Telugu bhakti Books Free ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… భక్తి గురించిన తెలుగు పుస్తకం ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది
చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి! గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, చర్యలు ఇంకా వాటి పరిణామాల అధ్యయనం మరియు విశేషాల గురించి చరిత్ర మనకు తెలియజేస్తుంది. జరిగిన గొప్ప గొప్ప కార్యాలు, వాటిని సాధించిన ఘనుల గురించి చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది.
సమాజంపై విశేషంగా ప్రభావం చూపిన వ్యక్తుల గురించి, సంఘటనల గురించి, చర్యల గురించి, ప్రకృతి పరిణామాలు, వాటికి గల కారణాలు, ప్రోత్సహించినవారి గురించి చరిత్ర తెలిపుతుంది.
ఒక్కసారి జరిగిన విషయం, దాని వ్యాప్తి మరియు దాని ప్రభావం బట్టి ఆ విషయం గురించి చరిత్ర ఎక్కువమార్లు ప్రజలు తెలుసుకుంటూ ఉంటారు.
చరిత్ర చరిత్రకారుల ద్వారా లిఖించబడుతుంది. గతం తాలూకా జ్ఞాపకాలు పుస్తక రూపంలో చేర్చబడి, లేదా విశ్లేషించబడి, మరల అవి చదవబడి, మరలా వాటిని ఒక భాష నుండి మరొక భాషకు తర్జుమా చేయబడవచ్చు. ఇంకా మరల తిరిగి వ్రాయడానికి, ఔత్సాహికులు ఉద్యుక్తులు కావచ్చును.
కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం చేయడం పుణ్యదాయకంగా చెబుతారు. విశిష్టమైన మాసము కార్తీకమాసము నందు నదీస్నానం, దీపారాధన, కార్తీకపురాణ పఠనం పరమ పుణ్యప్రదంగా చెబుతారు. స్థితికారునికి, లయకారునికి ఇద్దరికీ ప్రీతకరమైన మాసము కార్తీకమాసమని అంటారు.
స్థితికారునికి అల్లుడు, లయకారుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన నక్షత్రం కృత్తికా నక్షత్రం, ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండడం చేత కార్తీకమాసంగా ఈ నెలరోజులు చెబుతారు. స్థితికారునికి, లయకారునికి మరింత ప్రీతికరమైన మాసమే కదా కార్తీకమాసం.
వేకువవేళ నదీస్నానం చేయడం చాలా మంచిదని అంటారు. ఇంకా దీపారాధన చేయడం వలన మనసు మరింత శక్తివంతం అవుతందని అంటారు. అలాగే కార్తీకపురాణం చదవడం, పురాణ విషయంలో ఉన్న సూక్ష్మపరిశీలన చేయడం జ్ఙానదాయకం అంటారు.
కార్తీకమాసములో కార్తీకమాస నియమాలు పాటిస్తూ, కార్తీకపురాణం రీడ్ చేయడం వలన మనసు ఆలోచనలకు సూక్ష్మపరిశీలన అలవరుతుందని అంటారు. ఎక్కువగా కార్తీకమాసంలో సమయం యొక్క గొప్పతనం ప్రస్ఫుటంగా తెలియజేస్తారు.
పుణ్యసమయములలో పుణ్యకార్యం చిన్నదైనను పెద్ద ఫలితమే ఇస్తుందని ఈ కార్తీకపురాణంలో తెలియజేయబడుతుంది. అలాగే వ్యక్తి ఎంత నిష్ఠగా ఉన్నా, తగు జాగ్రత్తగా లేకపోతే, ఆ వ్యక్తి ఎంత క్రిందికి దిగజారుతాడో కూడా తెలియజేస్తుంది.
కార్తీకపురాణం తిధి, సమయం గొప్పతనం తెలియజేస్తుంది.
కార్తీకపురాణంకార్తీక మాససోమవారములు, మరియు తిధి, సమయ యొక్క గొప్పతనం తెలియజేస్తూ, దీపం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. నదీస్నానం ఆవశ్యకతను తెలియజేస్తుంది. అదే సమయంలో కర్మలు చేయడంలో ఎంత నిష్ఠతో ఉంటామో, ఈశ్వరుడి యందు నమ్మకం విషయంలో కూడా మనసు ధృతితో ఉండాలని కార్తీకపురాణం తెలియజేస్తూ ఉంటుంది.
కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం
ఈశ్వరుడి యందు నమ్మకం మాత్రం ఒకే ధృతి భక్తులందరిలోనూ ఉంటుంది. అదే వాడున్నాడు… వాడు లోకములన్నింటికి అధినాయకుడు. వాడే నాకు రక్షణ… సర్వాత్ముడు… సర్వేశ్వరుడు…సనాతనుడు, సర్వభూతములందు ఉండువాడు… అనే ధృతి మాత్రం చాలా బలంగా ఉంటుంది.
అటువంటి భక్తులను భగవంతుడు అనుగ్రహించడంలో మాత్రం భిన్నంగానే ఉంటుంది. మరి భిన్నమైన స్వభావాల వలననేమో కానీ భగవానుడి పరీక్షలు విచిత్రంగా ఉంటాయి. అంతటి పరీక్షలు ఎదుర్కోవాలంటే, ఆ ఈశ్వరుడి అనుగ్రహం తప్పనిసరి.
విద్యార్ధికి పరీక్షా సమయంలో ఇన్విలేజర్ రూపం అంటే పరమభయంగా అనిపిస్తే, వచ్చిన విషయం కూడా పేపరుపై వ్రాయలేడు. అలాగే జీవితంలో కాలం ఇచ్చే పరీక్షలు వ్యక్తి తట్టుకుని నిలబడాలంటే, పరీక్షలు పెట్టే ఈశ్వరుడి గురించి మనకు తెలిసి ఉంటే, ఈశ్వరుడు అంటే భయం ఉండదు. కాలం ఇచ్చే పరీక్షలో కాలానికే పోటీ ఇచ్చేంతలాగా ఉంటుంది. ఉదా: సతీ అనసూయ, సతీ సుమతి… వీరు సూర్యగమనమను నిలబెట్టారు. అంటే కాలాన్ని శాసించారు.
ఇలా ఈశ్వరుడి గురించి గొప్పగాను, మనకు అవగాహన అయ్యేలాగా కధల రూపంలోనూ తెలియజేసే పురాణాలలో విశిష్టమైనది కార్తీకపురాణం… ఈకార్తీకపురాణంలోని కధలు ఆసక్తికరంగా, విచిత్రంగానూ ఉంటాయి. కానీ సూక్ష్మమైన ధర్మమును తెలియజేస్తూ ఉంటాయి. ముఖ్యం దీపారాధన, నదీస్నానం, సమయం యొక్క విశిష్ఠతలను తెలియజేస్తూ ఉంటాయి.
నియమాలు నిష్ఠగా పాటించడమే ప్రధానం, అలా పాటించిన నియమ ఫలితం సంపూర్ణంగా పొందాలంటే, పరమేశ్వరుడిన అనుగ్రహం తప్పనిసరి. ఈశ్వరనామం చాలా ప్రధానమైనది… అలా నియమపాలన ఫలితం పూర్తిగా పొందాలంటే నారాయణ నామం లేక శివనామం కార్తీకమాసంలో పఠిస్తూ, కార్తీకపురాణం చదువుతూ, కార్తీకమాస నియమాలు పాటిస్తే, అవి మనకు మేలునే చేస్తాయని అంటారు.
పరమపుణ్యదాయకమైన ఈ మాసంలో పరమపవిత్రమైన కార్తీకపురాణం ఫ్రీ పిడిఎఫ్ బుక్స్ లింకులు ఈ క్రింది బటన్లకు జతచేయబడ్డాయి… ఆయా బటన్లపై క్లిక్ చేసి, కార్తీకపురాణం తెలుగు బుక్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
మీకు మీ బంధుమిత్ర పరివారమునకు విజయదశమి శుభాకాంక్షలు… ఫ్రీ భక్తి బుక్స్ రీడ్ చేయడానికి… ఆన్ లైన్లో ఉచితగా చాలా తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఫ్రీగా భక్తి బుక్స్ రీడ్ చేయవచ్చును. పిడిఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ క్లిక్ చేసి, గురుకుల్ వెబ్ సైటు సందర్శించవచ్చును.
ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఆచారంలోనే వేకువ వేళ నిద్రలేవడం, వేకువజామునే స్నానం చేసి, ధ్యానం చేయడం వంటివి ఉంటాయి. ఇటువంటి కర్మలను గురించి తెలియజేసే కొన్ని తెలుగు ఫ్రీ పిడిఎఫ్ తెలుగు బుక్స్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లను తాకండి.
ఎప్పటి ఆచారమో ఎంతమంది నుండి ఎంతమందికో వారసత్వంగా వస్తూ ఉంది. సాగుతూ ఉంది. అటువంటి ఆచారములో సందేహాలకు కూడా అవకాశం ఉంటుంది. అటువంటి ధర్మ సందేహాలు గురించి తెలియజేసే తెలుగు భక్తి ఫ్రీ పిడిఎఫ్ బుక్స్ ఈక్రింది బటన్లపై క్లిక్ చేసి రీడ్ చేయవచ్చును.
