మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే

మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే

రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఖర్చులు పెరుగుతుంటే, ఆ ఖర్చులకు సొమ్ములు అవసరం అయితే, వారు ఏదో ఒక కార్పోరేట్ కంపెనీతో పరోక్ష బంధం కలిగి ఉండే అవకాశం ఉంటుందని అంటారు. మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే అంటారు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఎందుకు రాజకీయ పార్టీలకు ఖర్చులు?

అంటే ఎన్నికలలో నాయకులు దేశమంతా తిరగాలి కాబట్టి. తమ పార్టీ చేస్తున్న పనులు చేయబోయే పనులు, ఇతర పార్టీల కన్నా మేమట్లా మెరుగు అని ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు పోటీపడతాయి. అలా పోటీ పడినప్పుడు సాదారణంగా పార్టీలకు వచ్చే విరాళాలు సరిపోతాయి….

మరి ఎందుకు ఒక పెద్ద కార్పోరేట్ వ్యవస్థలకు రాజకీయాలు లోబడి ఉండాల్సి వస్తుందంటే? ఎన్నికల ఖర్చులు హద్దులు దాటడమే అంటారు. అంతే ఆ ఖర్చులకు లెక్కలు కూడా ఉండవు. కానీ అధిక ఖర్చు అని చెబుతూ ఉంటారు.

ఇతర దేశాలలో జరిగే ఎన్నికల ఖర్చు ఒక్కోసారి మన దేశంలో జరిగే ఉపఎన్నిక ఖర్చుతో సమం అవుతుందని అంటున్నారంటే, రాజకీయ పార్టీలకు ఎంత ధనం అవసరం అవుతుందో అర్ధం చేసుకోవచ్చును.

అయితే అంత ధనం ఏమవుతుంది? అంటే ఓటుకు నోటు తీసుకునే జనాలు లేదా మద్యం మత్తులో పనిచేసే వారు ఉన్నప్పుడు ఎన్నికలలో రాజకీయ పార్టీల ఖర్చులకు హద్దుండదంటారు.

వ్యక్తిగా డబ్బు సంపాదిస్తున్నాను, నాయకుడుగా నా ప్రాంతమును అభివృద్దిని చేయి అని ఓటరు నాయకుడుని ప్రశ్నించినప్పుడే…. మార్పుకు నాంది.

ఎన్నికలలో డబ్బు వద్దని, అభివృద్దిని చేసే నాయకత్వమే కావాలనే కాంక్ష ప్రజలలో కలగాలని పెద్దలు అంటుంటారు.

ఓటర్లకు డబ్బు పంచే కార్యక్రమం ఉండకూడదు అంటే, ఓటుకు డబ్బు తీసుకోకూడదనే ఆలోచన అందరిలోనూ ఉండాలి.

ఓటుకు ఆశించవలసిన ప్రయోజనం సామాజికంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా కాదని అంటారు.

కుటుంబం కోసం వ్యక్తిగా వ్యక్తి పాటుపడతాడు. సమాజం కోసం నాయకుడు పాటుపడాలి.

వ్యక్తిగా కష్టపడేవారు నాయకుడుగా కూడా కష్టపడితేనే సమాజం వృద్ది కానీ ఎన్నికలలో గెలవడం కోసం ధనాన్ని నమ్ముకుంటే, తిరిగి ధనాన్ని సంపాదించుకోవడంలోనే పదవీ కాలం పూర్తయిపోతుంది. ఇక ఎన్నికల ప్రయోజనం ఎప్పుడు నెరవేరేది.

అభివృద్దిన ఆశించి ఓటు వేయాలి

కావునా ఎన్నికలలో భవిష్యత్తుకు పునాది వేసే నాయకులకే ఓటు వేయాలి. కానీ పునాదులు పడగొట్టే నాయకత్వానికి పట్టం కట్టరాదని అంటారు.

కుటుంబ భవిష్యత్తు కోసం ధనం సంపాదిస్తూ, కుటుంబం గౌరవం కాపాడుకుంటూ, సమాజంలో ఒక స్టేటస్ ను మెయింటైన్ చేసే ఒక వ్యక్తి, ఓటు వేసే సమయంలో కూడా మన ప్రాంతపు గౌరవం, మన ప్రాంతపు అభివృద్దికి పాటుపడే నాయకుడిని ఏరి కోరి ఎన్నుకోవాలి. మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే అంటారు.

ఒక పనిచేసి దానికి ప్రతిఫలం ఆశించవద్దు, వచ్చిన ఫలితం స్వీకరించి, మరొక ప్రయత్నానికి శ్రీకారం చుట్టు… మంచి గమ్యం చేరతాము అంటారు.

కర్మ సిద్దాంతం ప్రకారం ప్రయత్నించు, జీవితంలో ఎదుగుదల ఉంటుందని అంటారు.

పనిని వదలకుండా ప్రయత్నించు అదే పురుష లక్షణం (ఉద్యోగం పురుష లక్షణం)అంటారు.

మరి ఎందుకు దేశాన్ని లేదా రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగాన్ని ఎంచుకునే సమయంలో ముందే ఏదో కాంక్షించడం.

పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఇది పెద్ద తప్పు కదా?

కావునా ఓటుకు నోటు అంటే, వారికి ఓటు వేయకుండా ఉండడమే మేలు. అప్పుడు డబ్బులు ఖర్చు చేయాలనే ఆలోచనలు రాజకీయ పార్టీల నుండి దూరం అవుతాయి. ఎన్నికలలో డబ్బు ఖర్చుతో పనిలేకుండా కేవలం అభివృద్ది ప్రకారం ఓట్లు వేయడం మొదలయితే, రాజకీయ పార్టీలన్నీ అభివృద్ది చేయడంలోనే పోటీ పడతాయి.

కావునా ఓటరుమహాశయా… ఓటు వేసే వేళ తస్మాత్ జాగ్రత్త… దేశ భవిష్యత్తుని నిర్ణయించే అధికారం ఎవరికి అప్పగిస్తున్నావో… ఆలోచన చేయి….

మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

మంచి మార్పుకు పునాది ఓటుకు అభివృద్దిని కాంక్షించినప్పుడే

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది