఆకట్టుకోవచ్చును కానీ సుగుణాల కారణంగా వ్యక్తి ప్రేమించబడతాడని అంటారు.
సమూహం ఏర్పడేది సామాజిక ప్రయోజనాల కోసమే కానీ స్వప్రయోజనాల కోసం కాదని అంటారు.
విజయం సంతోషాన్ని తెస్తే, ఓటమి దు:ఖాన్ని తెస్తే, గెలుపు-ఓటమి శాశ్వతం కాదని భావించే భావన మనసుకు బలాన్నిస్తుందని అంటారు.
మంచి గుణాలు ఉండడం ఒక ఎత్తయితే, వాటిని ఉపయోగించడం వ్యక్తి గొప్పతనం తెలియబడుతుందని అంటారు.
మూడు ముళ్ళతో బంధం పెద్దలవలన ఏర్పడితే, దానిని గౌరవిస్తూ, తమ భాగస్వామిని అర్ధం చేసుకుంటూ నడుచుకోవడమే దాంపత్యం యొక్క గొప్పతనం అంటారు.
సమస్య సృష్టించబడుతున్నప్పుడే సమస్యక పరిష్కారం కూడా ఉంటుంది, తాళంతో పాటు తాళం చెవి కూడా తయారైనట్టు…. అని అంటారు.
ఎదగడానికి చదువు ఉపయోగపడితే, ఒదిగిపోవడానికి వినయం ఉపయోగపడుతుంది. సంస్కారం బట్టి బంధాలు ఏర్పడతాయని అంటారు.
ఓర్పు దేవతా లక్షణం అని అంటారు. దేవతల చుట్టూ మనిషి తిరిగినట్టుగా, ఓర్పు ఉన్నవారి చుట్టూ బంధాలు అల్లుకుంటూ ఉంటాయని అంటారు.
పుస్తకం చూసి వదిలేయకుండా, దానిని చదివి విషయావగాహన ఏర్పరచుకున్నట్టే, మనషుల స్వభావాలను కూడా చదివి అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటే, జీవితం కొత్త కొత్త పాఠాలు నేర్పుతుందని అంటారు.
వ్యక్తి గొప్పతనం ప్రదర్శించుకోవడానికి మరొకరిని చులకనగా చూపించడం సత్ప్రవర్తన కాదని అంటారు.
ఒక వ్యాక్యంలో Telugulo manchi matalu quotes గొప్ప మాటలు
చిన్న లక్ష్యాలతో మొదలు పెట్టు.
ఆలస్యం విజయాన్ని దూరం చేస్తుంది.
ప్రతిరోజూ నేర్చుకుంటేనే ముందుకు వెళ్తావు.
మాటలు గాయపరచగలవు… జాగ్రత్తగా మాట్లాడాలి.
మంచి మనసు ఉన్నవాడు ఎప్పుడూ గొప్పవాడే.
ప్రేమ అంటే అర్థం చేసుకోవడం.
చదువు నీ భవిష్యత్తుకు పునాది.
సమయం విలువ తెలిసినవాడు విజయం సాధిస్తాడు.
నిజమైన స్నేహం కాలంతో తగ్గదు.
గౌరవం ఇచ్చినప్పుడు గౌరవం వస్తుంది.
తెలుగు సంస్కృతిలో మంచి మాటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్వకాలం నుండి మన పెద్దలు చెప్పిన సూక్తులు, సామెతలు మన జీవితానికి మార్గదర్శకాలు.
- “మాట మంచిది అయితే మనిషి మంచివాడవుతాడు”
- “చెడు మాట మనసును గాయపరుస్తుంది”
👉 ఇవి మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తాయి. Telugulo manchi matalu quotes0