జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం ఎందుకు ముఖ్యం?

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం? ఆత్మవిశ్వాసం లోపిస్తే

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం ఎందుకు ముఖ్యం? విద్యార్థులు మరియు యువత కోసం సులభంగా అర్థమయ్యే పూర్తి తెలుగు వ్యాసం.

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం? ఆత్మవిశ్వాసం లోపిస్తే? మనిషి జీవితంలో విజయం సాధించడానికి ప్రయత్నం ఎంత ప్రధానమో, విశ్వాసం కూడా అంతే. కష్టపడే తత్త్వం, పట్టుదలతో ఉండడం…. విషయాల పట్ల అవగాహన ఇలా పలు విషయాలు విజయానికి ముఖ్యమే అయితే ఆత్మవిశ్వాసం (Self Confidence)కూడా ముఖ్యం.

ఆత్మవిశ్వాసం(Self Confidence) అంటే ఏమిటి?

అంటే మన మీద మనకు ఉన్న నమ్మకం. “నేను చేయగలను”, “నేను సాధించగలను” అనే భావన ఉండడం. ఆత్మవిశ్వాసం అనేది మనలో ఉండే ఒక శక్తి. ఇది మనసుకు బలం అవుతుంది, మనిషికి ధైర్యం ఇస్తుంది. కర్యసదనలో సమస్యలు వచ్చినా భయపడకుండా వాటిని ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆత్మవిశ్వాసం(Self Confidence) సహాయపడుతుంది.

ఆత్మవిశ్వాసం ఎందుకు అవసరం? ఆత్మవిశ్వాసం లోపిస్తే

తనమీద తనకే నమ్మకం లేని వ్యక్తీ మాటలు ఎవరూ నమ్మరు. అందువలన ప్రయత్నం చేయడానికి కూడా సంకోచించాల్సి వస్తుంది. కనుక జీవితంలో ఏ పని చేయలన్నా ఆత్మవిశ్వాసం(Self Confidence) అవసరం:

ఆత్మవిశ్వాసం లోపిస్తే, చిన్న పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి

మనలో ఆత్మవిశ్వాసం లోపిస్తే, దాని వలన భయం పెరుగుతుంది.

అంతేకాకుండా అవకాశాలు ఉన్నా, వాటిని ఉపయోగించుకోలేరు.

ఆత్మవిశ్వాసం బలంగా ఉంటే:

కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనసు ముందుకు వెళుతుంది.

జటిలమైన సమస్యలను సైతం ఎదుర్కోవచ్చు.

విజయాన్ని చేరుకోవడానికి మనసు ముందుకు వెళ్తుంది.

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం, విద్యార్థులకు ఆత్మవిశ్వాసం(Self Confidence)ప్రాముఖ్యత

విద్యార్థులకు కూడా జీవితంలో ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఎందుకంటే:

పరీక్షల సమయంలో ఒత్తిడి ఉండదు.

చదువులో ఏకాగ్రత పెరుగుతుంది.

మంచి మార్కులు సాధిస్తామనే నమ్మకం కలిగి ఉంటారు.

చాలా మంది విద్యార్థులు చదువుకున్నా కూడా “నాకు రాదు” అని భయపడుతుంటారు. ఇది ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే జరుగుతుంది.

జీవితంలో విజయానికి ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలి?

ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఒక్క రోజులో రాదు. దాన్ని క్రమంగా పెంచుకోవాలి.

 1. చిన్న విజయాలను లక్ష్యం చేసుకుని ప్రయత్నం చేయాలి.

మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే, అనుకున్న ఫలితాలు రావడం పెరిగేకొద్ది, విశ్వాసం పెరుగుతుంది.

2. కీప్ డిస్టెన్స్ ఫ్రం నెగటివ్ థింకింగ్, అనవసర ఆలోచనలు, ఆందోళనలు దూరం పెట్టండి

“నేను చేయలేను” అనే ఆలోచనలను వదిలేయాలి. బదులుగా “నేను ప్రయత్నిస్తాను” అని బలంగా మనసులో అనుకోవాలి. చిన్న ప్రయత్నం ఆటంకం వస్తే, పెద్దగా బాధపడకుండా, సమస్యను గుర్తించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి.

✅ 3. కష్టపడండి

కష్టే ఫలి అన్నారు. కష్టపడితే ఫలితం అన్నారు. కావునా ఆత్మవిశ్వాసం కేవలం మాటలతో కాదు, పనితో వస్తుంది. మీరు కష్టపడితే, మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది.

చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగాలి, అప్పుడు ఆత్మవిశ్వాసం(Self Confidence)పెరుగుతుంది.

  • సాధించగలిగేలా అనిపిస్తుంది
  • మనకు మోటివేషన్ పెరుగుతుంది
  • ప్రతి విజయంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

చిన్న లక్ష్యం సాధించడం ద్వారా పెద్ద లక్ష్యం సాధించగలం.

పెద్ద లక్ష్యం: ఇంటర్‌లో 95% మార్కులు రావాలి
చిన్న లక్ష్యాలు:

  • ప్రతిరోజు 2 chapters చదవడం
  • వారానికి ఒక mock test attempt చేయడం
  • రోజుకు 2 గంటలు focus study

👉 ఇలా చేస్తూ వెళ్తే చివరికి పెద్ద లక్ష్యం సులభంగా చేరుకుంటారు. ఒక్కసారి పెద్ద లక్ష్యం చేరుకున్నమా? మనలో విశ్వాసం పెరిగినట్టే.

కాని ముఖ్యంగా ఏ విషయంలోనూ ఇతరులతో పోల్చుకోవద్దు.

ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీమీద మీకు నమ్మకం ఉంటే చాలు.

ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తుల లక్షణాలు

  • వారు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు
  • వారు సమస్యలను ఎదుర్కోవడంలో ఉత్సాహంగా ఉంటారు.
  • తప్పులు చేసినా, క్రుంగిపోరు, తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటారు
  • ఇంకా ఇతరులను ప్రోత్సహిస్తారు

ఆత్మవిశ్వాసం(Self Confidence) మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇది మనసుకు బలం అవుతుంది, మనిషికి ధైర్యం ఇస్తుంది, జీవితంలో ముందుకు నడిపిస్తుంది, మంచి విజయాన్ని అందిస్తుంది.

మనందరం గుర్తుంచుకోవాల్సింది ఒకటే: “మన మీద మనకు నమ్మకం ఉంటే… అనుకున్న లక్ష్యం సాధించగలం!

TeluguReads Channel

తెలుగు ఎస్సేస్: ఆలోచనలకు అద్దం, ప్రేరణ, విద్య, సామజిక విషయాలలో…

AI వల్ల భవిష్యత్తులో Jobs పోతాయా? AI వల్ల ఉపయోగం

Adhunika vidya prayojanalu, Pramukhata telusukokapote?

Telugulo vyasam prakriya (Essay Writing Process) వివరంగా

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts