Category Archives: mano vijnanam

ఆరోగ్యమే మహాభాగ్యం వ్యాసం తెలుగులో

ఆరోగ్యమే మహాభాగ్యం వ్యాసం తెలుగులో ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి? తెలుసుకుంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రశ్న మనసు బదులు వెతుకుతుంది. ఎందుకు మన పెద్దలు ఈ మాట అన్నారో? ఆలోచన చేయాలి.

మనిషి సరిగ్గా పని చేయడానికి, అతను పూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండాలి, అంతేకాకుండా అతను ప్రశాంతతో ఉండాలి. ఇంకా అతను చేస్తున్న తన పనియందు పూర్తిగా దృష్టి పెట్టాలి. అప్పుడే తాను చేస్తున్న పని యొక్క ఫలితం తాను ఆశించిన రీతిలో సాధించగలడు.

అలా మనిషి తాను సమర్ధవంతగా పనిని పూర్తి చేయడానికి అతను మనసు కూడా లగ్నం కావాలి. అలా మనసు శరీరం పనిపై పూర్తిగా లగ్నం కావడానికి ఆరోగ్యం ప్రధానం. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు.

మనస్సు మరియు శరీరం మధ్య సంబంధం సంక్లిష్టమైనది మరియు పరస్పరం అనుసంధానించబడి ఉంటుంది. ఒకరి స్థితి మరొకరిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మనస్సు మరియు శరీర ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

ఆరోగ్యమే మహాభాగ్యం వ్యాసం తెలుగులో – మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం

ఒత్తిడి: మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరం కార్టిసాల్ మరియు అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు రక్తపోటు, హృదయ స్పందన రేటు మరియు ఇతర శారీరక లక్షణాలకు దారితీస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, తద్వారా మనం అనారోగ్యానికి గురవుతాము.

మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం: మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం మధ్య బలమైన సంబంధం ఉందని పరిశోధనలో తేలింది. నిరాశ మరియు ఆందోళన వంటి పరిస్థితులు శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, గుండె జబ్బులు, మధుమేహం మరియు ఇతర అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయి.

జీవనశైలి కారకాలు: మన జీవనశైలి ఎంపికలు మన మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండింటిపై కూడా ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.

మనస్సు-శరీర అభ్యాసాలు: ధ్యానం, యోగా మరియు తాయ్ చి వంటి అభ్యాసాలు మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండింటిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ అభ్యాసాలు ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మరియు మొత్తం శ్రేయస్సును పెంచడానికి సహాయపడతాయి.

మొత్తంమీద, మనస్సు మరియు శరీరం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి మరియు రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవడం సరైన ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం అవసరం.

ఇలా మనసు శరీరం ఒకదాని ఆరోగ్యంతో ఒకటి ఆధారపడి పని చేస్తూ ఉంటాయి. మనసు బాగుంటే శరీరాన్ని నియంత్రించగలదు. శరీరం బాగుంటే మనసుపై నియంత్రణకు సహకరించగలదు. రెండు పరస్పరం బాగుండడానికి ప్రతిరోజూ వ్యాయమం, యోగాభ్యాసం, నడక చాలా ప్రధానమని అంటారు.

జీవితంలో లక్ష్యం ఎంత ప్రధానమో? అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

మనిషి జీవితంలో లక్ష్యం ఎంత ప్రధానమో? అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి రేయింబళ్ళు కష్టపడి కోటీశ్వరుడు అయితే, అతను సరిగ్గా తన శరీరమును పట్టించుకోకపోవడం వలన జరిగే నష్టాలు?

కష్టపడి కోటిరూపాయిలు సంపాదించాలనే లక్ష్యంతో మానసిక ఒత్తిడిని చెంది, తన శరీరానికి కేటాయించవలసిన సమయాన్ని వృధా చేయడమే అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కాగలదని అంటారు. జీవితంలో డబ్బు చాలా ప్రధానమైనది. డబ్బు ఉంటేనే సంఘంలో గౌరవంగా జీవించగలం. కానీ అదే డబ్బు సంపాదించడంలో పూర్తిగా నిమగ్నమై కేవలం డబ్బు సంపాధనకే పరిమితం అయి, ఆరోగ్య నియమాలు ఉల్లంఘించడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం కరవవుతుంది.

వేళకు తినకుండా, తీరిక దొరికినప్పుడు తినడం ప్రధాన నష్టం. అందువలన శరీరంలో గ్యాస్టిక్ ట్రబుల్ ప్రారంభం అవుతుంది.

అదేపనిగా మానసిక ఒత్తిడికి లోనవడం వలన కూడా జీర్ణ సమస్యలకు కారణం కాగలదు.

ఆహార నియమాలను పట్టించుకోక పోవడం చేత, చిన్నగా ప్రారంభం అయ్యే సమస్యలు పెద్ద శారీక సమస్యలుగా మార్పు చెందుతాయి. పెద్ద పెద్ద సమస్యలు మనసును కృంగదీస్తాయి. కావునా చిన్న చిన్నగా ఆరోగ్య నియమాలను ఉల్లంఘించరాదని అంటారు.

డబ్బే కాదు, జీవితంలో చాలామంది చాలా రకాల లక్ష్యాలను పెట్టుకుని ఉంటారు. తమ జీవిత లక్ష్య సాధనకు కృషి చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో లక్ష్యం ఎంత ప్రధానమో, ఆరోగ్యము అంతే ప్రధానము. ఒక వ్యక్తి ఐఏఎస్ అధికారి కావడానికి ప్రయత్నిస్తూ, ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే, అతను అయినా దేశ సేవ చేయడానికి వ్యక్తిగతంగా అనర్హులుగా మారతారు.

లక్ష్యం ఏదైనా కావచ్చును కానీ లక్ష్య సాధనకు ఎంతవరకు కృషి చేస్తామో? అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేస్తున్న సాధనను వదలకూడదు.

ముందు శరీరం ఆరోగ్యంగా ఉంటే, వ్యక్తి ఒక చోట నుండి మరొక చోటకు అవలీలగా ప్రయాణం చేయగలడు. అదే అనారోగ్యంతో ఉంటే, పని మీద కనీసం ప్రయాణం కూడా చేయలేకపోవచ్చును.

అదే ఒక వ్యక్తి అరోగ్యంగా ఉంటే, తన పనులు తాను సమర్ధవంతంగా చేయగలడు. లేదంటే పనులు ఇతరులకు పురమాయించాలి. అక్కడ డబ్బు ఖర్చుతో పాటు పని నాణ్యతో లోపం కూడా ఉండవచ్చును. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు.

తెలుగు వ్యాసాలు తెలుగురీడ్స్ పోస్టులు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు Real Life Quotes In Telugu కాలంలో మనిషికి కాలం నేర్పే పాఠాలు, జీవితంపై ఏర్పడే అవగాహన మాటలుగా మారతాయి.

పెద్దలు మాట్లాడితే, ఆ మాటలకు అర్ధం మనసుకు జరిగే అనుభవం ద్వారానే తెలుస్తుందని అంటారు.

మాట మనసుని తాకుతుంది. కానీ అన్ని మాటలకు మనసు ప్రతిస్పందించకపోవచ్చును. కొందరి మాటలకు మనసు ప్రేరణ పొందుతుందని అంటారు.

అలాంటి పెద్దల మాటలను పరిశీలన చేయడం ద్వారా మనసు మనసుపై పరిశోధనాత్మకంగా పని చేస్తుందని అంటారు.

ఇక్కడ కొన్ని లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాత్మకం.

  • ఇష్టపడి పని చేస్తే, పనిపై ప్రేమ పెరుగుతుంది. పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది.
  • పరిశీలనా దృష్టితో ఉండడమే పరిశోధనకు మార్గం ఏర్పడుతుంది
  • ఎవరో వేసిన బాటలో అందరూ నడుస్తారు. కానీ ఒక్కరే తాను నడిచిన దారిలో ఎందరినో నడిపించగలరు.

  • సంతోషం మీ చర్యల వలన వస్తే అది ఆనందమయం అవుతుంది. ఇతరుల చర్యల వలన అయితే అది సంతోషం మాత్రమే.
  • ప్రపంచం నిత్య నూతనంగా ఉండడానికి మార్పును కోరుకుంటుంది. అటువంటి ప్రపంచంలో కూడా నీవు నీలాగా ఉండడం నీకు మాత్రమే ఉన్న గొప్పతనం.
  • మీ కృషి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళగలదు. అయితే మీపై మీకు గల నమ్మకమే సవాళ్ళను సైతం అధిగమించగలదు.

  • ఒక్కప్రశ్న చాలు జీవితంలో మార్పు ప్రారంభం కావాడానికి… నేనెందుకు ఇలా ఉన్నాను?.
  • నాకు తెలుసు. నాకు తెలిసినది ఎలా తెలిసినది. ఎవరో తెలుసుకున్నదే, నేను కూడా తెలుసుకున్నాను. మరి నేను కొత్తగా తెలుసుకున్నది ఏమిటి?
  • ఓటమి వెక్కిరించినా సరే, నా ప్రయత్నం చాలా ప్రధానం అనే బలమైన భావన ఘనవిజయానికి నాంది కాగలదు.

Real Life Quotes In Telugu

  • ప్రపంచం మన చుట్టూ ఒక అద్దం వలె పనిచేస్తుంది. మన ప్రవర్తనను బట్టే, ఇతరుల ప్రవర్తన మనకు ఎదురౌతుంది.
  • ఎదురైన ఓటమిలో గ్రహించిన వాస్తవమే, మరలా ప్రయత్నించడానికి ప్రోత్సాహం అవుతుంది.
  • భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆలోచనలకే పరిమితం అయితే, మీ గొప్పతనం మీలోనే. అదే ఆచరణలో పెడితే, మీరేమిటో మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి పరిచయం జరుగుతుంది.

  • కంటికి కనబడే మహిమ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతరంగంలో ఉండే మహిమను గుర్తిస్తే, అది ఆనందకరం, అద్భుతాలను ఆవిష్కరించగలదు.
  • చేద్దాం, చూద్దాం, వాయిదా కోసం చూడడం… వ్యక్తి ఉన్నతికి ప్రధాన అడ్డంకులు.
  • జీవితాన్ని ఆస్వాదించాలి కానీ అయోమయ్యంలో గందరగోళంగా కాలం వెలిబుచ్చరాదు.

