భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

తెలుగురీడ్స్ విజిటర్స్ కు వందనములు భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్ ఈ శీర్షిక ద్వారా తీర్దయాత్రలపై ఉచితంగా లభిస్తున్న ఆన్ లైన్ తెలుగు పి.డి.ఎఫ్ బుక్స్ గురించి క్లుప్తవివరణ.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

యాత్రలు చేసి ఆలయ సందర్శనం చేయడం, పాదయాత్రలు చేస్తూ దగ్గరలో ఉండే గుడికి కాలినడకన వెళ్లడం కార్తీకమాసం ముందునుండి భక్తులు ప్రారంభిస్తారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యాక పుణ్యక్షేత్ర దర్శనమునకు యాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాలినడకన తమ ప్రాంతానికి దగ్గరగా ఉండే దేవాలయమునుకు పాదయాత్ర చేస్తూ వెళ్లడం ఈ కార్తీకమాసమును ముందు, తరువాత ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

కొందరు కార్తీకమాసంలో ఇంట్లో కార్తీకదీపం వెలిగిస్తే, కొందరు ఇంటికి దగ్గరగా ఉన్న ఆలయములలో కార్తీకదీపం ప్రతిరోజు వెలిగిస్తారు. కొందరు ఊరికి దూరంగా ఉన్నా, నదీస్నానం చేయడానికి అనువుగా ఉన్న ఊరికి వెళ్లి దేవాలయంలో కార్తీకదీపం వెలిగిస్తూ ఉంటారు. అంటే విశేష దీపం వెలిగించడానికి కార్తీకమాసం విశిష్ఠమైన మాసంగా భావిస్తారు. కార్తీకమాసంలో వైష్ణవాలయం కానీ శివాలయం కానీ తప్పనిసరిగా దర్శించమంటారు. ఇంకా భారతదేశంలో విశిష్టమైన పుణ్యక్షేత్రములకు యాత్రలు కూడా ఈ మాసంలోనే చేయమని పెద్దలు చెబుతూ ఉంటారు.

అయితే దగ్గరలో ఉండే దేవాలయమునకు కొందరు కాలినడక దైవనామస్మరణతో భక్తితో పాదయాత్ర చేస్తూ శివుడిని లేక శ్రీహరిని దర్శించకుంటూ ఉంటారు. అలా దుర్గమ్మను, వేంకటేశ్వరుని, శంకరుని, వినాయకుడిని, కుమారస్వామిని, ఆంజనేయస్వామిని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. దూరంగా ఉండే పుణ్యక్షేత్రములకు మాత్రం వాహనం ద్వారా ఈ మాసం నుండే ఎక్కువగా ప్రయాణాలు కొనసాగుతాయి.

అయ్యప్పస్వామి మాలధారణ మండలకాలం ముగిసే సమయం కూడా కార్తీకమాసం మద్యలోకి రావడంతో మరింతమంది పుణ్యక్షేత్రములకు యాత్ర చేయడానికి సన్నద్ధం అవుతూ ఉంటారు. అయితే మన భారతదేశంలో దర్శించవలసిన పుణ్యక్షేత్రములను తెలియజేసే యాత్ర తెలుగు పుస్తకములను గురించి తెలుసుకుందాం.

యాత్రదర్శిణి దేవాలయాలు తెలుగు బుక్స్

శ్రీదత్తాత్రేయుని పుణ్యక్షేత్రములను తెలియజేస్తూ, ఆదేవాలయం చరిత్రను క్లుప్తంగా తెలిపే తెలుగు బుక్ ఉచితంగా ఆన్ లైన్లో లభిస్తుంది. ఈ తెలుగు బుక్ లో మహురము, గిరినార్, కరెంజ, నరసోబావాడి, ఔదుంబుర్, గాణుగాపురం, కొల్హాపూర్, నాశిక్, కురుగడ్డ, పిఠాపురము, మాణిక్యనగర్ మొదలైన శ్రీదత్త దేవాలయములు ఉన్న ప్రాంతములు గురించి క్లుప్తంగా వివరించబడి ఉన్నాయి. ఈ ఫ్రీతెలుగుబుక్ చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల విశేష భారతవానిలో పుణ్యక్షేత్రములకు పెట్టింది పేరుగా చెప్పబడుతుంది. ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రములు సందర్శిస్తూ, తీర్ధయాత్ర చేయడం పరమపుణ్యప్రదంగా చెబుతారు. యాత్ర బస్సులవారి ద్వారా యాత్రల వివరాలు ఉంటాయి. అయినా కొన్ని పుస్తకముల ద్వారా దర్శించబోయే తీర్ధయాత్రస్థలం గురించి విశిష్ఠత తెలుసుకుని దేవాలయం దర్శిస్తే మంచిదని చెబుతారు. ఈ క్రింది తెలుగు చిత్రాలకు తెలుగులో ఉత్తరభారతదేశ యాత్ర బుక్, దక్షిణ భారతదేశ యాత్ర బుక్, భారతదేశపు అన్ని పుణ్యక్షేత్రములు తెలుగు బుక్ లింకు చేయబడి ఉన్నాయి.

మీర ఈ క్రింది చిత్రాలను క్లిక్ టచ్ చేయడం ద్వారా ఆయా యాత్రలలో ఉండే పుణ్యక్షేత్రముల గురించి చదవవచ్చును. ఈ లింకుల ద్వారా ఈ తెలుగుబుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.

భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్
ఉత్తరభారత్ లో ఉండే పుణ్యక్షేత్రముల గురించి తెలియజేసే తెలుగు బుక్, భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్
భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్
దక్షిణ బారతంలో ఉండే పుణ్యక్షేత్రల దర్శిణి తెలుగు బుక్ భారతదేశ యాత్రదర్శిణి తెలుగు బుక్స్

పైచిత్రాలకు ఫ్రీగురుకుల్ వెబ్ సైటులోని పి.డి.ఎఫ్ పుస్తకములు ఆన్ లైన్ లింకులు ఎటాచ్ చేయడం జరిగింది. మీరు పై చిత్రంపై క్లిక్ చేసి ఆయా తెలుగుబుక్స్ రీడ్ చేయవచ్చును.

తెలుగు దూరమవుతున్నారు తెలుగు మరిచి పోయావా

మరిన్ని తెలుగు పోస్టులు

మనతో మాట్లాడే ఫోన్ కాల్ రికార్డ్ చేసున్నారా?

డిసెంబర్ 31 జనవరి 1

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

గీతా జయంతి జ్ఙానం భగవంతుడి చేత చెప్పబడిన భగవద్గీత

తెలుగులో చిన్న పిల్లల పేర్లు అచ్చ తెలుగు ఆడ, మగ చిన్నారి పేర్లు

ఫేస్ బుక్ తెలుగురీడ్స్ పేజి

పిల్లలకు ప్రాధమిక గురువుగా ఫోను

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

తెలుగురాశి ఫలాలు 2020 టు 2021

తెలుగుకధలు అమ్మనోటితో పిల్లలకు చెబితే….