అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలలో అనురక్తి అంటే మీనింగ్… పర్యాయ పదాలు కానీ నానార్ధములు కానీ పరిశీలిస్తే, ఆ పదానికి అర్ధం ఏమిటో గోచరమవుతుందని అంటారు. ఇప్పుడు ఈ అనురక్తికి పర్యాయ పదాలు…. ప్రీతి, ఆప్యాయత, మమకారం, ఇష్టం, అభిమానం, అనురాగం వంటి పదాలు చెబుతారు. ఈ పదాలన్నింటికి ఒక్కటే అర్ధం వస్తే… అది బాగా ఇష్టం. లేకా అమితమైన ప్రీతి…. ఎనలేని అనురాగం… అత్యంత ఇష్టం… ఇష్టాన్ని గాఢంగా చెబితే, అది అనురక్తి అంటే, ఆ అనురక్తి ఒక్కొక్కరికి ఒక్కో విషయంపై ఉంటుంది.
కొందరికి వంకాయ కూర అంటే బాగా అనురక్తి. కొందరికి పుస్తకాలు చదవడం అనురక్తి… కొందరికి పరిశీలించడం అనురక్తి. కొందరికి వినడం అనురక్తి… ఎవరికి ఎలాంటి అనురక్తి… ఆ అనురక్తే వారి జీవితంలో కీలకం అయితే…. మంచి విషయాలలో అనురక్తి పెంచుకోవడం శ్రేయష్కరం అంటారు.
మొత్తం మీద అనురక్తి అంటే చాలా చాలా ఇష్టమని సంకేతంగా ఒక వ్యక్తికి ఆపాదించి చెబుతూ ఉంటారు. అంటే అతనికి ఆమెపై అనురక్తి అంటారు. ఆమెకు అతనిపై అనురక్తి అంటారు. ఇలా ఆకర్షణ పొందిన మనసు గురించి చెబుతూ అనురక్తి పద ప్రయోగం చేస్తూ ఉంటారు.