  • సమయం గడిచిపోతుంది. మనసు ఆలోచనలతో పరిగెడుతుంది. సమయాన్ని, ఆలోచనలు సద్వినియోగం చేసుకోవడంలోనే జీవితం వృద్ది ఆధారపడి ఉంటుంది.
  • అవసరానికి మించిన ధనం, అక్కరకు రాని తెలివి వృధా.
  • ఊహకందని విషయాలలో ఊహించకుండానే జరిగే విశేష క్రియ అద్భుతంగా అనిపిస్తుంది.

Real Life Quotes In Telugu

  • ప్రతిసారి ప్రణాళిక వేసుకుని పోరాడలేం. ఒక్కొక్కసారి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనసుని అందుకు సన్నద్దం చేయడమే తెలివైన పని.
  • చెడుకు ప్రచారం వేగంగా లభిస్తే, మంచికి నీవు అనుమతిస్తేనే నీ దృష్టిలోకి వస్తుంది. మంచి వేచి ఉంటుంది కానీ ఇబ్బంది పెట్టదు.
  • ఆగితే ఆలోచనలు పెరుగుతాయి. ఆగకుండా ఉంటే ఆలోచనలు ఆగుతాయి. కావునా కర్తవ్యం విస్మరించకు.

  • మీకు తెలిసి మీరు లక్ష్యంతో ప్రయాణిస్తున్నారంటే, మీకు జీవితంపై సరైన అవగాహన ఉందని అర్ధం.
  • మనం మాత్రమే సంతోషంగా ఉండడం కాదు. మన చుట్టూ ఉన్నవారు కూడా.
  • ఫలితాన్ని అంచనా వేయడం సహజం. ఆశించిన ఫలితం కోసం పనిచేయడం కర్తవ్యం. ఫలితం పొందలేదని బాధపడడం మూర్ఖత్వం.
  • విఫలం వేయి మార్గములను అన్వేషించగల శక్తిని అందించగలదు.

కొన్ని తెలుగు బ్లాగు పోస్టులు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

లైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

Real Life Quotes In Teluguలైఫ్ కొటేషన్స్ తెలుగులో జీవితం సందేశాలు

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో మీటింగులో ఎలా మాట్లాడాలి? మంచి ప్రసంగం ఇవ్వడం అసాధ్యమేమి కాదు, కొంత అవగాహన మరియు అభ్యాసంతో, మీరు మీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు ప్రేరేపించే ప్రసంగాన్ని అందించవచ్చును. మీరు మంచి ప్రసంగం చేయడంలో, మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

మీరు ఎటువంటి ప్రేక్షకుల ముందు ప్రసంగిస్తున్నారో? తెలుసుకోండి: మీ ప్రసంగం వినడానికి వచ్చే, ప్రేక్షకుల వయస్సు, నేపథ్యం మరియు వారి ఆసక్తులను పరిగణించండి. ఇలా చేయడం వలన మీరు మీ సందేశాన్ని సమర్ధవంతంగా చెప్పగలగడానికి ఉపయోగపడుతుంది.

ఇంకా తగిన ఉదాహరణలు మరియు వృత్తాంతాలను ఎంచుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. పిల్లలను ఉద్దేశించి మాట్లాడాలా? యువకులను ఉద్దేశించి మాట్లాడాలా? పౌరులను ఉద్దేశించి మాట్లాడాలా? రాజకీయ సభలో మాట్లాడాలా? ఎప్పుడు? ఎక్కడ? ఎవరి ముందు మాట్లాడుతున్నామో? పూర్తి అవగాహన స్వయంగా పరిశీలన చేయాలి.

ప్రసంగం యొక్క ఉద్దేశ్యంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండండి: మీరు చెప్పాలనుకుంటున్న ప్రధాన అంశము మీరు మనసులో ప్రతిబించుకోవాలి. మీ మాటలు దాని చుట్టూ తిరగాలి. మీరు మాట్లాడే ప్రతి మాటా, ప్రధాన సందేశం యొక్క ఉద్దేశ్యాన్ని తెలుపుతూ ఉండాలి.

అద్భుతమైన ఆరంభం మీ ప్రసంగంలో ఉండాలి: మీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా, మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. అది కోట్ కావచ్చు, కథ కావచ్చు లేదా ప్రశ్న కావచ్చు. కానీ ఆరంభం ప్రేక్షకుల మనసును తాకాలి. మంచి ఆరంభం ఆద్యంతం కొనసాగించాలి.

మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో కొనసాగింపు ప్రసంగం

కొనసాగింపు ప్రసంగం : మీ ప్రసంగాన్ని కొంచెం హాస్యం అనిపించే చలోక్తులు ఉపయోగిస్తూ, మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఉదాహరణలు, ఉపాఖ్యానాలు ప్రయోగిస్తూ మాట్లాడాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి? మంచి అవగాహనతో మంచి మంచి పదాలతో మీటింగులలో మాట్లాడాలి.

ప్రసంగం చేయవలసిన విషయంపై సాధన: ఎంత సాధన చేస్తే, అంతగా విషయంపై పట్టు ఉంటుంది. విషయాన్ని అవగాహన చేసుకుని, దానిని సమర్దవంతంగా, అర్ధవంతంగా మాట్లాడే ప్రయత్నం చేయడానికి ముందుగానే సాధన అవసరం.

