తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్

ప్రతి మనిషికి పేరుతో బాటు ఉండే ఇంటిపేరు ఆవ్యక్తి యెక్క సామాజిక స్థితిని తెలియజేస్తుంది అంటారు. రామ, కృష్ణ, సుబ్బు, మహేశ్ ఇలా వ్యక్తిపేరు ఏదైనా ఉండనివ్వండి, కానీ సమాజంలో వ్యక్తుల ఇంటిపేర్లతో ఆయా వ్యక్తుల పలుకుబడి ఆధారపడి ఉంటుంది అంటారు. ఈ విధంగా తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్ లో వివిధ తెలుగువారి ఇంటి పేర్లు తెలియజేయబడ్డాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

వ్యక్తి ఇంటిపేరు వలన ఆవ్యక్తి ఏ కుటుంబానికి? ఏ కులానికి ? ఏ మతానికి? చెందినవారో తెలియజేస్తుంది అంటారు. తద్వారా సమాజంలో ఆయా కుటుంబ స్థితిని అనుసరించి, ఆ వ్యక్తి యొక్క స్థితికూడా తెలియవస్తుంది అంటారు. వ్యక్తి పేరుతో సమాజంలో ఆవ్యక్తికి ఐడెంటిటీ ఉంటే, ఇంటిపేరుతో కుటుంబానికి ఐడెంటిటీగా సమాజంలో ఉంటుంది అంటారు.

ఎప్పుడైనా, ఏదైనా ఒక ఇంట్లోనే పుట్టిన పెద్దవారు చేసిన మంచిపనులు, సమాజానికి మేలు జరగడంతో, ఆ ఇంటిపేరు గలవారికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది అంటారు. అప్పటి నుండి ఇంట్లోగల వ్యక్తులకు సమాజం నుండి గౌరవం లభిస్తుందని చెబుతారు.

తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్ మనకు ఫ్రీగా ఇంటర్నెట్లో లభిస్తుంది. ఈ తెలుగుబుక్ నందు తెలుగుఇంటిపేర్లు, తెలుగుసాంకేతికపద వివరణ తదితర విషయాలను తెలియజేయబడ్డాయి. ఇంకా ఈ తెలుగుబుక్ నందు భారతీయేతర భాషలలో ఇంటిపేర్లు, తెలుగుసాహిత్యంలో ఇంటిపేర్లు, తెలుగులో వ్యవహారికి తెలుగువారి ఇంటిపేర్లు, గృహనామ వివరణ పట్టిక, గృహనామ పరపద వివరణ పట్టిక, ఆధార గ్రంధసూచి సంబంధిత విషయాలు తెలియజేయబడ్డాయి.

ఒక వ్యక్తి చూపిన అసమాన ప్రతిభ వలన, ఆ వంశమునకు ఆ వ్యక్తిపేరే ఇంటిపేరుగా మారడం మన భారతీయ ఇతిహాసములలో కనబడుతుంది. అలా రామాయణంలో రాముని వంశం, రఘువంశంగా పిలుస్తారు. రాముని వంశంలో పూర్వులలో రఘువు కీర్తి వలన ఆవంశమునకు రఘువంశంగా చెప్పబడినట్టుగా ఇతిహాసం తెలియజేస్తుంది అంటారు.

మన తెలుగువారికి ఇంటిపేర్లు పూర్వుల నుండి మనకు వారసత్వంగా వస్తున్నట్టుగా పెద్దలు చెబుతారు. కొందరి ఇంటిపేర్లకు ప్రత్యేక దేవతా పూజలు కూడా ఉంటాయి. ఆయా దేవతలను కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో పూజించడం, కొందరి ఇంటిపేర్లవారికి సంప్రదాయంగా ఉంటుంది.

