కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం చేయడం పుణ్యదాయకంగా చెబుతారు. విశిష్టమైన మాసము కార్తీకమాసము నందు నదీస్నానం, దీపారాధన, కార్తీకపురాణ పఠనం పరమ పుణ్యప్రదంగా చెబుతారు. స్థితికారునికి, లయకారునికి ఇద్దరికీ ప్రీతకరమైన మాసము కార్తీకమాసమని అంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

స్థితికారునికి అల్లుడు, లయకారుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన నక్షత్రం కృత్తికా నక్షత్రం, ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండడం చేత కార్తీకమాసంగా ఈ నెలరోజులు చెబుతారు. స్థితికారునికి, లయకారునికి మరింత ప్రీతికరమైన మాసమే కదా కార్తీకమాసం.

వేకువవేళ నదీస్నానం చేయడం చాలా మంచిదని అంటారు. ఇంకా దీపారాధన చేయడం వలన మనసు మరింత శక్తివంతం అవుతందని అంటారు. అలాగే కార్తీకపురాణం చదవడం, పురాణ విషయంలో ఉన్న సూక్ష్మపరిశీలన చేయడం జ్ఙానదాయకం అంటారు.

కార్తీకమాసములో కార్తీకమాస నియమాలు పాటిస్తూ, కార్తీకపురాణం రీడ్ చేయడం వలన మనసు ఆలోచనలకు సూక్ష్మపరిశీలన అలవరుతుందని అంటారు. ఎక్కువగా కార్తీకమాసంలో సమయం యొక్క గొప్పతనం ప్రస్ఫుటంగా తెలియజేస్తారు.

పుణ్యసమయములలో పుణ్యకార్యం చిన్నదైనను పెద్ద ఫలితమే ఇస్తుందని ఈ కార్తీకపురాణంలో తెలియజేయబడుతుంది. అలాగే వ్యక్తి ఎంత నిష్ఠగా ఉన్నా, తగు జాగ్రత్తగా లేకపోతే, ఆ వ్యక్తి ఎంత క్రిందికి దిగజారుతాడో కూడా తెలియజేస్తుంది.

కార్తీకపురాణం తిధి, సమయం గొప్పతనం తెలియజేస్తుంది.

కార్తీకపురాణం కార్తీక మాస సోమవారములు, మరియు తిధి, సమయ యొక్క గొప్పతనం తెలియజేస్తూ, దీపం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. నదీస్నానం ఆవశ్యకతను తెలియజేస్తుంది. అదే సమయంలో కర్మలు చేయడంలో ఎంత నిష్ఠతో ఉంటామో, ఈశ్వరుడి యందు నమ్మకం విషయంలో కూడా మనసు ధృతితో ఉండాలని కార్తీకపురాణం తెలియజేస్తూ ఉంటుంది.

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం
కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

ఈశ్వరుడి యందు నమ్మకం మాత్రం ఒకే ధృతి భక్తులందరిలోనూ ఉంటుంది. అదే వాడున్నాడు… వాడు లోకములన్నింటికి అధినాయకుడు. వాడే నాకు రక్షణ… సర్వాత్ముడు… సర్వేశ్వరుడు…సనాతనుడు, సర్వభూతములందు ఉండువాడు… అనే ధృతి మాత్రం చాలా బలంగా ఉంటుంది.

అటువంటి భక్తులను భగవంతుడు అనుగ్రహించడంలో మాత్రం భిన్నంగానే ఉంటుంది. మరి భిన్నమైన స్వభావాల వలననేమో కానీ భగవానుడి పరీక్షలు విచిత్రంగా ఉంటాయి. అంతటి పరీక్షలు ఎదుర్కోవాలంటే, ఆ ఈశ్వరుడి అనుగ్రహం తప్పనిసరి.

విద్యార్ధికి పరీక్షా సమయంలో ఇన్విలేజర్ రూపం అంటే పరమభయంగా అనిపిస్తే, వచ్చిన విషయం కూడా పేపరుపై వ్రాయలేడు. అలాగే జీవితంలో కాలం ఇచ్చే పరీక్షలు వ్యక్తి తట్టుకుని నిలబడాలంటే, పరీక్షలు పెట్టే ఈశ్వరుడి గురించి మనకు తెలిసి ఉంటే, ఈశ్వరుడు అంటే భయం ఉండదు. కాలం ఇచ్చే పరీక్షలో కాలానికే పోటీ ఇచ్చేంతలాగా ఉంటుంది. ఉదా: సతీ అనసూయ, సతీ సుమతి… వీరు సూర్యగమనమను నిలబెట్టారు. అంటే కాలాన్ని శాసించారు.

ఇలా ఈశ్వరుడి గురించి గొప్పగాను, మనకు అవగాహన అయ్యేలాగా కధల రూపంలోనూ తెలియజేసే పురాణాలలో విశిష్టమైనది కార్తీకపురాణం… ఈకార్తీకపురాణంలోని కధలు ఆసక్తికరంగా, విచిత్రంగానూ ఉంటాయి. కానీ సూక్ష్మమైన ధర్మమును తెలియజేస్తూ ఉంటాయి. ముఖ్యం దీపారాధన, నదీస్నానం, సమయం యొక్క విశిష్ఠతలను తెలియజేస్తూ ఉంటాయి.

నియమాలు నిష్ఠగా పాటించడమే ప్రధానం, అలా పాటించిన నియమ ఫలితం సంపూర్ణంగా పొందాలంటే, పరమేశ్వరుడిన అనుగ్రహం తప్పనిసరి. ఈశ్వరనామం చాలా ప్రధానమైనది… అలా నియమపాలన ఫలితం పూర్తిగా పొందాలంటే నారాయణ నామం లేక శివనామం కార్తీకమాసంలో పఠిస్తూ, కార్తీకపురాణం చదువుతూ, కార్తీకమాస నియమాలు పాటిస్తే, అవి మనకు మేలునే చేస్తాయని అంటారు.

పరమపుణ్యదాయకమైన ఈ మాసంలో పరమపవిత్రమైన కార్తీకపురాణం ఫ్రీ పిడిఎఫ్ బుక్స్ లింకులు ఈ క్రింది బటన్లకు జతచేయబడ్డాయి… ఆయా బటన్లపై క్లిక్ చేసి, కార్తీకపురాణం తెలుగు బుక్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.