ఓర్పు దేవతా లక్షణం అంటారు.

ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, ఓర్పుతో ఇంట్లోనే ఉండాలి. లేకపోతే జీవితం తలక్రిందులు, మనతో బాటు మరింతమంది జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

పోరాడడం జీవితంలో సాధారణంగానే సాగుతుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలతోనో, కష్టాలతో వ్యక్తి పోరాటం సాగిస్తూనే ఉంటాడు. తనకోసమో, తనవారికోసమో పోరాటం సాగిస్తూ ఉంటాడు. ఒక కుటుంబ పెద్దగా తనవారికోసం ఎక్కువగా జీవితంలో పోరాడడం ఉంటే, కుటుంబ సభ్యులు కొందరు సహకారంగా ఉంటే, కొందరు ప్రతకూలంగా ఉండవచ్చును.

కానీ పోరాటం వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఆర్ధిక విషయాలలోనో లేదా ఏదైనా ఇతర అంశంలోనో జీవనపోరాటం సాగుతుంది. ఈ పోరాటంలో వ్యక్తి గెలవవలసి ఉంటుంది. ఏదో ఆటలో గెలుపు ఓటములు వెంటనే తేలతాయి. కానీ జీవన పోరాటంలో గెలుపు ఓటములు కాలం దీర్ఘకాలంలో కలుగజేస్తుందని అంటారు.

ఓర్పు దేవతా లక్షణంగా చెబుతారు. ఇలా కష్టనష్టాలలో ఓపికపట్టేవారు

ఈ పోరాటంలో వ్యక్తి మనసుకు కావాల్సింది, ఓర్పు పట్టడమే అని అంటారు. ఓర్పు దేవతా లక్షణంగా చెబుతారు. ఇలా కష్టనష్టాలలో ఓపికపట్టేవారు కూడా మనకు సమాజంలో కొందరు కనబడుతూ ఉంటారు. వారి ఓపికే, వారి లక్ష్యాన్ని దగ్గర చేస్తూ ఉండవచ్చును. కొందరు లక్ష్యం చేరకపోయినా వారికున్న ఓర్పు గుణాన్ని వదలరు. కొందరు ఓర్పు పట్టలేక ఉన్న అవకాశాలనే కోల్పోతూ ఉంటారు.

ఓర్పు పట్టడం అనే అలవాటు సహజంగానే ఉంటే ఫరవాలేదు. కానీ కొందరికి ఓర్పుపట్టలేక ఏదో మనోవికారం వలన తమపై తాము నియంత్రణం కోల్పోతారు. అలా నియంత్రణను కోల్పోయిన మనసు చేస్తున్న పనిలో పట్టు కూడా కోల్పోతుంది. విషయాల వద్ద విచక్షణను కూడా ప్రక్కన పెడుతుంది. తమపై తాము నియంత్రణ కోల్పోతున్నవారు కూడా తమతప్పు తాము ఎరుగకపోవచ్చును. లేదా తమ తప్పు తమకు తెలిసినా, దానిని సాధించడంలో వారి మనసు సహకరించకపోవచ్చును.

పెద్దలు అంటారు ‘తమ మనసు తమ మాట వినడంలేదు’ అన్న విషయం గ్రహించడం కూడా మంచి విషయం. ఒకనాటికి ఖచ్చితం తమ మనసుపై వారు నియంత్రణ కలిగి ఉండగలుగుతారని అంటారు. ఇలా మనసును నియంత్రంచడంలోనే సమాజంలో ఒక వ్యక్తి కార్యాలను సాధించగలడు. ఓర్పు వలననే ప్రమాదాలు తప్పించుకోగలడు. ఇప్పుడు కరోనా వైరస్ బయట బస చేసింది. ఈ కరోనా ఒక అంటువ్యాధి, దీనికి ఇంకా మందు కనిపెట్టలేదు కాబట్టి, కరోనా వైరస్ సోకినవారి ప్రాణాలకు సరైన వైద్యం అందకపోతే అది ప్రాణాంతకమే. ఇప్పుడు ఇది మహమ్మారిలాగా వ్యాపిస్తుంది.

ఇప్పుడు ఓర్పు అందరికీ అవసరం. ఇప్పుడు ఓర్పు పట్టడం అందరి సామాజిక బాధ్యత. కుటుంబ పెద్ద తన వారికోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్పు వహిస్తూ ఉంటారు. అటువంటి కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే, ఆ కుటుంబం అంతా చాలా ఓర్పు వహించి, అతనిని రక్షించుకుంటారు. అలా ఇప్పుడు సమాజం కరోనా మహమ్మారి కోరలలో చిక్కింది. ఇప్పుడు మన సమాజాన్ని మనమే ఓర్పు వహించి రక్షించుకోవాలి.

