నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? నేరస్థులు పాలకులైతే పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిపోతుంది. వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా కార్యాచరణ ముందుకు సాగదు. అడ్డగోలు నిర్ణయాలు అమలవుతాయి. నిబంధనలు పాటించకపోవడం పరిపాటిగా మారుతుంది.
ముఖ్యంగా మంచి – చెడుల గుర్తింపు మారిపోతుంది. చెడు మంచిగానూ, మంచి చెడుగానూ ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అందరూ తాత్కాలిక సౌఖ్యం కోసమే వెంపర్లాడడం మొదలవుతుంది. మంచి మాటను పెడచెవిన పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. అందువలన ఆ ప్రాంతపు పరిస్థితులలో శాంతి లోపిస్తుంది.
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలంటే, అందుకు మంత్రివర్గంతో సమావేశం, అఖిల పక్షంతో సమావేశం చేసి, తమ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యంతో బాటు, తమ నిర్ణయం వలన ప్రజలకు జరిగే ప్రయోజనం ఎంతో, చర్చను నిర్వహించి, చర్చల తర్వాత, ప్రభుత్వం నిర్ణయాన్ని ఆమోదిస్తుంది. అదే పాలకులు నేరస్థులైతే, ప్రజా ప్రయోజనాల కన్నా, తమ స్వార్ధ ప్రయోజనాలే ప్రధానంగా మారతాయి. ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటాయి.
ఒక ప్రాంతానికి ఇతర ప్రాంతాలలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే, పాలకులు నేరస్థులైనప్పుడు.
నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? – నేరాలు పెరుగుతాయి.
ఇంకా నేరప్రవృత్తి బాగా పెరిగిపోతుంది. నేరాలను అదుపు చేయడం కష్టంగా మారుతుంది. నేరాలను అదుపు చేసే వ్యవస్థ అప్రతిష్టను మూటగట్టుకుంటుంది.
హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, మహిళలపై చులకన భావన ఇంకా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం వంటి నేరాలు పెరిగిపోతాయి. బాలల్లో కూడా నేరప్రవృత్తి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసిన వారికి శిక్షలు లేకపోవడం వలన సమాజంలో నేరప్రవృత్తి వైపు ఆకర్షితులు కావడం జరుగుతుంది.
సామాజిక అభద్రత పెరిగిపోతుంది. కావునా ఎటువంటి పరిస్థితులలోనూ నేర స్వభావం ఉన్నవారికి అధికారం అప్పగించకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అది సామాజిక వినాశనానికి దారి తీస్తుంది.
ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?
అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?