‘అ’ ‘ఆ’ తదితర తెలుగు అక్షరములతో తెలుగువారి ఇంటిపేర్లు

మన తెలుగువారి ఇంటిపేర్లలో ‘అ’, ‘ఆ’ అక్షరాలతో ఈ తెలుగుబుక్ లో వివరించబడిన కొన్ని ఇంటిపేర్లు ఈవిధంగా ఉన్నాయి. అడబాల, అత్తినేని, అక్కినేని, అనిపెద్ది, అనిశెట్టి, అన్నపురెడ్డి, అన్నాబత్తుల, అప్పన, అప్పసాని, అప్పలభట్ట, అబ్బిరాజు, అప్పిరెడ్డి, అబ్బినేని, అబ్బిసాని, అభినేని, అమిరినేని, అమిలినేని, అంబారి, అమ్మిసెట్టి, అమ్మనభట్ల, అయాచితుల, అయితంరాజు, అయ్యపురెడ్డి, అయ్యలరాజు, అయ్యగారి, అయ్యవారి, అయ్యస్వామి, అయ్యారి, అరికకూటి, అరకల, అలవల, అలసంద, అలమందల,అలినేని, అల్లంనేని, అల్లంరాజు, అల్లంసెట్టి, అల్లం, అల్లసాని, అల్లమరాజు, అల్లు, అల్లెం, అవసరాల, అవినేడు, అవినేని, అవిసెట్టి, అవిరినేని, అవ్వా, అవ్వారి, అవిరినేని, ఆకుతోట, ఆకురాతి, ఆకాశం, ఆతంరాజు, ఆదిభట్ల, ఆడ్ల, ఆనం, ఆరిగ, ఆరిగల, ఆముదం, ఆరుబాటం, ఆరుమడకల, ఆరిక, ఆరె, ఆరెకూటి, ఆర్ల, ఆల, ఆలమనేని, ఆలమందల, ఆలంసెట్టి, ఆవాల, ఆవు, ఆవుల, ఆళ్ళ, ఆవడ, ఆవేదుల, ఆశబోయిన తదితర తెలుగువారి ఇంటిపేర్లుతెలుగుబుక్ లో ఉన్నాయి.

‘ఇ’ అక్షరంతో కొన్ని తెలుగువారి ఇంటిపేర్లు ఇటుకల, ఇడిగినేని, ఇంటి, ఇంగువ, ఇండ్ల, ఇత్తబోయిన, ఇమ్మడి, ఇమ్మడిసెట్టి, ఇమ్మాని, ఇమ్మానేని, ఇరిగినేని ఇంకా ఉ అక్షరంతో ఉడతల, ఉదరి, ఉద్దంరాజు, ఉడుతా, ఉడుముల, ఉప్పల, ఉప్పార, ఉప్పతి, ఉప్పి, ఉప్పరగోని, ఉమాపతి, ఉమారెడ్డి, ఉరుముల, ఉమ్మనేని, ఉయ్యాల ఇంకా ఊ అక్షరంతో కొన్ని తెలుగువారి ఇంటిపేర్లు ఊటా, ఊడిగం, ఊబిడి, ఊడిగం, ఊబిడి, ఊరకరణం, ఊసుగారి తదితర తెలుగువారి ఇంటిపేర్లు ఈ తెలుగుబుక్ లో తెలియజేయబడ్డాయి.

‘ఎ’ తెలుగు అక్షరంతో ఎక్కడి, ఎక్కలదేవ, ఎక్కాల, ఎడ్ల, ఎద్దుల, ఎంట్రప్రగడ, ఎద్దులవారి, ఎనిరెడ్డి, ఎద్దినేని, ఎనుముల, ఎద్దినీడి, ఎన్ముల, ఎరబోతుల, ఎరసాని, ఎరుకల, ఎమ్మె, ఎరువ, ఎర్రనేని, ఎర్రగొల్ల, ఎర్రచీమల, ఎర్రమసాని, ఎర్రబత్తుని, ఎర్రబల్లి, ఎర్రాపాత్రుని, ఎర్రాప్రగడ, ఎలకూచి, ఎర్రబోతు, ఎర్రమనేని, ఎఱ్ఱగుంటల, ఎల్లమరెడ్డి, ఎల్లంభొట్ల, ఎల్లంరాజు, ఎల్లిరెడ్డి, ఎల్లాప్రగడ తదితర తెలుగువారి ఇంటిపేర్లు ఈ తెలుగుబుక్ లో వ్రాయబడి ఉన్నాయి.

ఇంకా ‘ఏ’ ఏకా, ఏకుల, ఏచురాజు, ఏడక, ఏనుగుల, ఏమినేని, ఏడుపుల, ఏతపు, ఏనుగు, ఏంరెడ్డి, ఏరువ, ఏలిసెట్టి, ఏఱువ ఇంకా ‘ఐ’ అనే తెలుగు అక్షరంతో ఐతబోని, ఐనేని, ఐరెడ్డి, ఐలా మరియు ‘ఒ’ అనే తెలుగు అక్షరంతో ఒంటరి, ఒంటెద్దు, ఒబ్బిసెట్టి, ఒప్పరి తెలుగు ఇంటిపేర్లు ఉండగా ఇంకా ‘ఓ’ అనే తెలుగు అక్షరంతో ఓగు, ఓటికుంట, ఓబిలిచెట్టి, ఓబులసెట్టి, ఓబుళం తదితర తెలుగువారి తెలుగుఇంటిపేర్లుతెలుగుబుక్ లో తెలియజేయబడి ఉన్నాయి.

