Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి చేసే కంప్యూటర్ అప్లికేషన్! దీనిద్వారా Android OS మరియు iOS మొబైల్ యాప్స్ అభివృద్ధి చేయవచ్చును. ఎక్కువమంది ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ వాడుతుంటారు. కాబట్టి ఎక్కువగా ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్ అభివృద్ది చేస్తూ ఉంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు కాకుండా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న ఫోన్లు అంటే, అవి ఐఫోన్లు. ఇవి చాలా ప్రసిద్దం మరియు ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఐఫోన్లలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటాయి. కేవలం ఒక ఓఎస్ కు సరిపడే మొబైల్ యాప్ అభివృద్ది చేస్తే, అది మరొక ఓఎస్ లో రన్ కాదు. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండు మొబైల్ ఫోన్లలోనూ రన్ అయ్యే మొబైల్ యాప్స్ హైబ్రిడ్ మొబైల్ యాప్స్ అంటారు.

ఈ పోస్ట్‌లో ఆండ్రాయిడ్ స్టూడియో ఆధారంగా మనకు అందుబాటులో ఉన్న ట్యుటోరియల్ వెబ్‌సైట్‌లు మరియు వీడియోలకు లింక్‌లను తెలుసుకుందాం.

ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో కంప్యూటర్ లేదా ల్యాప్ ట్యాపులో ఇన్ స్టాల్ చేసే పద్దతిని తెలిపే వెబ్ లింక్స్ మరియు వీడియోలు ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్ నందు కానీ, ల్యాప్ టాప్ నందు కానీ ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్ స్టాల్ చేయడం గురించి వివరించే వెబ్ లింక్ కోసం ఇక్కడ ఈ అక్షరాలను క్లిక్ చేయండి.

ఇక Android Studio ఆండ్రాయిడ్ స్టూడియోలో కొత్త ప్రాజెక్టు ఎలా ప్రారంభించాలి?

ఈ క్రింది బటన్ పై క్లిక్ చేయండి. ఈ బటన్ కు జతచేసిన వెబ్ లింకులో ఆండ్రాయిడ్ స్టూడియో ఒక కొత్త ప్రాజెక్టు క్రియేట్ చేయడం గురించి వివరించబడి ఉంది.

https://youtu.be/ZZ-mXx4XowM
Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి

కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేయబడిన ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్, గ్రాడిల్ స్క్రిప్ట్స్ మెయిన్ ఫోల్డర్స్ ఉంటాయి. యాప్ ఫోల్డరులో మానిఫెస్ట్, జావా, రిసోర్స్ అను మూడు సబ్ ఫోల్డర్లు ఉంటాయి. గ్రాడిల్ స్క్రిప్ట్స్ ఫోల్డరును, అందులో డిపెండెన్సీస్ యాడ్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇంకా యాప్ వెర్షన్ కోడ్ మార్చడానికి ఉపయోగిస్తాము. ఏదైనా ప్లగిన్ ఇన్ స్టాల్ చేయడానికి ఉపయోగిస్తాము.

మొదటి మేనిఫెస్ట్ ఫోల్డరులో మేనిఫెస్ట్ ఎక్స్ ఎం ఎల్ ఫైల్ డిఫాల్ట్ గా ఉంటుంది.

మేనిఫెస్ట్ ఫైల్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో… ఇది ఒక ఎక్స్ ఎం ఎల్ ఫైల్. మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే మొదటిగా రీడ్ చేయబడే ఫైల్ మేనిఫెస్ట్ ఎక్స్ ఎం ఎల్ ఫైల్. దీనిలో మొబైల్ యాప్ నందు ఉపయోగించిన విషయాలను తెలియజేస్తారు. ఇంకా మొబైల్ పర్మిషన్స్ కోడ్ కూడా మానిఫెస్ట్ ఫైల్ నందు వ్రాయబడుతుంది. ఆండ్రాయిడ్ స్టూడియో మ్యానిఫెస్ట్ ఫైల్ గురించి ఈ క్రింది వెబ్ లింకు మరియు వీడియో లింకు ద్వారా తెలుసుకోండి.

https://youtu.be/8Ptf1C32IjM
మేనిఫెస్ట్ ఫైల్ నందు లాంచర్ ఏక్టివిటిని చేంజ్ చేయడం… గురించి వీడియో చూడండి.