చనిపోదామని ఆలోచన చేసేవారిని, తమ మాట చేత కట్టడి చేయగలడమంటే, ఎంతో బుద్దివికాసం కలిగి ఉన్నవారికే సాధ్యం. అటువంటి చైతన్యవంతమైన బుద్ది హనుమంతునికి సొంతం. శ్రీరామాయణంలో హనుమంతుడు బుద్దివైభవం కనబడుతుంది.
హనుమంతుడు గురించిన తెలుగు భక్తి బుక్స్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లను క్లిక్ చేయండి.
భక్తులు గురించి తెలుసుకుంటే, భగవంతుడి అనుగ్రహం తెలుసుకునేవారిపై ఉంటుందని అంటారు. ఏదైవం గురించి ఆరాధించే భక్తుడి గురించి తెలుసుకుంటే, ఆదైవరూపంలో భగవానుడి అనుగ్రహం తెలుసుకునేవారికి కూడా కలుగుతుందంటారు. రామ భక్తుడిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, రామానుగ్రహం కలుగుతుంది. అలా శివభక్తులు, భవాని భక్తులు, అయ్యప్ప భక్తులు…
కొంతమంది గురించి, మహా భక్తులు తెలుగు పిఎడిఫ్ ఫ్రీ బుక్స్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లపై క్లిక్ చేయండి.
సంప్రదాయంలో ఋషిరుణం తీరాలంటే, పురాణపఠం చేయాలంటారు. అటువంటి పురాణాలను అందించిన లేక అనువదించిన వారి గురించి తెలుగు బుక్స్…. గురువుల తెలుగు ఫ్రీ పిఎఎఫ్ బుక్స్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్లను క్లిక్ చేయండి.
కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం. ఈ తెలుగు పుస్తకం ఆన్ లైన్ నుండి పిడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ ద్వారా ఈ మూలపుటమ్మగురించిన తెలుగు పుస్తకం డౌన్ లోడ్ చేయవచ్చును.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతి అత్యధిక వార్షికాదాయం ఉండే దేవాలయం అంటే, బెజవాడ దుర్గమ్మతల్లి దేవాలయమే. శక్తిస్వరూపిణి వెలసిన బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది.
ఈ పద్యం ఇక్కడి ఇంద్రకీలాద్రి గోడపై వ్రాయబడి ఉంటుంది. ఈ పెద్ద అర్ధమున్న పెద్దమ్మ గురించి తెలియజేసే ఈ పద్యం మననం చేసుకుంటూ అమ్మను దర్శించుకుంటారు.
ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ. త్రిశక్తికి మూలశక్తిగా చెబుతారు. త్రిశక్తి అంటే త్రిమూర్తుల సతీమణులే. వారు సరస్వతి, లక్ష్మీ, పార్వతి మాతలుగా చెబుతారు. వారికి మూలశక్తిగా ఆదిపరాశక్తిగా ఈ అమ్మలగన్నయమ్మను భక్తులు కొలుస్తారు.
విద్యకు అధిదేవతగా సరస్వతిని, అష్టైశ్వర్యములకు లక్ష్మీని, సకలశక్తికి అధిదేవతగా పరదేవతగా పార్వతిమాతను భక్తులు కొలుస్తారు. మరి ఈ ముగ్గురమ్మలకు మూలమైన పరాశక్తి స్వరూపమును శ్రీకనకదుర్గమ్మను కొలిస్తే, జీవితానికి అవసరమైన అన్ని సౌఖ్యములను అందిస్తుందని అంటారు.
భాగవతం రచించిన పోతనామాత్యుని కులదేవత ఈ అమ్మేనట.
శ్రీరాముని అనుగ్రహంచేత భాగవతం రచించిన పోతనామాత్యుని కులదేవత ఈ అమ్మేనట. భాగవతం చదివితే మోక్షమును అందిస్తుంది. మరి అటువంటి భాగవతం రచనచేయాలంటే, కులదేవత అనుగ్రహం ఉండకుండా రామానుగ్రహం ఎలా కలుగుతుంది? అంటే అమ్మ అనుగ్రహిస్తే, ఆ ఇంటికి సర్వదేవతారక్షణ ఉంటుంది. ఈ విషయం పోతనమాత్యుని గురించి తెలుసుకుంటే తెలియవస్తుందని పెద్దలు అంటారు.
కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం లో అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీకనకదుర్గవైభవమును గురించి వ్రాయబడి ఉంటుంది. ఈ తెలుగుపుస్తకం ఈ క్రింది లింకుద్వారా ఉచితంగా డౌన్ లోడో చేసుకోవచ్చును.
శ్రీరామ నామ జపం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం అంటే వేయి విష్ణు నామాలు పలికినట్టేనని పరమశివుడు, పార్వతీదేవికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయని పెద్దలు అంటారు.
భక్తితో ”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే” ఈ శ్లోక పఠిస్తే వేయిసార్లు విష్ణు భగవానుడి నామాలు చెప్పినట్టు అని అంటారు. సహజంగా కష్టకాలంలో మనసులో మరే ఇతర భావన లేకుండా, చటుక్కున శ్రీమహావిష్ణువును తలవడమే తరువాయి, వచ్చి ఆపదనుండి గట్టెక్కిస్తాడు. అలాంటి శ్రీమహావిష్ణువు నామాలు వేయిమార్లు పలికితే వచ్చే పుణ్యఫలం శ్రీరామ నామం మూడు మార్లు పలికితే వచ్చేయడం అంటే… శ్రీరామనామం యొక్క గొప్పతనం మనకు కనబడుతుంది.
మనసులో ఏభావన లేకుండా కష్టకాలంలో పూర్తి మనసును భగవంతుడిపై పెట్టి, భగవంతుడిని తలవడం జరిగితే, శ్రీమహావిష్ణువు ఏవిధంగా వచ్చి రక్షణ చేస్తాడో మనకు గజేంద్రమోక్షం ఘట్టం నిరూపిస్తుంది.
పదే పదే మారుకి ఒకసారి మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం ద్వారా శ్రీరాముని గురించిన భావనలు మన మనసులో బలపడతాయి. శ్రీరాముని గురించి బలపడిని భావనలు శ్రీరాముని గురించి తెలియజేయబడిన గ్రంధపఠనం వైపు మనసును మళ్ళిస్తాయి. శ్రీరామాయణం మనసు పెట్టి చదివినవారికి శ్రీరాముని గుణగణాలే మనసులో బాగా నాటుకుంటాయి.
శ్రీరాముడు నిలువెత్తు ధర్మస్వరూపంగా చెబుతారు.
శ్రీరామాయణంలో ఒక చోట రావణుడికి శ్రీరాముని గురించి చెబుతూ… ”శ్రీరాముడు నిలువెత్తు ధర్మస్వరూపంగా, నడిచే ధర్మముగా చెబుతారు. అటువంటి శ్రీరామ నామ జపం చేయడం వలన, మన మనసులో ధర్మం గురించిన భావనలు బలపడతాయి.
ధర్మమును రక్షిస్తే, ధర్మము నిన్ను రక్షిస్తుంది. అటువంటి ధర్మమును అడుగడుగునా ఆచరించి చూపిన శ్రీరాముని గురించి జపం చేయడం, తపించడం అంటే ధర్మము గురించి తపించడమే…
ప్రకృతిలో పదార్ధమును పరిశీలించిన ఏవో కొన్ని ధర్మములను కలిగి ఉంటాయి. ఆ పదార్ధము యొక్క ధర్మాలను తెలుసుకోవడం వలన, ఆ పదార్ధమును ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలియవస్తుంది. అలాగే జీవిత పరమార్ధమును చేరుకునే ధర్మమార్గమును ఆచరించినవారి గుణగణాలు తలవడం అంటే, ఆ ధర్మమార్గము మనకు మన జీవితంలో గోచరించే అవకాశం ఉంటుంది.
భగవానుడు అందరినీ ఒకే లాగా అనుగ్రహించడం…. శ్రీరామదాసు, అన్నమయ్య… ఇద్దరూ భగవానుడిని కీర్తించినవారే కానీ ఇద్దరినీ అనుగ్రహించిన తీరు వేరుగా ఉంటుంది. అలాగే అందరి జీవితాలు కూడాను… కాబట్టి మనం ఆ భగవానుడిని పట్టుకుంటే మన జీవితం గురించి సాక్షి అయిన శ్రీరామచంద్రుడే, ఏవిధంగా అనుగ్రహించాలో ఆవిధంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది.
ధర్మమార్గమునకు మన ప్రయత్నం చేయడం మన ప్రధమ కర్తవ్యం. మన జీవితానికి అవసరమైన కర్తవ్యం మనం నిర్వహించుకుంటూనే, మన జీవిత పరమార్ధం గురించి కూడా మన ప్రయత్నం చేయడం మన ధర్మం. అందుకు ముందుగా నామస్మరణ కన్నా మేలైనది లేదు అంటారు.
