ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి ఉండకపోవచ్చు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఈ రోజుల్లో పురుషులకు కూడా అందరికీ కరాటే వచ్చా? కొందరికే వచ్చి ఉంటుంది. ఇక మహిళలు అంతా కరాటే నేర్చుకుని తమని తాము రక్షించుకుంటారని కాదు, మహిళ సంరక్షణ సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలి. సమాజంలో ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే, అంటే ఆ ఆడపిల్ల ఎవరికి ఒంటరిగా కనబడితే, వారు ఆమెకు ఎటువంటి హాని తలపెట్టకుండా ఆమెను గమ్యానికి చేర్చడం వారి సామాజిక బాధ్యత. ఆడువారికి అటువంటి భద్రత కల్పించడం అనేది భారతీయ సంప్రదాయంగానే భావిస్తారు, అంటే మనల్ని ఇతరుల పరిపాలించకముందు మన సంప్రదాయం స్త్రీలను గౌరవించడం ప్రధానంగా ఉంది. లేకపోతే గాంధిగారు ఆమాట ఎందుకు వాడుతారు?

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత బాలురకు చిన్నప్పటి నుండే తండ్రి తెలియజేయాలి.

పురుషుడు బాధ్యతతో ధర్మంవైపు న్యాయంగా నడవడమే పురుష లక్షణం అయితే అటువంటి పురుష లక్షణంతో ప్రవర్తించడం అతని ప్రధమ ప్రయత్నం కావాలి. భారతదేశ సంప్రదాయంలో చరిత్ర చూసుకుంటే స్త్రీలు ఎందరో చరిత్రకెక్కిన పురుషుల వెనుక ప్రోత్సాహం అందించినవారే ఎక్కువ. ఏ గొప్ప నాయకుడు అయినా, ఏ గొప్ప శాస్త్రవేత్త అయినా, ఏగొప్ప తత్వవేత్త అయినా, చివరికి భగస్వరూపులు అయిన రామకృష్ణ పరమహంస కానీ, వివేకానందస్వామి కానీ ఎవరైనా ఒక స్త్రీ కొంత సమయం జీవన్మరణ పోరాటం చేస్తేనే వారు ఈ భూమిపైకి వచ్చారు. స్త్రీ అటువంటి పవిత్రమూర్తిగా సామాజికంగా మేలై నాయకులను, మేలైన మార్గదర్శకులను సమాజానికి అందిస్తే, పురుషుల నండి సామాజికంగా ఎటువంటి బాధ్యత ఉండాలి? ఒక్కసారి మృగంగా మారబోయే పురుషుడు తన పుట్టుకకు కూడా ఒక స్త్రీ చావుబ్రతుకులతో పోరాటం చేస్తేనే, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని ఆలోచిస్తే తప్పుడు పనులు చేయలేరు.

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని సమాజంలో పరిణితి చెందినవారి స్పృహలో ఉండాలి, పరిణితి చెందుతున్నవారికి బోధిస్తూ ఉండాలి. కుడి చేతితో అన్నం తినిపిస్తున్న అమ్మ, ఎడం చేతితో ముడ్డి కడుగుతుంది. అమ్మగా మారే అటువంటి ఆడువారి గురించి, నడక నేర్పించే నాన్న ఖచ్చితంగా స్త్రీ అంటే గౌరవం కలిగేలాగా కొడుకుతో మాట్లాడాలి. అది తండ్రిగా తన బాధ్యత. సేవలు చేస్తున్న భార్యను పురుషుడు చూసే దృష్టి వ్యక్తిగతంగా ఉన్నా… పిల్లల ముందు స్త్రీని దుర్భాషలాడడం ఉండకూడదు. ముందు పురుషుడు పిల్లల ముందు, ఇతరుల ముందు తన భార్యకు గౌరవం తెచ్చేలాగా ప్రవర్తించాలి. ఇంకా ఇతర స్త్రీలపై ఎటువంటి భావనతో ప్రవర్తించాలో చిన్ననాటి నుండే బాలురకు నేర్పించాలి. ఆంటీ అంటే అర్ధం లేదు, అత్తయ్య, అక్కయ్య, పిన్ని, పెద్దమ్మ ఇలా అచ్చతెలుగు పలుకులే పలికించాలి. అందులో ఆత్మీయత ఆప్యాయత ఉంటుంది. ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత బాలురకు చిన్నప్పటి నుండే తండ్రి తెలియజేయాలి.

స్మార్ట్ పోన్లలో విజ్ఙానం ఎప్పుడు కావాలంటే అప్పుడే

అయేషా హత్య, దిశ మరణం, మహిళల మిస్సింగ్ ఇలా మహిళలపై ఎక్కడో ఒక చోట జరుగుతుందంటే సమాజంలో విలువలు ఏస్థాయికి పడిపోతున్నాయో ? ఆలోచించాలి. సాంకేతిక పెరిగి, స్మార్ట్ ఫోన్లు అందరికి అందుబాటులో ఉండడమే కాకుండా స్మార్ట్ పోన్లలో విజ్ఙానం ఎప్పుడు కావాలంటే అప్పుడే తెలుసుకునేలాగా అందుబాటులోకి వచ్చింది. అంతటి అవకాశం ఈ రోజుల్లో ఉంటే, స్మార్ట్ ఫోను ద్వారా తెలుసుకునే విషయాలు మన మైండులోకి చేరి అవే అమలు అవ్వడం కూడా జరిగిపోతుంది. ఎందుకంటే ఒక బుక్ రీడ్ చేస్తే, ఆబుక్ లో ఉన్న విషయంతో మనిషి కాసేపు ఏకాగ్రతతో ఉండడం చేత అ విషయాని మైండు బాగా పట్టుకుంటుది. ఆ విషయం అమలు చేయడమో లేక ఇతరులకు సలహా ఇవ్వడమో చేస్తాడు. అలాగే స్మార్ట్ ఫోనులో మనిషి ఒంటరిగా ఏమి చూస్తున్నాడో అదే చేయాలనే ఆలోచనలు మనిషి మైండుకు కలగడం సహజం, కాబట్టి మంచి విషయాలు, విజ్ఙాన విషయాలు, గొప్పవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడం వలన సామాజిక బాధ్యత మనిషికి మరింత పెరుగుతుంది.

