ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా

ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా ఆరంభం అయ్యింది. సాదారణంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఐపిఎల్20 కప్ సెప్టెంబర్2020లో ప్రారంభం అయ్యింది.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఇన్ని మాసాలు లేటు అవ్వడానికి కారణం కరోనా… అందరినీ వణికించిన కరోనా, కరెక్టుగా ఐపిఎల్ ప్రారంభానికి ముందుగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది.

కరోనా రాకముందే మార్చి29న ప్రారంభం మ్యాచుతో కూడిన ఐపిఎల్ షెడ్యూల్ కూడా విడుదలైంది.

అయితే కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభం కావడంతో, అప్పుడే లాక్ డౌన్ కూడా అమలలోకి వచ్చింది. లాక్ డౌన్ సడలిస్తారు.. ఐపిఎల్ సాగుతుందనే అంచనా కూడా ఉంది.

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా కేవలం టివిల ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించి ఐపిఎల్ నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు.

నిర్వాహకులు కూడా ఐపిఎల్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేసినా, కరోనా వైరస్ వ్యాప్తి బాగా పెరగడంతో… ఐపిఎల్ మ్యాచులు వాయిదా వేశారు.

క్రికెట్టే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా కరోనా అడ్డుకుంది. సాదరణ జీవనాన్ని కూడా కరోనా ఇంటికే పరిమితం చేసింది.

కరోనా కారణంగా వాతావరణ కాలుష్యంలో కూడా తేడాలు వచ్చాయి. మోటారు వాహనాల వినియోగం తగ్గడంతో కాలుష్యం కొంచెం తగ్గిందనే వార్తలు కూడా వచ్చాయి.

అలాంటి సమయంలో క్రికెట్ మ్యాచులు అసాధ్యమని కేంద్రం భావించడంతో, ఐపిఎల్ నిర్వహణ వాయిదా పడింది.

మనదేశంలో క్రికెట్ కు ఆదరణ ఎక్కువ… అందులోనూ ఐపిఎల్ అంటే మరింత క్రేజ్…

నెలరోజుల పాటు అభిమానులను అలరించే ఐపిఎల్ అయిదు నెలల ఆలస్యంగా సెప్టెంబరులో దుబాయ్ లో ప్రారంభం అయ్యింది.

ప్రేక్షకులు లేకుండా కేవలం టివి ప్రసారాల ద్వారానే మ్యాచులు జరిగాయి. అయినా ఐపిఎల్ లాభాల బాటలోనే నడవడం విశేషం….

ఢిల్లికి – ముంబైకి మధ్య ఐపిఎల్T20 ఫైనల్ మ్యాచ్ జరిగింది.

ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా
ఐపిఎల్2020 కరోనా కారణంగా 5నెలలు ఆలస్యంగా

10నవంబర్ 2020న ఢిల్లికి – ముంబైకి మధ్య ఐపిఎల్T20 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఢిల్లి గెలుస్తుందనే అంచనా కూడా ఎక్కువగానే వచ్చింది…

కానీ డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబై జట్టు ఐపిఎల్ కప్ అయిదోసారి అందుకుంది. అయిదు నెలల లేటుగా ప్రారంభం అయిన ఐపిఎల్ టి20 కప్పు ముంబైపరమైంది. రోహిత్ శర్మ 68 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

ఇంకా టి20 ఐపిఎల్ టోర్నిలో ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ పై పలు ప్రశంసలు కురిశాయి. అయిదు సార్లు కప్పు కొట్టిన ఘనత రోహిత్ శర్మదే… అయ్యింది.

ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ గా అద్భుతమైన పనితీరు రోహిత్ శర్మ కనబరిచారు. ఆటగాడిగా రాణిస్తూ, కెప్టెన్ గా కూడా జట్టుకు మేలునే చేశాడు.

ఈ విధంగా ఐపిఎల్2020 కరోనా కారణంగా ఆలస్యమైనా మంచి మజానే ప్రేక్షకులకు అందించి.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

చిన్న పిల్లల పేర్లు అచ్చతెలుగులో గల యాప్. బేబి నేమ్స్ బాయ్స్, గర్ల్స్ విడి విడిగా సెర్చ్ చేయవచ్చును. ఇంకా ఎంచుకున్న పేరుతో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ చూడవచ్చును.

ఆలోచనకు పదును పెడితే పధకం, గురి కుదిరితే రహదారే…

తెలుగు రీడ్స్ ఫస్ట్ పోస్టు