ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్ ఇప్పుడు ట్రెండింగులో ఉన్న సాఫ్ట్ వేర్ డవలప్ మెంటు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఒకనాడు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రొగ్రామింగులో ఒక ఊపు ఊపిన జావా, ఇప్పుడు మొబైల్ రంగంలో యాప్ డవలప్ మెంటులో కూడా అదే చేసింది.

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే మొబైల్ యాప్స్ కూడా పెరిగాయి.

మొబైల్ యాప్ డవలపర్స్ పెరిగారు. మొబైల్ యాప్స్, గేమ్స్ అనేకంగా వస్తున్నాయి. గేమ్ డవలప్ మెంట్ అయితే యానిమేషన్ కూడా తెలిసి ఉండాలి.

యాప్ డవలప్ మెంటుకు లాజికల్ థింకింగుకు జావా లాంగ్వేజ్ తోడైతే, ఆలోచనకు రూపకల్పన చేయవచ్చును.

ఆండ్రాయిడ్ ఫోన్లలో మొబైల్ యాప్స్ అనేకంగా ఉన్నాయి. అయినా అందరీ ఆలోచన ఒకలాగా ఉండదు. కొందరి ఆలోచన కొందరికే నచ్చవచ్చును. కానీ కొందరి ఆలోచన అందరికీ నచ్చవచ్చును.

అలా అందరికీ నచ్చేవిధంగా మీరు ఆలోచన విధానం ఉంటే, మాత్రం టెక్నాలజీని వాడుకునే అవకాశం వదులుకోకూడదు. ఒకే అంశంపై రక రకాల మొబైల్ యాప్స్ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నా అందరికీ నచ్చేలా ఉందే, విజయవంతం అవుతంది.

ఆవిధంగా అందరికీ నచ్చేవిధంగా మన ఆలోచనా విధానం ఉందో లేదో తెలియాలంటే, మనకు ఆలోచనను ఒక రూపం ఇచ్చి, దానిని అందరికీ పరిచయం చేయడమే…

అందరికీ పరిచయం చేసిన విషయం పాపులర్ అయితే, మన ఆలోచనా విధానం చాలామందికి నచ్చింది. ఎంత ఎక్కువమందికి నచ్చితే…. అంత పాపులారిటీ….

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్
ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

పొందిన పాపులారిటీ వృధా అవ్వదు. చాలా ఉపయోగపడుతుంది. వెంటనే ఆలోచనను మరింత వృద్ది చేసి, మరింత ప్రయోజనకారిగా యాప్ డవలప్ చేస్తే, అది ఇంకా ఎక్కువమందికి చేరుతుంది.

ఐడియా ఉండాలి. ఐడియా డవలప్ చేయాలి. అందరికీ ఉపయోగపడేలాగా…

అలా పొందిన పాపులారిటిని మరింతగా డవలప్ చేసుకోవచ్చును. అసలు ఐడియా ఉండాలి. ఉన్న ఐడియా ఎక్కువమందికి ఉపయోగపడాలి. ఐడియా డవలప్ చేయాలి. అందరికీ ఉపయోగపడేలాగా…

ఎలాంటి ఐడియా అయినా దాని వలన భవిష్యత్తు సమజ మనుగడకు అడ్డు రాకుండా ఉండాలి. ఏదో ఒక ఆలోచన పట్టుకుని గొప్ప ఐడియాగా భావిస్తే, అది భవిష్యత్తును దెబ్బతీయవచ్చును.

అలాంటి వాటిలోకి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు అందరూ బాగా వాడారు. అంటే అప్పట్లో అది గొప్ప ఆలోచన కావచ్చును… కానీ ఇప్పుడ ప్లాస్టిక్ భూతం మానవ మనుగడకు ముప్పు అనే కధనాలు అనేకంగా చదువతున్నాం… అటువంటి ఐడియాలు… వేస్ట్…

కరెంట్ సిట్యుయేషన్లో యూజ్ అవ్వడమే కాదు… ఫ్యూచర్లో కూడా ఉపయోగంగానే ఉంటే, దాని ఉపయోగం ఉన్నన్నాళ్ళు మన ఆలోచన గొప్పదే… దాని ఫలితం పదిమందికి ప్రయోజనంగా ఉంటుంది.