‘క’ ‘గ’ తదితర తెలుగు అక్షరాలతో తెలుగువారి ఇంటిపేర్లు

‘క’ అనే తెలుగు అక్షరంతో తెలుగుఇంటిపేర్లు కగ్గా, కంకణాల, కంకర, కంకినేని, కంచాల, కంచిభొట్ల, కంచుఘంటల, కంచె, కంచిమేకల, కటారి, కట్ట, కటికల, కటికినేని, కట్ట, కట్టల, కటికిరెడ్డి, కటికె, కటినేని, కట్టా, కట్టెమోపుల, కట్ల, కడిమి, కఠారి, కడియం, కడియాల, కంటమణి, కంఠంనేని, కంటినేని, కంటిబోయిన, కంఠంరాజు, కంటె, కంటే, కండపునేని, కత్తి, కత్తిరిసెట్టి, కత్తుల, కదిరి, కనక, కధల, కనకరాజు, కదం, కనకాప్రగడ, కందర్ప, కందాడ, కంది, కందికాయల, కందాళ, కందిబళ్ళ, కందిబేడల, కందిమళ్ళ, కందుల, కన్ని, కన్నెల, కన్నడ, కన్యధార, కన్నం, కన్యాదార, కపిలవాయి, కప్పెర, కప్పగంతుల, కప్పల, కమతం, కమాలకర, కప్పు, కంపన, కంబాల, కమ్మగోని, కమ్మర, కమ్ముల, కమ్మిసెట్టి, కరిపెనేని, కరిమాల, కర్నాడు, కర్పూరపు, కర్రి, కర్నాటి, కర్రెడ్ల, కలిదిండి, కలకల, కలగోట్ల, కలిదేర, కలిమిడి, కలిగోట్ల, కల్లం, కలిరెడ్డి, కాకి, కస్తూరి, కాగితం, కామినేని, కాశీనాధుని, కుర్రా, కురుకూటి, కూకట్ల, కూనపరెడ్డి, కేతినేని, కేతిరెడ్డి, కేశినేని, కొంగర, కొడవటి, కొండపునేని, కొండారెడ్డి, కొండ్రెడ్డి, కొప్పిసెట్టి, కొనిగర్ల, కొమరనేని, కొమ్మారెడ్డి, కొయ్యకూర, కోకల, కోడిపుంజుల, కోడిగుడ్ల, కోడెల, కోణంగి, కోన, కోనేటి, కోమటిరెడ్డి తదితర తెలుగువారి ఇంటిపేర్లుతెలుగుపుస్తకంలో తెలియజేయబడ్డాయి.

‘గ’ అనే అక్షరంతో గంగ, గంగదాసు, గంగసాని, గంగిరెడ్డి, గజ్జెల, గట్టినేని, గడ్డం, గంటల, గంటా, గద్దె, గంధం, గన్నమనేని, గన్నెబోయిన, గవరరాజు, గవ్వల, గాజుల, గాదిరాజు, గానాల, గిడుగు, గుజ్జల, గుజ్జుల, గుడిసె, గుంట్ల, గుత్తా, గుత్తుల, గుమ్మడి, గున్నల, గుర్రం, గుర్రాల, గూడల, గూడెపు, గొట్టి, గోకరాజు, గోగిరెడ్డి, గోపనగోని, గోదా, గోపాలభట్ల, గోపాలం, గోపిదేవి, గౌని తదితర తెలుగు ఇంటిపేర్లు ఇంకా ‘ఘ’ తెలుగుఅక్షరంతో ఘట్టమనేని, ఘట్టమరాజు, ఘంటా తదితర ఇంటిపేర్లు ఈతెలుగుబుక్ లో వ్రాయబడి ఉన్నాయి.