ఎందుకంటే అదే సమాజంలో మనం తిరుగుతున్నాము. అదే సమాజంలో మనం జీవనోపాధి కలిగి ఉన్నాము. అదే సమాజంలో మనం సుఖసంతోషాలను అనుభవిస్తున్నాము. అదే సమాజంలో మనం ఎన్నో కార్యాలు నిర్వహిస్తూ, సమాజాన్ని ఉపయోగంచుకున్నాం.. ఉపయోగించుకుంటాం కూడాను. కానీ రేపటికి సామాజిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాను అంటూ కరోనా మహమ్మారి కోరలు చాచింది. కరోనా వైరస్ ఇప్పటికి మనదేశంలో వేలాదిమందికి సోకింది.

ఒకవ్యక్తికి కరోనా సోకి, అతనికి కరోనా వైరస్ సోకినట్టు తెలియక నెలరోజులు సమాజంలో తిరిగితే అతను 400మందికి ఆ వైరస్ ను వ్యాపింపజేయగలడు. చూడండి ఎంత పెద్ద తప్పు మన వలన మనకు తెలియకుండానే సమాజానికి జరిగిపోతే… సుమారు 400 మంది ప్రాణాలు రిస్కులో ఉన్నట్టే కదా… సమాజాన్ని ఉపయోగించుకుంటూ మనం సమాజానికి కూడా ఉపయోగడపడాలి. సహాయం చేసిన వ్యక్తికి తిరిగి అతనికి అవసర సమయంలో సహాయం చేస్తాం. అలా చేయకపోతే కృతఘ్నుడు అంటారు.

సమాజాన్ని ఉపయోగించుకుంటూ, ఉపయోగించుకోబోతూ మనం సమాజాన్ని రక్షించుకోవడం మన సామాజిక బాధ్యత.

అలా ఇప్పుడు మన సహకారం సమాజానికి అవసరం అయింది. ఇప్పుడు ఆ సహకారం మనం ఓర్పు వలననే అందించగలం. సమాజాన్ని ఉపయోగించుకుంటూ, ఉపయోగించుకోబోతూ మనం సమాజాన్ని రక్షించుకోవడం మన సామాజిక బాధ్యత. ఇటువంటి కాలం ఇంతకుముందు ఎన్నడూ మనం చూడలేదు. కాబట్టి అలవాటు ప్రకారం తప్పులు చేసేస్తూ ఉంటాం. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనం సామాజిక దూరం పాటించాలి.

సామాజిక దూరం వలన కరోనా వైరస్ వ్యాప్తి లింకు పెరగదు. తద్వారా ఇప్పటికే బయటపడిన కేసులు పరిష్కరించడంలో వైద్యుల పని సులువు అవుతుంది. కాబట్టి మనం బయటకుపోకుండా ఇంటికే పరిమితం కావడంలో ఓర్పు వహించాలి. అయితే ఒంటరిగా ఉండే, మనసు పరి పరి విధాలుగా పోతుంది. అది అంటుంది, ఇది అంటుంది. అలా చేయి, ఇలా చేద్దాం అంటూ సూచిస్తుంది. కాలును కుదురుండనివ్వదు, చేతిని అదుపులో ఉండనివ్వదు.. దాని అలవాటు ప్రకారం శరీరంపై ప్రభావం చూపుతూ ఉంటుంది.

ఇక్కడే ఇలాంటి సమయంలోనే మనసును నియంత్రణంలో ఉంచుకోవడం ప్రధానం. మనసు చేసే చేష్టలను గమనిస్తే, అదే ఆగుతుంది. అది చెప్పినట్టే వింటే అది ఇంట్లో కూర్చోనివ్వదు. మనసు చదువుకునే సమయంలో శ్రద్ధగా పాఠాలు విని కుదురుగా ఉన్న మనసు ఒక వయస్సు వచ్చాక మాత్రం ఏదో అలవాటును వ్యక్తి మానరిజంగా అంటగట్టేసి అదే మానరిజంలో వ్యక్తిని నడిపిస్తుంది. అదేదో సినిమాలో చూపించినట్టుగా… మనసుకు మానరిజం అంటే అది మనకు ఒక్కోసారి బలం అయితే ఒక్కోసారి బలహీనత కావచ్చును. కానీ ఎప్పుడూ ఒకే తీరు వలన అతి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక అలవాటుపడిన మనసు ఒకేసారి కుదురుగా ఉండాలంటే, ఒప్పదు. అది చేయాల్సిన పనిని చేసేయాలని సూచిస్తుంది. బహుశా ఇంటికే పరిమితం కానివారి దృష్టి ఇదే అయ్యి ఉండవచ్చును.