పోతనమాత్యుడు రచించిన భాగవతం శ్రీరామునికే అంకితం
బమ్మెర పోతరాజు రచించిన భాగవతం, ఎక్కువగా శ్రీమహావిష్ణువు గురించి, శివుడి గురించి ఉంటే, అలాంటి భాగవత రచనకు దైవానుగ్రహం శ్రీరాముని రూపంలో జరిగింది. భాగవతం రచించిన పోతనామాత్యులు పరమ రామభక్తుడు… చివరికి భాగవతం శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అంటే శ్రీరాముడు అనుగ్రహిస్తే శ్రీమహావిష్ణువు, పరమశివుడు అనుగ్రహం పొందినట్టే.
హరిహరుల అనుగ్రహం సులభంగా పొందాలంటే, శ్రీరామ నామ జపం మూడు మార్లు పదే పదే తీరిక వేళల్లో చేయడం మేలు అంటారు. మరీ ముఖ్యంగా శ్రీరాముడు కష్టకాలంలో ఓ మాములు మనిషిలాగానే దు:ఖించడం కనబడుతుంది.
మన కష్టకాలంలో తోటివారి మాటలు ఓదార్పు ఎలా ఉంటుందో… శ్రీరామాయణం చదివితే, రాముని మనసు మన మనసుకు మరింత దగ్గరవుతుందని అంటారు. అందుకే శ్రీరామ నామ జపం పదే పదే చేసి, శ్రీరామచంద్రుని గురించి భావనలు బలపడ్డాక, శ్రీరామాయణం చదువుతుంటే, శ్రీరాముడే మనసులో కొలువై ఉంటాడని అంటారు. ముందుగా శ్రీరామ నామ జపం మనస్ఫూర్తిగా, భక్తితో, నమ్మకంతో చేయడం అలవాటు అయితే, శ్రీరాముని అనుగ్రహం కలుగుతుంది.
పరీక్షత్తు మహారాజు తొలిసారిగా కలిబారిన పడ్డ మహారాజు. ధర్మరాజుకు మనవడు, ఉత్తర – అభిమన్యుల బిడ్డ. భారతం ప్రారంభం ఈయన పుత్రుడు తలపెట్టిన సర్పయాగంతో పాండవుల గురించి చెప్పబడుతుంది. ఈ పరీక్షత్తుమహారాజు వలననే శ్రీమద్భాభాగవతం ప్రవచించబడింది.
కలియుగ ప్రారంభంలో కంటబడ్డ కలిపురుషుడుని తరిమివేయబోయాడు. అయితే కాలానుసారం కలిని వదిలేశాడు. అటువంటి మహారాజు కలిబారిన పడి, తన మృత్యువును తానే కొని తెచ్చుకుంటాడు. కలి ప్రభావం మొదటిగా గురైంది.. పరీక్షత్తు మహారాజే...
శ్రీకృష్ణుడుచే రక్షింపబడిన పరీక్షత్తు మహారాజు అంత్యకాలంలో ఆదిదేవుని ప్రవచనములు విని తరించాడు. ఈ ప్రవచనములు శుకబ్రహ్మ చేశారు. అదే మనకు భాగవతం.
పరీక్షత్తు మహారాజు పుట్టుకలోనూ పరమాత్మ సందర్శనం… అలాగే గిట్టే ముందు పరమాత్ముని ఆత్మస్వరూపడుగా సందర్శనం చేసిన మహానుభావుడు.
కలియుగ ప్రారంభం గురించి ప్రస్తావించాలంటే, పరీక్షత్తు మహారాజు గురించి చెబుతారు. భాగవతం చెప్పాలంటే పరీక్షత్తు గురించి చెబుతారు. మహభారతం ప్రారంభంలో పాండవుల గురించి చెప్పాల్సినప్పుడు కూడా పరీక్షత్తు గురించి చెబుతారు. పరీక్షత్తు మహారాజు ఈయన జననం, ఈయన శాపగ్రస్తుడు కావడం, మరణ సమయం వివరిస్తూ ఉంటే తెలుగు బుక్ రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ పై టచ్ చేయండి.
పరీక్షత్తు మహారాజు తొలి కలి బాధితుడు… ధర్మరాజు మనవడు, ధర్మాత్ముడు అయిన పరీక్షత్తు మహారాజులో కలి ప్రవేశించగానే… పరీక్షత్తు మహారాజు బుద్ది భ్రంశం ఎలా అవుతుందో? కర్తవ్యం స్థానంలో అహం ఎలా పెరుగుతుందో? కోపం రావడానికి పెద్దగా కారణాలు ఉండవు. ఇలా మనకు పరీక్షత్తుపై కలి ప్రభావం చూపిన విధానం ప్రవచం వింటే, మంచి విషయాలు తెలుస్తాయి.
ఈ క్రింది ప్రవచనం కలియుగ ప్రారంభంలో కలిప్రవేశం గురించి, ధర్మదేవత వ్యధ చెందడం, పరీక్షత్తు కలిని చెరపట్టడం, కలికి వరాలు ఇవ్వడం. ఆ తర్వాత కలిప్రభావం చేత బ్రాహ్మణ కుమారుని ద్వారా పరీక్షత్తు శాపం పొందడం తదితర భాగవత విషయాలు ఉంటాయి.
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికిపుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది.
భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది. ఆటోమేటిగ్గా ఆసక్తి కూడా వస్తుంది. అంటే ఒక వ్యక్తికి భగవంతుడు అంటే ఆసక్తి ఉంది. ఏ భగవంతుడు అంటే ఆసక్తి? అంటే వినాయకుడు అంటే ఆసక్తి ఉంది.
విఘ్నేశ్వరుడు ఎందుకంటే, ఏ శుభలేఖ చూసిన మొదటగా శ్రీరస్తు, శుభమస్తు అవిఘ్నమస్తు పదాలు కనబడతాయి. ఎవరంటే? వినాయకుడు అంటారు. విఘ్నేశ్వరుడిని చూస్తే, బొజ్జతో బొద్దుగా ముద్దుగా ఉంటాడు. కానీ ఏనుగు ముఖంతో ఉంటాడు. పామును పొట్టకు చుట్టుకుని ఉంటాడు. పరిశీలిస్తే ఒక దంతంతో ఉంటాడు. అంత పొట్ట వేసుకుని లావుగా ఉండేవాడు, చిట్టెలుకపై ప్రయాణం చేస్తాడు. అసలు ఆసక్తికే ఆసక్తి పుట్టించేలా రూపం ఉంటుంది. ఖచ్చితంగా ఆసక్తికరమైన భావన బలంగా ఉంటుంది. ఎందుకలా? గణేషుడు గురించి తెలిపే పుస్తకాలు చదివితే, గణపతి ఎవరు? లంభోధరుడు జననం ఎట్టిది? వినాయకుడు అవతార ప్రయోజనం? ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.
ఇంకొకరికి శివుడు అంటే ఆసక్తి, ఎందుకు?
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…
శివుడు అంటే ఎందుకు ఆసక్తి అంటే, శివుడికి మూడు కళ్ళు ఉంటాయి. కంఠం నీలంగా ఉంటుంది. పాము మెడలో ఉంటుంది. నంది మీద కూర్చుంటాడు. ఎందుకలా అనే దృష్టి వెళ్ళి, శివుడు గురించి తెలుసుకోవాలి. శివుడు ఎందుకలా ఉంటాడనే ఆలోచన, ఆలోచనకు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఇలా శివుడు గురించి కొందరికి ఆసక్తి పెరగవచ్చును.
కొందరికి విష్ణువు అంటే ఆసక్తి పెరుగుతుంది. నాలుగు భుజములు కలిగి ఉంటాడు. నల్లగా ఉంటాడు. పాముపై పడుకుని ఉంటాడు. అవతారములు ఎత్తుతూ ఉంటాడు. అనేక అవతారములతో పూజింపబడుతూ ఉంటాడు. ఎందుకు ఇన్ని అవతారములు ఎత్తాడు. మిగిలిన దేవతలకు లేనన్ని అవతారములు ఈ స్వరూపమునకే ఎందుకు? ఆసక్తికరమైన ప్రశ్న…
ఇక మూడవ ఆయన కానీ మనం మొదలు ఆయన సంకల్పంతోనే… ఆయనకు నాలుగు తలకాయలు ఉంటాయి. ఎక్కడ పూజలందుకోడు.. కానీ సృష్టికర్త. ఆ సృష్టికర్తే బ్రహ్మదేవుడు. నాలుగు తలకాయలు బ్రహ్మదేవుని స్వరూపం చూడగానే ఆయనకు ఎందుకు నాలుగు తలకాయలు అనే ఆసక్తి వస్తుంది. ఇలా ఆసక్తి పెరగడానికి మనకు కనిపించే దైవ స్వరూపములు ఉంటాయి. ఎందుకు దేవతా మూర్తుల అలా ఉంటారంటే, అలా ఉన్నవారిని చూసి ఆసక్తి పెరిగితే ఆలోచనతో జ్ఙానం వైపు మనిషిని మళ్లించడానికే అనే ఆసక్తికరమైన విషయం ద్యోతకమవుతుంది.