బాడీ లాంగ్వేజ్‌ ప్రసంగంలో చాలా ప్రధానం: ప్రసంగం చేసే సమయంలో నిటారుగా నిలబడి మాట్లాడండి, కంటికి ప్రేక్షక సముదాయమను పరిచయం చేసుకోండి మరియు మీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి చేతులతో సంజ్ఞలను ఉపయోగించండి.

బలమైన నినాదం : మీ ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసే బలమైన ముగింపుతో మీ ప్రసంగాన్ని ముగించండి.

మీటింగులో ఎలా మాట్లాడాలి?

ఏదైనా సభలో మాట్లాడేటప్పుడు. మాటతీరు స్పష్టంగా ఉండాలి. చెబుతున్న మాటలలో సభాఉద్ధేశ్యం ఏమిటో, అదే ప్రతిబింబించాలి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నామో? వారి ఆసక్తి ఏఏ విషయాలను బట్టి ఉంటుందో అలా అనర్ఘలంగా మాట్లడాలి.

అంటే ప్రస్తుత కాలంలో ఒక పాపులర్ సినిమా ఉంటే, ఆ సినిమా క్యారెక్టర్లను తీసుకుంటూ, సభా ఉద్దేశ్యాన్ని ప్రతిబింబించే విధంగా ప్రసంగం చేయగలగాలి. ఇక పాపులర్ క్రికెటర్ ఉంటే, ఆ క్రికెటర్ గురించి ప్రస్తావిస్తూ, మాట్లాడగలగాలి. ఏదైనా దేశాన్ని ఆకర్షించిన అంశం ఉంటే, ఆ అంశాన్ని కూడా ఉటంకిస్తూ, సభా ఉద్ధేశ్యాన్ని ప్రసంగిస్తూ ఉండగలగాలి.

ఈ చిట్కాలు ఉపయోగకరంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను! మీ ప్రసంగానికి శుభాకాంక్షలు!

తెలుగురీడ్స్

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం

పరిపాటి meaning in telugu

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు

చాకచక్యం అంటే ఏమిటి?

అశక్తత meaning అంటే అర్ధం?

తదేకంగా అర్థం తెలుగు పదం

మొబైల్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరో తెలిసిపోతుంది. సాదారణంగా ఉన్నప్పుడు మన మనసు మన మాట వింటుంది. కానీ బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మాత్రం మన మాట పట్టించుకోదు. మనలాగా ఆలోచించేవారు లేదా మన అంతరంగం గురించి బాగా తెలిసినవారి మాట వింటుంది.

ఎప్పుడూ సంతోషంగా ఉండే మనసుకు ఒక్కసారిగా ఎక్కువ ఒత్తిడితో ఉన్నప్పుడు మనసు మాత్రం మనమాట వినదు. ఎంత వద్దూ అనుకున్నా ఆలోచనలతో అంతరంగం అధిక ఆలోచనల తాకిడికి గురవుతుంది. అంతరంగంలో ఉండే మనసు వివిధ భావనలకు గురి అవుతూ ఉంటుంది. అనుభవం పెరిగే కొలది, తననితాను నియంత్రించుకుంటూ, మనకు సహకారిగా బాగా పనిచేస్తుంది. కానీ ఒక్కొక్కసారి అనుకోని సంఘటనల వలన కావచ్చును. అనుకోని వ్యక్తుల మాటల ప్రభావం కావచ్చును. ఊహించని ఎదురుదెబ్బల వలన కానీ మనసు ఒత్తిడికి గురైతే మాత్రం అది అశాంతిగా మారుతూ అంతరంగంలో ఓ అలజడినే సృష్టిస్తుంది. ఇక ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట ఉండదు.

మనసు మనకు ఒక బలం. దానికి ఉన్న అనుభవం మనకు అత్యంత శక్తివంతమైన బలం. అటువంటి బలమైన మనసుకుండే అలవాట్లు, ఎప్పుడైనా అనుకోని పరిస్థితులలో మనసు సంఘర్షణకు గురైతే మాత్రం మన అంతరంగం అయోమయ్యంగా మారుతుంది. అలాంటి సమయాలలో మన మనసు మరలా కుదురుకోవాడానికి అయినవారి ఓదార్పు మాటలు మన మనసుని ఒత్తిడి నుండి దూరం చేయగలిగితే, అది స్వస్థతకు చేరుతుంది. కొందరు ఒంటరిగానే ఆలోచిస్తూ, ఒత్తిడి నుండి బయటపడే ప్రయత్నం చేయగలిగితే, కొందరికి తోటివారి సహకారంతో ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉంటుంది.

సమస్యల తాకిడికి ఏర్పడే ఒత్తిడి

అయినా కొందరు ఒకచోట కూర్చుని, కళ్ళుమూసి, బయటి విషయాలకు దూరంగా మనసుని తీసుకువెళ్ళి, ఏదో ఒక చోట ఏకాగ్రతతో నిలిపి, కాసేపు ఒత్తిడికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా అప్పటి ఆలోచనల నుండి మనసును మళ్ళించడం కూడా, మన మనసుని మనం నియంత్రించుకోవడం వంటిదే. ఈ ప్రయత్నం విజయవంతం అయితే, సమస్యల తాకిడికి ఏర్పడే ఒత్తిడిని దూరం చేసుకోవడం సులభమే అంటారు.

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో
బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

కానీ ఒత్తిడికి గురైన మనసు అంత త్వరగా ఆలోచనల నుండి బయటపడకపోవచ్చును. కాబట్టి కొందరు ఏదో పుస్తకం చదువుతూ లేదా ఏదైనా సినిమా చూస్తూ తమ తమ సొంత ప్రయత్నాల ద్వారా ఒత్తిడి నుండి దూరం అయ్యే ఆలోచన చేస్తారు. అప్పుడు పుస్తక పఠనం, సినిమా వీక్షణం కూడా మనపై ప్రభావం చూపుతాయి.

ఒత్తిడికి లోనైన మనసు త్వరగా ఒత్తిడి నుండి బయటపడడానికి, మనసుకు బాగా దగ్గరైనవారి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారు. దీని వలన త్వరగా ఒత్తిడిని దూరం చేయగలం అంటారు. ఇలా ఒక వ్యక్తిలో ఏర్పడిన ఒత్తిడిని, ఆ వ్యక్తి నుండి దూరం చేసే బంధం ప్రతివారికి ఉంటుంది. వారిలో అమ్మ ఉండవచ్చును. నాన్న ఉండవచ్చును. భార్య ఉండవచ్చును. అన్నాతమ్ముడు, అక్కా చెల్లెలు ఉండవచ్చును. ఇంకా మంచి మిత్రుడు కావచ్చును. లేదా ప్రియురాలు / ప్రియుడు కావచ్చును.

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే, ఒత్తిడి తగ్గుతుందో? వారు మన మనసుకు బాగా దగ్గరయినట్టు!

మన బాధ ఎవరితో చెప్పుకుంటే, మన మనసు స్వస్థతకు చేరుతుందో, వారు మన మనసుపై ప్రభావం చూపుతున్నట్టు. మన మనసుపై మంచి ప్రభావం చూపే వారిలో సహజంగానే మొదట తల్లిదండ్రులు ఉంటారు. అయితే ఒక వయస్సు పెరిగే కొలది, తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం తగ్గవచ్చును. అప్పుడు కొన్ని విషయాలు అమ్మానాన్నతో చర్చించలేకపోవచ్చును. అలాంటి సమయంలో అన్నింటిలోనూ మన మనసుతో మమేకం అయ్యేవారిలో మొదటగా జీవిత భాగస్వామి ఉండవచ్చును. భార్య / భర్తతో అన్ని పంచుకోవడం, మనకు అలవాటుగా మారిపోతుంది. రెండు శరీరాలే కానీ వారి మనసు ఒక్కటిగా ప్రవర్తిస్తుంది.

అంటే మన జీవితంలో ఎవరితో అయితే ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటామో? వారే మనకు ఒత్తిడి పెరిగినప్పుడు మన మనసుపై త్వరగా ప్రభావం చూపగలరు. అలా ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో పంచుకునే అవకాశం ఉన్నప్పుడు… ఎలాంటి స్థితిలోనైనా మన మనసుపై, వారు మంచి ప్రభావం చూపగలరు.

సమస్య వలన ఒత్తిడికి గురైతే, సమస్యకు పరిష్కారం లభించేవరకు

కొన్ని సార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాగా ఒత్తిడికి గురైతే మాత్రం, ఆ సమస్యకు పరిష్కారమే మన మనసుని ఒత్తిడి నుండి బయటకు తీసుకురాగలదు. కానీ ఒత్తిడితో ఉన్న మనసుకు పరిష్కారం వెంటనే తట్టదు. అయినవారితో కాసేపు మాట్లాడితే, ఉపశమనం పొందిన మనసు మరలా సమస్యపై దృష్టిపెట్టి, పరిష్కార మార్గం కనుగొనగలదని అంటారు.

అంటే సమస్య వలన ఏర్పడిన ఒత్తిడిని కాసేపు దూరం చేసుకోవడానికి మనకు బంధాలు బాగా ఉపయోగపడతాయి. వారిలో అమ్మానాన్న, జీవితభాగస్వామి, మంచిమిత్రులు…. ఉండవచ్చును.

ఎవరి మీద మనకు బాగా ప్రేమ ఉంటుందో? వారి మాటలు వినడం వలన కాసేపు ఉపశమనం కలగవచ్చును.

మనకు ఎవరిపై అమితమైన గౌరవ మర్యాదలు ఉంటాయో? వారితో మాట్లాడినా మనసుకు భరోసా లభించగలదని అంటారు.

