సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్

సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్ గురించి… జీవితం కష్టసుఖాలతో కలిసి మమకార మిత్రులతో ఆత్మీయ బంధువులతో కలసి ఉండే కుటుంబ సభ్యులతో సాగిపోతూ ఉంటుంది. ఒకసారి ఒకరి సంతోషం కుటుంబానికి అంతటికి సంతోషం, ఇంకోసారి ఒకరి దుఖం కుటుంబానికి కష్టం కలిగించే సందర్భం. ఇలా జీవితం అన్ని రకాల భావనలతో మిలితిమై మనిషిని ఆశానిరాశ నిస్పృహలలో తేల్చుతూ కాలంలో సంతోషాలను కలిగిస్తూ ఉంటుంది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

జీవితంలో ఒత్తిడిలు ఎదుర్కొంటూ కేవలం సందేశం అందించే చిత్రాలను చూడడానికి కుటుంబసమేతంగా అంటే సాధ్యం కాదు. ఒకరు ఎదో ఆలోచనలో ఎదో భావనలతో విబిన్న భావనలతో ఉండే వ్యక్తుల కలయిక కుటుంబం. చిన్న కుటుంబమే అయినా ఒకరికి వంద ఆలోచనలు వంద సమస్యలు అన్ని సమస్యల మధ్య కేవలం సందేశం కూడిన ట్రాజెడి సినిమాలు చూడాలంటే ఇబ్బందే.

సందేశం కధలో కలిసిపోయి, సాదారణ ధర్మాలతో ధర్మం కోసం సాహసం చేసే కధానాయకుల కధలో కామెడీ, డ్రామా, యాక్షన్ వంటి సన్నివేశాలతో అక్కడక్కడ అవసరానికి సెంటిమెంట్ సన్నివేశాలతో కుటుంబ వ్యక్తిగత సామజిక విలువను కోల్పోకుండా సాగే హీరోల సినిమాలు చూడడంతో బాటు, తమతోటి వారితో కలిసి చూడవచ్చు. ప్రేమ కోసం ఫైట్ చేస్తూ, ఇంటికోసం ఆలోచన చేస్తూ, కుటుంబం కోసం త్యాగం చేస్తూ, బందం కోసం భాద్యత తీసుకుంటూ, సమాజం కోసం పాటు పడుతూ సాగే కధలలో అవసరమైన సరదా సన్నివేశాలతో సాగే చిత్రాలు ఆనందదాయకంగా ఉంటుంది.

సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్

బహుశా 1990 – 2000 మధ్యలలో వచ్చిన తెలుగు చిత్రాలు సూపర్ హిట్ అయ్యి అందరిని అలరించిన కొన్ని చిత్రాలను గుర్తు చేసే ఉద్దేశ్యంతో ఈ పై వివరణ ఉంది. త్యాగంతో కూడిన కధానాయకుడుకి గంభీరమైన మనసుతో దుఃఖాన్ని లోపలే దాచుకునే చిత్రాలు కొన్ని ఉంటే, నీతి శాస్త్రాలు చదవకపోయినా సహజస్వభావం నీతివైపే వెళ్ళే కధానాయకుల చిత్రాలు కొన్ని ఉంటాయి.

ఇంటికి పెద్దరికం వహిస్తూ ఇంటి సభ్యులకు మార్గదర్శకంగా నిలిచే వ్యక్తుల చిత్రాలు కొన్ని ఉంటే, డబ్బుకోసం ఏపని అయినా చేసే వ్యక్తి, ధర్మం తెలుసుకుని అధర్మాన్ని అడ్డుకునే బలవంతుల కధలు కొన్ని ఉంటాయి. అమ్మే దేవత అమ్మమాట అంటే దేవుడి మాటకన్న గొప్పగా భావించే ఒక కొడుకుని మోసం చేయబోయి బుద్ది తెచ్చుకున్న ఒక అమ్మ కధ ఇలా అనేక విధాలు అనేక చిత్ర విచిత్ర కధలతో తెలుగు చిత్రాలు ఆయా సంవత్సరాలలో సకుటుంబంగా సినిమాహాలులో చూడదగిన చిత్రాలుగా ఉన్నాయి.

ఇప్పటి కాలంలో వచ్చే చిత్రాలు కొన్నింటిని కుటుంబంతో కలిసి చూడలేము అంటారు. అలా అంటున్న ఈ కాలంలో కూడా కొందరి చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉండడం ఉంది. కాని గతకాలపు చిత్రాలలో ఉన్న విలువలు ఈకాలపు పరిస్థితులలో తెలుసుకోవడము మంచిదే. అందరిని అలరించగలిగే వినోదభరితం, సందేశం అంతర్లీనంగా ఉండే కదల చిత్రాలు కొన్ని క్రిందగా చదవండి.

