శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ. ఈయన దర్శకత్వంలో వచ్చిన శుభసంకల్పం మూవీలో కమలహసన్, ఆమని, ప్రియారామన్, కె విశ్వనాధ్ ప్రధాన పాత్రలుగా ఉంటే, రాళ్ళపల్లి, నిర్మల, గొల్లపూడి తదితరులు నటించిన ఈ చిత్రం శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్ పతాకంపై SP బాలసుబ్రహ్మణ్యం నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు, మూవీ సాంగ్స్ పాపులార్ అయ్యాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

రాయుడు (కె విశ్వనాధ్) సముద్రతీరాన నివాసం ఉండే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పెద్దమనిషి, అయన సంకల్పమే ఆచరణలో శుభసంకల్పంగా మన ముందుకి వచ్చింది. సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మత్యకారులకు పడవలు చేయించి ఇస్తూ, వారి మంచిచెడులను చూసుకునే పెద్దమనిషి. రాయుడుకి ఒక కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు, ఆమె మనుమరాలు తాతయ్య అంటే ప్రేమ కొద్ది, ఆ పల్లెకి వచ్చి వెళుతూ ఉంటుంది. ఇంకా రాయుడుకి ఒక దత్తపుత్రుడు ఉంటే అతను చెడు అలవాట్లకు బానిసగా మారతాడు.

సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మత్యకారులలో దాసు (కమలహాసన్) చాల తెలివైనవాడు. పేపర్ పెన్ను అవసరం లేకుండా ఎప్పటి లెక్కలు అయినా కావలసినప్పుడు చెప్పగలిగే జ్ఞాపక శక్తి కలిగిన వ్యక్తి, అయితే అతను ఏమాత్రం అక్షరజ్ఞానం లేని వ్యక్తి. దాసు అంటే రాయుడుగారికి ఎనలేని అభిమానం ఉంటుంది.

చెడు అలవాటులకు దగ్గరైన తన కొడుకుని డబ్బు వ్యవహారాలకు దూరంగా ఉంచడంతో చెడు అవసరార్ధం రాయుడు కొడుకు అయిన దత్తుడుజ, పట్నంలో ఒక వ్యక్తి దగ్గర (కోట శ్రీనివాసరావు) దగ్గర లక్షల కొద్ది అప్పు చేస్తాడు.

గంగా మహాలక్ష్మి దాసుల వివాహం – శుభ సంకల్పం కె విశ్వనాద్ క్లాసికల్ మూవీ

పడవలు తయారుచేసే ఒక తాగుబోతు కూతురు అయిన గంగామహాలక్ష్మి (ఆమని) దాసు ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ విషయం తెలిసిన రాయుడు వాళ్ళిద్దరికీ పెళ్ళిచేసి, మరలా దాసు – గంగామహాలక్ష్మికి పుట్టిన కొడుకుకి నామకారణం కూడా తన ఖర్చులతో చేయిస్తాడు.

పట్నంలో అప్పు చెల్లించవలసిన రాయుడు కొడుకు దత్తుడు, రాయుడు ఆఫీసులో లేని సమయంలో వచ్చి బలవంతంగా డబ్బు తీసుకుని వెళ్లిపోతుంటే, దాసు అడ్డుకుని ఆ లక్షల డబ్బుని తన ఇంట్లో దాస్తాడు. తరువాత విషయం ఊరిని నుండి వచ్చిన రాయుడికి వివరిస్తారు.

డబ్బుని దాసు ఇంటిలోనే ఉంచి, వ్యాపార వ్యవహారాలకు ఉపయోగించమని, మీ అందరికి తలా ఒకరికి ఒక ఇల్లు, ఒక పడవ సొంతంగా ఉండి, మీరు సంతోషంగా ఉండాలి అదే నా సంకల్పం అని రాయుడు అంటారు. తన సంకల్పానికి దాసుని సహకారంగా ఉండమని చెబుతారు. ఇక ఆ డబ్బు వ్యవహారాలు అన్ని దాసు గుడిసె నుండే జరుగుతూ ఉంటాయి.

ఒకరోజు దాసు వేటకి అని సముద్రంలోకి వెళ్తాడు, అదును కోసం చూస్తున్న రాయుడి కొడుకు మనుషులు దాసు ఇంటికి వచ్చి దాడి చేస్తారు. ఆ డబ్బుని కాపాడే క్రమంలో దాసు నాయనమ్మ ప్రాణాలు కోల్పోతుంది. గుడిసె నుండి డబ్బుని తీసుకుని గంగామహాలక్ష్మి పడవమీద సముద్రంలోకి వెళ్తుంది, వెంటాడిన మనుషులకు డబ్బులు దక్కకుండా ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతుంది.

వేటకు వెళ్ళి దాసు, గంగకు ప్రాణహాని

వేటకు వెళ్ళిన దాసుకి డబ్బు గంగా మహాలక్ష్మి వలలో చిక్కుతారు, అయితే గంగా మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయి, డబ్బుని రక్షిస్తుంది. దాసు నాయనమ్మ మరణం చూసిన రాయుడికి గుండెపోటు వస్తుంది. రాయుడి ప్రాణరక్షణార్ధం గంగామహాలక్ష్మి బ్రతికే ఉన్నట్టు అబద్దం చెబుతాడు దాసు.

హాస్పిటల్ నుండి గంగ కోసం ఎదురుచూసే రాయుడు, తిరిగిరాని లోకాలకు తరలిపోయిన తనభార్య క్షేమంగా వస్తుంది అని రాయుడికి అబద్దం చెబుతూ దాసు పాత్ర విబిన్నంగా కనిపిస్తుంది. అందరూ ఉండి కూడా దాసు తన భార్యకు తన కొడుకుతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు, రాయుడి ప్రాణ రక్షణకోసం. ఈ సన్నివేశాలు కంటతడిబెట్టిస్తాయి. చివరికి రాయుడికి గంగవిషయం తెలుస్తుంది, తరువాత రాయుడి కలల్ని దాసు నిజం చేస్తాడు.

నటన అంటే కమలహాసన్ చిత్రాలే సమాధానాలుగా చెబుతారు, అటువంటి నటనకి కె విశ్వనాధ్ గారి దర్శకత్వం తోడైతే ఆ చిత్రం నటన విశ్వరూపమే కనిపిస్తుంది. అటువంటి ఈ చిత్రం ఒక శుభసంకల్పాన్ని నెరవేర్చే పాత్రలో కమలహాసన్ నటన అద్బుతంగా ఉంటుంది. ఒక మంచి చిత్రం ఉంది అని చెప్పగలం కానీ ఆ మంచి చిత్రం గురించి గొప్పగా చెప్పడం కన్నా మంచి చిత్రాలే చూస్తేనే బాగుంటుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

అచ్చ తెలుగులో చిన్న పిల్లలు పేర్లు మొబైల్ యాప్

విమర్శకుల ప్రశంశలు కలిగిన దృశ్యం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ మూవీస్ తెలుగు

గాంధిజి, భగత్ సింగ్, మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాట నాయకులు

సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