నలదమయంతి తెలుగుభక్తి సినిమా

అలనాటి పాత తెలుగు సినిమాలలో నలదమయంతి తెలుగుభక్తి సినిమా ఒక్కటి. ఈ తెలుగు సినిమాలో నలమహారాజు, దమయంతిల వివాహ ఘట్టం నుండి సన్నివేశాలు ఉంటాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

నలదమయంతి కధ మహాభారతంలో ధర్మరాజు విన్న కధలలో ఒక్కటి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, అగ్రజుడు అయిన ధర్మరాజు ఈ కధ వింటాడు. ఇక ఈ సినిమా అయితే నలదమయంతిల హంసరాయభారంతో ప్రారంభం అవుతుంది. హంస రాయభారంతో నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఒకరంటే ఒకరికి ఇష్టం మానసికంగా ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. దానికి నలుడు కూడా బయలుదేరతాడు.

దమయంతి అందచందాలు గురించి, గుణగణాలు గురించి బాగా విన్న దేవతలు ఆమెను పరీక్షించాలనుకుంటారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యమధర్మరాజు నలుడు దగ్గరకు వచ్చి, ముందుగా ఒక మాట తీసుకుంటారు. వారికి నలుడు ప్రతిజ్ఙ చేస్తాడు, మీరు చెప్పిన పనిని చేసిపెడతానని. వెంటనే వారు దమయంతికి తమగురించి గొప్పగా చెప్పి, తమలో ఎవరినైనా ఒకరిని వరించేలా, ఆమె మనసుని మార్చమని అడుగుతారు. నలుడు నేనెలా అంత:పుర కన్యతో మాట్లాడేది, అనగా దానికి వారు నలుడు అదృశ్యమయ్యే శక్తిని ఇస్తారు.

అంత:పురంలో దమయంతి ఒంటరిగా ఉన్నప్పుడు, నలుడు అక్కడికి వస్తాడు, ఆమెకు దేవతలు గురించి చెబుతాడు. అయితే ఆమె నలుడే తన భర్త అని తేల్చి చెబుతుంది. ఈ విషయం తెలుసుకున్న దేవతలు స్వయంవరం సభలో తాము కూడా నలుడులాగా మారి, సభాసినులై ఉంటారు. స్వయంవరంలో అయిదుగురు నలుడులు కనిపించేసరికి, దమయంతి అమ్మవారిని ప్రార్ధిస్తుంది. అప్పుడు దమయంతికి అమ్మవారు అంతర్లీనంగా ఒక సూచన చేస్తుంది. ”దేవతలు కనురెప్ప వేయరు, ఎవరు కనురెప్పలు వేస్తూ ఉంటారో అతనే నలుడు” అని చెప్తుంది. దానితో దమయంతి నలుడినే వరిస్తుంది.

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

నలదమయంతిలకు ఇద్దరు పిల్లలు కలుగుతారు. అయితే సోదరుడు పుష్కరుడు చేసిన మోసపూరిత జూదంలో రాజ్యాన్ని కోల్పోతాడు. దమయంతి పిల్లలను తన పుట్టింటికి పంపించేసి, తాను నలుడితో కలసి కానలకు వెళ్తుంది. అడవులలో నలదమయంతిలకు తినడానికి ఏమి దొరకక నానా కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు నలుడు దమయంతి ”ఇన్ని కష్టాలు నాతో నీకెందుకు, నీవు నీ పుట్టింటికి వెళ్లు” అంటాడు. అందుకు బదులుగా దమయంతి నలుడితో ”త్రిమూర్తులు కన్నా నాకు మీరే మిన్న అన్నట్టుగా” పలికి ఆమె అతనితోనే ఉంటుంది. ఆమెతోనే ఉంటే ఆమె పుట్టింటికి వెళ్లకుండా నాతోనే ఉండి ఈ అష్టకష్టాలు పడుతూనే ఉంటుందని భావించిన, నలుడు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెను ఆ అడవిలో వదిలేసి వెళతాడు.

దమయంతి నిద్రలేచి చూసేసరికి ఒక కొండచిలువ ఆమెకు కనబడుతుంది. ఆమె తప్పించుకునే లోపు ఆమెను కొండచిలువ చుట్టుముడుతుంది. ఆమె ఆర్తనాదం విన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కొండచిలువను చంపి, ఆమెను రక్షిస్తాడు. తర్వాత దమయంతి వారి గూడెంకు వెంటబెట్టుకుని వెళతాడు.

ఇక మరొ ప్రక్క నలుడు అడవిలో నడుస్తూ, ఆకలితో అలమటిస్తుండగా అక్కడ దగ్గరిలో మంటలలో ఉన్న పాము ఒక్కటి కనిపిస్తుంది. నలుడు వెంటనే పాముని మంటలలో నుండి కాపాడతాడు. వెంటనే పాము నలుడి కాలుపై కాటు వేస్తుంది. దానితో నలుడు తన అందమైన రూపం కోల్పోయి, వికృత రూపంలోకి మారతాడు. అప్పుడు ఆ పాము ఒక మానవరూపంలో ప్రత్యక్షమై, ఇది నీ మేలుకే వచ్చింది. ఈ రూపంలోనే నీవు ఆయోధ్యాధీశుడు అయిన ఋతుపర్ణుడిని సేవించమని చెప్పి అంతర్ధానం అవుతాడు.

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

దమయంతి ప్రాణాలను కాపాడిన వాడే, దమయంతిని బలత్కారం చేయబోతాడు, అప్పుడు ఆమె పరాశక్తిని ప్రార్ధించడంతో, దమయంతి అక్కడి నుండి రక్షించబడుతుంది. తర్వాత దారిలో కొందరి బాటసారుల ద్వారా ఆమె తన తండ్రి ఇంటికి చేరుతుంది.

నలుడు ఋతుపర్ణుడి దగ్గర బాహుకుడు అను నామధేయంతో సేవకుడిగా చేరతాడు. ఇలా విధి విలాసంలో భాగంగా వేరు అయిన నల దమయంతులు చివరికి ఎలా కలుసుకున్నారు. విడదీసిన విధే తిరిగి వారు కలవడానికి ఎలా సహకరించింది? ఈ విధంగా చిత్రం సాగుతుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

తెలుగు స్టోరీస్

TeluguloVyasalu

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.