అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ తెలియజేయడానికి ఈ పోస్టు వ్రాస్తున్నాను.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

గమనిక: పురాణములు చదివేటప్పుడు కొన్ని నియమ నిబంధనలను ఆయా పురాణ పుస్తకములలోనే తెలియజేస్తారు. ముందుగా ముందుమాట చదివి రచయిత ఉపోద్ఘాతం మరియు పురాణం తెలియజేసే నియమనిష్టలు తెలుసుకుని, వాటిని అనుసరించి పురాణపఠనం చేయడం ఉత్తమమని అంటారు. కావునా మీరు పురాణ పుస్తకములు చదివేటప్పుడు అత్యంత శ్రద్ధతోనూ, మరియు ఉత్తమమైన ప్రదేశములో కూర్చుని, ప్రశాంత చిత్తముతో చదివితేనే పురాణసారం మనసు గ్రహించగలుగుతుంది.

పెద్దలచే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కు అధినాయకులు చెప్పబడతారు. సృష్టి అంటే పుట్టుక అది మనకు తెలియకుండానే జరిగే ప్రక్రియ, లయ అంటే ముగింపు(రోజు నిద్ర గురించి, దీర్ఘనిద్ర గురించి, సృష్టి అంతం గురించి చెబుతారు) అంటారు. ఇక స్థితి ఇది చాలా ప్రధాన విషయంగా కనబడుతుంది. స్థితి అంటే కరెంట్ స్టేటస్, ప్రస్తుతం అంటారు. సృష్టి, లయలలో అందరికి తెలిసేలా ఉండదు కానీ స్థితి మాత్రం ఉన్నవారందిరికి పరిచయమే. ఇప్పుడున్న స్థితిలో మీరు బాగున్నారా? అంటారు. ఇక్కడ అడిగినవారు, చెప్పినవారు ఇద్దరూ స్థితిలో ఉన్నవారే. ఈ స్థితికి శ్రీమహావిష్ణువు రక్షకుడుగా పండితులు చెబుతారు. వ్యక్తికి స్థితికారుని హృదయం తెలిసి ఉంటే, ఏ సమయంలో ఏమి చేయాలో ఖచ్చితంగా తెలియబడుతుందంటారు. స్థితికారుని గూర్చి తెలిపే పురాణములు విష్ణుపురాణము, హరివంశము, గరుడ పురాణము, శ్రీకృష్ణ లీలలు వివిధ గ్రంధములుగా మనకు తెలుగుబుక్స్ లభిస్తాయి.

స్థితికారుడు శ్రీమహావిష్ణువు కాబట్టి విష్ణుపురాణం మరి మిగిలిన గ్రంధాలు ఎందుకంటే, స్థితికారుడు అయిన వైకుంఠాధీశుడు ధర్మ సంస్థాపనార్ధం అవతారములు స్వీకరిస్తాడు. అందుకనే అన్ని అవతారములలోనూ వైకుంఠపురవాసి పురాణములు, ఇతిహాసముల గ్రంధములు, తెలుగు పుస్తకములు అనేకంగా ఉంటాయి. వైకుంఠాధీశుడు రామావతారం గురించి తెలిపే శ్రీరామాయణం ఒక ఇతిహాసమై ఉంది. శ్రీకృష్ణావతారం గురించి తెలిపే హరి వంశం, శ్రీకృష్ణ లీలలు తదితర తెలుగురచనలు ఉంటాయి. అలవైకుంఠపురంబున నివసించే శ్రీమహావిష్ణువు స్వయంగా గరుడునికి తెలియజేసిన పురాణం గరుడ పురాణంగా ఉంది. అల వైకుంఠపురవాసి దశావతారముల గురించి తెలియజేసే భాగవతం పోతనామాత్యులు మనకు తెలుగులో రచించారు. ఇంకా భాగవతం గురించి ఎన్నో తెలుగుబుక్స్ మనకు లభిస్తాయి.

