సాహిత్యం గురించి చదువుతూ చదువుతూ అది అలవాటుగా మారి చదివి చదివి అది ఒక తపస్సు అయితే, అలా చదివినవారు మరొక పుస్తకం సృష్టించే స్థాయికి చేరగలరు… లేదా ఒక విషయాన్ని విపులంగా అర్ధవంతంగా పదిమందికి వివరించి ప్రసంగించగలరు. చదవడం ఒక తపస్సు అయితే, అలా తపస్సు చేసినవారు గురువుగా మారగలరు.
ఒక విషయంలో తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, ఆ విషయం ఆ వ్యక్తి చేత సాధించబడుతుంది.
సమాజంపై ప్రభావం చూపించే అనేక వస్తువుల సృష్టికి ముందు… ఆ వస్తువు యొక్క తయారీ విధానం ఒక ఆలోచనగా ఒక వ్యక్తి మెదడులో మెదిలితే, అలా మొదలైన ఆలోచన గురించి ఆ వ్యక్తి తపిస్తే, ఆ ఆతపన వలన ఆ ఆలోచన ఆచరణకు వస్తే, ఇప్పటి కాలంలో అనేక వస్తువులు సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అలాంటి వాటిలో రేడియో, టివి, ఫోన్ వంటి వస్తువులు ఎన్నో ఉంటాయి.
అందరూ తపించి తపించి వస్తువు కనిబెడితే, మరి వాటిని వినియోగించేది ఎవరు?
ఇలాంటి ప్రశ్నకూడా పుట్టే అవకాశం ఉంటుంది. అది సహజమే కాలం మనల్ని ప్రశ్నించేవరకు సాధారణంగా అలవాటు అయిన జీవితాన్నే కొనసాగించడం మనసుకు ఉండే అలవాటు అంటారు. కానీ కాలం ప్రశించేవరకు అంటే, మనం కాలం మములుగానే ఖర్చు అయిపోయినట్టే…
జీవితంలో సరదాలు కోల్పోతామనేది బ్రమ మాత్రమే. ఎందుకంటే చిన్నప్పుడు మన పోషణ కొరకు కష్టపడే తల్లిదండ్రులు మనకున్నట్టే… ఒక సినిమా వెళ్దాం అని ప్రోత్సహించేవారు మన చుట్టూ ఉంటారు.. కాబట్టి సినిమాకు వెళ్లాలనే సరదా కోసం తాపత్రయపడనవసరం లేదు. అలాంటి చిన్న చిన్న సరదాల కోసం ప్రోత్సహించేవారు లేదా అలాంటి సౌకర్యాలు అందించే వ్యవస్థలు కూడా ఉన్నాయి.
అంటే సినిమాకు వెళ్లాలంటే ఒకరు ముందుగా టికెట్ తీసుకోవడానికి థియేటర్ కు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా టిక్కెట్స్ ఆడించే వ్యవస్థలు కూడా ఉన్నాయి. వ్యక్తికి సరదాలు అందించే విషయంలో మన చుట్టూ వ్యక్తులే కాదు వ్యవస్థలు కూడా ఉన్నప్పుడు, జీవితంలో సరదాలు కోల్పోయే బ్రమ అవసరం లేదని అంటారు.
దేని కోసం తపన ఉండాలి? ఇదే ప్రధాన ప్రశ్న అయితే
జీవితపు లక్ష్యం కొందరికి చిన్నప్పుడే బలపడితే, దాని సాధనకు వారు చదువుకునే వయస్సు నుండే ప్రేరిపింపబడుతు ఉంటారు… అంటే స్కూల్లో టాపర్ గా ఉంటూ కాలేజీ చదువులలో కూడా అదే ఫలితాలు రాబుడుతూ చదువును పూర్తి చేసుకునేవారు తమ తమ ఆర్ధిక, సామాజిక లక్ష్యాలను అందుకుంటూ ఉంటారు.
అలాగే కొందరికి వృత్తి నేర్చుకునేటప్పుడు లక్ష్యం ఏర్పడుతూ ఉంటుంది… పట్టుదలతో తాము నేర్చుకుంటున్న వృత్తిలో శ్రద్దాశక్తులు కనబరుస్తూ తమ జీవిత లక్ష్యానికి మార్గం సుగమం చేసుకుంటూ ఉంటారు.
కొందరు చదువుకునే వయసులో ఆటలతో కాలం గడిపి, ఒక వయసు వచ్చాక అవసరాల కోసం ఆర్జన చేసే సమయంలో లక్ష్యం ఏర్పడే అవకాశం ఉంటే, ఆ వయసులో వారు తమ జీవన లక్ష్యం కోసం పాటుపడతారు…
ఇలా జీవితంలో ఎప్పుడైనా తమ జీవితపు లక్ష్యం ఏర్పడుతూ మనిషిని తన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి లక్ష్యం తీసుకెళుతుందని అంటారు.
ఒకరి జీవితపు లక్ష్యం ఒక వ్యవస్థగా మారవచ్చు. ఒకరికి కలిగిన అసౌకర్యం ఒక వ్యవస్థను సృష్టించే విధంగా ఆలోచనను కలిగించవచ్చు.
ఆలపాటి రామచంద్రరార్రావు ఆర్ధికంగా ఎదుగుదల జీవితపు లక్ష్యం అయితే, ఇప్పుడు అది అంబికా దర్బార్ అనే వ్యవస్థ.
ఊరి ప్రయాణం కోసం కలిగిన అసౌకర్యం ఒక వ్యక్తికి ఆలోచనను కలిగిస్తే, అది ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ… రెడ్ బస్ టికెట్ బుకింగ్…
ఇలా జీవితపు లక్ష్యం చిన్నప్పుడే ఉంటే, అది చదువు నుండి కొనసాగవచ్చు… ఒక్కోసారి జీవితపు మద్యలో లక్ష్యం ఏర్పడవచ్చు… కానీ అది ఆ వ్యక్తిలోను, సమాజంలోను మార్పుకు నాంది కాగలదని అంటారు.
0 responses to “తపించి తపించి పట్టుదలతో కృషి చేస్తే, సాధించలేనిది ఏముంటుంది?”