ఎవరి మాట వినని స్వభావి బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు

తమ స్వంత నిర్ణయంతోనే ముందుకు సాగేవారు ఉంటారు. వారు ఇతరుల సలహాను పాటించడం కన్నా, స్వీయ ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిపై ప్రేమాభిమానాలు ఉంటాయి కానీ నిర్ణయాలు తమకు తామే తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలా నిర్ణయాలు తీసుకునేవారు బాగా ఆలోచించే, నిర్ణయాలు తీసుకుని విజయవంతంగా ముందుక సాగుతారు. కానీ ఒక్కోసారి అనాలోచితంగా చేసే నిర్ణయాలు సమస్యకు కారణం కాగలవు. అలాంటివారు ఒత్తిడికి గురైతే మాత్రం తమకు తామే స్వయంగా అంతరంగంలో ఏకాగ్రతతో ఒత్తిడిని జయించాలి అంటారు. అంటే ఎవరి మాట వినని స్వభావి బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు, తమతో తామే మనసుని ఒక చోట కేంద్రీకరించడం ద్వారా కాసేపు మనసుకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేయడం అంటారు.

మనపై మనకు నియంత్రణ అంటే మన మనసుపై మన నియంత్రణ ఎంతవరకు ఉందో? అది ఎప్పుడైనా బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మనకు తెలియబడుతుందని అంటారు.

రోజూ కాసేపు మన మనసుతో మాట్లాడితే

ప్రతిదినం కాసేపు మన మనసుతో మాట్లాడి చూడండి… అంతరంగంలో అద్భుతమును మనం గమనించగలం అంటారు. కానీ ప్రతిదినం మనకుండే సమస్యల తాకిడితో, వాటి గురించిన ఆలోచనలకే మనం నిమిత్తులం అయి ఉంటాము.

కుటుంబ సభ్యుల అవసరాలు, తోటివారి సమస్యలు, మనలో ఉండే లక్ష్యాలు, మనకుండే బాధ్యతలు, మన చుట్టూ ఉండేవారి ప్రవర్తన… ఏదో ఒక బంధం రూపంలో ప్రత్యేక ప్రభావం ఎక్కువ ఆలోచింపజేయడం… ఇలా ఏదో ఒక విధంగా మన మనసు నిత్యం ఆలోచనలతో కూడి ఉంటుంది. కానీ నేనలా ఉన్నాను. నాలోఉండే మనసు ఎలా ప్రభావితం అవుతుంది. నాలో ఉండే మనసు నా చుట్టూ ఉండేవారి వలన ఏవిధంగా ప్రభావితం అవుతుంది. నా మనసు ఎలా ప్రవర్తించి, నా చుట్టూ ఎటువంటి వ్యక్తిత్వాన్ని కనబరుస్తుంది. ఇలా మన మనసుపై మనకు అవగాహన ఎంతవరకు? అంటే సమాధానం కొంచె కష్టతరమే. కానీ ప్రయత్నిస్తే, మనసుతో ప్రతి రోజూ కాసేపు మాట్లాడి చూస్తే, అది మనకు ఓ గొప్ప మిత్రుడు అంటారు.

మనపై ఉండే బాధ్యతలు కానీ మనలో ఉండే లక్ష్యాలు కానీ మన మనసుని మన నుండి ఆలోచనలకే పరిమితం చేస్తూ ఉంటే, ప్రతిదినం కాసేపు మనసుతో మాట్లాడే అవకాశం దేవుడెరుగు… అప్పుడప్పుడు ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా ఉంటే చాలు అనే భావన బలంగా ఉంటుంది.

మనసు బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ప్రయోజనం కూడా ఉండవచ్చు అంటారు.

ఎందుకంటే మనసుకు అంతగా అనుభవం లేని కొత్త విషయం ఎదురైనప్పుడే, అది లోపల పేర్కోని ఉండే ఆందోళన వలన మరింతగా ఆలోచనల తాకిడి అధికం అయి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రతివారికి ఏదో ఒక అంశంలో కానీ ఏదో ఒక వ్యక్తితో కానీ ఏదో ఒక అలవాటు విషయంలో కానీ కొంత ఆందోళన అంతర్గతంగా ఏర్పడుతూ ఉండవచ్చును. అటువంటి ఆందోళనకు తగ్గట్టుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడే మనసు ఒత్తిడి గురికావడం జరుగుతుంది.

అయితే మనసు బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ప్రయోజనం ఏమిటి? అంటే మన మనసుకు ఒక కొత్త అనుభవం ఎదురౌతుంది. ఒత్తిడిని జయించగానే మన మనసు మరలా అలాంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం తక్కువ. ఇంకా మన మనసులో ఉండే ఆందోళన తేలిపోతుంది. మన ఆందోళనకు మూల కారణం తెలిసి, అది దూరం అయ్యే అవకాశం ఎక్కువ. మనసు ఒత్తిడికి గురయిందంటే, దానికొక కొత్త అనుభవం ఏర్పడుతుంది. ఆ అనుభవం నేర్పిన పాఠం వలన మనసు ముందు జాగ్రత్తతో భవిష్యత్తులో ప్రవర్తించే అవకాశం ఉంటుంది.

ఒత్తిడికి లోనయిన మనసుకు అందుకు కారణం అయిన వ్యక్తుల స్వభావం ఏమిటో? వారి ప్రవర్తన ఎలా ఉంటుందో? తదితర అంశాలలో అవగాహన ఏర్పడుతుంది. అయితే ముందుగా మన మనసులో నుండి ఒత్తిడిని దూరం చేయాలి. కర్తవ్యంపై దృష్టిసారించాలి.

మన మనసు బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు వివిధ విషయాలతో మమేకం కావడం.

