రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు

రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు. అంటే ఎవరైనా, ఎప్పుడైనా రావాణాసురుడు మాదిరిగా ప్రవర్తించడం వలన జీవితంలో ఉన్నత స్థానం నుండి దిగువ స్థానానికి పతనం కావడం ఖాయమని అంటారు.

పరస్త్రీని కాంక్షించడం, పరస్త్రీని చెరపట్టడం వ్యక్తి జీవిత పతనానికి నాంది అవుతుందని రావాణాసురుడి జీవితం తెలియజేస్తుంది.

ఎందుకంటే రావణుడు త్రిమూర్తులలో ఒక్కరైన పరమశివునికి భక్తుడు. పరమశివుడు ఇవ్వనిదంటూ ఏమి ఉండదు. అయినను పరమశివుడిని ఒక్కసారి దర్శిస్తే చాలు, జన్మదన్యమని భావించే మునులు, మహర్షులు ఉంటారు. కానీ రావణాసురుడు కైలాసానికే పోయి వచ్చాడు. ఆత్మలింగాన్ని పొందాడు…. కానీ దక్కించుకోలేకపోయాడు.

సకల శాస్త్రములు తెలిసిన రావణాసురుడు తనకు తెలిసిన ధర్మం ఇతరులు పాటించాలని అంటాడు కానీ తాను పాటించడానికి ఇష్టపడడు. అందుచేతనే రావణుడిని రావణాసురుడు అంటారు.

తెలిసిన ధర్మాన్ని ఆచరించకుండా, ఇతరులను వేధించే బ్రతకడం అసుర లక్షణమని అంటారు.

శ్రీరామాయణంలో రావణుడు లంకా రాజ్యానికి అధినేత.

శివునికి పరమభక్తుడైన రావణుడు హరిద్వేషిగా జీవించాడు. తన తపోబలం చేత దిక్పాలకులను సైతం శాసించగలిగేవాడు. కానీ తనలోని అసుర లక్షణాలు చేత, శ్రీరాముని భార్య అయిన సీతమ్మను చెరపట్టాడు.

పరమసాద్వి అయిన సీతాపహరణ చేయడం ద్వారా రావణాసురుడి పతనానికి నాంది పడింది.

సీత ఎడబాటుతో కుమిలిపోయిన రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానర వీరులు మరియు వానర సైన్యంతో లంకకు చేరి, రావణాసురుడిని మట్టుబెడతారు.

చెడ్డవాడు చెప్పినా వినడు… శక్తికి ధర్మం తోడవ్వకపోతే, ఎంతటి శక్తివంతుడైన పతనం కావాల్సిందేనని రావణుడి జీవితం చూస్తే తెలుస్తుంది.

రాముడు తండ్రి మాటను నిలబెట్టడానికి పదునాలుగు సంవత్సరాలు అడవులలో జీవిస్తే, రావణుడు తన చెల్లెలి చెప్పుడు మాటలకు ప్రభావితుడై, మొత్తం కుటుంబం మొత్తం పతనానికి కారణం అయ్యాడు.

రావణుడి వలె ప్రవర్తిస్తే, వ్యక్తికి చెడ్డపేరు రావడమే కాదు కుటుంబానికి హాని కలుగుతుంది. వంశమునకు చెడ్డపేరు మిగిలిపోతుంది.

రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు. అతని ప్రవర్తనను పూర్తిగా పెడచెవిన పెట్టాలి. రాముని ఆచరణను పాటించాలి.

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu