కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు

కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు ఏ కోదండరామిరెడ్డి, జంద్యాల, రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య, ఈవివి సత్యనారాయణ, విజయబాపినీడు, వంశీ మొదలైన దర్శకులు అనేక తెలుగు చలనచిత్రాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకాభిమానాన్ని పొందితే, కొన్ని చిత్రాలు అవార్డులు పొందాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఏ కోదండరామిరెడ్డి కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు

సంధ్య తెలుగుచలనచిత్రంతో 1980 లో దర్శకుడుగా మొదలుపెట్టిన ఏకోదండరామిరెడ్డి తరువాతి సంవత్సరంలో వరుసగా రెండు తెలుగు చిత్రాలకు ఒక తమిళ చిత్రానికి దర్శకుడుగా పనిచేసారు. చిరంజీవి -రాధిక, జగ్గయ్య – శారద ప్రధాన పాత్రలతో దర్శకత్వం వహించిన న్యాయంకావాలి చిత్రానికి మంచిపేరు వచ్చింది. తరువాత చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ గా స్థిరపడి, వీరిద్దరి కాంబినేషన్ కి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు తోడై ఎక్కువ చిత్రాలు ప్రజాదరణను పొందాయి. చిరంజీవి సినీ కెరీర్లో టర్నింగ్ పాయింట్ గా చెప్పే ఖైది చిత్రానికి ఏ కోదండరామిరెడ్డిగారే దర్శకులు.

ఏనార్, శోభన్ బాబు, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. న్యాయం కావాలి, అభిలాష, ఖైది, అనుభందం, దొంగ, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, వేట, దొంగమొగుడు, పసివాడి ప్రాణం, కిరాయిదాద, మరణమృదంగం, త్రినేత్రుడు, బలేదొంగ, నారి నారి నడుమ మురారి, చిట్టెమ్మ మొగుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, నిప్పురవ్వ, ముఠామేస్త్రి, అల్లరి అల్లుడు, బొబ్బిలి రాజా వంటి ప్రజాదరణ పొందిన మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి కెరీర్లో మంచి హిట్ చిత్రాల ఇచ్చిన దర్శకులలో కోదండరామిరెడ్డి ఒకరు.

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు కుటుంబ కధ చిత్ర దర్శకులు

ముద్దమందారం చిత్రంతో దర్శకుడుగా వచ్చిన జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేక కుటుంబ కధలను హాస్య ప్రధానంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో కామెడి చిత్రాలను అందించి తెలుగు వారి నోట నవ్వుల పండించిన దర్శకులు. మరీ ముఖ్యంగా ఈయన చిత్రాలలో సుత్తివేలు, సుత్తి వీరభద్రరావులతో చేయించే హాస్య సన్నివేశాలకు నవ్వని తెలుగుచిత్ర ప్రేక్షకులుండరు. బాలకృష్ణతో బాబాయ్ అబ్బాయ్, సీతారామ కళ్యాణం, చిరంజీవితో చంటబ్బాయి హాస్య చిత్రాలను తెరకెక్కించారు.

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో బాబాయ్ హోటల్, విచిత్రం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్రమోహన్ కధానాయకులుగా చిత్రాలని డైరెక్ట్ చేసారు. నాలుగు స్తంబాలాట, రెండురెళ్ళు ఆరు, అహనాపెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, చంటబ్బాయి, సీతారామ కళ్యాణం, పడమటి సంధ్యారాగం, రెండు జళ్ళ సీత చిత్రాలు ప్రసిద్ది పొందాయి. బ్రహ్మానందం, సుత్తివేలు, వీరభద్రరావు లను అందించింది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారే.

అలాగే చిరంజీవి ఆపద్బందవుడు చిత్రంలో గొప్పింటి పెద్దగా నటించి మెప్పించారు. ఆనంద భైరవి, పడమటి సంధ్యారాగం, ఆపద్భాందవుడు  చిత్రాలకు ఉత్తమ రచయితగా, ఆనందభైరవి చిత్రానికి ఉత్తమ దర్శకులుగా నంది అవార్డులు అందుకున్నారు.  శ్రీవారికి ప్రేమలేఖ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇంకా జర్నలిస్ట్ గా కూడా పలు అవార్డులు అందుకున్నారు.

రవిరాజా పినిశెట్టి కుటుంబ కధా చిత్ర తెలుగు దర్శకులు

చిరంజీవితో జ్వాలా చిత్రంతో దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న రవిరాజా పినిశెట్టి తరువాయి అర్జున్తో కోనసీమ కుర్రోడు, కళ్యాణ చక్రవర్తితో కృష్ణ లీల, చిరంజీవితో చక్రవర్తి, యముడికి మొగుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. యముడికి మొగుడు చిత్రం మంచి ప్రజాదరణ పొందింది, అటు తరువాత మంచి హిట్ చిత్రాలను దర్శకత్వం వహించి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ముత్యమంతముద్దు, రాజావిక్రమార్క, చంటి, బలరామకృష్ణులు, కొండపల్లిరాజా, బంగారుబుల్లోడు, పెదరాయుడు, మా అన్నయ్య వంటి మంచి ప్రజాదరణ పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మోహన్ బాబు సినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం, విక్టరి వెంకటేష్ సినీ కెరీర్లో మ్యుజికాల్ హిట్ చిత్రం చంటి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే రవిరాజా పినిశెట్టి హిట్ చిత్రాలు కొన్ని రీమేక్ చిత్రాలుగా ఉంటాయి. అది పినిశెట్టి రవిరాజా పినిశెట్టి కుమారుడు.

ముత్యాల సుబ్బయ్య తెలుగు కుటుంబ చిత్ర దర్శకులు

నిర్మాతల దర్శకుడైన ముత్యాల సుబ్బయ్య కుటుంబ కదా చిత్రాలను చక్కటి సెంటిమెంట్ మేళవించి, కుటుంబసమేతంగా చూడదగిన చిత్రాలను తీసారు. మూడుముళ్ళభందం చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన ముత్యాల సుబ్బయ్య గారు, నవభారతం, సగటు మనిషి, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మమతలకోవెల, నేతిచరిత్ర, మాఇంటికధ, మామగారు, కలికాలం, ఎర్రమందారం, బంగారుమామ, పల్నాటి పౌరుషం, అన్న, అమ్మాయి కాపురం, సోగ్గాడి పెళ్ళాం, పవిత్రభందం, హిట్లర్, గోకులంలో సీత, పెళ్లిచేసుకుందాం రా, స్నేహితులు, అన్నయ్య, ఆప్తుడు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమునా, ఐశ్వర్య ప్రధాన పాత్రలుగా మామగారు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చిత్రంగా అందించారు. ఇందులో బాబూమోహన్ – కోటశ్రీనివాసరావు కామెడీ కాంబినేషన్ సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ – రాశి జంటగా గోకులంలో సీత  రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రం రాజశేఖర్-విజయశాంతి లతో అరుణకిరణం, రాజేంద్ర ప్రసాద్ – యమునలతో ఎర్రమందారం, మహేశ్వరీ ప్రధాన పాత్రలో అమ్మాయికాపురం, వెంకటేష్ – సౌందర్యల కాంబినేషన్లో పవిత్రబందం చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. ఇంకా పలు పురష్కారాలు అందుకున్నారు.

ఈవివి సత్యనారాయణ కుటుంబ కధాచిత్ర తెలుగు దర్శకులు

జంధ్యాలగారి శిష్యుడు అయినా ఈవివి సత్యనారాయణ చెవిలో పువ్వు చిత్రంతో దర్శకుడుగా మారి, ప్రేమఖైది ప్రేమకదా చిత్రంతో ప్రేక్షకులను సినిమాహాలులో రెండున్నర గంటలపాటు ఖైదు చేసారు. అప్పుల అప్పారావు చిత్రంతో అందరిని హాస్యభరితంగా ఆనందింపజేసి సీతారత్నంగారి అబ్బాయితో కామెడీ-సెంటిమెంట్ సమపాళ్లలో చూపించారు. జంబలకిడిపంబ అంటూ హాస్యాన్ని అందరికి పంచారు. ఇలా ఈవివి సత్యనారాయణ కామెడీ, సెంటిమెంట్ కుటుంబ కధ చిత్రాలను ఎక్కువగా హస్యబరితంగానే తెరకెక్కించారు. చిన్నచిత్రాలకు పెద్ద చిత్రాలకు కూడా దర్శకత్వం వహించిన దర్శకుడు.

ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో రాజేంద్ర ప్రసాదుతో హాస్యం అందించిన ఈవివి వారసుడు, హలో బ్రదర్, ఆవిడా మా ఆవిడే చిత్రాలతో నాగార్జునతో హాస్యం పలికించారు. చిరంజీవితో అల్లుడా మజాకా, వెంకటేష్ తో అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మోహన్ బాబుతో అదిరింది అల్లుడు, కృష్ణతో తెలుగువీరలేవరా పలు హీరోలతో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈవివి సత్యనారాయణ సొంతబ్యానర్ పై చాలబాగుంది చిత్రం స్వీయ దర్శకనిర్మాన భాద్యతలు తీసుకుని విజయవంతమయ్యారు. రంభ, రచన, ఊహ, రవళి నాలుగు నటీమణులు ఈవివి చిత్రాలద్వారా తెలుగు చిత్ర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అలాగే తన కొడుకులు అయిన నరేష్, ఆర్యన్ రాజేష్ లను హీరోలుగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసి అందించారు. అల్లరి నరేష్ కామెడీ చిత్రాల హీరోగా విజయవంతం అయ్యారు.

విజయబాపినీడు

డబ్బు డబ్బు డబ్బు చిత్రానికి దర్శకుడు గా వచ్చిన విజయబాపినీడు పట్నంవచ్చిన ప్రతివ్రతలు చిత్రంలో చిరంజీవి మోహన్ బాబులతో దర్శకునిగా పనిచేసారు. రాజేంద్ర ప్రసాద్ పలు హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాకు పెళ్ళాం కావాలి, దొంగకోళ్ళు, జూలకటక, మహాజనానికి మరదలు పిల్ల హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. మెగాస్టారు చిరంజీవితో పట్నంవచ్చినప్రతివ్రతలు, మగమహారాజు, హీరో, మగధీరుడు, ఖైదినెంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

వంశీ

కుటుంబ హాస్యకదా చిత్రాలను అందించిన దర్శకులలో వంశీ ఒకరు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా మంచుపల్లకి చిత్రం చిరంజీవి-సుహాసినిలతో తెరకెక్కించి దర్శకుడు అయ్యారు. మోహన్ – భానుప్రియలతో ఆలాపన చేయించి, కార్తిక్ భానుప్రియలతో అన్వేషణ చేసి, భానుప్రియను సితారగా మార్చి, రాజేంద్ర ప్రసాదుని లేడీస్ టైలర్ చేసారు. తరువాత పలు హాస్య చిత్రాలను కుటుంబ కదా చిత్రాలను అందించారు. చెట్టుకింద ప్లీడర్, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, ఏప్రిల్ 1 విడుదల, లింగబాబు లవ్ స్టొరీ, జోకర్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

వీడియోల ద్వారా పొగత్రాగటంపై అవగాహన

నిత్యము ఉదయం నడక ప్రయోజనాలు