గుడ్ ఐడియా ఉండాలి. మంచి ఆలోచనను యూజుపుల్ గా మార్చాలి. ఎలా డవలప్ చేస్తే మన ఐడియా అందరికీ ఉపయోగపడుతుందో… సరిగా ఆలోచన చేసి, దానిని అభివృద్ది చేయాలి.

అందరికీ ఉపయోగపడే ఐడియా మన దగ్గర ఉంటే, దానిని టెక్నాలజీతో ఒక రూపకల్పన చేసి, నలుగురికీ ఉపయోగపడేలా చేయవచ్చును.

ఇప్పుడు టెక్నాలజిలో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువమంది వాడుతున్నారు.

ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్… ఏదైనా విషయం ఎక్కువ మందికి చేరేలా ఉంటే, అదే సమాజాన్ని శాసిస్తుంది.

చాలా చాలా మందే ఆండ్రాయిడ్ ఓస్ ఉన్న స్మార్ట్ ఫోనులో సమాజంలో వాడుతున్నారు. ఏదైనా విషయం ఎక్కువ మందికి చేరేలా ఉంటే, అదే సమాజాన్ని శాసిస్తుంది.

ఇప్పుడు సమాజంలోకి స్మార్ట్ ఫోను మంచి మీడియాగా ఉంది. మీరు ఏదైనా ఐడియాతో ఒక యూట్యూబ్ చానల్ డవలప్ చేస్తే, చాలామందికి ఆండ్రాయిడ్ ఫోనుద్వారా మీ వీడియోలు చేరతాయి.

మీరు ఒక బ్లాగును క్రియేట్ చేస్తే, మీరు చెప్పే విషయాల విశ్లేషణ చాలామందికి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల ద్వారానే చేరుతుంది.

మీరు ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేస్తే ఎక్కువమందికి చేరేది… ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతోనే…

మనం మాట్లాడిన ఒకరికి నచ్చితే, అతని దగ్గర గుర్తింపుకు పరిమితం. అలాగే మనం మాట్లాడిన విషయం ఒక ఊరి ప్రజలందరికీ నచ్చితే, అది ఊరివరకే పరిమితం… పోటీ చేస్తే సర్పంచ్ గా గెలవవచ్చును.

కానీ మనం మాట్లాడిన విషయం ఒకటికి పదిసార్లు ఒక స్టేట్ ప్రజలందరికీ నచ్చితే, ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది… కదా…

అలాగే ఏదైనా ఒక ఐడియాను డవలప్ చేశారు. అది ఎక్కువమందికి నచ్చింది. ఇంకా ఎక్కువసేపు ఆ ఐడియాను ఫాలో అవుతున్నారు. అది ఆర్ధికప్రయోజం పెందచుతుంది.

మొబైల్ యాప్ డవలప్ చేయాలంటే, ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఎక్కువమంది యూజర్లకు నచ్చడం. ఎక్కువమంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉండడం… చాలా ప్రధానం.

ఇంతకముందు అనుకున్నట్టు ఒక విషయంలో ఎంతమంది ఎన్ని మొబైల్ యాప్స్ డవలప్ చేసినా… అందరికీ నచ్చింది… ఎక్కువమంది ఏక్టివ్ యూజర్లను కలిగి ఉన్న యాప్… సక్సెస్ పుల్ యాప్…

పాపులర్ ఐడియా ఉండదు…. మంచి ఐడియా పాపులర్ అవతుంది. అందరికీ తెలిసిన విషయమే… అది కానీ అందులో అందరూ గమనించని విషయం ఉంది.

చాలామంది గమనించని విషయమును హైలెట్ చేసిన ఐడియా సక్సెస్ అవుతుంది.

అంటే అందరూ ఫోను వాడుతుంటారు… ఆ ఫోను గురించిన పూర్తి అవగాహన ఎక్కువమందికి ఉండకపోవచ్చును.

కొందరికి కేవలం ఫోను కాల్ చేయడం కొరకు మాత్రమే వాడుతారు. వీరు ఖరీదు అయిన ఫోను అయినా, దానిని కేవలం కాల్ చేయడం కొరకు మాత్రమే వాడుతారు.