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు ఆన్ లైన్లో

పురాణములు చదవడానికి, వినడానికి ఎంతో పుణ్యఫలం ఉంటేనే సాధ్యమంటారు. ఇంకా అల వెకుంఠాధీశుని అనుగ్రహం ఉంటేనే గరుడపురాణం చదవే అదృష్టం కలగదు అని పండితులు చెబుతూ ఉంటారు. ఇంకా గరుడపురాణం గురించి ప్రవచనరూపంలో వినడం కూడా చాల ప్రశస్థమైన విషయంగా చెబుతారు. అలాంటి గరుడపురాణం తెలుగులో ఉచితంగా ఆన్ లైన్లో చదవడానికి లేక డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. గరుడ పురాణం గరుడుని ద్వారా శ్రీమహావిష్ణువు లోకానికి అందించి విశేష జ్ఙానముగా చెబుతారు, ప్రవచనకారులు. ఈ పురాణమును గూర్చి ఎంత శ్రద్ధతో వింటే అంత ఫలితం అని చెబుతారు. దీనిని గూర్చి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలు వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

శ్రీ హరివంశ పురాణమును ఎక్కువగా పిల్లలు లేనివారు ఈ పురాణ పఠనమును అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఈ పురాణ పుస్తకము చదివేవారు ఒక వ్రతదీక్షలాగా చేయాలని చెబుతారు. అకారణంగా ఎవరిని నిందించకూడదు, పవిత్ర హృదయముతో దయతో మౌనముతో నిత్యం సరళ స్వభావము కలిగి వినయభావనతో ఉంటూ ఈ శ్రీహరివంశ పురాణమను చదవాలంటూ చెబుతారు. ఎన్ని సార్లు ఎంత భక్తిశ్రద్ధలతో చదివితే లేక వింటే అంతగొప్ప ఫలితం ఉంటుంది అంటారు. మీరు శ్రీహరివంశ పురాణం తెలుగు ఉచిత పుస్తకం చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. ఇంకా ఈ పురాణమును గూర్చిన ప్రవచనం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి వీడియోలు వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

శ్రీమహావిష్ణువు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శ్రీరామాయణం గురించిన తెలుగు పుస్తకములు ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తున్నాయి. శ్రీనివాసుడు శ్రీరామునిగా భూమిమీద ఒక నరుడుగా నడిచిన ఇతిహాసం శ్రీరామాయణం. శ్రీరామనామం భక్తిశ్రద్ధలతో మననం చేసుకున్న పుణ్యమే అంటారు. అటువంటి పరమపవిత్రమైన రామాయణంలోని సుందరకాండ గురించి ఎక్కువగా తెలుగు పుస్తకాలు ఉంటాయి. ఇంకా సంపూర్ణ రామాయణం ఆరుకాండలతో కలిపి ఎక్కువగా మనకు లభిస్తాయి. సంపూర్ణ రామాయణం గురించిన వివిధ రచయితల తెలుగుబుక్స్ చదవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

స్థితి అంటే ప్రస్తుతము కాబట్టి ప్రస్తుతం ఒకరికి దు:ఖంగా ఉంటే అదే ప్రస్తుతం మరొకరికి సు:ఖంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఒక మనిషి మనసుకు ఏర్పడే సుఖదు:ఖాలకు కారణం పురాణములు తెలియజేస్తాయి. నమ్మితే పురాణములు ప్రశాంతచిత్తమును ఇస్తాయి అంటారు. మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడే బాగా పనిచేయగలడని అందరూ అంటారు. ఈ విధంగా చూస్తే ప్రస్తుతంలో జీవితం గురించి సరైన అవగాహనతో సుఖదు:ఖాలను చూడడం అలవాటు అవసరం కాబట్టి పురాణపఠనం మంచిదనే పెద్దలు అంటారు. మీకు ఈ పోస్టు నచ్చితే షేర్ చేయండి.

ధన్యవాదాలు తెలుగురీడ్స్