అంటే ఒక మంచి మ్యూజిక్ వినడం.

ఓ హాస్యపు సినిమా వీక్షించడం లేదా హాస్యపు కార్యక్రమములు చూడడం.

మంచి పుస్తకం చదవడం

తదితర పద్దతులు మేలు చేస్తే, మత్తుపానీయలకు చేరువకావడం మనకు మనమే చేటు చేసుకోవడం అవుతుంది.

మనసుకు బాగా అలవాటు అయిన విషయం

ఒక్క విషయం గమనిస్తే, మన మనసుకు బాగా అలవాటు అయిన విషయంలో, దాని ప్రవర్తన ఎప్పుడూ ఒకే విధంగా ఉండడం గమనార్హం. ఎలాంటి పరిస్థితులలోనూ బాగా అలవాటు ఉన్న విషయంలో మనసు ఒకే ఫలితాన్ని రాబట్టగలదు. అంటే దానికి ఏదో అంతర్లీనంగా ఏర్పడిన తెలియని భావన ఏదో, దానికనుగుణంగా ఏర్పడే సమస్య వలన అది పరిష్కారం గోచరించక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. బాగా తెలిసిన విషయంలో, నాకు తెలుసు అనే భరోసాతో మనసు ఎలాంటి స్థితిలోనూ బాగా పనిచేయగలుగుతుంది. అంటే ఒత్తిడికి మూలకారణం తెలిస్తే, మనసుకు మనసే బలం అవుతుంది. సమస్య దూరం అవుతుంది.

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో ఏర్పడే ఏ ప్రత్యేక భావన

అవును బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియదు. ఇంకా సమస్యను మరింత జఠిలం చేసుకుంటూ ఉంటాము. కానీ ఒక్క విషయం గమనిస్తే, మనకు మాత్రమే బాగా సంతోషం కలిగినప్పుడు, మన మనసు బాగా ఆనందంగా ఉంటుంది. ప్రశాంతతో ఉంటుంది. అలాగే బాగా దు:ఖం కలిగినప్పుడు కూడా మనసు బాధపడుతుంది. మరలా ఉపశమనం పొంది, తిరిగి స్వస్థతకు చేరుతుంది. అయితే మనకు మాత్రమే ప్రత్యేకంగా జరిగిందనే భావన మాత్రం మనసుపై ఒత్తిడిని పెంచుతుంది. మనకు మాత్రమే ఇలా అనే ప్రత్యేక భావం లేనప్పుడు మనసు త్వరగా స్వస్థతకు చేరే అవకాశం ఎక్కువ అంటారు.

వందమందిలో మనకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తే, వందమందిలో నేను గొప్ప అనే భావన బలపడవచ్చును. అలాగే వేలమందిలో మనకు ఒక ప్రత్యేక గుర్తింపు వస్తే, ప్రత్యేకంగా మనసులో భావన సంతోషంతో నిండిపోతుంది. అలాగే మనసు బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు కూడా నాకు మాత్రమే ఇలా జరుగుతుందనే భావనే మన మనసుపై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనకు మాత్రమే ఇలా? అనే ప్రత్యేక భావన బాధకరమైన విషయాలలో వెంటనే మనసులోంచి తొలగించాలని అంటారు.

సమాజంలో అనేకమంది బాగా ఒత్తిడికి గురికావడం జరుగుతుంది.

నిత్యజీవనం ఎప్పుడూ ఒకేవిధంగా కొనసాగదు. సుఖదు:ఖాలు ఉన్నట్టే, అధిక ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మన మనసుపై ప్రత్యేకమైన ప్రభావం చూపించే వ్యక్తులు పరిచయం అవుతారు. అలా ఆయా సంఘటనల లేక ఆయా వ్యక్తుల ద్వారా ఒత్తిడికి గురికావడం వలన, వివిధ కొత్త విషయాలు తెలియబడతాయి. అయితే ముందుగా ఒత్తిడికి గురిచేసే, ప్రత్యేక భావన మన మనసులో బలపడకుండా జాగ్రత్తపడాలి.

వేలమంది బాగా ఒత్తిడితో ఉంటారా? అంటే అవుననే సమాధానం కొన్ని గణాంకాలు పరిశీలిస్తే, తెలియబడుతుంది. ఇందుకు ప్రత్యేకించి పరిశోధన చేయనవసరం లేదు. కేవలం యూట్యూబ్ వీడియోలలో స్ట్రెస్ అవుట్ వీడియోలు ఎంతమంది వీక్షించారో గమనిస్తే చాలు. ఎంతమంది స్ట్రెస్ అవుట్ వీడియోలు చూసి ఉంటే, అంతమంది స్ట్రెస్ కు గురయినట్టే కదా? ఒత్తిడికి దూరంగా అనే వీడియో ఓ కోటిమంది చూసి ఉంటే, కోటిమంది బాగా ఒత్తిడికి గురికావడం జరిగిందని భావించవచ్చును కదా…?

అలాంటప్పుడు మనకు మాత్రమే ఏదో ప్రత్యేకంగా జరిగిపోతుందనే ఆందోళనను మనసులో పెరగనివ్వకూడదు.