సోషల్ మీడియా యాప్స్ కొందరు వాడుతూ ఉంటారు. కేవలం ఫ్రెండ్ రిక్వెస్టులు చూడడం, వారికి తిరిగి రిప్లై ఇవ్వడం… చాలామంది ఇక్కడికే పరిమితం అవ్వవచ్చును.

బ్రౌజింగ్ ద్వారానే చాలా వరకు యాప్స్ ఇన్ స్టాల్ చేయవసరంలేదు… బ్రౌజింగుపై పూర్తి అవగాహన అన్ని ప్రాంతీయ భాషలలోనూ అందిస్తే, ఆ యాప్ విజవంతం కాగలదు.

ఎందుకంటే సోషల్ మీడియా యాప్స్ అంటే, వెబ్ సైటుల కూడా ఉంటాయి. వెబ్ సైటులను ఏదైనా ఒక బ్రౌజరులో ఓపెన్ చేసి చూసుకోవచ్చును…. కాబట్టి మొబైల్ బ్రౌజింగ్ ట్యుటోరియల్ బాగా వృద్ది చేస్తే, ఉపయోపడుతుంది.

ఒక గుడ్ ఐడియా అందరికీ ఉపయోగడపడేలా మొబైల్ యాప్ డవలప్ చేయాలి. దానిని ఎక్కువమందికి తెలిసేలాగా చేయాలి. అప్పుడు ఆయాప్ సక్సెస్ అవుతుంది.

ఇంకా చాలామంది డవలప్ చేసిన మొబైల్ యాప్స్ ఉన్నా… అందులో ఏదో ఒక విషయంలో మరింత డవలప్ మెంట్ అవసరం ఉంటుంది. ఆ విషయం కనిపెడితే, ఆరకమైన యాప్ మరొకటి చేసినా విజయవంతం అవుతుంది.

ప్లేస్టోర్లో అనేక రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆండ్రాయిడ్ ఫోను యూజర్ అన్నింటిని డౌన్ లోడ్ చేసుకోరు. కావాల్సిన మాత్రమే డౌన్ లోడ్ చేసుకుంటారు.

అలా అందరూ డౌన్ లోడ్ చేసుకుని ఉండే యాప్స్ ఏమిటో చూసుకుని… అటువంటి యాప్స్ బాగా గమనించి, వాటిలో బెటర్ మెంట్ తీసుకురాగలిగితే, గ్రేట్ రిజల్ట్స్ పొందవచ్చును.

వాట్సప్, యూట్యూబ్, మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్ వంటి మొబైల్ యాప్స్

చాలా మంది ఫోన్లలో వాట్సప్, యూట్యూబ్, మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్ వంటి మొబైల్ యాప్స్ ఉంటాయి. యూట్యూబ్ అయితే ప్రతీ ఆండ్రాయిడ్ ఫోనులోనూ డిఫాల్ట్ గా ఉంటుంది.

మ్యూజిక్ ప్లేయర్, మెసేజింగ్, కాలింగ్, కాంటాక్ట్స్, వీడియో ప్లేయర్ వంటివి ఎటువంటి స్మార్ట్ ఫోను అయినా డిఫాల్ట్ గానే కొన్ని ఉంటాయి.

అలాంటి వాటిలో ఏవైనా సమస్యలు ఉంటే, అవి అందరికీ ఉండవచ్చనే ఊహను పట్టుకుంటే, ఆ ఊహను మరింతగా డవలప్ చేసి, కొత్త యాప్ క్రియేట్ చేయడమే….

ఇప్పుడున్న పాపులర్ యాప్స్, స్మార్ట్ ఫోను వచ్చిన కొత్తల్లో ఉండి ఉండవు… కదా.

స్మార్ట్ ఫోను వినియోగదారులు పెరిగాక పలు మొబైల్ యాప్స్ వృద్ది చెందాయి. హాట్ స్టార్ మొబైల్ యాప్ 2015లో లాంచ్ అయ్యింది…. అంతకుముందు స్మార్ట్ ఫోనులు ఉన్నాయి… వాటిలో సినిమాలు చూసేవారు…

మొబైల్ వాడుక ఎంతకాలం? యాప్స్ వాడుక ఎంతకాలం? ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డవలప్ మెంట్

మొబైల్ వాడకం ఎప్పుడూ ఉంటుంది… అందులో యాప్స్ వస్తూ ఉంటాయి… పోతూ ఉంటాయి.

ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ కొన్న వ్యక్తి మరికొంత కాలానికి మరొక ఫోన్ కొంటాడు… కానీ ఫోన్ వాడుకను మానడు… అయితే ఫోన్ వాడుతున్న యూజర్ ఖాతా చరిత్రలో నిలిచి ఉంటున్న యాప్స్ ఎన్ని?

అలా ఒక యూజర్ మొబైల్ ఖాతా చరిత్రలో ఎల్లకాలం, ఎంత ఎక్కువమంది చరిత్రంలో ఉంటే, అంత విజయవంత అయినట్టు….

యూట్యూబ్, వాట్సప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ వంటి కొన్ని సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ఉంటాయి.

అయితే ఇప్పుడు మొబైల్ యాప్ ప్రారంభంలో అంత పెద్ద విజయం సాధ్యం కాకపోవచ్చును. కానీ మన ఐడియా అందరికీ నచ్చితే, అది సాధ్యమే అవుతుంది.

ఎందుకంటే అవసరాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలాగా నడవదు. 2019లో రెగ్యులర్ జీవన విధానం 2020లో అందరిలోనూ మార్పుకు గురైంది… అప్పుడప్పుడు కాలం తెచ్చే మార్పులు వ్యవస్థలపై కూడా భారీగానే పడతాయి.

అలాంటి సమయాలలో కొత్త ఆలోచను పుంతలు తొక్కుతాయి. యూజుపుల్ ఐడియాస్ వర్కవుట్ అవుతాయి.

మొబైల్ యూజర్ ఖాతాలో మన మొబైల్ యాప్ పర్మెనెంటుగా ఉండాలంటే, ఎక్కువమంది మొబైల్ యూజర్స్ ఉపయోగించే ఉపయోగాన్ని మనం అందరికన్నా సమర్ధవంతంగా అందించాలి.

వీడియో బ్లాగింగ్ ఇప్పుడు పెద్ద ట్రెండు… అందరూ ఆన్ లైన్లో ఫోనుతో కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. ఔత్సాహికులు వీడియో ద్వారా ఇచ్చే ప్రదర్శనల వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.

అలాంటి వీడియో బ్లాగింగులో మరింత డవలప్మెంట్ ఎక్కువ సక్సెస్ రేట్ సాధించగలదు… ఇప్పటికే ఉన్న వీడియో బ్లాగింగ్ యాప్స్ గమనిస్తే, వాటిలో ఏదైనా అసౌకర్యం ఉండి, దానిని మరింత డవలప్ చేయడంతో సక్సెస్ పుల్ వీడియో యాప్ చేయవచ్చును.

ఒకప్పుడు ఒక రైటర్ ఎనలైజింగ్ ఆర్టికల్స్ ఒక పుస్తకంగా ఉండేవి. కానీ ఆన్ లైన్ అందుబాటులోకి వచ్చాకా… అవి పిడిఎఫ్ బుక్స్ రూపంలోకి మారుతున్నాయి.

మొబైల్ యాప్స్ రూపంలో కూడా బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి. బ్లాగులు మొబైల్ బ్లాగులుగా మారుతున్నాయి.

నేటి టెక్నాలజీ యుగంలో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ కీలక పాత్రను పోషిస్తాయి. వాటిలో మీ ఐడియా ఉంటే, భవిష్యత్తు మీదేనంటారు…

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

చిన్ని పిల్లల పేర్లు అచ్చతెలుగులో సెర్చ్ చేయడానికి తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

ఆకాశంలో అద్భుత సంయోగం ఈరోజు

లిస్టువ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

వెబ్ సైట్ షార్ట్ కట్స్ ఇన్ ఒన్ స్క్రీన్

విషయములు ఆలోచన పుస్తకం

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి మూవీ

సంపూర్ణ రామాయాణం భక్తి మూవీ తెలుగు సినిమా