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…
భక్తి అనే ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…
ఆసక్తికరంగా ఉండే దేవతా మూర్తులు, వారిపై ఆసక్తి కలగగానే వారి వారి పురాణములు మనకు మనోవిజ్ఙానమును తెలియజేస్తాయి. ఏ పురాణము చూడండి.. మనసు, మనసు చేష్టలు, బలమైన మనసు, బలహీనమైన మనసు, ఆచారం కలిగిన మనసు, ఆచారం లేని మనసు… ఇలా మానసిక పరిస్థితులలో మనసు ఆయుధం ఎలా అవుతుంది. మనసు గురించిన విజ్ఙానమును అందిస్తూ, జీవిత పరమార్ధం గురించి తెలియజేస్తూ ఉంటాయి.
మనసును నియంత్రణలో పెట్టుకుంటే, కష్టంలో దాని పనితీరు బాగుంటంది. మనసు ఆకలికి తట్టుకోవడం అలవాటు అయి ఉంటే, ఉపవాసం చేయగలుగుతుంది. ఆకలికి తట్టుకునే అలవాటు లేకపోతే, ఆకలి తీర్చుకోవడానికి దొంగ కూడా మనిషిని మార్చే అవకాశం మనసుకు ఉంటుంది. అంటే నియంత్రణ అలవాటు అయిన మనసు ఆకలిని తట్టుకుని విజ్ఙతతో వ్యవహరిస్తుంది. ప్రకృతిలో తనకున్న పరిధిలో పరువుగా మనగలుగుతుంది.
Asakti gurinchi teliyajestu devata
ఆసక్తి గురించి తెలియజేస్తూ దేవతా స్వరూపములు గురించి ఎందుకు చెప్పానంటే? ఎక్కువమందికి తెలిసి ఉండే దేవతా మూర్తులు. ఇక పరిశీలన చేస్తే, మనోవిజ్ఙానం వైపు, జీవిత పరమార్ధం వైపు తీసుకువెళ్ళగలిగే పురాణ విజ్ఙానం ఆయా దేవతలపై ఉంటాయి. ఇక భక్తితత్వంలో మనసు ఉపశమనం పొందుతుందని పెద్దల మాట. భక్తి అనే ఆసక్తికిఆయుధంపుస్తకంఅయితే… భక్తి గురించిన పురాణాలు చదవాలనిపిస్తుంది. మనసు అంటే ఏమిటో? తెలుస్తుంది.
సరే ఇక ఆసక్తి ఇంకా ఇతర విషయములపై కలుగుతుంది. చూస్తున్న వస్తువులో గుణం గమనించడం వలన ఏర్పడే ఆసక్తి పరిశీలనాత్మకమైన ఆలోచనలను సృష్టిస్తుంది. ఇటువంటి ఆలోచనలు విద్యాభ్యాసంలో ఎక్కువగా ఉంటే, విద్యార్ధికి విద్యలో క్లారిటీ వచ్చేస్తుంది.
మనిషి ఎదురుగా లేకపోయినా వారితో నేరుగా మాట్లడగలగడం అనే సదుపాయం గలిగిన ఫోనుపై ఆసక్తి వస్తుంది. ఇంకా కొన్ని ఫోన్లు ద్వారా ఎక్కడో ఉన్న మనిషిని చూస్తూ, మాట్లడగలగడం మరింత ఆసక్తికరమైన ఆలోచనను పరిశీలిస్తే కలుగుతుంది. అయితే అలవాటు అయ్యాక అటువంటి పరిశీలన మనిషిలో కొరవడుతుంది. కానీ పరిశీలన చేస్తే, చూస్తున్న మొబైల్ ఫోనులో ప్రపంచం ఎలా కనబడుతుంది? అనే ఆసక్తి కలగక మానదు.
ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన చుట్టూ ఉండే వస్తువులు కానీ మొక్కలు కానీ ప్రదేశాలు కానీ దైవ స్వరూపములు కానీ మనలో ఆసక్తిని కలిగిస్తాయి. మనం పరిశీలన చేస్తే, చాలా విషయాలు ఆసక్తికరంగానే ఉంటాయి.
న్ని విషయాలు, అన్ని వస్తువులు, అన్ని అంశములు అందరికీ ఆసక్తి చూపడానికి మనసు
అయితే అన్ని విషయాలు, అన్ని వస్తువులు, అన్ని అంశములు అందరికీ ఆసక్తి చూపడానికి మనసు ఇష్టపడకపోవచ్చును. కొందరు దైవం అంటే భక్తి ఉంటే, కొందరికి దైవం అంటే భయం ఉంటుంది. కొందరికి దేవుడు ఎక్కడ అనే ఆసక్తి ఉంటుంది. కొందరికి వస్తువులను పరిశీలించడంపై ఆసక్తి ఉంటుంది. కొందరికి వస్తువు పనితీరుపై ఆసక్తి ఉంటుంది. కొందరికి మానవ శరీరం పనితీరు గురించిన ఆసక్తి కలగవచ్చును. కొందరికి కంపూట్యర్స్ అంటే ఆసక్తి పెరగవచ్చును.
ఇలా ఆసక్తి ఏర్పడడంలో కొందరికి కొన్నింటిపై ఉంటుంది. కొందరికి దీర్ఘమైన పరిశీలన ఏదో ఒక విషయంలో ఏర్పడుతుంది. ఎలా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. ఈ ఆలోచనే కలిగితే, ఆ భగవంతుడు కనిపించేవరకు ప్రయత్నం ఆగదు. ఇక ఇక్కడ వంద ఆలోచనలు లేవు. నిజంగా భగవంతుడినే చూడాలనే ప్రయత్నం అంతే. స్వామి వివేకానందకు భగవంతుడిని చూడాలి, అనే ఆలోచనతోనే రామకృష్ణ పరమహంసను కలవడం జరిగింది.
మరికొందరికి కంప్యూటర్ ఎలా పని చేస్తుంది. దాని బ్యాక్ గ్రౌండులో ఏం జరుగుతుంది. తెలుసుకోవాలనే ఆసక్తి. అదే తపన, అదే ఆలోచన… దాని గురించి తెలిసినవారి దగ్గర తెలుసుకోవడం, ఆలోచించడం సాధన చేయడం జరుగుతంది. ఇలా సుదీర్ఘమైన ఆసక్తి కొందరికి కలిగితే, వారి ప్రయత్న ఫలితం చాలామందికి మార్గదర్శకం కావచ్చును. ఇందుకు సాయపడే విషయాలలో పుస్తకం ఒక ఆయుధంలాగా ఉంటుంది.
ఎందుకు పుస్తకం ఆయుధం అంటే, అనుభవజ్ఙులు
ఎందుకు పుస్తకంఆయుధం అంటే, అనుభవజ్ఙులు తమన అనుభవ సారమును పుస్తక రూపంలో వివరించి ఉంచుతారు. కొన్ని సంస్థలు ఒక వస్తువు తయారి గురించి, దానికి ఉపయోగపడే మూల పదార్ధముల గురించి, వాటి వాటి గుణములు గురించి విధానములను ఒక పుస్తకరూపంలో మార్చుతారు. ఇలా ఏదైనా విజ్ఙానపరమైన విషయాలు పుస్తకంలోకి మారతాయి.
స్కూలులో పాఠాలు పుస్తకంలో వివరించబడిన విషయాలే. కానీ ఆ పుస్తకం కూడా ఎవరో ఒకరు వ్రాసినదే అయి ఉంటుంది. ఆ వ్రాసినవారికి పుస్తకం చదివే అలవాటు ఉంటుంది.
అంటే పుస్తకం విజ్ఙానం అందిస్తుంది. ఆసక్తిని బట్టి పుస్తకం మరింత అవగాహన కలిగించే విజ్ఙానం అందిస్తుంది. కొత్తగా సృష్టించబడిని విధానం మరలా పుస్తకం అందుకుని భద్రపరిచి భవిష్యత్తులో మరొకరికి అందేవిధంగా మారుతుంది. పుస్తకం ఓ విజ్ఙాన వారధిలాగా మారుతుంది.
దేనిపై ఆసక్తి కలిగితే, దానిపై వివరణలతో కూడిన బుక్స్ నేర్చుకునేవారి ముందుంటాయి. దీర్ఘకాలికమైన ఆసక్తి అందరికీ ఒకలాగా ఉండదు. కానీ అందరిలాగానే ఉంది అంటే అది కేవలం అనుభవించడం వరకే పరిమితం అవుతుంది.
ఎప్పుడూ అన్నం మాత్రమే తినేవారికి కొంచెం బిర్యాని తినిపిస్తే, బిర్యానిపై ఆసక్తి పెరుగుతుంది. మరలా బిర్యాని తినాలనిపిస్తుంది. ఇది అందరికీ కలిగేదే, తిని అనుభవించడం వరకు పరిమితం. కానీ బిర్యాని తయారి ఎలా? బిర్యాని ఎలా చేస్తారు? ఇది కొందరికి నేర్చుకునేవరకు పరిమితం. ఆసక్తి ఎక్కడవరకు పరిమతం అయితే అక్కడి వరకు మనసు విషయసంగ్రహణం చేస్తుంది.
Aasakti andariki untundi kani
ఆసక్తి అందరికీ ఉంటుంది. కొన్ని విషయాలలో అనుభవించడం వరకు పరిమితం అయితే ఏదో ఒక విషయంలో పూర్తిగా తెలుసుకునేవరకు ఉంటుంది. ఇలా ఒక విషయంలో పూర్తిగా తెలుసుకునేవరకు ఉండే, ఆసక్తికిఆయుధంపుస్తకంఅయితే… అవగాహన చేసుకోవడమే తరువాయి విషయసంగ్రహణం చేయవచ్చును.
ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…
చంద్రుడు అత్యంత ఆసక్తికరమైన స్వరూపము. ఎందుకంటే చంద్రుడు మన కంటికి కనబడతాడు. ఈయన గురించి పురాణములలో చెప్పబడి ఉంది. ఇంకా మనకు ఉన్న తిధలు, చంద్రగమనం ఆధారంగానే సాగుతుంది. ఇంకా చంద్రుడు ఒక ఉపగ్రహంలాగా మనకు పుస్తకములలోనూ పరిచయం ఉంటుంది. పౌర్ణమి రోజున పూర్ణ చంద్రుడు మనసును ప్రభావితం చేస్తాడు. ఆరోజు చంద్రుడిని చూస్తూ ఆనందించేవారు ఉంటారు.
పరిశీలిస్తే ప్రకృతి చాలా ఆసక్తి. మనసులో కలిగిన ఆసక్తి బలం బట్టి ఆసక్తి మనకు విషయ పరిజ్ఙానం అందిస్తుంది. ప్రకృతిలో మన మనసు చూపించిన ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… మనసు దృష్టి సారించిన ఆసక్తిలో ఎంతో విషయ సేకరణ చేయవచ్చును. పుస్తకపఠనం విజ్ఙానంతో చెలిమి చేయడం వంటిది అంటారు. ఉపయోగించుకుంటే ఆసక్తి బలం.
భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. సర్వదేవతా భజనలు, రామభజనామృతము, సీతారామ భజన తదితర తెలుగు పుస్తకాలు… సర్వదేవతా భజనలు బుక్ లోని కొన్ని భజన పద్యాలు.
రామ భజనామృతము తెలుగు బుక్ నందు భజన పాటలు మన మనసుకు తేలికగా వచ్చేసేలాగా ఉన్నాయి.
భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా
భజనలు చేయవే ఓ మనసా సీతారాముల భజనలు చేయవే ఓ మనసా అయోధ్య రాముని భజనలు చేసి ఆనందం పొందవే ఓ మనసా ఆత్మానందం పొందవే ఓ మనసా || ధశరధరాముని భజనలు చేసి దిగ్విజయం పొందవే ఓ మనసా దివ్యానందం పొందవే ఓ మనసా|| కౌసల్య రాముని భజనలు చేసి కృపానందం పొందవే ఓ మనసా కైవల్యం పొందవే ఓ మనసా|| అహల్య రాముని భజనలు చేసి ఆనందం పొందవే ఓ మనసా పరమానందం పొందవే ఓ మనసా|| భార్గవ రాముని భజనలు చేసి భక్తిని పొందవే ఓ మనసా బ్రహ్మానందం పొందవే ఓ మనసా ||
కళ్యాణ రాముని భజనలు చేసి కటాక్షం పొందవే ఓ మనసా కైవల్యం పొందవే ఓ మనసా|| సీతారాముల భజనలు చేసి సంతోషం పొందవే ఓ మనసా సరోజదళముల పూజలు చేయవే ఓ మనసా||
నన్ను కన్నతల్లి నా భాగ్యమా సీతమ్మ తల్లి జనకరాజ తనయే నిన్ను నమ్మితమ్మ నా దైవమా రఘునాధ ప్రియే సూర్యవంశరాణి నా మొరలు వినవే సరోజాక్షి సౌమిత్రి పూజిత అయోధ్యారాణి కరుణచూపు తల్లి కమలలోచనీ కౌసల్య కోడల రఘు వంశోద్ధారి.
పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు చదవడం అలవాటు అయితే, మంచి బుద్దులు అబ్బుతాయని అంటారు. సహజంగా పిల్లలకు కధలంటే ఆసక్తి ఉంటుంది. కధలలోని సారంశం గ్రహించడం పిల్లలకు అలవాటు అయితే, అదే అలవాటు నిత్య విద్యలో కూడా అలవాటు పెరుగుతుంది.
అన్ని అలవాట్లుకు పరిమితులు చెబితే, విద్య నేర్చుకోవడంలో పరిమితులు చెప్పరు. వినయంతో కూడిన విద్య ఎంతవరకైనా తెలుసుకోవచ్చును. పిల్లలకు అవసరమైన వినయవిధేయతలు చిన్ననాడే బలంగా నాటుకోవాలని అంటారు. ఇందుకు తరచుగా వాడే మాటలు ‘మొక్కై ఒంగనిది, మానై ఒంగునా‘ అని అంటారు.
చూసి నేర్చుకునే వయస్సు నుండి చదివి నేర్చుకునే వయస్సులో కధల పుస్తకాలు, నీతి కధలు పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. పిల్లలకు విమర్శించేవారి కన్నా, నియమాలు పాటిస్తూ రోల్ మోడల్ గా జీవించి వ్యక్తుల పరిచయం అవసరం. మొదటగా తల్లిదండ్రులే పిల్లలకు మోడల్ గా కనబడతారు.
పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు
తండ్రి ఏ విషయంలో సమాజంలో పాపులర్ అయ్యి ఉంటే, అదే విషయంలో ఆ తండ్రి ఆ పిల్లవానికి రోల్ మోడల్ గా ఉంటారు. ఆ విషయంలో తన తండ్రే తనకు హీరో. కొందరు పిల్లలు వెంటనే అనుసరించడం కూడా మొదలు పెడతారు. అందుకే పిల్లల విషయలో తండ్రి పెద్ద హీరోగా ఉంటాడు.
తెలుగు కధలు పుస్తకాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి.
దురదృష్టం కొలది తండ్రికి దురలవాట్లు ఉంటే మాత్రం వాటిని పిల్లలకు తెలియకుండా పెద్దలు జాగ్రత్త పడాలి. కారణం… పిల్లలకు అనుసరించడమే అలవాటుగా ఉండే వయస్సులో తండ్రి ఏంచేస్తే అదే చేసే అవకాశం కూడా ఉంటుంది.
అనుసరించే వయస్సులో ఏది అనుసరించాలి? ఏది అనుసరించ కూడదనే విషయంలో తల్లిదండ్రుల ఇచ్చే క్లారిటీతో బాటు పుస్తకాలు తెచ్చే ఆలోచనా విధానం కూడా పిల్లలకు ఉపయోగం. పుస్తకాలలో ఉండే నీతి కధలలో సారంశం పిల్లలలో వికాసం పెంచుతుంది. స్పూర్తిని పెంచే తెలుగు పుస్తకాలు చదవడం వలన కూడా పిల్లలకు మంచి బుద్దులు పెరుగుతాయి.
స్కూలు విద్యకు వెళుతున్నవారు స్కూల్లో స్నేహితుల ద్వారా విషయ విజ్ఙానం పెంపొందించుకుంటూ ఉంటారు. సామాజిక పోకడలలో వీరు కొన్నింటిని అనుసరించే అవకాశం కూడా స్కూల్ స్నేహితుల ద్వారా ఏర్పడే అవకాశం ఉంటుంది. స్కూలుకు వెళ్ళే పిల్లలకు నీతి కధల పుస్తకాలు మేలును చేకూరుస్తాయి.
స్పూర్తిదాయకమైన వ్యక్తుల కధలు, ధర్మాత్ముల గురించి వివరించడం వలన పిల్లలకు
Children needed models rather than critics.. అంటే పిల్లలకు విమర్శకుల కన్నా మోడల్స్ అవసరం ఎక్కువ. Children are great imitators… అనుసరించడంలో పిల్లలకన్నా ముందుండేవారు ఉండరు.
పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు
వినే వయస్సులో చెప్పేవారు చెప్పే మంచి మాటలు వినేవారికి బాగా నాటుకుంటాయి. కధలు విని పడుకోవడం అనే అలవాటు పిల్లలకు ఉంటే, నీతి కధలు, స్పూర్తిదాయకమైన వ్యక్తుల కధలు,ధర్మాత్ముల గురించి వివరించడం వలన పిల్లలకు ఆయా గుణములపై ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి వారి జీవితానికి ఎంతో మేలునే చేకూరుస్తాయని అంటారు.
స్పూర్తిదాయకమైన వ్యక్తుల గురించిన కధలు వినడం వలన స్ఫూర్తి గురించిన ఆలోచన పిల్లలలో పెరుగుతుంది. స్ఫూర్తిదాయకమైన విషయాల గురించి ఆలోచన కలుగుతుంది. ధర్మాత్ముల గురించి వివరించడం వలన ధర్మము యొక్క గొప్పతనం తెలియబడుతుంది. ధర్మాత్ముల జీవితం గురించి తెలిసి ఉండడం వలన, మనసు చెదిరే వయస్సుకొచ్చేటప్పటికీ మనసులో మనసుపై నియంత్రణ ఉండే అవకాశం ఎక్కువ అంటారు.