జావా ఫోల్డర్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో

రెండవ జావా ఫోల్లరులో ప్యాకేజి ఫోల్లర్లు మూడు ఉంటాయి. ఈ ఫోల్లర్లలో మొదటి ప్యాకేజిలో జవా ఫైల్స్ ఉపయోగించి, యాప్ అవసరం అయిన కోడ్ వ్రాయవలసి ఉంటుంది. మిగిలిన రెండు జావా ప్యాకేజిలలో టెస్టింగ్ జావా ఫైల్స్ ఆండ్రాయిడ్ స్టూడియో సృష్టిస్తుంది. ఈ ప్యాకేజి ఫోల్డర్లు ప్రొజెక్టు పేరుతో ఆండ్రాయిడ్ స్టూడియో నందు కనిపించును. మొదటి ప్యాకేజిలో మెయిన్ ఏక్టివిటీ పేరుతో ఒక జావా క్లాస్ ఉంటుంది. ఇది కొత్త ప్రాజెక్టుగా డిఫాల్ట్ గా వస్తుంది. మెయిన్ ఏక్టివిటీ మార్గంలో, మీరు చాలా జావా క్లాస్ ఫైళ్ళను సృష్టించవచ్చు!

ఈ జావా క్లాస్ ఫైల్స్ అన్ని ఏక్టివిటీస్ ను బట్టి సృష్టిస్తారు. ఏక్టివిటీ అంటే?

డిజైన్ చేయడానికి ఎక్స్ ఎం ఎల్ లేఅవుట్ ఫైలు, డిజైన్ చేసిన ఎక్స్ ఎం ఎల్ ఫైలుకు జావా ప్రొగ్రామింగ్ వ్రాయడానికి ఒక క్లాస్ ఫైల్ రెండింటిని కలిపి ఏక్టివిటి అంటారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోనులో స్క్రీనుపై కనిపించే స్క్రీనులన్నీ ఈ ఏక్టివిటీస్ ద్వారానే డిస్ప్లే అవుతాయి. ప్రతి డిజైనుకు బ్యాక్ గ్రౌండు జావా క్లాసు ఫైల్ ప్రత్యేకంగా ఉంటే, యాక్టివిటి అవుతుంది. ఒక ఏక్టివిటీకి మల్టిపుల్ జావా క్లాస్ ఫైల్స్ సృష్టించవచ్చును.

ఇంకా వేరు వేరు పేర్లతో జవా క్లాస్ ఫైల్స్ సృష్టించడానికి ప్యాకేజిలను సృష్టించవచ్చును. ఉదాహరణకు, ఏక్టివిటీస్, ప్రాగ్మెంట్స్, ఎడాప్టర్స్, మోడల్స్, ఇంటర్ పేస్ మొదలైనవి.

మూడో ప్రధానమైన ఫోల్డర్ రిసోర్స్. అది ఈ res పేరుతో ఆండ్రాయిడ్ స్టూడియోలో ఉంటుంది.

ఈ res ఈ ఫోల్డర్ లో డ్రాయిబుల్, లేఅవుట్, మిప్ మాప్, వాల్యుస్ ను సబ్ ఫోల్డర్లు ఉంటాయి. ఇంకా ఈ res పోల్డరులో మరిన్ని సబ్ ఫోల్డర్లు జతచేయవచ్చును. ఉదా: రా, మెను, ఫోంట్స్, ఏనిమ్ వంటి సబ్ ఫోల్డర్లు డిజైనింగ్ అవసరం బట్టి జతచేయవచ్చును.

రిసోర్సెస్ ఫోల్డరులో ప్రధానమైన సబ్ ఫోల్డర్ లేఅవుట్ (layout): మీకు మొబైల్ యాప్ స్కీనులో కనిపించే స్క్రీనులన్నీ ఈ లేఅవుట్ ఫోల్డరులోనే సేవ్ చేయబడతాయి. ఈ క్రింది ఇమేజులో బ్లూకలరులో హైలెట్ అయి ఉన్న ఫోల్డరును చూడండి.

Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి
మొబైల్ యాప్ స్కీనులో కనిపించే స్క్రీనులన్నీ ఈ లేఅవుట్ ఫోల్డరులోనే సేవ్ చేయబడతాయి.
Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి
Android స్టూడియో మొబైల్ యాప్ అభివృద్ధి

ఎక్కువగా ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే, సంబంధిత కంపెనీ లోగో ఉంటుంది. ఆ తరువాత లాగిన్ అవ్వండి అంటూ లాగిన్ స్క్రీన్ ఉంటుంది. మీరు ఇంకా రిజిష్టర్ కాకపోతే, రిజిష్టర్ అవ్వండి అంటూ రిజిష్టర్ స్క్రీను ఉంటుంది. ఇంకా ఫర్గెట్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే, మరొక స్క్రీను వస్తుంది. ఇతర మొబైల్ యాప్స్ నందు, ఆయా కంపెనీల కంటెంటు ప్రత్యక్షంగా యాప్ ప్రారంభంలోనే కనవడతాయి.

ఇలా కనిపించే లాగిన్ స్క్రీన్, రిజిష్టర్ స్క్రీన్, రిసెట్ పాస్ వర్డ్ స్క్రీన్, కంటెంట్ స్క్రీన్ వంటి ఐటమ్స్ అన్ని ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎక్స్ ఎం ఎల్ లేఅవుట్స్ లో డవలప్ చేస్తారు. వాటి నిర్వహణ గురించి జావా క్లాసు లో కోడ్ వ్రాస్తారు. ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎక్స్ ఎం ఎల్ లేఅవుట్స్ గురించిన వీడియోలు క్రింది కంటెంట్లో గమనించండి.

ఏదైనా ముందుగా డిజైనింగ్ అందరిని ఆకట్టుకుంటుంది. అటువంటి డిజైనింగ్ లేఅవుట్స్ ఉపయోగించి, ఎక్స్ ఎం ఎల్ ఫైల్స్ సృష్టిస్తారు.

ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎక్స్ ఎం ఎల్ ఫైల్స్ ఎక్కువ ఈ క్రింది లేఅవుట్స్ కలిగి ఉంటాయి.

Vertical Linear Layout

Horizontal Linear Layout

Relative Layout

Constraint Layout

Frame Layout

Table Layout

Android Linear Vertical, Horizontal Layout ఆండ్రాయిడ్ లినియర్ లేఅవుట్(నిలువు మరియు అడ్డు వరుసలో) గురించి

Linear Layout ప్రత్యేకత ఏమిటి అంటే, ఐటమ్స్ అడ్డు వరుసలో లేదా నిలువ వరుసలో చూపుతుంది. ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎక్కువ ఐటెమ్స్ లిస్ట్ రూపంలో చూపించడానికి ఈ లేఅవుట్ బాగా ఉపయోగిస్తారు. ఈ క్రింది వీడియోలో ఈ లేఅవుట్ గురించిన వివరణ ఉంది, చూడండి.

https://youtu.be/jR-DM2SkCwc

రిలేటివ్ లేవుట్ Android Relative Layout

ఈ రిలేటివ్ లేవుట్ లో ఒక ఐటమ్ ప్లేస్ చేయడానికి మరొక ఐటమ్ ఆధారం అవుతుంది. ఆండ్రాయిడ్ స్టూడియలో రిలేటివ్ ఎక్స్ ఎం ఎల్ లేవుట్ నందు, ఒక బటన్ సెంటరులో తీసుకుంటే, ఆ బటన్ ఐడిని ఉపయోగించి, ఆ బటన్ కు టాప్ లేదా బాటమ్ లేదా కుడి లేదా ఎడమ వైపులో మరొక బటన్ లేదా టెక్స్ట్ వ్యూ ప్లేస్ చేయవచ్చును. ఈ క్రింది వీడియోలో రిలేటివ్ లేఅవుట్ గురించి వివరణ ఉంది, చూడండి.

https://youtu.be/iKinQYGlA88
కాన్స్ట్రైంట్ లేఅవుట్Android Constraint Layout :