ఇంటిపేర్లలో తెలుగు ఇంటిపేర్లు ‘చ’ అను తెలుగు అక్షరంతో ఈవిధంగా చక్రపాణి, చక్రాల, చట్రాతి, చంద్రరాజు, చదల, చదుపు, చలినేడి, చలసాని, చల్ల, చల్లా, చాగి, చాటల, చిక్కం, చిట్టినేని, చిట్టిబోయిన, చినిగోని, చింతకాయల, చింతమనేని, చింతా, చిన్నాబత్తుల, చిప్పల, చీకటి, చీమల, చీపురు, చుక్కా, చెన్నాప్రగడ, చెరకు, చెలమలసెట్టి, చెవిటి, చేమకూర తదితర తెలుగుఇంటిపేర్లు వివరించబడి ఉన్నాయి.

‘జ’ అనేతెలుగు అక్షరంతో తెలుగుఇంటిపేర్లు ఇలా జక్కనభట్ల, జగ్గు, జనమంచి, జంగాల, జమ్మి, జలగుండల, జలది, జలం, జలసూత్రం, జాజుల, జిడ్డు, జున్ను, జిల్లేడు, జొన్నల, జోగు, తదితర ఇంటిపేర్లు తెలియజేయబడ్డాయి.

‘ట’ ‘త’ తదితర తెలుగు అక్షరాలతో తెలుగువారి ఇంటిపేర్లు

‘ట’ అక్షరంతో టంకసాల, టెంకా, టేకు, టేకుల, ‘డ’ తెలుగుఅక్షరంతో డప్పు, డప్పుల, డాక, డొక్కా, డేగల ‘త’ తెలుగు అక్షరంతో తంగేటి, తడ, తండా, తడికల, తప్పట, తప్పడ, తమ్మారెడ్డి, తమ్మిసెట్టి, తమ్మినీడు, తమ్మినేని, తలారి, తల్లపనేని, తాటిసెట్టి, తాడుబోయిన, తాతిన, తాతిని, తాతినేని, తాపి, తియ్యగూర, తిమ్మన్న, తిరుమలచెట్టి, తిరుమలసెట్టి, తిరుమలప్రగడ, తిరుమాని, తిరువీధలు, తిరుమలరాజు, తిరుమలరెడ్డి, తీగల, తీర్ధం, తివారి, తుంగ, తుంగా, తుప్పర, తుమ్మల, తుమ్మ, తమ్మనేని, తూముల, తెడ్ల, తెలకుల, తెల్లావుల, తొట్టి, తొమ్మండ్రు, తోట, తోక, తోకల, తోటకూర, త్రిపురనేని, త్రిపురమల్లు తదితర తెలుగువారిఇంటిపేర్లు వ్రాయబడి ఉన్నాయి.

‘ద’ అను తెలుగు అక్షరముతో తెలుగువారి తెలుగుఇంటిపేర్లు దడిగ, దడిగె, దండు, దత్తా, దరువుల, దాడి, దాదల, దామని, దామర, దారణ, దామినేని, దారా, దాసరి, దాసర్ల, దిండు, దివినేని, దివ్వెల, దీపాల, దుగ్గినేడి, దుగ్గిరెడ్డి, దుద్దుల, దుంపల, దూడల, దూలం, దువ్వెన, దేవభట్ల, దేవరసెట్టి, దేవర, దేవిరెడ్డి, దేవినేని, దొడ్డపనేని, దొడ్డి, దొడ్ల, దొంతంరాజు, దొమ్మరి, ద్రోణంరాజు, దోమల, ధారా, ధనియాల తదితర ఇంటిపేర్లు తెలియజేబడ్డాయి. ఇంకా ‘న’ అక్షరంతో నక్కా, నక్కల, నత్తల, నడ్డి, నంది, నందిరెడ్డి, నందిభట్ల, నందిరెడ్డి, నరిసెట్టి, నర్రా, నల్లబోతు, నల్లబోయిన, నల్లా, నల్లమామిడి, నల్లమోతు, నాగభైరవి, నాగరాజు, నాగినేని, నాగుబోతు, నాయని, నారపురెడ్డి, నారసాని, నారసెట్టి, నారిన, నార్ని, నిమ్మల, నువ్వుల, నూకపోతుల, నెమలి, నేరేడు, నోముల, నేతి తదితర తెలుగుఇంటిపేర్లు తెలుగువారికి ఉన్నట్టుగా ఈ తెలుగుబుక్ లో వ్రాయబడి ఉన్నాయి.

