తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి.
మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే, మహాభారతం వింటే ధర్మంపై ఆలోచన పుడుతంది. అది సందేహం అవ్వవచ్చును, లేక ధర్మంగా బ్రతకాలన్న తలంపు కావచ్చును. అది చదివే హృదయం, అర్ధం చేసుకునే మనోస్థితిని బట్టి ఉంటుందని కూడా అంటారు. ఎవరైనా ఒక విషయం గురించి చెబుతూ… ఇదే నిజం అంటే, దానికి బదులుగా… సరే అంటాం, కానీ అది అబద్ధం అనగానే మరి నిజమేమిటి? ప్రశ్నిస్తాం అబద్దం మహిమ అలా ఉంటే, మరి సందేహం ఇంకెంత ఆత్రం కలిగిస్తుంది? మరీ ధర్మ సందేహమైతే మరీ ఆసక్తి పెరుగుతంది. అందుకేనేమో తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి అనే నానుడి ప్రాచుర్యం పొంది ఉంటుంది. గారెలు ఒంటికి శక్తి అయితే, మహాభారతం మనసుకు శక్తినిస్తుంది అంటారు.
మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ లింకులు
మూడువేల పేజిలకు పైగా ఉన్న సంపూర్ణ మహాభారతం తెలుగులో చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. మరీ గ్రాంధిక భాష కాకుండా కొంచెం వాడుక భాష మాదిరగానే చదవడానికి అనువుగా ఉండే సైజులో అక్షరాలు ఉంటాయి. ఈ పుస్తకమును రచించినవారు మొదలి వెంకట సుబ్రహ్మణ్యంగారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు రచింపచేసిన సంపూర్ణ ఆంధ్ర మహా భారతం-1 నుంచి 15 భాగాలు పిడిఎఫ్ ఆన్ లైన్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. సుమారు పదివేలకు పైగా పేజిలతో సంపూర్ణ ఆంధ్ర మహాభారతం 1 నుండి 15 భాగాలు ఉంటాయి. పర్వముల వారీగా శ్లోకాలు, ప్రతిపదార్ధం, తాత్పర్యంతో ఈ తెలుగు పిడిఎఫ్ బుక్ ఉంటుంది. ఈ బుక్ రీడ్ చేయడం వలన తెలియని తెలుగు పదాలకు అర్ధములు తెలియవస్తాయి.
తెలియని వస్తువు వాడేటప్పుడు, ఆ వస్తువును గతంలో ఉపయోగించిన అనుభజ్ఙుని మాటలు విని, తద్వారా కొత్త వస్తువును సరిగా ఉపయోగిస్తాం. ఉపోద్ఘాతం వినడం వలన విషయంపై పట్టు పెరుగుతుంది. అలాగే మహాభారతం లాంటి గ్రంధాలు చదివేటప్పుడు ఆయా గ్రంధం యొక్క ప్రయోజనం, గ్రంధం యొక్క సద్భావనను పండితుల ద్వారా తెలుసుకుని, ఆ గ్రంధం పూర్తి పఠనం చేయడం ద్వారా, సదరు గ్రంధపఠన ఫలితం పూర్తిగా పొందగలరని అంటారు. ఈ విధంగా చూస్తే మహాభారతం దర్మసందేహాలను కూడా తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మహాభారతం సంపూర్ణ గ్రంధపఠనం కన్నా ముందే మహాభారతం గురించిన ప్రవచనాలు వినడం మేలని పండితులు అంటారు. లేదా ఏదైనా మహాభారతం గురించి ధర్మసూక్ష్మములను, మహాభారత ప్రధాన ప్రయోజనం గురించి వివరించే రచనలు మొదటిగా చదవడం కూడా ప్రయోజనమేనని చెబుతారు. ఈ విధంగా అయితే ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు పేరిట శ్రీరామచంద్రమూర్తి గారు రచించిన తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
బాలలకు బొమ్మలను చూడడం ద్వారా ఆసక్తి కలుగుతుంది. బాలలకు పుస్తకాలలో వచనం కన్నా బొమ్మలు ఎక్కువగా ఉంటే, ఆయా బొమ్మలను పరిశీలిస్తూ, వచనం కూడా చదవడానికి ఇష్టపడతారు. బాలలు భారతం చదవాలంటే వారికి బొమ్మలతో కూడిన తెలుగుభారతం బుక్ ఇస్తే చూస్తూ చదవడానికి ప్రయత్నిస్తారు. బొమ్మలు కలిగిన భారతం పిడిఎఫ్ పుస్తకంగా ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తుంది. బాలానంద బొమ్మల భారతం తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
ఇంకా ఈ ఇతిహాసములోని వ్యక్తుల గురించి అంటే భీష్ముడు, ద్రోణుడు, భీముడు, ద్రౌపది, శకుని, ధృతరాష్ట్రుడు విడి విడి ఉన్న తెలుగుబుక్స్, పర్వముల వారీగా విడి విడి ఉన్న తెలుగుబుక్స్, భారతంలో నీతి కధలు తదితర మహాభారతంపై ఉన్న వివిధ రచనల తెలుగుబుక్స్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో