వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

వ్యవసాయం వదిలి వ్యాపారం చేద్దాం. జీవితం బాగుంటుంది. వ్యవసాయం వదిలి ఉద్యోగం చేసుకుందాం… నెలకొకమారు ఖచ్చితంగా జీతం వస్తుంది. వ్యవసాయం వదిలి ఇంకా ఏదైనా చేద్దామంటూ కొందరు కొన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగితే, వాటిలో విజయవంతం అయినవారు మిగిలినవారికి మార్గదర్శకం కాగలరు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

అయితే వ్యవసాయం కన్నా ఏది బాగుంది. వ్యవసాయం కన్నా మిగులు కనబడమే రంగమేది? అనే ఆలోచన రైతులో పుట్టడానికి కారణం వారి ఆర్ధిక పరిస్థితే కారణం అయితే, అటువంటి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచవలసిన బాద్యత… ప్రజలను కాపాడే వ్యవస్థదే అవుతుంది. రైతుల కూడా సామాన్య ప్రజలే కదా..

పని చేయించుకునేవారికి పనివారు కావాలి. పని చేసే మనిషికి శక్తి అవసరం. శక్తి అందించే వ్యవస్థకు వనరులు అవసరం. వనరులను ఉపయోగించి శక్తినందించే ఆహారోత్పత్తి చేసేది…. వ్యవసాయదారులు అంటే రైతులు.

తెలుగురాష్ట్రాలలో కష్టంతో కూడుకుని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉండే రంగం వ్యవసాయ రంగం. ఈ రంగంలో తక్కువ సేద్యంచేసే భూమి కలిగిన వ్యక్తి, తన పొలంపని తానే చూసుకునే అవకాశం ఎక్కువ ఉంటే, ఎక్కువ వ్యవసాయభూమి కలిగిన వ్యక్తి కూలీలను పెట్టుకుని, వివిధ యంత్రములతో కూడా పనిచేయించుకుంటూ ఉంటాడు. ఈ రంగం అందరి తెలుగు ప్రజలకు తెలిసినదే, అయితే కష్టం ఎక్కువ ఉంటూ ప్రకృతి కూడా అనుకూలంగా ఉండాలి కాబట్టి కొంతమంది వ్యాపారాలు, ఉద్యోగాలు వెతుక్కుంటూ పట్టణ ప్రాంతాలకు తరలి వెళతారు. ఎక్కడికి వెళ్లినా రైతు పండించిన ధాన్యమే మనకు ఆహారం.

వ్యవసాయం చేయడంతో ఇంట్లో డబ్బు కన్నా ధాన్యం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంతో అయితే ఇంట్లో డబ్బు ఎక్కువగా ఉంటుంది. డబ్బుతో ధాన్యం కొనుగోలు చేయవచ్చును. కానీ పండించన ధాన్యం అమ్మకానికి ఉండాలి.

వ్యాపారం చేయడం చాలా సులభం, లెక్కల్లో సూత్రాలు, సిద్దాంతాలపై సరైన అవగాహన ఉంటే లెక్కలు చేయడం ఎంత సులభమో..అలాగే సామాజిక అవసరాలలో ప్రాధాన్యత, భవిష్యత్తు మానవ అవసరాలు ఏమిటనే ఒక అవగాహన, అవసరమైన వస్తు, సేవలలో లోటుపాట్లు గురించిన అవగాహన ఉంటే వ్యాపారం సులభతరం అంటారు.

పుస్తకాలలో చదివినట్టు వ్యాపారంలో పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఎదుటి వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి నివాస ప్రాంతాన్ని బట్టి అనుకూల – ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వ్యాపారం ఆన్ లైన్ ద్వారా కూడా ఎక్కువగా నడుస్తుంది. ఆన్ లైన్లో అనేకంగా ఆఫర్స్ ఎక్కువగా ఎప్పటికప్పుడు పండుగలు లేక విశేషమైన రోజులను బట్టి వస్తూ ఉంటున్నాయి.

కొనుగోలుదారుకు ఆన్ లైన్లో తగ్గింపు ధరలలోనే ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఫోన్లు, కంప్యూటర్స్, గృహోపకరణాలు, దుస్తులు లాంటివి చాలానే లభిస్తున్నాయి. అమ్మేవారు కూడా తమ తమ వస్తువుల పాపులర్ ఆన్ లైన్ ఇకామర్స్ సంస్థల వెబ్ సైట్ల నుండి అమ్మకాలు కొనసాగించవచ్చును.

సమాజంలో వ్యక్తికి నిత్యావసరమైనది ధాన్యం, తిండిగింజలు, కూరగాయలు, కిరణా సరుకులు ఇవి ప్రతి వ్యక్తి కుటుంబానికి పోషణార్ధం చాలా అవసరం. అయితే వీటిని పండించే వ్యవసాయం మాత్రం కొందరికే అవసరం అన్నట్టుగా సమాజం సాగుతుంది, అన్న విషయం మహర్షిలాంటి సినిమాలలో చూపిస్తున్నారు…అంటే సమాజంలో వ్యవసాయం తక్కువ అవుతుందనే ఆందోళన అందరిలో వచ్చింది.

వేగంగా వృద్ది చెందుతున్న సమాజంలో వ్యాపారం అవసరం అయ్యి, సాంకేతికతతో మరింత తేలికగా సాగుతుంది. తేలిక విధానంతో డబ్బు సంపాధన ఉండటంతో, డబ్బుకు అన్ని వస్తు, సేవలు దొరకడంతో వ్యవసాయం చేయడం కన్నా వ్యాపారం లేక ఆయా వ్యాపార, ఉత్పాదక వ్యవస్థలలో ఉద్యోగం చాలు అంటూ మానవ జీవితం సాగుతున్నట్టుగా కనబడుతుంది.

ఒక కంపెనీలో కష్టపడి కార్మికులు పనిచేస్తే, ఆ కంపెని వస్తువుని మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ వ్యవస్థ కావాలి. కానీ వ్యవసాయం కూలీలు కష్టపడి చేస్తే, మార్కెటింగ్ అవసరం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ధాన్యం అవసరం లేకుండా ఎవరు ఉంటారు. అయితే దళారివ్యవస్థను సరిదిద్దవలసిన ఆవశ్యకత మాత్రం పబ్లిక్ పైనే ఉంటుంది. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

వ్యవసాయంతో బాటు కూడా ఉండే మరొకటి పాడి. పొలంలో గడ్టి తీసుకువచ్చి వాటిముందు వేస్తే, ఆ గడ్డితిని పాలను ఇస్తాయి. పాలు వలన ఆరోగ్యం, బలం అంటారు. వ్యవసాయంతో కూడిన పాడి ఉండటం అంటే ఐశ్వర్యవంతుడనే అంటారేమో. అయితే పొలం పని, పాడి పని రెండూ చాకిరి ఎక్కువ అనే అంటారు. కానీ అవి లేనిదే మన తెలుగువారు ఉండలేరు.

వ్యవసాయమా? వ్యాపారమా? అంటే వ్యాపారం తేలిక అయినా వ్యవసాయం కష్టమైనా పెద్దలు వ్యవసాయమే ఎంచుకోమని చెబుతారు. చాలా సార్లు ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం వచ్చింది, అప్పుడు ఆగ్రదేశాలలో ప్రజలు నానాకష్టాలు పడ్డారు అని చెబుతారు. కానీ దాని ప్రభావం మనపై చాలా తక్కువనే చెబుతారు. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం మరియు మనదేశ మహిళలు పొదుపుతో కూడిన విధానం కుటుంబంలో పాటిస్తారు. కాబట్టి డబ్బు లేకపోతే అల్లాడిపోవాల్సిన ఆగత్యం మనకు రాలేదు అని చెబుతారు.

దీనిని బట్టి వ్యవసాయం ప్రధానంగా సాగితే, దానిని అనుసరించి పాడి, తిండిగింజలు, కూరగాయలు విరివిగా ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో డబ్బుతో తక్కువ పని ఉంటుంది. తినడానికి కావాల్సినవి విరివిగా ఉంటే, ఉన్నడబ్బుతో ఇతర అవసరాలు తీర్చుకోవచ్చు. డబ్బు తక్కువగా ఉంటే ఇతర అవసరాలు ఆపివేయవచ్చును. ఇలా వ్యవసాయం వ్యాపారం కన్నా మిన్నగా కనబడుతుంది.

ఆర్ధికమాంద్యం వచ్చినప్పుడు కష్టాలను ఎదుర్కొన్న ప్రజలు ఎక్కువగా కలిగిన దేశాలు సాంకేతికంగా, వ్యాపారపరంగా వృద్ది ఎక్కుగా ఉన్న దేశాలు కావడం గమనార్హం.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్