దీనిని ఎక్కువగా ఆండ్రాయిడ్ స్డూడియో ఎక్స్ ఎం ఎల్ ఫైల్లో గల విడ్జెట్స్ ను డ్రాప్ అండ్ డ్రాగ్ పద్దతిలో అమర్చడానికి ఉపయోగిస్తారు. ఈ లేఅవుట్ ఎక్కువమంది ఉపయోగిస్తారు. ఎందుకంటే దీనిని డిజైనింగ్ పద్దతిలో ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. ఈ క్రిందగా దీని గురించిన ట్యూటోరియ్ వీడియో లింకులు గలవు చూడండి.

https://youtu.be/qhHQ-igcWbM

డ్రాయిబుల్ ఫోల్డర్: ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇది ఒక స్టోరేజ్ పోల్డరులాగా పనిచేస్తుంది. ఏవైనా ఇమేజెస్, ఐకాన్స్ మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఉపయోగించడానికి ఈ డ్రాయిబుల్ ఫోల్డరు ఉపయోగపడుతుంది. ఇందులో కొత్తగా క్రియేట్ చేసే షేప్ ఫైల్స్, వెక్టర్ ఐకాన్స్ కూడా క్రియేట్ చేయవచ్చును. ఏదైనా బటన్ కు బ్యాక్ గ్రౌండు, బోర్డర్స్ ఆకర్షణీయంగా డిజైన్ చేయవచ్చును. ఈ ఫోల్డరులో ఐకాన్ మరియు బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉపయోగించాలో ఈ క్రింది వీడియోలో చూడండి.

https://youtu.be/Wkfg7YgBGo0

ఇంకా ఆండ్రాయిడ్ స్టూడియో మరొక ముఖ్యమైన పోల్డర్ వాల్యూస్. దీనిలో డిజైనింగ్ లో ఇచ్చే వాల్యూస్ ఫైల్స్ సృష్టించవచ్చును. అంటే పొడవు – వెడల్పు విలువలు ముందుగానే కొన్ని పేర్లతో సేవ్ చేయడం. తర్వాత ఆ డైమన్షన్స్ ను లేఅవుత్ డిజైనింగులో ఉపయోగించడం. అలాగే ఫోంట్స్. ఇంకా కలర్స్… ముందుగానే కొన్ని పేర్లతో కొన్ని కలర్స్ సెట్ చేసుకోవడం. ఆ కలర్స్ మరలా లేఅవుట్ లో అప్లై చేయడం ఉంటుంది. ఆండ్రాయిడ్ స్టూడియో వాల్యూస్ ఫోల్డరులో కలర్.ఎక్స్ఎంఎల్ ఫైల్ గురించి ఈ క్రింది వీడియోలో చూడండి.

https://youtu.be/uxllJKLWFs8
‘స్ట్రింగ్స్.ఎక్స్ఎంఎల్:

ఎక్కువగా యూజర్ నుండి వివరాలు సేకరించేటప్పుడు కొన్ని పేర్లు హింట్ రూపంలో వ్రాస్తూ ఉంటాము. మరికొన్ని సార్లు ఏదైనా టెక్స్ట్ వ్యూ పై కొన్ని పేర్లను చూపుతూ ఉంటాము. అలాగే బటన్లపై కూడా కొన్ని పేర్లు చూపుతూ ఉంటాము. సాదారణంగా ఈ పేర్లను స్ట్రింగ్స్ గా చెబుతారు. వీటిని ముందుగానే కొన్ని షార్ట్ నేమ్స్ తో స్ట్రింగ్స్ ఫైల్లో సేవ్ చేసుకుని మరలా లేఅవుట్ డిజైనింగులో వాడుకోవచ్చును. ఉదా: ఒక యాప్ పేరును పదే పదే కొన్ని యాక్టివిటీస్ చూపించాలి. ఆ యాప్ పేరు ఒక్కసారి స్ట్రింగ్.ఎక్స్ఎంఎల్ ఫైల్లో సేవ్ చేయబడి ఉంటే, దానిని ఎక్కడ కావాలంటే, అక్కడ డిజైనింగులో ఉపయోగించవచ్చును. ఈ క్రింది వీడియోల స్ట్రింగ్స్.ఎక్స్ఎంఎల్ ఫైల్ గురించి వీడియో చూడండి.

https://youtu.be/xOkKlv92HwY

ధన్యవాదాలు

తెలుగురీడ్స్.కామ్