ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు

రాజకీయ సామాజిక పరిస్థితులలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు వీడియోలు చూడడం వలన ప్రస్తుత రాజకీయ పరిణామలపై అవగాహన ఉంటుంది. తెలుగు రాష్ట్రముల రాజకీయ పార్టీలు, జాతీయ రాజకీయ పార్టీల గురించి, ఆయా పార్టీలు నాయకులపై విమర్శనాత్మక విశ్లేషణలు వీడియోల రూపంలో ఉంటాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

రాజకీయం నాయకుల ప్రయోజనాలతో బాటు పార్టీ ప్రయోజనాలు మరియు ప్రజా ప్రయోజనాలు కోసం సాగుతుందంటారు. రాజకీయంగా పార్టీల పొత్తులు పార్టీ ప్రయోజనాలతో బాటు ప్రజాప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక కూటమిగా ఏర్పడుతూ ఉంటారు. నాయకులు పార్టీ వీడడం అంటే వారి రాజకీయ ప్రయోజనంతో బాటు ఆప్రాంత ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పార్టీలు మారుతూ ఉంటారంటారు.

ఏదైనా రెండు పార్టీల కలయిక లేదా పార్టీ వీడడం అనేది వారి ప్రయోజనాలతో బాటు ప్రజల ప్రయోజనాలు భవిష్యత్తు ప్రయోజనాలు కోసం జరుగుతుందంటారు. అయితే జరిగే రాజకీయ పరిణామాల గురించి న్యూస్ చానల్లలో డిబేట్ కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో వివిధ పార్టీలు ప్రముఖులతో బాటు, రాజకీయ సామాజిక విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు.

నాయకులు తమ తమ పార్టీ విధానాలను సమర్ధించుకుంటూ, ఇతర పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ ఉంటే, విశ్లేషకులు ప్రస్తుత విధానంలో పరిణామాలను విశ్లేషిస్తూ ఉంటారు. ఇలా రాజకీయ పరిణామాలలో సామాజిక భవిష్యత్తును విశ్లేషించే వారిలో ప్రముఖంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు విశ్లేషణలు కూడా ఉంటాయి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణలు అన్ని తెలుగు చానల్లలోనూ ఉంటాయి. ఇంకా ఈయనకి ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ఈ చానల్ పేరు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అయితే ఈ చానల్ కు 3లక్షలకు పైగా సబ్ స్కైబర్స్ కూడా ఉన్నారు.

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలతో బాటు కేంద్ర ప్రభుత్వ విధానములను, జాతీయ రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ ఉంటారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చేసిన విశ్లేషణలు కొందరికి నచ్చితే, మరికొందరికి నచ్చవు ఆ విషయంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి వీడియోల కామెంట్లను చూస్తే అవగతం అవుతుంది. ఈయనే చెబుతూ ఉంటారు, నేను నా అభిప్రాయం తెలియజేస్తూ ఉంటాను. అది అందరూ ఇష్టపడకపోవచ్చును అని.

సమాజంలో జరిగే రాజకీయ పరిణమాలలో రాజకీయ నాయకుల రాజకీయ అంతరంగం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు విశ్లేషణల వీడియోలు చూడవచ్చు. న్యూస్ పేపర్ రీడ్ చేయడం కన్నా న్యూస్ చానల్ వాచ్ చేయడంతో సమయం సేవ్ అవుతుందనే వారికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి వీడియోలతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు తెలియవస్తాయి.

ఈ క్రింది వీడియోలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు బిజెపి – జనసేన పొత్తు గురించి ప్రస్తావిస్తూ… ఆయన పవన్ కళ్యాణ్ గారికి తగిన గౌరవం లభించకుండానే బిజెపితో పొత్తు ప్రక్రియ జరిగినట్టుగా విశ్లేషించారు. బిజెపికి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో అంతగా అనుకూలతలు లేకపోయినా, ఎన్నికలు లేని సమయంలో జనసేన బిజెపితో కలిసింది. బిజెపి తెలివైన పనిచేసినట్టుగా విశ్లేషించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన-బిజెపి పొత్తులో రాజకీయ పరిణామాలను విశ్లేషించే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి వీడియోలు చూడవచ్చు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్