అల్లుడుగారు మ్యూజికల్ హిట్ – సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్

అల్లుడుగారు సరదాగా సాగేపోయే కుటుంబ సెంటిమెంట్ చిత్రం. తన తండ్రితో చెప్పిన అబద్దం కారణంగా, తండ్రి ఆరోగ్యరిత్యా ఆ అబద్దాన్ని నిజం చేయాల్సిన పరిస్థితిలో ఒక వ్యక్తిని తీసుకువచ్చి భర్తగా పరిచయం చేసే కధతో చిత్రం ప్రారంభం అవుతుంది. జైలునుండి విడుదల అయిన వ్యక్తి సరాసరి ఒక ఎస్టేట్ ఓనర్ కూతురికి భర్తగా నటించాల్సి వస్తే, కేవలం డబ్బు కోసం ఒప్పుకుంటాడు. అలా ఇద్దరు అపరిచితులు భార్యభర్తలుగా ఒక పెద్దమనిషి దగ్గర నటిస్తూ, ఆ పెద్దమనిషి ఆరోగ్యం కోసం వారు దగ్గరై ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడంతో చిత్రం ముగుస్తుంది. అయితే చివరకు ఎక్కడ నుండి వచ్చినవారు అక్కడికే చేరుకుంటారు. అయితే ప్రేమ కధ సరదా సన్నివేశాలతో మంచి మంచి పాటలతో ప్రేక్షకులని మెప్పిస్తుంది.

సూపర్ హిట్ ఫాంటసీ – సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్

పురాణాల్లో నారదుడు వచ్చాడు అంటే సాదారణ స్థితికి భిన్నంగా ఇంకేదో జరగబోతుంది అనేది ప్రకృతి నియమంగా కనబడుతుంది. దేవలోకంలో నారదుడు రాగానే దేవేంద్రుడు కూతురు ఇంద్రజ దీవెనలు తీసుకుని భూలోకంలో హిమాలయాలు సందర్శించడానికి వస్తుంది. పిల్లలతో కలిసి ఉండే రాజు, తన దగ్గర ఉండే అనాధ పిల్ల కాలువైద్యం నిమిత్తం మూలిక కోసం హిమయలకు వస్తాడు. హిమాలయాల్లో మహిమగలిగిన తన ఉంగరాన్ని ఇంద్రజ చేజార్చుకుని తిరిగి స్వర్గం చేరుకుంటుంది. మూలికతోబాటు ఆ ఉంగరాన్ని అందుకున్న రాజు ఇంటికి వచ్చేస్తాడు. ఉంగరం పోగొట్టుకొని స్వర్గలోక ప్రవేశం కోల్పోయిన ఇంద్రజ భూలోకంలో ఉన్న రాజు ఇంటికి చేరుతుంది. అక్కడ నుండి ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

మ్యూజికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్

ముక్కోణపు ప్రేమ కధా చిత్రాలు అనేకంగా మనకి తెలుగులో లభిస్తాయి. అలాంటి చిత్రాలలో నారి నారి నడుమ మురారి చిత్రం ఒకటి. సూపర్ హిట్ రొమాంటిక్ సాంగులతో ఆద్యంతం చిత్రం సరదాగా సాగిపోతుంది. కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు మాత్రమే ఉండి, ఆద్యంతం సరదాగా ప్రేమ సన్నివేశాలతో సాగిపోయే తెలుగు చిత్రం. పొగరుబోతు అత్తకి బుద్ది చెప్పడానికి మామ సహయంతో పక్కింటిలోకి వచ్చిన బావతో మరదళ్ళు సాగించే ప్రేమకలాపాలు మంచి కాలక్షేపాన్ని అందిస్తాయి. పాటలుకూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇద్దరు మరదళ్ల ప్రేమను భరించే వ్యక్తిగా బాలకృష్ణ నటిస్తే, మరదళ్ళుగా శోభన, నిరోషా నటించారు. ఇంకా కైకాల సత్యనారాయణ, శారద, అల్లు రామలింగయ్య, రమాప్రభ, సుత్తివేలు తదితరులు నటించారు.

చంటి

అల్లారు ముద్దుగా పెరిగే జమిందారుగారి చెల్లెలు, మొద్దుగా అనిపించుకునే పాటలు పాడే పనివాడికి మద్యలో జరిగిన ప్రేమకధలో నలిగే అనుబంధాలు కలిగిన చంటి చిత్రం అందరిని అలరించింది. మొద్దుబారిన కొడుకు ఎప్పుడు జీవితం ఎలా ఉంటుందో అని భాదపడే తల్లికి కొడుకుగా, ఊరిలో వారు కన్నెత్తి చూడడానికి బయపడే అమ్మాయి ఎదుట నిలబడి పాటలు పాడే వ్యక్తిగా చంటి పాత్రలో వెంకటేష్ నటించారు. జమిందారు చెల్లెలి పాత్రలో మీనా నటించింది. జమిందారుగా నాజర్ నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. తమిళ చిత్రం చినతంబి చిత్రకధ ఆధారంగా తెలుగు రీమేక్ చేసారు. ఇంకా మంజుల, బ్రహ్మానందం తదితరులు నటించారు.

గ్యాంగ్ లీడర్ – సకుటుంబానికి వినోదం అందించే తెలుగు మూవీస్

గ్యాంగ్ లీడర్ అంటే పెద్ద గ్యాంగ్ వేసుకుని ఒక సమాజ సేవో లేక దోపిడినో చేసే గ్యాంగ్ అని ఊహిస్తాం కానీ ఈ చిత్రం కుటుంబకధతో ఒక భాద్యత కలిగిన యువకుడి ఔన్నత్యం ఉన్నతమైన మనసు ప్రేక్షకుల గుండెలకి గ్యాంగ్ లీడర్ అయ్యాడు. మధ్యతరగతి కుటుంబ భాద్యతను నెత్తిన వేసుకుని జీవించే రఘుపతి(మురళిమోహన్)కి రెండవ తమ్ముడు రాఘవ(శరత్ కుమార్) ఐఏఎస్ చదువుకు రెడీ అవుతూ ఉంటాడు. ఆ చదువుకు ఫీజు కట్టడానికి అవసరమైన డబ్బు లేకపోతే, చిన్న ఆక్సిడెంట్ కేసు నెత్తిన వేసుకుని డబ్బు అన్నకి అందజేసి జైలుకు వెళతాడు మూడవ తమ్ముడు రాజారామ్(చిరంజీవి). రఘుపతి ఒకరోజు తాను చూసిన ఒక రాజకీయ హత్యకేసు గురించి పోలీసులకు చెప్పి, సదరు హత్య చేసిన ఏకాంబరం కనకాంబరం చేతిలో హతుడవుతాడు. రఘుపతి హత్య విషయం తెల్సిన స్నేహితులు రాజారామ్ తో చెబితే ఆవేశంతో ప్రాణాలు మీదకు తెచ్చుకుంటాడు అని భావించి, స్నేహితులు హోమ్ మినిస్టర్ కి దరఖాస్తు పెట్టుకుని వారు కూడా ఏకాంబరం కనకాంబరం చేతిలో హతులవుతారు. నిజం తెలిసిన రాజారామ్ కుటుంబాన్ని కాపాడుకోవడంలో ముందు ఉంటూ అన్యాయం చేసే గ్యాంగ్ ని మట్టు బెట్ట గ్యాంగ్ లీడర్ అవుతాడు రాజారామ్.

అమ్మే దైవంగా భావించే అబ్బాయిగారు

మాతృదేవోభవ అని పెద్దలు చెబితే ఇక్కడ ఈ చిత్రంలో ఈ అబ్బాయి మాత్రం మారుటతల్లి అయినా దేవతగానే చూసుకోవడం విశేషం. తల్లి తనకి ద్రోహం చేస్తుందని తెలిసినా అమ్మని దేవతగానే భావించిన అబ్బాయిగారి కధ. చిన్నతనంలో తండ్రి తీసుకువచ్చి ఈమే నీ తల్లి అనగానే ఆతల్లి మాటను అనుసరించి బడికికూడా పోకుండా అమ్మ చెప్పిన మాటలల్లా వింటాడు. అస్తికోసమే రెండోపెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఈ పిల్లవాడిని కీలుబొమ్మగానే మారుస్తుంది. కొడుకుకు ఇంకో తింగరి అమ్మాయిని ఇచ్చి చేస్తే ఆస్తివిషయంలో తిరుగులేదు అనుకుంటున్నా సమయంలో కొడుకు అనుకోని పరిస్థితిలలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని రావడంతో చిత్రకధ ఆసక్తిగా ఉంటుంది. చదువుకున్న కోడలిని చంపడానికి చేసిన విష ప్రయత్నంలో విషం కొడుకే త్రాగుతాడు. అమ్మమీద మాటపడడం ఇష్టం లేని అబ్బాయిగారు. కట్టుకున్న పెళ్ళాం అమ్మనిజస్వరూపం గురించి చెప్పినా అమ్మమీద నమ్మకంతో ప్రాణాలు మీదకు తెచ్చుకున్న కొడుకుని చూసి బుద్ది తెచ్చుకుంటుంది ఆ తల్లి. అమ్మకి తనపై కపట ప్రేమ ఉన్నా కన్నతల్లి కాకపోయినా ఆ తల్లిమాట వినే అబ్బాయిగారుగా వెంకటేష్ నటిస్తే, తల్లిగా జయచిత్ర నటించారు. మీనా వెంకటేష్ కు జోడీగా నటించారు.

మరెన్నో తెలుగు చిత్రాలు ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ వినోదం అందించే చిత్రాలు తెలుగులో ఉన్నాయి. ఇంకా కొన్ని చిత్రాల గురించి తరువాత…వ్రాయగలను

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

పుల్ లెంగ్త్ తెలుగు ఫ్యామిలీ మూవీస్

సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ

శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