Telugulo vyasam prakriya (Essay Writing Process) వివరంగా

Telugulo vyasam prakriya (Essay Writing Process) వివరంగా

Telugulo vyasam prakriya వివరంగా ఒకమంచి వ్యాసం రాయడానికి ఒక పద్ధతి (writing process) ఉంటుంది. ఒక విషయం గురించి మన ఆలోచనలు, అభిప్రాయాలు, వివరాల్ని సరళంగా, ఓ క్రమపద్ధతిలో అక్షర రూపంలో అందించే ప్రక్రియ.

ఇప్పుడు వ్యాసం ఎలా రాయాలి? ఆ ప్రక్రియ ఏమిటి చూద్దాం!


Telugulo vyasam prakriya విషయం (Topic) ఎంపిక

 ఈ విషయం గురించి రాయదలచామో, దేనిపై స్పష్టత ఉండాలి. ఎక్కువగా సామజిక ప్రయోజనాలు, వ్యక్తిత్వ వికాసం వంటి శ్రేయస్కరమైన అంశాలు, సామజిక సమస్యలు, దీర్ఘకాల ప్రయోజనాల కోసం అవసరమైన మార్పులు, ప్రకృతి పర్యావరణం వంటి ఉపయుక్తమైన విషయాల(topics)ను ఎంచుకుంటారు.

Telugulo vyasam prakriyaలో, మంచి విషయం లక్షణాలు:

  • స్పష్టంగా ఉండాలి, విషయం గురించి పరిచయం చేస్తూ, విషయం యొక్క విశ్లేషణ రాస్తూ, చివర్లో సందేశం.
  • మీకు అర్థమయ్యే విషయం కావాలి. రీడర్స్ కు అర్ధం కావాలి.
  • పాఠకులకు ఉపయోగపడాలి. చదివేవారికి ఉపయోగపడాలి. విషయం గురించి సమగ్ర సమాచారం తెలియాలి…

ఉదాహరణలు:

  • సోషల్ మీడియా ప్రభావం
  • మొక్కలు పెంపకం అవసరం
  • పరిశీలన – ఆసక్తి – సాధన

పై అంశాలు మనపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వలన నష్టాలతో కూడిన లాభాలు ఉంటాయి. మొక్కల పెంపకం వలన భవిష్యత్తులో సమాజ శ్రేయస్సు కోసం చేసేవి. పరిశీలన ఇది వ్యక్తిలో విజ్ఞానం పెంపొందింప జేస్టాయి.


వ్యాసం రాయడానికి సమాచారం సేకరణ (Research)

రాయబోయే విషయం గురించి పూర్తి సమాచారం సేకరించాలి, సమాచారం తెలుసుకుని, దానిపై అవగాహన పెంచుకోవాలి.

సమాచారం ఎక్కడ లభిస్తుంది?

  • పుస్తకాలు
  • వార్తలు
  • ఆన్లైన్ వెబ్ సైట్స్ (వికిపీడియా, యూట్యూబ్ వీడియోలు)
  • మీ అనుభవం

గమనిక: నిజమైన సమాచారం ఉంటే వ్యాసం బలంగా ఉంటుంది.

ఆలోచనల క్రమపద్ధతి (Planning)

Telugulo vyasam prakriyalo ఒక వ్యాసం రాయడానికి ముందు, ఆ వ్యాసం గురించి సేకరించిన విషయాలను, ఎలా రాయాలో ఆలోచనలు చేసుకుని, ఒక ప్లాన్ చేసుకోవాలి.

రాయవలసిన విషయం (writing topic) ఇలా విభజించండి:

  • పరిచయం (Introduction)
  • ప్రధాన భాగం (Body)
  • ముగింపు (Conclusion)

విషయ పరిచయం (Topic Introduction)

ఇది వ్యాసం మొదటి భాగం.

ఇందులో:

  • విషయం పరిచయం చేయాలి
  • వ్యాసం చదువుతున్నప్పుడు, పాఠకుడికి ఆసక్తి పెరగాలి

ఉదాహరణ:
“పర్యావరణ పరిరక్షణ, మన జీవనానికి అత్యంత ముఖ్యమైనది…”


Telugulo vyasam prakriya – ప్రధాన భాగం (Body)

ఇది వ్యాసంలో ముఖ్యమైనది మరియు సమాచారం విశ్లేషణ అంతా ఈ భాగంలోనే ఉండాలి.

ఇందులో:

  • ఎంపిక చేసుకున్న విషయం(selected topic) గురించి వివరంగా రాయాలి
  • విషయంపై ఉదాహరణలు ఇవ్వాలి
  • విషయంలో సమస్యకు కారణాలు, పరిష్కారం వలన ప్రయోజనాలు చెప్పాలి

వ్యాస ప్రక్రియలో ప్రధాన భాగంలో, ప్రతి పేరా ఒక పాయింట్ గురించి ఉండాలి.


వ్యాసం ముగింపు (Article Conclusion)

ఇది వ్యాసం చివరి భాగం.

ఇందులో:

  • ముఖ్య విషయాలను సంక్షిప్తంగా చెప్పాలి
  • ఒక మంచి సందేశం ఇవ్వాలి

ఉదాహరణ:
“మనం బాగుండాలంటే, మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండాలి. వాతావరణం కాలుష్యం తగ్గించడంలో మన పాత్ర ఉండడం చేత, మన తర్వాతి తరం వారికీ మనం చేసే మేలు. మనమందరం పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత.”


వ్యాసం సవరించడం (Editing & Proofreading) – Telugulo vyasam prakriya

రాసిన తర్వాత తప్పులు సరిచూడాలి.

చూసుకోవాల్సినవి:

  • వాక్య నిర్మాణం
  • అక్షర దోషాలు
  • భావం సరైనదా లేదా

మంచి వ్యాసం లక్షణాలు

  • సరళమైన భాష
  • స్పష్టమైన భావం
  • క్రమపద్ధతి
  • ఉదాహరణలు ఉండటం
  • పాఠకుడిని ఆకర్షించడం

సంక్షిప్తంగా

వ్యాసం ప్రక్రియ: – Telugulo vyasam prakriya

  1. విషయం ఎంపిక
  2. సమాచారం సేకరణ
  3. ప్రణాళిక
  4. పరిచయం రాయడం
  5. ప్రధాన భాగం వివరించడం
  6. ముగింపు ఇవ్వడం
  7. సవరణ చేయడం

వ్యాసాలు ఉపయోగాలు.

వ్యాసాలు విషయాలను వివరిస్తాయి… విషయాల గురించి ఆలోచింపజేస్తాయి. విషయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. సమాజంలో సమస్యల తీవ్రతను తెలియజేయడానికి వ్యాసాలు ఉపయోగపడతాయి. ఇవి విద్యార్ధులకు అనేక విషయాలను పరిచయం చేస్తాయి. సమాజంలో వ్యక్తి ప్రభావం, వ్యక్తిపై సమాజం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో? అనేక వ్యాసాలు వలన తెలియజేస్తాయి.

telugureads channel

Great! We’ve received your information.

We couldn’t process your submission. Please retry

Related Posts