చెడు అలవాట్లు వ్యాదిలాంటివి వాటి గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలసిన అవసరం అందరికీ అవసరం ఉండదు. వ్యాది సోకినప్పుడు మందేసినట్టుగా చెడు అలవాట్టు పరిచయమైనప్పుడు వాటి గురించి ఆలోచన చేసి, వాటి వలన ప్రయోజనంతో బాటు, సామాజికంగా మనిషిని ఏస్థాయిలో నిలబెడుతున్నాయో? ఆలోచనే చేస్తే వాటిపై నియంత్రణ మనిషి మైండుకు వస్తుంది. అంతే కానీ ప్రత్యేకించి వాటి గురించి ఆలోచిస్తే ఆ చెడుపని చేసేవరకు ఆరాటంతో దారి తప్పుతారు. పదవతరగతి ప్రతి విద్యార్ధికి విద్యాలయం ఇచ్చే పరీక్ష, పది కొందరు ఫెయిల్ అయినా ఫరవాలేదు కానీ యవ్వనం అనేది కాలం తెచ్చే పరీక్షాకాలం, ఆకాలంలో మనసుపై నియంత్రణతో నిలబడడమే పాస్ కావడం. మనసును అలవాట్లు నుండి రక్షిస్తూ, వ్యసనాలకు దూరంగా ఉండడమే యవ్వనంలో వ్యక్తి నేర్చుకోవాలసిన విషయం. అన్నం తినడం కూడా అలవాటే, అయితే అదేపనిగా రోజుకు పదిమార్లు తింటే, ఆ వ్యక్తిని తిండిబోతు అంటారు. అంటే సాదారణం కన్నా ఎక్కువమార్లు చేస్తే అది వ్యసనం, వ్యక్తి ఏ విషయంలోనూ వ్యసనపరుడు కాకుడదు. అవసరం అయితే అలవాటుని జయించే విధంగా ఉండాలి కానీ అవసరం లేకపోయినా ఇష్టం కదా అని అలవాట్లను వ్యసనాలుగా మార్చుకోకూడదు.

ప్రతి పురుషుడు తనని తాను నియంత్రించుకుంటూ సామాజిక బాధ్యతతో నడిచినరోజు ఆడది అర్దరాత్రి ఒంటరిగా కనిపించినా, ఆమెను గమ్యస్థానం చేర్చాలనే అలోచన ప్రధమంగా కనిపిస్తుంది. అదే యువతలో ప్రధానంగా పెరగాలి. పరస్తీ పరదేవతా స్వరూపంగా భావించి, నమస్కారం చేయడం మన భారతదేశ సంస్కృతి అంటారు. అటువంటి సంస్కృతికి భారతీయలంతా వారసులే, కాబట్టి ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత గా గుర్తించాలి.

స్త్రీని గౌరవప్రదంగా చూపించడం సినిమావారి కనీస సామాజిక బాధ్యత.

దిశపై జరిగిన దారుణం చాలా అమానుష చర్య, అయితే ఆచర్యకు ప్రతిచర్యగా అందరూ సామూహికంగా ప్రతిస్పందించారు. కానీ వ్యక్తిగతంగా స్త్రీపై సద్భావన అందరికీ ఉంటే, ఇటువంటి ప్రేరేపిత వ్యక్తులు సమాజంలో తయారు కారు. స్త్రీని గౌరవించడం అనే మాటలు సినిమాలో తగ్గిపోయాయి, ఫలితంగా యువతలోనూ తగ్గిపోతున్నాయి. స్త్రీని గౌరవప్రదంగా చూపించడం సినిమావారి కనీస సామాజిక బాధ్యత. ఎందుకంటే సినిమాలో ట్రెండ్ యువతకి ఫ్యాషన్ కాబట్టి సినిమాలో స్త్రీ యొక్క గొప్పతనం పెరిగే విధంగా ఉండాలి కానీ తగ్గేవిధంగా కాకుడదు. బాహుబలి సినిమాలో హీరో ఔన్నత్యం తల్లి పెంపకం వలననే పెరిగితే, అర్ధం చేసుకున్న భార్యవలన కాలం పెట్టిన పరీక్షలో ప్రాణాలను సైతం మనస్పూర్తిగా అర్పించగలిగాడు. అటువంటి స్త్రీపాత్ర ప్రతి పురుషుడి విషయంలో ఒక తల్లి రూపంలోనూ, భార్యరూపంలోనూ లభిస్తుంది. అటువంటి స్త్రీమూర్తిని పవిత్రమూర్తిగా చిత్రీకరించాలికానీ అసభ్యపదజాలం, లసభ్యకరమైన భంగిమలను కాదు. ఇది సినిమావారు గుర్తించాల్సిన విషయం. కొన్ని సినిమాలలో కాదు… అన్ని సినిమాలలోనూ స్త్రీల గురించి మంచినే పెంచాలి. స్త్రీలలోనూ చెడు ప్రవర్తన కలిగివారు లేకపోలేదు, కానీ అటువంటి వారిని హైలెట్ చేయడం వలన ప్రయోజనం కన్నా, ఇలా కూడా మారవచ్చనే సలహాను అందించినట్టే అవుతుంది కాబట్టి స్త్రీలలోని మంచినే చూపించాలి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్