పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

పుస్తకం అంటే జ్ఙానం తెలియజేస్తుంది. వస్తువు గురించి కానీ, వ్యక్తి గురించి కానీ, పనిని గురించి కానీ, ఏదైనా పుట్టు పుర్వోత్తరాలు పుస్తకాల వలన తెలియజేయబడుతూ ఉంటాయి. వస్తువు ఎప్పుడు పుట్టింది? ఆ వస్తువుని ఎవరు కనిపెట్టారు? ఆ వస్తువు ఎలా అభివృద్ది చేయబడింది? ఒక వస్తువుని కనిపెట్టిన వారి నేపథ్యం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం ఒక పుస్తకం వలన తెలియబడతాయి. ఇదే మాదిరి వ్యక్తి గురించి కూడా ఉంటుంది. అలాగే చరిత్ర గురించి కూడా పుస్తకాలు చదవడం వలన తెలుసుకోగలుగుతాం. కాబట్టి పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు ఉంటాయి. అలా పుస్తకాలు వలన వివిధ విషయాల గురించి అవగాహన ఏర్పరచుకోవచ్చును.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఒక భాష నేర్చుకోవడానికి ఆ భాషకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఒక ప్రాంతం గురించి తెలుసుకోవడానికి ఆ ప్రాంతం గురించి చక్కగా వివరించిన పుస్తకాలు చదవాలి. సామాజిక అవగాహన గురించి, సామాజికపరమైన జ్ఙానం అందించే పుస్తకాలు చదవాలి. ఒక సంప్రదాయం గురించి తెలియాలంటే, ఆ సంప్రదాయం గురించి పండితులు వ్రాసిన పుస్తకాలు చదవాలి. ఇలా ఏదైనా ఒక విషయంలో విశేషమైన అవగాహన కోసం, ఆయా విషయంలో గల వివిధ పుస్తకాలు చదవాలి.

విజ్ఙానం కోసం పుస్తకాలు చదవడం. పుస్తకాలలోని విషయ పరిజ్ఙానం పెంచుకోవడం తప్పనిసరి.

మనం జీవిస్తున్న సమాజం మనకు తెలుస్తుంది. ఇదే మన సమాజం గతంలో ఎలా ఉండేది? గతంలో సమాజంలో జరిగిన మార్పులు. అలా జరిగిన భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందెవరు? అ మార్పులకు కారణాలు? ఇలా సామజికంగా మన ప్రాంతపు చరిత్ర గురించి, చరిత్రకారులు రచించిన పుస్తకాలు మన పూర్వికుల గురించి తెలియజేస్తుంది.

వ్యక్తికి విద్యార్ధి దశ నుండే పుస్తకాలతో పరిచయం పెరుగుతుంది – పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

విద్యార్ధి దశలోనే మనకు పుస్తకాలతో సాంగత్యం ఏర్పడుతుంది. భాషా సంబంధిత పుస్తకాలు, గణిత పుస్తకాలు, సామాజిక శాస్త్రం, సామన్య శాస్త్రం, పరిసరాల పరిజ్ఙానం… వివిధ పుస్తకాలలోని విషయం పాఠశాలలోని ఉపాధ్యాయుల ద్వారా వింటాము. ఆయా పుస్తకాలలో వివిధ సమాధానాలు బట్టీబడటం జరుగుతుంది. అప్పటి నుండే కొందరు పాఠ్య విషయాలపై పట్టు పెంచుకుంటారు. మనకు ఉహ తెలుస్తున్నప్పుడే పుస్తకాలు పరిచయం అవుతూ ఉంటాయి.

నిర్ధిష్ట నిర్ణయాక చదువు పూర్తయ్యేవరకు ప్రతి వ్యక్తికి పుస్తకాలతో అనుబంధం కొనసాగుతుంది. ఇలా చదువుకు సంబంధించిన పుస్తకాలే కాకుండా… మనో విజ్ఙానం తెలియజేసే పుస్తకాలు కూడా మనసు గురించి వింత విషయాలను తెలియజేస్తూ ఉంటాయి.

ఇంకా కాల్పనిక పుస్తకాల వలన ఊహా ప్రపంచం కూడా మనసులో సృష్టించుకోవచ్చును. వివిధ రకాల పుస్తకాలు వివిధ రకాల ఆలోచనలను పెంచుతాయి.

పౌరాణిక పుస్తకాలు చదవడం వలన భక్తి, జ్ఙాన, వైరాగ్యం గురించిన అవగాహన ఏర్పడుతుందని అంటారు. ఇంకా ఇవి వ్యక్తి జీవన పరమార్ధమును ప్రబోదిస్తాయని పెద్దలంటారు.

వివిధ రకాల పుస్తకాలు వివిధ విజ్ఙాన విషయాలు – పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

చరిత్ర గురించిన సరైన అవగాహన రావాలంటే, వివిధ చారిత్రక పుస్తకాలు చదవాలి. ఒక ప్రాంత చరిత్ర కానీ, ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్ర కానీ పుస్తక రూపంలో నిక్షిప్తం అయి ఉంటాయి. కావునా చారిత్రకపరమైన విషయాల పట్ట ఆసక్తి గలవారికి చారిత్రక పుస్తకాలు మరింత విషయ జ్ఙానం అందిస్తాయి.

పరిశోధనాత్మక పుస్తకాలు వివిధ పరిశోధనల గురించి తెలియజేస్తాయి. పరిశోధనాత్మక విషయాలను, ప్రయోజనాలను తెలియజేస్తూ ఉంటాయి. పరిశోధన అంటే ఆసక్తి ఉన్నవారికి పరిశోధన గురించిన పుస్తకాలు చదవడం వలన పరిశోధనాత్మక ఆలోచనలకు ప్రేరణ కాగలవు.

పుస్తకాలు చదవడం వలన ఉపయోగాలు

సాహిత్యం గురించి తెలియాలంటే వివిధ సాహిత్య పుస్తకాలు చదవాలి.

కొత్త సాంకేతిక పరికరం కొనుగోలు చేస్తే, ఆ వస్తువు వాడుక గురించిన పుస్తకం కూడా ఆ వస్తువుతో బాటు ఉంటుంది. అంటే ఒక వస్తువు వాడుక గురించి కూడా పుస్తకంలో జ్ఙానం నిక్షిప్తం అయి ఉంటుంది.

పుస్తకాలు చదవడం వలన ఆయా పుస్తకాలలో ఉండే విషయ సారం గురించిన అవగాహన ఏర్పడుతుంది.

కాల్పనిక పుస్తకాలు పదే పదే చదువుతుంటే, ఊహా శక్తి కూడా పెరుగుతుందని అంటారు.

ఈ కాలంలో మనకు ఆన్ లైన్ లైబ్రరీగా మన ఫోన్ ఉపయోగపడుతుంది.

గూగుల్ క్రోమ్ ద్వారా ఆన్ లైన్ పుస్తకాలు అందించే వెబ్ సైటును ఓపెన్ చేస్తే మన ఫోనే మనకు ఒక లైబ్రరీగా ఉపయోగపడుతుంది. లేదా ఒక మొబైల్ యాప్ వలన కూడా మన స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ లైబ్రరీగా ఉపయోగపడుతుంది.

ఫ్రీగురుకుల్.ఆర్గ్ వెబ్ సైటులో చాలా తెలుగు పుస్తకాలు పిడిఎఫ్ రూపంలో మనకు లభిస్తాయి. ఆ వెబ్ సైటుని సందర్శించడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

పుస్తకాలు చదవడం మంచి అలవాటు అయితే, మంచి పుస్తకం మంచి స్నేహితుడి వంటిది అని అంటారు.

ధన్యవాదాలు.

తెలుగురీడ్స్