ధర్మమును ఆచరించి సమాజంలో మంచి పేరు సంపాదించుకున్న ధర్మాత్ముల గురించి పిల్లలకు వివరిచడం తప్పనిసరిగా చేయాలని అంటారు. అలాగే స్ఫూర్తిదాయకమై జీవన కొనసాగించి, సమాజం చేత గుర్తింపు పొందినవారి గురించి కూడా పిల్లలకు తెలియజేస్తూ ఉండడం మరొక మేలైన విషయంగా చెబుతారు.
Children our most valuable resources… పిల్లలు మన విలువైన వనరులు…. నేటి పిల్లలే రేపటి పౌరులు…
నేటి పిల్లలే రేపటి పౌరులు… నేడు పిల్లలుగా ఉండేవారు ఎదుగుతూ నేర్చుకునే విషయాలతో పౌరులుగా మారతారు. పిల్లలు ఏవిధంగా పౌరులుగా మారతారో ఈ మూడు విషయాలు కీలకం అవుతాయి. నేర్చుకునే వయస్సులో ఎటువంటి విషయాలు చూస్తున్నారు? ఎటువంటి విషయాలు అనుసరిస్తున్నారు? ఎటువంటి విషయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు?
పిల్లలు నేర్చుకునే వయస్సులో అనుసరణ ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. వారు అనసరించడానికి అతి దగ్గరగా ఉండే మోడల్ అంటే, ఆ పిల్లవాని తండ్రే. తండ్రికి మించిన మోడల్ పిల్లలకు అంతదగ్గరగా మరొకరు ఉండరు. తల్లి ప్రేమతో పిల్లవానికి చాలా విషయాలు తెలియజేస్తుంది. అయితే ఆచరణకు తండ్రి విధానం మోడల్ గా మారుతుంది.
నేడు మంచి విషయాల ద్వారా మంచి వ్యక్తిత్వం ఏర్పరచుకుని ఓ మంచి పౌరుడిగా మారితే, అతను సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు. సమాజానికి మేలు చేసేవారంత వనరుగానే ఉంటారు.
మంచి పౌరునిగా మారబోయే పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. వివిధ రకాల తెలుగులో గల పిడిఎఫ్ పుస్తకాల లింకులు ఈక్రింది బటన్లను క్లిక్ చేయడం ద్వారా రీడ్ చేయవచ్చును.
శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా పుస్తకం చదువుతున్న మనసు ఏకాగ్రత దృష్టితో పుస్తకంలో వ్రాయబడిన విషయాలతో మమేకం అవుతుంది.
ఎక్కువగా పుస్తకం చదివేటప్పుడు అందులోని విషయంపై ఆసక్తిని బట్టి, ఆ పుస్తకంపై ఏకాగ్రతా దృష్టి ఏర్పడుతుంది. కానీ కేవలం పుస్తకం చూస్తూ పేజీలు తిరగేయడం వరకే పరిమితం అయితే పుస్తకంలో వ్రాయబడి ఉన్న విషయం పూర్తిగా అవగతమవదు.
పుస్తకం చూస్తూ ఉంటే, అందులో దేని గురించి వ్రాయబడి ఉన్నదో తెలియబడుతుంది, క్లుప్తంగా తెలుస్తుంది. కానీ దానిని పూర్తిగా చదివి అవగాహన చేసుకుంటే, ఆ పుస్తకములోని విషయ సారం తెలియవస్తుంది.
పుస్తకంలోని రచయిత ముందుమాట చదివితే పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం తెలియబడుతుంది. పుస్తకం చదివితే పుస్తకంలోనివిషయసారం అవగతమవుతుంది.
ఆకట్టుకునే విధంగా ఒక వస్తువు ఉంటుంది. ఆకట్టుకునే విధంగా ఒక వీడియో ఉంటుంది. ఆకట్టుకునే విధంగా ఒక సినిమా ఉంటుంది. కానీ పుస్తకం మాత్రం విషయ విశ్లేషణతో ఉండి, ఆకట్టుకోవడంలో మిగిలిన మీడియా కన్నా వెనుకే ఉంటుంది. అయితే విజ్ఙాన పరిజ్ఙానం ఎక్కువగా విశ్లేషించబడేది పుస్తకాలలోనే అంటారు.
యాధాలాఫంగా ఒక బుక్ చూడడం అంటే, యాధాలాఫంగా యూట్యూబ్ వీడియో చూసినట్టే. పనిగట్టుకుని ఒక బుక్ కోసం వెతికితే, ఏరికోరి నచ్చిన సినిమా చూసినట్టే.
ఎందుకంటే యధాలాఫంగా చూసే వీడియో అయినా మనకు అవసరంలేని సమయంలో అంతగా ప్రధాన్యత మన మనసు ఇవ్వదని అంటారు. అలా కాకుండా ప్రత్యేకించి ఒక వీడియో కోసం వెతికితే, ఆవీడియో ఆసాంతం చూస్తూ ఉంటాం. అలాగే ఏదో యాధాలాఫంగా పుస్తకం చూస్తే, ఆ బుక్ చదవాలని అనిపించకపోవచ్చును.
బాల్యంలో మనసు మాట విని ఉండకపోవచ్చును కానీ పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది.
ఏదైనా ఒక అంశములో ఒక పుస్తకం చదవాలనే కోరిక మనసులో మెదిలితే… ఆబుక్ చదవడానికి మనసు సమాయత్తం అవుతుంది. జీవితంలో బ్రతకడానికి ఉపాధి కోసం చదువుకున్న చదువులో కూడా బాల్యంలో మనసు మాట విని ఉండకపోవచ్చును. పెద్దల ప్రోత్సాహంతోనో, పెద్దల భయంతోనో చదువుపై శ్రద్ధ పెట్టి ఉంటాము.
అయితే జీవితంలో ఉపాధి కొరకు మాత్రమే కాకుండా పుస్తకాలు ఇంకా ఇతర విషయాల వలన కూడా ఇతర పుస్తకాలు చదివే వయస్సు వస్తుంది.
ఉద్యోగం చేస్తున్న రంగంలో ఇంకా విజ్ఙానం అవసరం అయితే మరిన్ని పుస్తకాలు చదవడం తప్పదు. అయితే జీవితంలో కాలక్షేపంగా పుస్తకాలు చదివే అలవాటు కూడా కొందరికి ఉంటుంది. మొదట్లో చందమామ కధలు, లేక సాహిత్యం గురించిన పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది.
కొందరికి వార పత్రికలు, మాసపత్రికలు చదివే అలవాటు ఉంటుంది. ఏదైనా పుస్తకాలు చదివే అలవాటు కొందరికి బాగానే ఉంటుంది.
ఎన్ని చదివినా ఏదో ఒక కొత్త ఆలోచనను మనసు సృష్టించే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఆలోచనను సృష్టించే మనసు గురించి చదివితే.. అదే ఒక చిత్రంగా ఉంటుంది.
కనబడని మనసు బౌతికంగా ఉండే మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మనసు ఎంత బలంగా ఉంటే, అంత ప్రతిభావంతంగా కార్యాలు నెరవేరతాయి. కోరికలు తీరతాయి. మనసు అంటే ఆలోచనను కల్పించేదిగా చెబుతారు.
అటువంటి బలమైన మనసు గురించి చదివితే, మానసిక అశాంతి ఉండకపోవచ్చును. ఎందుకంటే మనసు ఎక్కడ ఉంటుందో? దేనిని ఆధారంగా చేసుకుని పనిచేస్తుందో? దానిని తెలుసుకుంటే, ఇక తెలుసుకోవడానికి ఏమి లేదు, అంటారు.
మనోవిజ్ఙానం మన భారతీయ విజ్ఙానంలో ప్రభావంతమైన విషయం
మనోవిజ్ఙానం మన భారతీయ విజ్ఙానంలో ప్రభావంతమైన విషయం. మనసుని నియంత్రిస్తే, లోకంలో కార్యం సాధించడంలో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అంటారు. అంత బలమైన మనసుకు పుస్తకం చదివే అలవాటు ఉండవచ్చును, ఉండకపోవచ్చును. కానీ దానిని గురించి వీడియో ప్రవచనాలు చూసిన మేలు అంటారు.
పుస్తకం మనకు విజ్ఙాన విషయాలను అందిస్తుంది. పుస్తకం భక్తిని గురించి తెలియజేస్తుంది. పుస్తకం మనకు సమాజం గురించి తెలియజేస్తుంది. ఏదైనా లోకంలో విజ్ఙాన విధానం ఉంటే, అది పుస్తక రూపంలో మార్చబడి లేక మార్చుతూ ఉంటారు.
విజ్ఙానం ముందుగా పుస్తకంలోకి మారి, మరింతమంది విద్యార్ధులకు చేరువ అవుతుంది. అటువంటి పుస్తకం ఉపాధి లబ్ది చేకూరాక కూడా మనోమయమైన పుస్తకాలలో మంచితత్వవిజ్ఙానంకలిగినపుస్తకం ఏదైనా ఒక్కటి ఎంపిక చేసుకుని చదవుకోవడం మంచి అలవాటుగా చెబుతారు. అలా శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. తద్వారా విషయాలపై అవగాహన పెరుగును.
శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది
తత్వతహా, భక్తి పరంగానూ మనకు మంచి విజ్ఙానం అందించే పుస్తకాలలో ముందుండేది.. భగవద్గీత…భగవానుడు, భక్తుడికి బోధించిన గీత… విశేషమైన విషయ పరిజ్ఙానం అందిస్తుంది. ఇంకా భగవద్గీతతో బాటు వివిధ పురాణ పుస్తకాలు కూడా మనకు మనసు గురించి, నియమాల గురించి తెలియజేస్తూ ఉంటాయి.
విగ్రహం చూడడంలోనే నిగ్రహం పాటించడం ఉంది. అటువంటి విగ్రహ స్వరూపముల గుణగణాలను వివరించే పురాణ పుస్తకాలు మనోనియంత్రణకు గురించే తెలియజేయబడతాయి. నిగ్రహం ఉండడం వలన భగవంతుడినే చేరవచ్చని, నిగ్రహం కోల్పోవడం వలన భగవంతుడి వద్ద నుండి దిగజారిపోవడం ఎలా ఉంటుందో… వివిధ పురాణ గాధలు తెలియజేస్తాయి. అంటే విగ్రహ స్వరూపములు చెప్పేది నిగ్రహంగా ఉండమనే….
విగ్రహం చూస్తూ నిగ్రహం అలవాటు చేసుకోమనడంలోనే మనకు మనోవిజ్ఙానం ఆచరణాత్మకంగా దేవాలయాల ద్వారా తెలియజేస్తే, ఆయా దేవతా పురాణా మరింత మనోవిజ్ఙానం అందిస్తాయి.
దు:ఖంతో ఉండే మనసు త్వరగా స్వస్థతను కోల్పోయి, నిగ్రహం తప్పుతుందని అంటారు. అలాంటప్పుడు భగవంతుడిని గుర్తుకు తెచ్చుకుని నిగ్రహంగా ఉండమంటారు. మనసులో నిగ్రహం ఏర్పడడానికి విగ్రహ స్వరూపాలు ద్వారా మన మనసులో వివిధ దేవతామూర్తులను దేవాలయాలు చేరుస్తూ ఉంటాయి.
అలాంటి దేవాలయములలోని దేవతల గురించి, ఆయా దేవతల పురాణ పుస్తకాలు చదవడం వలన మనసు శాంతిగా ఉంటుందని అంటారు. ఈ తెలుగురీడ్స్.కామ్ ద్వారా ఉచితంగా లభించే తెలుగు పుస్తకాల లింకులు పోస్టులలోనూ, పేజిలలోనూ జత చేయడం జరిగింది. ఈ క్రింది బటన్ టచ్ లేక క్లిక్ చేసి ఉచిత భక్తి పుస్తకాలు చదవవచ్చును, లేక డౌన్ లోడ్ చేయవచ్చును.
వ్యక్తి శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది… ఆప్రకారం అందులోని విషయం మనసులోకి బాగా చేరుతుంది.
అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్ చదవడానికి ఈ పోస్టు చివరలో ఉన్న బటన్ పై క్లిక్ చేయగలరు.
అయ్యప్ప అనగానే నియమాల మాల మదిలో మెదులుతుంది. నియమంగా మాలధారణ స్వీకరించి, నియమంగా నిద్రలేచి, నియమంగా స్నానాది కార్యక్రములు చేసి, నియమంగా పూజచేసి, నియమంగా వడి చేసి, నియమంగా భిక్ష చేసి, నియమంగా స్వామిని ఆరాధిస్తూ, నియమంగా నిద్రకు ఉప్రక్రమించడం…
ఆహార నియమాలు, నిద్ర, నియమానుసారం క్రమం తప్పకుండా చేస్తూ స్వామిని ఆరాధించడంలో భక్తి పారవశ్యంతో ఉండడం ప్రధానంగా మాలలో కనబడుతుంది. మాల ధరించినవారు అయ్యప్పగానం చేస్తూ ఉంటే, వారితో బాటు వారిని చూస్తున్నవారు కూడా నిద్రాహారాలు మరుస్తారు. అయ్యప్ప అనగానే నియమమే ప్రధానంగా కనబడుతుంది.
హరిహరుల సుతుడు అయ్యప్ప ఎందరికో ఆరాద్య దైవం. నియమం తప్పే కాలంలో నియమాలతో కూడిన ఆహార పద్దతి, నిద్ర శరీరానికి, మనసుకు బలాన్ని చేకూరుస్తాయని అంటారు.
అలా ఆలోచిస్తే మన భారతీయులకు భగవానుడు అంటే ఉండే అద్వితీయమైన భక్తి భావమును నియమాలు తోడైతే, అవి ఆచరణలోకి వస్తే, అలా ఆచరణ అవసరమైన కాలం ఒక మండలం రోజులు ఉంటే, ఆ ప్రవర్తన మనసుపై ప్రభావం చూపుతుంది. మనసులో పెరిగే సత్వగుణం శరీరమునకు మేలు చేయగలదని అంటారు.
నియమాలలో తీసుకునే సాత్విక ఆహారం, మనసును సత్వగుణంవైపు తీసుకుపోతుంది. ఇంకా వీలైనంతగా భగవధ్యానమునకు వీలు కల్పించే అయ్యప్ప మాల నియమాలు మనిషి మనసుకు మరింత బలాన్ని ఇస్తాయి. సద్భుద్దితో ప్రవర్తించడం వలన శత్రుత్వం కూడా పోయే అవకాశం అధికంగా ఉంటుంది. అయ్యప్ప మాల నియమాల తోరణంగా చెబుతారు.
నియమాలతో మంచి మనసుతో క్రమం తప్పకుండా నిద్రహారాలకు భంగం కలగకుండా, అయ్యప్పనే ఆరాధించడంతో… అయ్యప్ప అనుగ్రహం భక్తులపై పరిపూర్ణంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఎవరైనా చెప్పేది ఒక్కటే మనసు లగ్నం చేయడం ప్రధానం. దైవంపై మనసు లగ్నం చేసి పూజ చేస్తే, అది ఫలిస్తుందని చెబుతారు. మనసు లగ్నం కావడానికే సాత్వికాహారం నియమాలలో ఉంటుందని చెబుతారు.
అయ్యప్పస్వామి చరిత్ర పిడిఎఫ్ తెలుగుబుక్
అనుభవం కష్టాలతో కూడి ఉంటే, వారి ఆలోచనలు సమస్యకు పరిష్కారంగా కనబడతాయి. అలాగే మనస్ఫూర్తిగా నియమాలు పాటిస్తే, వాటి ఫలిత ప్రభావం పూజకు ఉపయుక్తంగా మారుతుందంటారు.
40 రోజుల పాటు ఒక క్రమానుసారం నిద్రాహారాలు తీసుకుంటే, శరీరం కూడా ఆవిధంగా అలవాటు పడే అవకాశం ఎక్కువ. పాటించిన నియమాలు శరీరానికి శక్తిగా మారి ఫలితం ఇచ్చే కాలం కూడా 40 రోజులుగానే చెబుతారు.
నమ్మినవారికి మేలు చేసేవిధంగా మంచి ఆహార నియమాలతో కూడిన మాలధారణ అయ్యప్ప అనుగ్రహం ఉంటేనే స్వీకరించగలం అనేది భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి చరిత్రను గురించి తెలుగు భక్తి బుక్ పిడిఎఫ్ బుక్ రూపంలో ఉచితంగానే రీడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ టచ్ క్లిక్ చేసి అయ్యప్ప స్వామి చరిత్ర పిడిఎఫ్ బుక్ చదవవచ్చును.
లోకంలో సామెతలు చాలా విశిష్టమైనవి, అవి చాలా నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటాయని అంటారు. అలాంటి వాటిలో జన్మానికో శివరాత్రి అంటూ నానుడి ఉంది. మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస కలిగి ఉంటే, అంతకన్నా మరొక అదృష్ట విషయం ఏముంటుంది?
నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనసుకు, ఒక్కరోజులో దేవునిపై ధ్యాస కలగాలంటే, కష్టమే! అందుకనేమో జన్మానికో శివరాత్రి అంటారు. ఏదైనా పండుగ వస్తే, ఆ పండుగ రోజునా ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలతో కొంత కాలాయాపన జరిగితే, చేసే పనిలో ఆటంకం ఉంటే మరికొంత కాలాయాపన ఉంటుంది. కాలాయాపన జరిగిపోతుందనే ఆలోచనతో దేవునిపై ధ్యాస కరువవుతుంది.
అందుకే ముందుగానే రాబోయే పండుగలు గూర్చి తెలుసుకుని ఉండి ఉండాలి అంటారు. మనకున్న వివిధ పండుగలలో వివిధ దేవీదేవతలను పూజిస్తూ ఉంటాం. ఏదేవుని పూజకు ఆయా విధానం ప్రకారం పూజిస్తూ ఉంటాం. పూజావిధానంతో బాటు మన:ప్రవర్తన మరీ ముఖ్యమంటారు. పూజ చేస్తూ ఉన్నప్పుడు ధ్యాస దేవునిపై ఉండి తీరాలి అంటారు. అప్పుడే ఆ పూజకు సరైన ఫలితం ఉంటుందని పండితులు అంటారు.
