కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం

నిత్య దీపారాధనతో చేసినా, కార్తీకమాసంలో చేసే దీపారాధన ప్రముఖమైనదిగా చెబుతారు. ఇంకా కార్తీకమాసంలో ప్రత్యేకతిధులలో చేసే దీపారాధన విశిష్టమైనదిగా చెబుతారు. అయితే కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం అంటే మరింత విశిష్టమైనదిగా ఉంటుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఇలా ఈ విధంగా కార్తీకమాసంలో సోమవారంతో కూడిన కార్తీకపౌర్ణమి రోజున కార్తీకదీపం పెట్టే విధంగా రోజులు వచ్చి ఉంటాయి. అయితే ఆ సమయంలో అందరికీ ఆ భాగ్యం తెలిసి ఉండకపోవచ్చును. లేకా తెలిసినా చేసే అవకాశం లేకపోవచ్చును.

అందరికీ తెలిసేలా కొందరు చేసే ప్రయత్నం మొత్తం అందరికీ తెలియకపోవచ్చును. అందుకే ఈ పోస్టు ద్వారా ఆసక్తి కలిగిన వారికి ఈ కార్తీకపౌర్ణమి గుర్తు చేయడం కొరకు మాత్రమే ఈ పోస్టు.

సోమవారం దీపారాధన శివుడికిష్టం అంటారు. కార్తీకమాసంలో కార్తీక సోమవారం మరింత ప్రీతి అంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చాలా విశిష్టమైనదిగా చెబుతారు. ఇక కార్తీకమాసంలో సోమవారం కార్తీకపౌర్ణమి కార్తీకదీపం చేయడం అంటే అదృష్టమనే అంటారు.

శివకేశవులకు ఇష్టమైన కార్తీకమాసంలో కార్తీక దీపారాధన, ఈశ్వరనామ స్మరణ మరింత పుణ్యప్రదం అంటారు.

కార్తీకమాసములోని కార్తీకపౌర్ణమి తిధి రోజున దీపారాధన చేసి, ఈ క్రింది శ్లోకం పఠించాలని గురువుగారు బ్రహ్మశ్రీచాగంటి కోటేశ్వరరావుగారు అంటారు.

పరమపుణ్యమైన కాలముగా కార్తీకమాసమును చెబుతారు. ఇందలి మాసములో మనం చేసే ప్రాత:కాల స్నానాలు శుభప్రదమని అంటారు. అలా కార్తీక స్నానమాచరిస్తూ, సోమవారం మరియు ఇతర పుణ్యతిథులలో చేసే దైవారాధన మరింత పుణ్య ప్రదం అంటారు.

తెలుగురీడ్స్