తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్

వంద పద్యాలు అంతకన్నా ఎక్కువగా పద్యములు ఉంటే, ఆ పద్యముల సమూహమును శతకముగా చెబుతారు. పూర్వులు రచించిన పద్యములు మనకు శతకములుగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా సామాజిక పరిస్థితులు, నీతి, ఆచరణ, సంప్రదాయములు, భక్తి, ఆరాధన, వ్యక్తి పరివర్తన తదితర అంశములను స్పృశిస్తూ ఉంటాయి. తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లో శతాదిక పద్యములతో కూడి ఉంటాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

భక్తి పారవశ్యంతో కొందరు తమ భావనలను పద్యరూపంలో తెలియజేస్తే, కొందరు సమాజంలో వివిధ వ్యక్తిత్వాలపై తమ భావనలను వెల్లడి చేయడం మనకు శతకాలు తెలుగు పద్యాలలో కనబడుతుంది. ఎక్కువగా భక్తితో కూడిన భావనలను తెలియజేస్తూ, వివిధ దేవతల అద్భుత గుణముల విశిష్టతను భక్తి శతకాలు వెల్లడి చేస్తాయి. ఏభావనతో వెల్లడి చేసినా, తద్భావన ఎంతో లోతైన భావం కలిగి ఉంటాయి. ఇంకా శతక పద్యములు చిన్న పద్యములుగానే ఉన్నా గుణాత్మక మార్పును సూచిస్తూ ఉంటాయి అంటారు.

తెలుగులో శతకముల తెలుగుబుక్స్

శతకములు అనగానే మనకు గుర్తుకు వచ్చేవి వేమన శతకం, సమతీ శతకం, దాశరధి శతకం, భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం. కానీ పూర్తిగా మనం చదువుకున్న పాఠ్యపుస్తకాలలో ఉండవు, బాగా ప్రసిద్ది చెందిన పద్యాలే ఉంటాయి. కవులు భక్తి పారవశ్యంతో చేసిన శతకాలు మనలోను భక్తిని పెంపొందిస్తాయి. అలాగే ఇంకా మనకు మరిన్ని శతకాలు కూడా ఉన్నాయి. తెలుగు కవులు రచించిన శతకాలు మనకు మరిన్ని ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ తెలుగుబుక్స్ రూపంలో లభిస్తున్నాయి. మారుతి శతకం, మూకపంచశతి కటాక్ష శతకం, నరసింహ శతకం, భర్త్రుహరి శతకం, కుమారి శతకం, కమార శతకం, కృష్ణ శతకం, ఆంధ్ర నాయక శతకం ఇలాంటి శతకాలు మరిన్ని అందుబాటులో ఉన్నాయి. భక్తిని, ఆలోచనను రేకెత్తించే ఈ శతకమాధుర్యాలు ఉచితంగా చదవాలంటే ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

వేమన శతకంలో వేమన ఎక్కువగా వ్యక్తి, సమాజంలో వ్యక్తి వ్యవహారం ఎలా ఉంటుందో? సూచిస్తూ ఉంటాయి. పురుషలందు పుణ్యపురుషులు వేరయా అంటూ… వ్యక్తి గుణమును స్పృశిస్తుంది. వేమన శతకములు తెలుగు పద్యములు చదివి, వాటి భావన చదవడం వలన వ్యక్తి మనసు తనను తాను చెక్ చేసుకోవడం కూడా మొదలుపెడుతుంది అంటారు. ఇంకా సమాజంలో వివిధ రకాల వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో తెలియబడుతుందని అంటారు. వేశ్యతో సంబంధం కలిగి ఉన్న వేమన, ఒక్కసారే వైరాగ్యంతో యోగిగా మారి సామాజిక పరిస్థితులలో వివిధ వ్యక్తుల వ్యక్తుల ప్రవర్తనను తన పద్యములలో ఎత్తి చూపుతాడు. వేమన పద్యాలు చాలా ప్రసిద్ది చెందియున్నాయి.

వేమన శతకము తెలుగు పద్యములు మాదిరి సుమతీ శతకం కూడా సామాజిక హితమును కాంక్షిస్తూ ఉంటాయి. ఇంకా భక్తితో కూడిన ఆరాధనా భావనలను రేకెత్తించే తెలుగు శతకాలు మనకు లభిస్తాయి. కాళహస్తీశ్వర తెలుగు శతకం తెలుగు పద్యాలు మన శివుని గూర్తి తెలియజేస్తాయి. దూర్జటి రచించిన ఈ భక్తి శతకం శివలీలలను తెలియజేస్తుంది. చెరశాలలో రామదాసు వెల్లడిజేసిన రామభక్తి భావనలే దాశరధీ శతకం.

తెలుగు శతకాల బుక్ లింక్స్

తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్ లింకులు ఈ క్రిందగా ఇవ్వబడ్డాయి. ఈ క్రింది లిస్టులో ‘తెలుగుబుక్’ అనే పదమునకు ఆయా పేర్లతో కూడిన బుక్ లింక్ చేయబడింది.

తెలుగు శతకములు చదవడంతో బాటు వినడం వలన కూడా ఆయా తెలుగు పద్యములు మన మనసులో మననం అవుతాయి. మననం చేత మనసులో మంచి విషయాలు పద్యరూపంలో చేరతాయి. గుర్తుకు వచ్చిన పద్యములకు సంబంధించిన పద్యభావనను తలచుకోవడం వలన, మనసు మార్పువైపు మరలుతుందంటారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్