సినిమా రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్య…

సినిమా రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్యగా కనబడతారు. ఎందుకంటే స్వయంకృషితో పైకొచ్చిన హీరో అనగానే చిరంజీవే గుర్తుకువస్తారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ప్రాణం ఖరీదు, పున్నమినాగు, కోతలరాయుడు, మంత్రిగారి వియ్యంకుడు అంటూ సినిమా రంగంలో పునాదిరాళ్ళు ఏర్పరచుకుంటూ… అందరి మనసులలో ఖైదీగా మారారు.

గ్యాంగ్ లీడర్, ఘరానామొగుడు, హిట్లర్, మాస్టర్ అంటూ అందరికీ మెగా స్టార్ అయ్యారు. ఎదుగుతున్న హీరోలకు ఆదర్శం అనిపించుకున్నారు.

ఎవరైనా కొత్తగా సినిమా రంగంలోకి వస్తే, అలా వచ్చినవారికి ప్రేరణ ఆచార్య చిరంజీవే అని గర్వంగా చెప్పుకుంటారు.

కధానాయికలకు ఆచార్య చిరంజీవితో జత కట్టడం ఒక కలగా ఉంటుంది. అటువంటి కల నెరవేరి సంతోష పడ్డవారు ఉంటారు.

తెలుగు సినిమా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి… అదే రంగంలో ఎదగాలనుకునేవారికి చిరంజీవి ఆచార్యగా ఉంటారు.

గాడ్ ఫాదర్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చిన చిరంజీవి డైనమిక్ హీరో, డేరింగ్ హీరో, సుప్రీమ్ హీరో అంటూ అభిమానులకు చేరువైనా చిరంజీవి… మెగాస్టార్ గా ప్రజల మనసులో స్తిరంగా నిలిచారు.

తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో త‌న పేరిట ఎన్నో రికార్డుల‌ని నెలకొల్పిన చిరంజీవి కొంతకాలం ప్రజాజీవితంలో వచ్చి సినిమాలకు దూరంగా ఉన్నారు. కారణాలు ఏవైనా మరలా సినిమా రంగంలోకి వచ్చి, అదే స్పీడ్ కొనసాగిస్తున్నారు.

ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సైరా నరసింహారెడ్డి సినిమాతో ఇప్పటి హీరోలకు ఛాలెంజ్ విసిరారు. అప్పటి క్రేజ్ ఇప్పటికి అభిమానులలో ఉండడం విశేషం.

ఆచార్య తెలుగు సినిమాలో నటిస్తున్న చిరంజీవి, సినీ రంగంలో ఎదుగుతున్నవారికి ఒక ఆచార్యుడుగానే కనబడతారు. ఒక ఆచార్య సినిమా కాకుండా ఇంకా ఆయన గాడ్ ఫాదర్, భోలా శంకర్ అనే టైటిల్ గల చిత్రాలతో ప్రేక్షకులముందుకు రానున్నట్టు వార్తా విషయం.

ఎప్పుడో పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాల నుండి ఇప్పటి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల వరకు చిరంజీవి చరిష్మా పెరుగుతూ… ప్రేక్షకుల మదిలో ఖైదిగా మారిన మెగాస్టార్ బర్త్ డే ఆగస్టు 22… పుట్టిన రోజు సంధర్భంగా మెగా స్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు… ఆచార్య చిరంజీవికి మని మని హ్యాపీ బర్త్ డే…

తెలుగులో శుభాకాంక్షలు

వ్యాసరచన గురించి ఇంకా వివిధ వర్గాలలో తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్ ప్రశ్నలు తెలుగుక్విజ్

తెలుగులో చిన్న పిల్లల పేర్లు