అధిక ఒత్తిడికి గురికావడానికి మరొక కారణం

ఈ విషయంలో ఏమో ఎలా ఉంటుందో? ఆ విషయంలో ఏమో ఎలా జరుగుతుందో? భయంగా ఉందనే ఆందోళనాత్మక ఆలోచనలు మనసులో పెరగడం వలన కూడా ఆయా సంఘటనలు జరిగినప్పుడు మనసు ఒత్తిడికి గురికావడం జరగవచ్చని అంటారు.

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మనకు బాగా సహకరించే వ్యక్తులు మనకు మేలు చేయగలరు. ఇంకా మంచి మ్యూజిక్ వినడం. యోగసాధన, ఏకాగ్రతతో ఒక విషయంపై దృష్టిని నిలపడం. తదితర చర్యలతో ఒత్తిడిని అప్పటికీ దూరం చేసుకుని మనసు స్వస్థతకు చేరిన తర్వాత ఒత్తిడికి కారణమైన అంశాలపై దృష్టిసారించాలని సూచిస్తారు.

అతి విశ్వాసం అపనమ్మకానికి దారితీయడం వలన కూడా ఒత్తిడికి గురికావడానికి కారణం కాగలదు.

మనకు అనుభవ పూర్వకంగా తెలిసే విషయ పరిజ్ఙానం మనలో ఒకింత గర్వానికి దారితీయవచ్చును. గర్వం కలిగినప్పుడు అతిశయం కలుగుతుంది. మనలో అతివిశ్వాసానికి కారణం కాగలదు. అతి సర్వత్రావర్జయేత్ అన్నారు. అంటే అతి ఎక్కడా పనికిరాదు. ముఖ్యంగా అంతర్లీనంగా అతి అసలు పనికిరాదని అంటారు. అలాంటి అతిశయం మనసులో ఏర్పడితే, ఏ విషయంలో అయితే అతి ఏర్పడుతుందో అదే విషయంలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు మనసు తీవ్రఒత్తిడికి గురికావడం జరగవచ్చును. అలా అతి విశ్వాసం మనలో అపనమ్మకంగా మారే అవకాశం ఉంటుంది.

అధిక ఒత్తిడికి గురికావడం వలననే వ్యసనాలకు ఆస్కారం ఉంటుంది.

అవును ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వలన, ఏదో ఒక పానీయం స్వీకరించడం లేదా ఏదో కార్యక్రమం అతిగా చూడడం జరగవచ్చును. అదే అలవాటుగా మారి తిరిగి కోలుకోలేని వ్యసనంగా కూడా మారవచ్చును. ఇంకా వ్యసనం వలన సమస్యకు పరిష్కారం కొనుగొనడం మాని సమస్యకు బయపడడం జరగవచ్చును. తద్వారా తనపై తనకు నమ్మకం కోల్పోయే అవకాశం కూడా ఉండవచ్చని అంటారు.

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలాగే మనసుని మనసుతోనే నియంత్రించాలి కానీ దానికి కొత్త విషయం పరిచయం చేస్తే, ఆ విషయంతో అది మమేకం అయితే మనసు గతితప్పుతుందని అంటారు. కావునా ముందుగా బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మన మంచి మిత్రుడితో మాట్లాడేయడం, ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేయడం. మిత్రునితో మాట్లాడిన దూరంకానీ ఒత్తిడి మనసులో ఉంటే, అతి చేరువుగా ఉండే జీవిత భాగస్వామితో పంచుకోవడం. ఒత్తిడి భారం తగ్గించుకోవడం. అయినా తగ్గని ఒత్తిడి ఉంటే, ఖచ్చితంగా మన మనసుతో మనమే పోరాటం చేయాలి. మనసుని అలవాట్ల వైపు వెళ్ళకుండా స్వీయ సాధన చేత దానిని నియంత్రించాలని అంటారు.

ముఖ్యంగా సహజంగా ఏర్పడిన వస్తు విషయాలతో మనసుని నియంత్రించడానికి చూడాలి. అంటే సాయం వేళల్లో ప్రశాంతమైన ప్రకృతితో మమేకం కావడం. దేవాలయంలో దైవ సన్నిధిలో గడపడం. పండితుల మనోవిజ్ఙానపు మాటలు ఆలకించడం. పురాణేతిహాసలలో నీతి కధలు చదవడం. ఇలా మనసు దృష్టిపెట్టాలనే తలంపు మనసులో పుట్టాలి కానీ మనసు మనకు ఓ మంచి మిత్రుడు కాగలడు.

మన మనసు మనకొక మిత్రుడి వలె ఉండాలి.

ఎక్కువగా ఒత్తిడితో ఉంటున్నామంటే, మనసులో ఏదో ఆందోళన చాలాకాలం నుండి ఉంటుందనే విషయం గమనించాలి. కుటుంబంలో తండ్రి ముందు మాట్లాడడానికే భయపడే కొడుకు వలె మన మనసు మనతో ఉంటే, అది విపత్కర స్థితిలో ఇబ్బందికరం. అలా కాకుండా తండ్రితో కొంచె చొరక ఉన్న మిత్రుడి మాదిరిగా మాట్లాడే కొడుకు వలె మన మనసు మనతో మాట్లాడుతుంటే, అదే అద్భుతం అంటారు. అది పరిష్కారం సాధించగలదని అంటారు.

తెలుగురీడ్స్.కామ్