కావునా ఏ పండుగకు ఏదేవుడుని పూజించాలో ఆ దేవుని పురాణమను విశిష్టముగా చదివితే, ఆ దేవునిపై మనసు మమేకం అవుతుందంటారు. తినగా తినగా వేపాకు తియ్యగా ఉన్నట్టుగా, చదవగా… చదవగా… చదువుతున్న దేవుని మహిమలు మన మనసులో నాటుకుంటాయని అంటారు. ప్రస్తుతం మనకు ముందుకు రాబోయే మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస పెట్టడం ప్రధానమైన విషయం.
పరమశివుని వైభవం శివపురాణము
ముందుగానే పరమశివుని వైశిష్ఠ్యమును తెలియజేసే తెలుగుబుక్స్ రీడ్ చేయడం ద్వారా పరమశివుని వైభవం మనకు అవగతమవుతుంది. శివపురాణం చదవడం వలన మనకు పరమశివుని వైభవం తెలియబడుతుందని పెద్దలు చెబుతారు. శివపురాణం చదవడం వలన నిత్యం శివుడిని తలవడం మనసుకు అలవాటు అయితే, ఆయొక్క అలవాటు వలన మనసు మంచి సమయములలో కూడా పరమశివుడిని మననం చేసుకుని పుణ్యం మూటగట్టుకుంటుందని అంటారు.
మననం మనసుకుండే అలవాటు కావున మననం చేసే విషయాలలో సాత్విక విషయాలు ఉండాలి అంటారు. అలా వివిధ దేవతల మంచి గుణములను తెలియజేసే వివిధ దేవతా పురాణములను రీడ్ చేయడం వలను ఆయా దేవతలపై మనసు మననం చేయడం అలవాటుగా చేసుకుంటుంది. శివపురాణం మంచిగా చదివితే, శివుని వైభవం అర్ధం చేసుకునే మనసు, శివుడిని తలుస్తూ ఉంటుంది. ఆవిధంగా పరమశివుడిని గూర్చి మననం చేసే మనసు, మహాశివరాత్రి పర్వదినాన కూడా మననం చేస్తే, ఆ రోజు పూజావిధానంతో బాటు, మనసంతా శివధ్యాసే ఉంటే, ఆ జన్మకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది? అందుకేనేమో జన్మానికో శివరాత్రి అంటారు.
అంటే మనసులోకి ముందుగా పరమశివుడిని తెచ్చుకుని ఉంటే, ఏదోక శివరాత్రికి మనసంతా శివుడే ఉండి, ఆ మనిషి తరించాడానికి మనసు మేలు చేస్తుంది. మరి మనసుకు పరమశివుని వైభవం తెలియజేసే శివపురాణం గురించిన తెలుగుబుక్రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి లేదా క్లిక్ చేయండి. ఈ మహాశివరాత్రిపర్వదినమునపరమశివునిపైధ్యాస పెట్టడానికి ప్రయత్నిస్తే, రాబోయే మహాశివరాత్రులకు మనసు మరింతగా ప్రిపేర్ అవుతుంది.
శివరాత్రి రోజున ఉపవాసం చేయడంతో బాటు, ఆ రోజురాత్రి జాగరణ చేయడం పరపాటి. అయితే ఉపవాసం చేయడం అంటే ఆహారం మీద ధ్యాస లేకుండా, పరమశివునిపైన మాత్రమే ధ్యాస నిలపడం అంటారు. జాగరణ అంటే నిద్ర కూడా మరిచి పరమశివునిపై ధ్యాసను పెట్టడం అంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినమున పరమశివుని వైభవం తెలియజేసే సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం తెలుగుబుక్ తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.
ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస
చదవడం కన్నా శ్రద్దగా వ్రాయడం వలన బుక్ లో ఉన్న విషయం బాగా అర్ధం అవుతుందని అంటారు. దీని కన్నా శ్రద్దగా వినడం వలన మనసు మరింతగా విషయాన్ని అర్ధం చేసుకోగలదు అంటారు. అలా దేవుని గురించి చదవడం కన్నా ముందు వినడం వలన ఆ దేవునిపై భక్తి బాగా పెరుగుతుంది. అటు తరువాయి ఆయా దేవీదేవతలబుక్స్ రీడ్ చేయడం వలన ఆయా దేవీదేవతలపై భక్తి భావన బలపడుతుంది. అంటే ప్రవచనాలను ఆసక్తితో వినడం ద్వారా భగవంతునిపై ధ్యాస పెరుగుతుంది. అలా ప్రముఖుల ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస పెంచుకోవచ్చును.
ప్రముఖు ప్రవచన కర్తల ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస పెరగడానికి అవకాశం ఎక్కువ. మన తెలుగు ప్రవచన కర్తలలో ప్రముఖులు, ప్రసిద్ద ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఈయన పరమశివుని గూర్చి చెబుతుంటే, మనసు మరు విషయంవైపు మరలదు అంటారు. అటువంటి గొప్పవారి మాటలలో మహాదేవుని గూర్చి వినడం వలన పరమశివునిపై ధ్యాస మరింతగా పెరుగుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు పరమశివుని గురించి అనేకంగా ఉన్నాయి. వాటిలో అష్టమూర్తి తత్వం ప్రవచనాలు చాలా ప్రసిద్ది. అష్టమూర్తి తత్వం గురించి గురువుగారు చెప్పిన ప్రవచనం వినడానికి క్రింది వీడియో చూడండి.
మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస
మహాశివరాత్రి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన ప్రవచనం ఈ క్రింది వీడియో ద్వారా వీక్షించవచ్చును.
మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస
పరమేశ్వరుడుని చేరుట జీవుని లక్ష్యమైతే, పురాణాలు, పురాణ ప్రవచానాలు మార్గం చూపుతాయని పెద్దలంటారు. పరమశివుని గురించి ధ్యాస సాదారణ రోజులలో చదవడం, వినడం ద్వారా అలవాటు చేసుకుంటే, మహాపర్వదినాలలో మనసే మార్గముగా మారిపోతుందని అంటారు.
ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణరచయితవాల్మీకిజయంతి నేడు. వాల్మీకిమహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ తిధి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం తేది మారుతుంది. ఈసారి అక్టోబర్ 13న వచ్చింది. రామాయణ రచయిత అయిన వాల్మీకి గురించిన గాధ ఇలా ప్రాచుర్యం పొంది ఉంది.
బందిపోటు దొంగగా అడవిలో ఉంటాడు. అడవిలో ఆ దారిలో వస్తున్న నారదమహర్షిని కూడా ఆ దొంగ అడ్డగిస్తాడు. అయితే అప్పుడు నారదుడు అతనిని ”నీవు చేస్తున్నది పాపం, ఈ పాపంలో నీ భార్యబిడ్డలకు భాగం ఉందో లేదో తెలుసుకో” అని అంటాడు. దానికి వెంటనే ఆ దొంగ తన ఇల్లాలిని ఇదే విషయం అడిగితే, ఆమె ”నీవు సంపాదించి, తీసుకురావడం నీ ధర్మం, నీ పాపంలో నాకు భాగముండదు” అని చెప్పడంతో ఆ దొంగ మరలా తిరిగి నారదుడిని చేరతాడు.
అప్పుడు నారద మహర్షి అతని వైరాగ్య భావనను గమనించి అతనికి తారకమంత్ర ఉపదేశం చేస్తాడు. అయితే ఆ దొంగకు రామ రామ రామ అనడం కూడా చేతకాకపోవడం వలన రామ అక్షరాలను వెనుక నుండి మర మర అనమని చెబుతాడు. అప్పుడు అతను మర మర మర మర….అంటూ పలుమార్లు ఉచ్ఛరించడం చేత, అది రామా రామా గా మార్పు పొంది, పెద్ద తపస్సులోకి వెళతాడు. అతని తపస్సు పూర్తయ్యేసరిగి అతని చుట్టూ పుట్ట పెరిగిపోయి, అందులోంచి తిరిగి మహాజ్ఙానిగా బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అంటారు.
మహాతపస్సు చేత బ్రహ్మగారి వర ప్రభావంతో నారదమహర్షి సంక్లిప్త రామాయణం విన్న వాల్మీకిమహర్షి ఆరుకాండట శ్రీరామాయణం రచించడం ప్రారంభించి, దిగ్విజయంగా పూర్తి చేసారు. అయితే ఇందులో ప్రత్యేకత ఎవరైనా రచయిత కల్పన చేత పాత్రలను సృష్ఠించగలరు. కానీ శ్రీరామాయణంలోని వ్యక్తుల మనసులోని భావాలను తెలుసుకోగలిగిన వరం పొంది ఉన్న వాల్మీకి రామాయణ రచన అంతా వారి వారి మనోభావాలను యధాతదంగా వ్రాయగలిగారు అని అంటారు.
మానవజీవితాన్ని ఉద్దరించగలిగిన రామాయణం రచించి ఇచ్చిన వాల్మీకి మహర్షి జయంతి నేడు కాగా ఈ వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. మనకు మంచిని ప్రబోధిస్తూ ధర్మాన్ని పట్టుకుంటే భూమి ఉన్నంత కాలం చరిత్రగా ఎలా ఉంటుందో నిరూపించే శ్రీరామాయణం రచించిన వాల్మీకిజయంతిని జరుపుకోవడం ఆనందదాయకం.