భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్

గురువును మించిన శిష్యుడుగా, తండ్రికి వివాహం కొరకు తన వివాహం చేసుకోనని ప్రతిజ్ఙ చేసి, భీష్ముడుగా ప్రసిద్దికెక్కిన దేవవ్రతుడు మిక్కిలి కృష్ణ భక్తుడుగా చెబుతారు. మహాభారతంలో పితామహుడుగా కనిపించే, ఈయన ధర్మాన్ని ఆచరించి, భీష్మాచార్యులుగా ప్రసిద్దికెక్కారంటారు. భీష్మఏకాదశి రోజున భీష్ముడుని తలచుకోవాలని చెబుతారు. 2020లో భీష్మఏకాదశి ఫిబ్రవరి 5న వస్తుంది. భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్ గురించి….

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

భీష్ము పితామహుడు శంతనుడుకు, గంగకు కొడుకుగా పుడతాడు. అతనిని చిన్నప్పుడే గంగ తనవెంట తీసుకువెళ్లి విద్యాభ్యాసం చేయించి, మరలా శంతన మహారాజుకి అప్పజెప్పుతుంది. శంతనుడు దేవవ్రతుడు ఒక్కానొక్క కొడుకు కావడం చేత, ఆరోజులలో క్షత్రియులకు బహుసంతానం ధర్మం కాబట్టి, శంతనుడు సత్యవతిని రెండవ వివాహం చేసుకోవాలని తలుస్తాడు. అయితే సత్యవతి తండ్రి దాసరాజు షరతు వలన, శంతనుడు నిరాశ చెందుతాడు. తండ్రి నైరాశ్యమునకు కారణము తెలుసుకుని, తండ్రి వివాహం కొరకు, దాసరాజు షరతును అనుసరించి, ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని భీష్మ ప్రతిజ్ఙ పెద్దల సమక్షంలో చేస్తాడు. అప్పటి నుండి దేవవ్రతుడు, భీష్ముడుగా ప్రసిద్ది చెందారు.

తండ్రి మరణానంతరం కూడా తన పినతల్లి పుత్రులు సింహాసనం అధిష్ఠిస్తే, భీష్ముడు రాజ్యాన్ని పరిరక్షించడం చేస్తాడు. ఇంకా వారి వివాహం కోసం పాటుపడతాడు. అందులో భాగంగా గురువుగారితోనే యుద్దం చేస్తాడు. కురుక్షేత్రంలో కౌరవులు తరపున యుద్దం పాండవులతో యుద్దం చేస్తాడు. పాండవుల ధర్మం గెలవడం కోసం, తన మరణ రహస్యాన్ని తానే ధర్మరాజు చెప్పి, అంపశయ్యపై ఉంటాడు. అంపశయ్యపై ఉన్న భీష్యుడే, విష్ణుసహస్రనామం శ్రీకృష్ణుడి సమక్షంలో చెబుతాడు. ధర్మరాజు ధర్మబోధ చేసి, యుద్ధానంతరం దర్మరాజులో కలిగిన అశాంతిని తొలగిస్తాడు. ఇలా భీష్మాచార్యుల గురించి చాలా గొప్పగా మహాభారతం చెబుతుంది. భీష్మఏకాదశి సందర్భంగా భీష్మాచార్యులను తలచుకోవాలని పెద్దలంటారు. ఈ భీష్మాఏకాదశి సందర్భంగా భీష్ముడు చెప్పిన విష్ణుసహస్రనామం పారాయణ చేయాలని కూడా చెబుతారు.

భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్ గురించి చూస్తే, ఈ బుక్ తెలుగుభాషలో ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తుంది. మహాభారతంలోని భీష్మపర్వము తెలుగులో పిడిఎఫ్ బుక్ రూపంలో లభించే భీష్మపర్వము తెలుగుబుక్ ఫ్రీగా రీడ్ చేయవచ్చును లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ క్రింది బటన్ పై టచ్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ తెలుగులో రీడ్ చేయవచ్చును.