You are currently viewing విజయ్ సీఎం అయితే… పవన్ కళ్యాణ్ ఎప్పుడు?
విజయ్ సీఎం అయితే… పవన్ కళ్యాణ్ ఎప్పుడు?

విజయ్ సీఎం అయితే… పవన్ కళ్యాణ్ ఎప్పుడు?

విజయ్ సీఎం అయితే… పవన్ కళ్యాణ్ ఎప్పుడు? AP Politicsలో మళ్లీ హాట్ డిబేట్ కు అవకాశం ఏర్పడిందా?

నిన్నటి దాక?

          టివికె పార్టికి ఎన్ని సీట్లు వస్తాయి?

          ఆ పార్టి ప్రభావం ఎంత?

ఆ పార్టికి వచ్చే ఓటు శాతం అధికార పార్టికి లాభం చేకూరుస్తుందా? లేదా ప్రతిపక్ష పార్టికి లాభం చేస్తుందా?

విజయ్ పార్టి అధికారంలోకి రావడానికి ఎంత కాలం పడుతుంది.

ఇప్పుడు

          ఆ పార్టితో కలసి వచ్చేది ఎవరు?

          విజయ్ కి మద్దతు ఇచ్చే పార్టీ ఏది?

          ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు?

ఇలాంటి చర్చ ఉంటే, ఆంధ్రలో కూడా కొత్త చర్చ మొదలౌతుంది. విజయ్ సీఎం అయితే… పవన్ కళ్యాణ్ ఎప్పుడు? అనే ప్రశ్న పుడుతుంది.

2024 ఏపిలో కూటమి విజయానికి కారణం అయిన పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల ఫలితాలకు ముందు పవన్ కళ్యాణ్ కూటమి కట్టడాన్ని విమర్శించినవారు, ఇప్పుడు మరల ఓ కొత్త విమర్శ మోసుకురావడం ఖాయంగా కనబడుతుంది. ఇంతకీ తమిళనాడు రాజకీయాలకు, ఏపిలో రాజకీయాలకు లింక్ ఏమిటి?

విజయ్ సీఎం అయితే… పవన్ కళ్యాణ్ ఎప్పుడు? ప్రశ్నకు అసలు కారణాలు:

1. సినిమా హీరో రాజకీయ నాయకుడు ట్రెండ్

  • విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పెద్ద సినిమా స్టార్లు.
  • ఫ్యాన్ బేస్‌ను ఓట్లుగా మార్చగలరా? అనే ఆసక్తి ప్రజల్లో ఉంది.
  • అందుకే తమిళనాడు విషయాన్ని APతో పోల్చుతున్నారు.

పై విషయాలు పోలిక పెట్టుకుని చూసారు… ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఒక్కడే వచ్చి, అతని పార్టి విజయం 100 కి పైగా సీట్లు గెలిచారు.

సాదారణంగా ఏదైనా పోలిక పెట్టుకుని చూస్తున్నప్పుడు, దానిలో బెస్ట్ ఎవరు? అనే ప్రశ్న వస్తుంది. అదే పొలిటికల్ పోలిక ఉంటే మాత్రం, బెస్ట్ ఎవరు అని చూసేవారితో పాటు, అవకాశం చూసుకుని విమర్శలు చేసేవారు ఎక్కువగా ఉంటారు.

ఇప్పటికే ఏపిలో పవన్ కళ్యాణ్ డిప్యూటి సిఎంగా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ నే సిఎం అయ్యే అవకాశం ఎక్కువ.

విమర్శ ఏమని వస్తుంది?

పవన్ కళ్యాణ్ సిఎం కావాలని ఆశించేవారిని దృష్టిలో పెట్టుకుని, విజయ్ సాధించిన ఫలితం చూపుతూ, పవన్ కళ్యాణ్ గురించి చర్చ మళ్ళి తెరపైకి రావచ్చు.

కూటమి కట్టడం వలననే పవన్ కళ్యాణ్ డిప్యూటి సిఎంగానే ఉండవలసి వచ్చిందనే వాదన బలపడే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఏపిలో ఉన్న రాజకీయ పరిస్థితులలో ఈ వాదన పెద్దగా ప్రభావితం చూపకపోవచ్చు కానీ 2029 ఎన్నికలలో మాత్రం ఈ వాదన ప్రభావం ఉండవచ్చు. రాజకీయలలో ఎప్పుడు ఎవరు ఎలా మారతారో తెలియదు…

పవన్ కు, విజయ్ కు పోలిక పెట్టిన వారు, విజయ్ సీఎం అయితే… పవన్ కళ్యాణ్ ఎప్పుడు? అనే ప్రశ్న వేస్తారు?

telugureads channel

తెలుగు ఎస్సేస్: ఆలోచనలకు అద్దం, ప్రేరణ, విద్య, సామజిక విషయాలలో…

Leave a Reply