కరోనా వైరస్ భారిన పడితే, మనతో బాటు మరికొందరికి వ్యాపింపచేసినవారమవుతాం.. అదే ఓర్పు వహించి, ప్రభుత్వ సూచనలు పాటిస్తే మాత్రం… మనం రక్షణలో ఉన్నట్టే,

కానీ కరోనా వైరస్ బయట కోరలు చాచి ఉంది. బయటకుపోయిన వ్యక్తిని ఏరూపంలో కాటు వేస్తుందో తెలియదు. బయటకుపోయి కరోనా వైరస్ అంటించుకుని వస్తే, అది కుటంబీకులకు వ్యాపిస్తుంది. మరలా వారినుంచి ఇతరలుకు వ్యాపిస్తుంది. ఇలా కరోనా వైరస్ భారిన పడితే, మనతో బాటు మరికొందరికి వ్యాపింపచేసినవారమవుతాం.. అదే ఓర్పు వహించి, ప్రభుత్వ సూచనలు పాటిస్తే మాత్రం… మనం రక్షణలో ఉన్నట్టే, మనం రక్షణలో ఉంటే మనతోటివారు రక్షణలో ఉన్నట్టే.. తద్వారా సమాజం మనవలన రక్షణలో ఉన్నట్టే… ఇంతకన్నా మనం ఇప్పుడు సమాజానికి చేయవలసినది ఏముంటుంది?

సామాజిక సేవ అంటే బయటకుపోయి పెద్ద పెద్ద కార్యాలు నిర్వహించడం అయితే ఇప్పుడు ఇంటికే పరిమితం కావడం పెద్ద సామాజిక సేవ అంటున్నారు. ఓర్పు వహిస్తే రాబోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చును. ఈవిషయంలో ఇప్పటికే ఓర్పు వహించి ఇంటికే పరిమితం అయినవారందిరీకి పేరు పేరునా ధన్యవాదాలు. ఎందుకంటే అలా ఓర్పుతో ఇంట్లోనే వారు ఉండడం వలన కరోనా వైరస్ వారికి సోకదు. తద్వారా వారి కుటుంబం కూడా సేఫ్. తద్వారా సమాజం కూడా సేఫ్. తద్వారా ఒక రకంగా నేను కూడా సేఫ్.. అందుకని వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ఓర్పు పట్టి ఇంటికే పరిమితం అయిన వారందరికి కృతజ్ఙతలు…ఒకవేళ లాక్ డౌన్ మరింత పొడిగించిన అది మన రక్షణ కోసమే కాబట్టి… ఇంకా ఓర్పు పట్టడం మనవంతు ప్రయత్నం.. మన ప్రయత్నం మనం చేద్దాం… ఓర్పుతో సమాజాన్ని సేవ్ చేసుకుందాం.. భవిష్యత్తు బాధను కొంచెమైనా తగ్గించుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం… ఓర్పు వలననే అవకాశాలను అందుకుని, జీవితలో ఎదగగలడు. ఓర్పు వలననే జీవన పోరాటంలో గెలుపు గుర్రం, జీవితాంతం వరకు సాగగలుగుతుంది. ఓర్పు దేవతా లక్షణం అంటారు. మనసు అంతిమంగా గెలవాల్సింది. తనని తానే అని చెబుతారు, పండితులు. ​గెలవాల్సిన పోరాటంలో బుక్స్ మన మనసుకు మరింత అవగాహన అందిస్తాయి. ఎందుకంటే ఒంటరిగా ఉండడం అంటే మనసుతో పని. కాబట్టి బుక్స్ మనసుకు మిత్రుని మాదిరిగా ఉంటాయి. పోరాడే సమయంలో మనసు కదలకుండా ఉండడమే ఆయుధం అయితే, ఒంటరిగా ఉండడం అంటే మనసు మనసుతో చేసే యుద్ధం.. అది చూడండి, ఇది చూడండి అనే మాయలో మనసు పడితే, దాని గురించి అది చేయాల్సిన పరిశీలన కాలం కోల్పోతాం.

https://www.youtube.com/watch?v=i1zsRt2ZHMQ
ఓర్పు దేవతా లక్షణం అంటారు.