ఇంకా ఈ తెలుగుబుక్ నందు ‘ప’ అనే తెలుగుఅక్షరంతో ఈవిధంగా తెలుగువారి ఇంటిపేర్లు పగిడి, పంగ, పంగా, పచ్చల, పచ్చిగోళ్ళ, పచ్చిపులుసు, పడాల, పడిగెల, పడమటి, పడవల, పండితపెద్ది, పత్తి, పంటల, పంతుల, పండా, పన్నాల, పంది, పందాల, పమిడిపూల, పంబాల, పయ్యాల, పరసా, పరానేని, పర్వతనేని, పలవనేని, పలిసెట్టి, పలుగు, పల్నాటి, పల్లంసెట్టి, పల్లెబోయిన, పసల, పసుపుల, పాడి, పాతింటి, పానేటి, పాముల, పాలకూర, పిడిసెట్టి, పిన్నమనేని, పిప్పళ్ళ, పుచ్చకాయల, పుట్ట, పుచ్చల, పువ్వుల, పూజల, పూలబోని, పెంకుటింటివారు, పూలసాని, పెద్దగౌని, పెదమల్లు, పెద్దింటి, పెద్దిభొట్ల, పెమ్మసాని, పెరికెల, పెసల, పేర్ల, పేరినేని, పేర్ని, పేర్రాజు, పైయావుల, పొగాకు, పొన్న, పొట్టు, పొట్ల, పోచినేని, పోతున, పోతుబోయిన, పోలిసెట్టి తదితర ఇంటిపేర్లు ఈ తెలుగుబుక్ లో తెలియజేయబడ్డాయి.

‘బ’ ‘మ’ తదితర తెలుగు అక్షరాలతో తెలుగువారి ఇంటిపేర్లు

తెలుగు అక్షరాలలో ‘బ’ అను అక్షరంతో తెలుగువారి ఇంటిపేర్లు బచ్చు, బంగారు, బచ్చలకూర, బండ, బండారి, బండి, బత్తి, బత్తిన, బత్తు, బలుసు, బసినేని, బసిరెడ్డి, బాచిన, బాడిగ, బాతుల, బాదం, బాలిన, బాలినేని, బిక్కసాని, బిక్కిన, బీరం, బుక్కిన, బుడ్డిగ, బుడిగ, బుర్రా, బెల్లపు, బెజ్జం, బేతిని, బైరెడ్డి, బొక్కా, బొడ్డుమేకల, బొద్దుబోయిన, బొప్పన, బొమ్మన, బొమ్మసెట్టి, బొమ్మిడాల, బొల్లపునేని, బొల్లినేని, బోళ్ళ, బ్రహ్మభొట్ల, భండారి, భాగవతుల, భీమనేని, భొట్ల, భోగినేని తదితర తెలుగు ఇంటిపేర్లుతెలుగుబుక్ లో తెలియజేయబడ్డాయి.

‘మ’ అను తెలుగు అక్షరంతో తెలుగువారి తెలుగు ఇంటిపేర్లు మక్కల, మంగలి, మంగినేని, మజ్జిగ, మంచినీళ్ళ, మంచినేని, మడక, మడకల, మడుగు, మడుగుల, మండువ, మద్దల, మద్దినీడి, మద్దినేని, మరగోని, మలినేని, మర్రి, మల్లారెడ్డి, మల్లిడి, మల్లిన, మల్లిగౌని, మల్లు, మసిముక్కు, మాచిరెడ్డి, మాడల, మాడా, మాడిసెట్టి, మాతంగి, మాదిన, మాదవపెద్ది, మానికల, మామిడి, మామిళ్ళ, మామిడిపోతుల, మారిని, మారుతి, మారెళ్ళ, మారేడు, మిక్కిలినేని, మిడతల, మావిడి, మిద్దె, మిరపకాయల, మిద్దెల, మునగా, ముప్పనేని, ముప్పన, ముప్పలనేని, ముప్పిడి, ముమ్మిడి, ముల్లంగి, మువ్వల, మూల, మేకా, మేకపోతుల, మేడి, మోదుగు, మోదుగుల తదితర ఇంటిపేర్లు తెలియజేయబడ్డాయి.

ఇంకా వివిధ తెలుగు అక్షరాల వారీగా వివిధ తెలుగువారి తెలుగు ఇంటిపేర్లు తెలియజేయబడ్డాయి. తెలుగువారి ఇంటిపేర్లను తెలియజేసే తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్